dv phanishyam

Thriller crime drama

4.4  

dv phanishyam

Thriller crime drama

అదే రోజు

అదే రోజు

7 mins
23.7K


తేదీ 29th ఆగస్ట్ 2007

అందరూ ఎవరిపన్నుల్లో వారు బిజీ గా ఉన్నారు..

ఒక హెయిర్ కటింగ్ షాప్ లో,కొంతమంది న్యూస్ పేపర్ చదువుతున్నారు..

-మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు,

-ఇండియా ని గెలిపించిన మహేంద్రసింగ్ ధోని,

-ప్రముఖ హైప్నోటీస్ట్ అభిరామ్ ని తాను అందించిన సేవలకు గాను సత్కరించిన ప్రభుత్వం..

సడన్ గా టీవీ లో ఫ్లాష్ న్యూస్, సిటీ లో ఫేమస్ బంగారు దుకాణం లో దొంగలు పడి, చాలా బంగారం దోచుకెళ్లారు అని...

పోలీసులు దొంగతనం జరిగిన షాప్ కి వెళ్లి అన్ని క్లూ లు సేకరిస్తున్నారు, ఎక్కడ కూడా దొంగకు సంబందించిన క్లూ మాత్రం దొరకలేదు..

పోలీసులు మరియు క్లూస్ టీమ్ ప్రకారం ఇది ఎవరో ప్రొఫెషనల్ చేసిన పని అని నిర్ధారిస్తారు..

పోలీసులు ఆ దొంగతనం చేసిన దొంగ కోసం గాలిస్తున్నారు..సీసీటీవి footage కోసం కూడా చూస్తున్నారు,

కానీ ముందుగానే , దొంగతనం జరిగిన రోజు,ఆ ఏరియా లో ఆ టైం లో కరెంట్ లేకుండా జాగ్రత్త పడ్డాడు దొంగ..

ఎంత ప్రయత్నించినా, పోలీసులు ఈ కేస్ ఛేదించలేక పోయారు..అప్పుడు ఈ కేస్ డీల్ చేస్తున్న ఇన్స్పెక్టర్ సుబ్బారావు కి మంచి స్నేహితుడైన డిటెక్టివ్ గౌరవ్ కి ఫోన్ చేస్తాడు..

సుబ్బారావు: గౌరవ్ , మొన్న జరిగిన దొంగతనం గురించి వినే ఉంటావు కదా,

గౌరవ్: అవును విన్నా, దోంగ పక్కా ప్రొఫెషనల్ అని, క్లూస్ కూడా ఏమి వద్దలేదు అని , పోయిన బంగారం విలువ కూడా చాలానే ఉంది అని కూడా విన్నా..నేను ఈ కేసులో ఎలా సహాయపడగలను..

సుబ్బారావు: మేము ఎన్నిరకాలు ప్రయత్నిస్తున్నా ఎటువంటి పురోగతి కనిపించడం లేదు..నువ్వు, నీకున్న అనుభవం తో ఏదైనా సహాయం చేస్తావేమో అని నీకు కాల్ చేసాను..

గౌరవ్: సరే , నా ప్రయత్నం నేను చేస్తాను, నాకు కొంత సమాచారం కావాలి, రేపు వచ్చి నిన్ను కలుస్తా.

సుబ్బారావు: సరే, నీకు ఎటువంటి సమాచారం కావాలన్న ఇస్తాము..

మరుసటిరోజు ఉదయాన్నే గౌరవ్ వెళ్లి సుబ్బారావు ని కలిసి, తనకి కావలసిన సమాచారం అడుగుతాడు..

గౌరవ్: దొంగతనం ఏ రోజు ఏ టైం లో జరిగింది..?

సుబ్బారావు: మా దెగ్గర ఉన్న సమాచారం ప్రకారం దొంగతనం 29th తెల్లవారుజామున 2.30 కి జరిగింది..

గౌరవ్: ఎంతమంది దొంగతనానికి వచ్చారు?

సుబ్బారావు: దొంగతనం చేసింది ఒక్కడే, అతడు చాలా తెలివిగా, పక్కా పధకం ప్రకారం దొంగతనం చేసాడు..

గౌరవ్: సీసీటీవీ footage ఏమైనా దొరికిందా?

సుబ్బారావు: దొంగతనం చేసిన టైం లో ఆ ఏరియా లో ఒక అరగంట పాటు కరెంట్ పోయింది.

గౌరవ్: సీసీటీవీ కి పవర్ బ్యాకప్ ఉంటుంది కదా ,అది కర్రెంట్ పోయినా, చీకట్లో కూడా రికార్డ్ చేస్తుంది కదా..?

సుబ్బారావు: సీసీటీవీలకి ఉండాలిసిన పవర్ backup కూడ తీసేసాడు, చాలా తెలివిగా ప్లాన్ చేసాడు.

గౌరవ్: నువ్వు చెప్పిన దాని ప్రకారం, ఇది ఎవరో పక్కా ప్లాన్ వేసి చేసిన దొంగతనం, ఆ దొంగ పక్కా ప్రొఫెషనల్ లాగా ఉన్నాడు..సరే ప్రస్తుతానికి ఈ సమాచారం చాలు, ఏదైనా అవసరం వస్తే, కాల్ చేస్తా అన్నాడు..

గౌరవ్ తన అనుభవం తో ఈ కేస్ గురించి ఆలోచించడం మొదలు పెడతాడు..

1. దొంగతనం జరిగిన ప్రదేశం అమీరుగుట్ట అది సిటీ లోనే బిజీగా ఉండే ఏరియా, అక్కడ ఎన్నో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి.

2. దొంగతనం జరిగిన షాప్, కరెక్ట్ గా సిగ్నల్ దెగ్గర ఉంది..

3. దొంగతనం జరిగిన టైం లో ఆ ఏరియా లో కరెంట్ పోవడం అంటే , ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి తెలిసే ఉంటుంది..

వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్న తన ఫ్రెండ్ సునీల్ కి ఫోన్ చేస్తాడు గౌరవ్, తను ఇచ్చిన సమాచారం ప్రకారం, కరెంట్ పోయిన మాట వాస్తవమే, కానీ అది ట్రాన్స్ఫార్మర్ దెగ్గర ఎదో ప్రాబ్లెమ్ రావడం వల్ల కరెంట్ పోయింది, అక్కడ ఒక చెట్టు కొమ్మ దానిపైన పడి కొన్ని తీగలు తెగిపోయాయి..అని సమాధానం చెప్తాడు సునీల్..

సరే థాంక్స్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు గౌరవ్..

వెంటనే సునీల్ మళ్ళీ కాల్ చేస్తాడు గౌరవ్ కి..ఇంకో విషయం చెప్పడం మర్చిపోయ..

ఏంటదీ..కరెంట్ పోయింది ఆమీర్ గుట్ట లో మాత్రమే, కానీ రోడ్డుకి అటుపక్క శ్రీకిష్ణ కాలనీ లో ఉంది అని..సరే అని ఫోన్ పెట్టేస్తాడు..

గౌరవ్ , దొంగతనం జరిగిన చోటికి వెళ్లి చుట్టుపక్కల గమనిస్తాడు,అప్పుడు తనకోక విషయం తడుతుంది..

దొంగతనం జరిగిన షాపు కరెక్ట్ గా ట్రాఫిక్ సిగ్నల్ దెగ్గర ఉండడం అక్కడ ట్రాఫిక్ పోలీసులకి  సంబంధించిన సీసీటీవీ ఉండడం ల, ఈ షాప్ కి పక్కన ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉండడం గమనిస్తాడు..

సుబ్బారావు సహాయంతో, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి దొంగతనం జరిగిన రోజు రాత్రి కి సంబందించిన FOOTAGE చూస్తాడు..

అది చూస్తున్న తనకి ఏమి కనిపించదు..సరే అని వెళ్లిపోతున్నా టైం లో ..ఒక చిన్న కుర్రాడు స్కూల్ బ్యాగ్ వేసుకొని వెళ్లడం గమనిస్తాడు..

ఒక చిన్న పిల్లవాడు తెల్లవారుజామున 2.30 టైం లో స్కూల్ బ్యాగ్ వేసుకొని వెళ్ళటం ఏంటి అని ఆలోచిస్తాడు..

వెంటనే ఆ footage తీసుకొని సుబ్బారావు దెగ్గరికి వెళ్తాడు..ట్రాఫిక్ పోలీసులకి సంబందించిన సీసీటీవీ footage సర్రిగా లేక పోవడం వల్ల ఫేస్ క్లియర్ గా కనపడలేదు..అప్పుడు గౌరవ్ దొంగతనం జరిగిన షాప్ పక్కనే ఉన్న షాపింగ్ మాల్ కి సుబ్బారావుని వెంటపెట్టుకొని వెళ్తాడు..

అక్కడ ఉన్న సీసీటీవీ footage లో ఆ చిన్న పిల్లవాడి మొహం క్లియర్ గా కనపడుతుంది..అప్పుడు పోలీసులు ఆ పిల్లవాడిని వెతకడం మొదలు పెడతారు..

ఎక్కడా పిల్లవాడి ఆచూకీ దొరకదు, అప్పుడు వెంటనే ఆ పిల్లవాడి ఫోటోని ఒక ఆర్టిస్ట్ సహాయంతో..సర్రిగా గీయించి..పేపర్లో, టీవీలో ప్రకటన వెయిస్తారు..

కొన్ని గంటల తరువాత ఒక ఫోన్ వస్తుంది..ఆ అబ్బాయి కి సంబందించిన వివరాలు ఇస్తాం అని..వెంటనే..లక్ష్మీ అనే ఒకావిడ..పోలీస్ స్టేషన్ కి వచ్చి..ఈ అబ్బాయి ఒక అనాధ ఆని తను అమ్మ అనే అనదాశ్రమం లో చిన్నప్పటి నుండి ఉన్నాడు అని చెప్తుంది..

పోలిసులుతో పాటు గౌరవ్ , ఆ అబ్బాయిని పిలిచి కొన్ని ప్రశ్నలు అడుగుతారు..

పోలీసులు: నీ పేరు ఏంటి?

పిల్లవాడు: నా పేరు ఆనంద్ సర్.

పోలీసులు: ఏమి చదువుతున్నావ్?

ఆనంద్: 9th క్లాస్ సర్.

పోలీసులు: 29th ఆగస్ట్ 2007 రోజు ఎక్కడికి వెళ్లావు?

ఆనంద్: నేను ఎక్కడికి వెళ్ళలేదు సర్.

పోలీసుకు: సర్రిగా గుర్తుచేసుకొని చెప్పు బాబు ?

ఆనంద్: లేదు సర్ ఎక్కడికి వెళ్ళలేదు సర్.

పోలీసులు: అయితే నీకు ఒక వీడియో చూపిస్తాం, దాంట్లో ఉంది ఎవరో చెప్పు .

ఆనంద్: సరే సర్.

పొలిసులు వీడియో చూపిస్తూ, ఇక్కడ ఉన్నది ఎవరో చెప్పు అన్నారు, ఆ వీడియో చూసి, అది నేనె సర్ ఆ బ్యాగ్ కూడా నాదే.

పోలీసులు: ఈ వీడియో 29th ఆగస్ట్ 2007 రాత్రి 2.30 ది, నువ్వు ఆ టైం లో ఎక్కడికి వెళ్ళవ్.

ఆనంద్: ఆ వీడియో లో ఉన్నది నేనె, ఆ బ్యాగ్ కూడా నాదే, కానీ నేను ఆ టైం లో ఎక్కడికి వెళ్ళలేదు, అనదాశ్రమంలోనే ఉన్నా.

పోలీసులు ఆనంద్ ని అనుమానితుడిగా భావించి , అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ కి తీసుకు వచ్చి ప్రశ్నిస్తున్నారు కాని ఎన్ని సార్లు ఆడిగిన అదే సమాధానం..ఎంచేయాలో తెలీక పోలీసులు, గౌరవ్ తలలు పట్టుకున్నారు..

నెల రోజులు గడిచాయి..ఎటువంటి పురోగతి లేదు..

ఇది ఇలా ఉండగా..29th సెప్టెంబర్ 2007 ఇంకొక వార్త వస్తుంది..బంగారం తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చే నితూట్ ఫైనాన్స్ లో దొంగతనం జరుగుతుంది..అక్కడ ఉన్న బంగారం మొత్తం దోచులెళ్లిపోతారు..దొంగలు..

పోలీసులు , క్లూస్ టీం, గౌరవ్ అందరూ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు..అక్కడ కూడా ఎటువంటి క్లూ దొరకదు..

అసలు ఏమి జరుగుతుందో అర్ధం కాక..అందరూ తలలు పెట్టుకుంటారు...ఐతే,గౌరవ్ కి ఒక ఐడియా వస్తుంది..

దొంగతనం జరిగిన ప్రదేశం ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ..ఖచ్చితంగా అక్కడ సెక్యురిటి గార్డ్ ఉంటాడు..తనగురించి తెలుసుకుందాం అని నితూట్ ఫైనాన్స్ ఆఫీస్ కి వెళ్తాడు..

నితూట్ ఫైనాన్స్ వాళ్లు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆ రోజు సెక్యురిటి పెరు శాంతయ్య, తనని తలపై ఎవరో రాడ్తో బలంగా కొట్టారు, అప్పుడు..తను కళ్లు తిరిగి పడిపోయాడు అని చెప్పారు..

గౌరవ్, శాంతయ్యని కలవడానికి హాస్పిటల్ కి వెళ్తాడు.. అక్కడ తనని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు..

గౌరవ్: శాంతయ్య అసలు ఆరోజు ఏమి జరిగిందో చెప్పు.

శాంతయ్య: ఆ రోజు రాత్రి 1.30 ని అయ్యింది..నేను బంగ్లా వెనుక ఉన్న బాత్రూం కి వెళ్దాం అని కుర్చీలోనుంచి లేచి..వెళ్తుంటే ఒక పిల్లవాడు వొచ్చి ..తాత..దాహంగా ఉంది నీళ్లు కావాలి అని అడిగాడు..వెంటనే నా దెగ్గర ఉన్న నీళ్ల బాటిల్ ఇచ్చా..థాంక్స్ అని చెప్పి ముందుకు వెళ్ళాడు,

ఈ టైం లో ఇక్కడేం చేస్తున్నావ్ అని అడుగుదాం అనుకునే లోపలే తను వెళ్ళిపోయాడు..

సరే అని నేను బాత్రూం కి వెళ్లి వచ్చి నా కుర్చీలో కూర్చుందాం అని తిరిగేలోపు..ఎవరో రాడ్ తో కొట్టారు..ఎవరా అని చూసేలోపు..కళ్ళు బైర్లు కమ్మేసాయి..

కానీ నాకు గుర్తున్నతవరకు..అది నీళ్లు అడిగిన పిల్లవాడే అన్నాడు శాంతయ్య..

గౌరవ్: నీకు ఆ పిల్లవాడు ఎలా ఉంటాడో గుర్తుందా?

శాంతయ్య: గుర్తుంది సర్.

గౌరవ్: నువ్వు రేపు పోలీస్ స్టేషన్ కి వచ్చి, ఆ పిల్లవాడి పోలికలు చెప్పాలి.

శాంతయ్య: సరే సార్ వస్తాను

గౌరవ్: ఇదిగో నా ఫోన్ నెంబర్, వచ్చే ముందు ఫోన్ చేసి రా.

శాంతయ్య: అలాగే సార్

మరుసటి రోజు శాంతయ్య పోలీస్ స్టేషన్ కి వెళ్లి పిల్లాడి పోలికలు అన్ని చెప్పాడు.

ఆ పొలికలతో ఒక బొమ్మ గీశాడు ఆర్టిస్ట్, అది చూపించి ఈ పిల్లవాడినా నువ్వు చూసింది అని అడిగారు.

శాంతయ్య: అవును సర్ కచ్చితంగా ఈ పిల్లాడే..

మునుపటిలా గానే ఆ పిల్లాడి ఫోటో పేపర్లలో, టీవీలో వేయించారు పోలీసులు.

అది చూసి నారాయణ అనే ఒకతను కాల్ చేశాడు, ఈ పిల్లాడు గురించి నాకు తెలుసు నేను మీకు చెప్తాను అన్నాడు.

వెంటనే పోలీస్ స్టేషన్ కి రమ్మని, గౌరవ్ అన్నాడు..

నారాయణ పోలీస్ స్టేషన్ కి వచ్చి, ఈ పిల్లాడు, సూర్యోదయ అనే అనాధ ఆశ్రమం కి చెందినవాడు, చిన్నప్పట్నుంచి అక్కడే పెరిగాడు.

గౌరవ్: ఆ పిల్లవాడిని మీ వెంట తీసుకు రాలేదా?

నారాయణ: లేదు సార్ తీసుకురాలేదు.

గౌరవ్: ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకు రావాలి

నారాయణ: సరే సార్ రేపు పొద్దున్నే తీసుకుని వస్తాను.

మరుసటి రోజు పిల్లవాడిని వెంటపెట్టుకుని వచ్చాడు నారాయణ, పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉన్నాడు శాంతయ్య,

గౌరవ్ వచ్చి శాంతయ్య ని ఈ పిల్లవాడిన ఆరోజు చూసింది అని అడిగాడు. అవును అని సమాధానం ఇచ్చాడు శాంతయ్య.

పిల్లవాడిని ఒక్కడిని లోపలికి తీసుకెళ్లి, కొన్ని ప్రశ్నలు అడగాలి అని గౌరవ్, నారాయణ తో అన్నాడు..

సరే సార్ అన్నాడు నారాయణ,

గౌరవ్: నీ పేరు ఏంటి బాబు?

పిల్లవాడు: నా పేరు చందు సార్.

గౌరవ్: ఏ క్లాస్ చదువుతున్నావ్?

చందు: ఎయిత్ క్లాస్ సర్.

గౌరవ్: 29వ తారీకు నువ్వు ఎక్కడున్నావ్?

చందు: అనదాశ్రమంలో లో ఉన్న సార్

గౌరవ్: బయట కూర్చున్న అతని నువ్వు ఎప్పుడైనా చూసావా?

చందు: లేదు సార్, ఎప్పుడూ చూడలేదు.

గౌరవ్: సరిగ్గా గుర్తు తెచ్చుకో చందు.

చందు: లేదు సార్ నేను ఎప్పుడూ చూడలేదు అండి.

గౌరవ్: సరే నువ్వు వెళ్ళు మళ్లీ అవసరమైతే పిలుస్తా నువ్వు తప్పకుండా రావాలి.

చందు: తప్పకుండా వస్తాను సార్ థాంక్యూ.

మళ్ళీ అందరూ ఎం చేయాలో తెలీక తలలు పట్టుకున్నారు..

అలా కొన్ని నెలలు గడిచాయి..ప్రతి నెల 29th సిటీ లో ఎదో ఒక దొంగతనం జరగడం..అన్ని అనాధ పిల్లలే చేయటం...ఏ ఆధారాలు లేక వాళ్ళని వదిలేయడం..ఇలా జరుగుతూఉంటుంది..

ఫిబ్రవరి నెల వచింది..ఆ సంవత్సరం లీపు సంవత్సరం కాదు కాబట్టి ఆ నెలలో 28 రోజులే ఉంటాయి..

పోలీసులు, గౌరవ్ అందరూ ఊపిరి పీల్చుకుంటారు..ఎటువంటి దొంగతనం జరగదు అనుకుంటారు..

కానీ మరో పిడుగు లాంటి వార్త..ఇంకో బంగారు దుకాణంలో దొంగతనం జరిగింది అని...

అందరికి మళ్ళీ టెన్షన్ మొదలవుతుంది..

అన్ని ఇన్వెస్టిగేషన్స్ జరిగిన తరువాత , మళ్ళీ అదే పాయింట్స్, అనదాశ్రమంలో పెరిగిన పిల్లవాడు, scene of offence లో పిల్లవాడి ప్రమేయం, కానీ ఎటువంటి ఆధారాలు లేకపోవటం,

ఒక్క పాయింట్ కి క్లారిటీ లేదు..ప్రతి నెల 29 న జరిగే దొంగతనం ఈ నెల 28 వ తేదీన జరగడానికి కారణం ఏంటి?

గౌరవ్ కి ఒక ఆలోచన వచ్చింది..

పిల్లలు అందరు వేరువేరు అనదాశ్రమంలో లో పెరిగిన వాళ్లు, దొంగ తనాలు జరిగిన తీరు తేదీలు అన్ని గమనిస్తే , దొంగతనం చేయించింది ఒక్కరే..

ఆ ఒక్కరు ఎవరు అని ఆలోచిస్తుండగా..ఒక్కసారి అన్ని ఆశ్రమలకి వెళ్లి అడుగుదాం అని అనుకున్నాడు..

ఆన్నీ ఆశ్రమలకి వెళ్లి, ఒకే రకమైన ప్రశ్నలు అడుగుతాడు..

ఇంటికి తిరిగి వచ్చి, అవ్విన్ని ఒక దెగ్గర రాసుకుంటాడు..

సమాధానాలు రాసేటప్పుడు ..ఒక క్వశ్చన్ కి అందరూ ఒక్కటే సమాధానం చెపుతారు..

ప్రశ్న: తరచు మీ ఆశ్రమానికి ఎవరెవరు వస్తూ ఉంటారు..

సమాధానం: అందరూ ఒకటే పేరు చెపుతారు..అది చూసాక దొంగ ఎవరో తెలిసిపోతుంది గౌరవ్ కి..

రెండు రోజులు ఆ దొంగని ఫాలో అవుతాడు..

తను ఏమి చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని..ఇవ్వన్నీ ఆరా తియ్యగా ..

కొన్ని వింత విషయాలు తెలుస్తాయి..

ఏవ్వరికి తెలీకుండా, అతన్ని కిడ్నప్ చేస్తాడు గౌరవ్, జనసంచారం లేని చోటుకి తీసుకెళ్లి..ముసుగేసి....కట్టేసి..మొత్తం అంతా రాపడ్తాడు గౌరవ్..

గౌరవ్: ఇవ్వని మీరు చేయించారు అంటే, నేనె కాదు ఎవ్వరు నమ్మరు, మీరు నిజం చెప్పండి.

దొంగ: అవును , అవన్నీ చేయించింది నేనె.

గౌరవ్: మీరు సంగం లో ఇంత పెద్దవారుగా చలామణి అవుతునారు, మీకు ఎందుకు అంత అవసరం ఇదంతా చేయించడానికి?

దొంగ: సంగంలో పేరు మాత్రమే ఉంది, కానీ అనుకున్నంత ఆస్తి లేదు, నాతో ఉన్నవాళ్లు అందరూ పేరుతో పాటు ఆస్తి పాస్తులు సంపాయించారు..నేను మాత్రం ..అది చేయలేక పోయాను.

గౌరవ్: చిన్న పిల్లలని ఎందుకు ఎంచుకున్నారు?

దొంగ: పిల్లలు అందరూ ఆనాదలే, ఒక వేళ వాళ్ళని పట్టుకున్న ఏమి చేయలేరు అని తెలుసు అందుకే..

గౌరవ్: మరి ప్రతి నెల 29 th ఎందుకు ఫిబ్రవరిలో మాత్రం 28th ఎందుకు..?

దొంగ: నవ్వుతూ, ప్రతినెలా దొంగతనం జరిగేది 28th రాత్రి 11.55 ని , కానీ అంత అయ్యేసరికి 29 వస్తుంది..కానీ అందరూ 29th రోజు మాత్రమే దొంగతనం జరుగుతుంది అనుకునే వాళ్లు..

గౌరవ్: సరే, అదే రోజు మాత్రమే ఎందుకు?

దొంగ: కంట నీళ్లతో..జులై 28 రాత్రి నాకు ఇద్దరు కావల ఆడ పిల్లలు పుట్టారు..వాళ్లకోసం ఎదైన చేయాలి అనుకున్నా..అందుకే ఈ దొంగతనాలు చేసా..

ఇవ్వన్నీ వీడియోలో రికార్డ్ చేసిన గౌరవ్, పోలీసులకి ఆ వీడియో ని అండ్ దొంగని అప్పచెప్తాడు..

పోలీసులు ఆ దొంగని చూసి ఆశ్చర్యపోతారు..

అతనెవరోకాదు ప్రముఖ హైప్నోటీస్ట్ అభిరామ్..

ప్రతినెలా అనాధాశ్రమలకి వెళ్లి సేవ చేసే ముసుగులో..చురుకైన పిల్లని ఎంచుకొని..హిప్నో టైజ్ చేసి దొంగతనాలు చేయించేవాడు..

ఇలా జైలు ఊచలు లెక్క పెడతాను అని ఊహించి ఉండడు..

కష్టపడి ఈ కేస్ ని ఛేదించిన డిటెక్టివ్ గౌరవ్ ని, ప్రభుత్వం సత్కరిస్తుంది...



Rate this content
Log in

Similar telugu story from Thriller