Shaik Sameera

Thriller


4  

Shaik Sameera

Thriller


ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

6 mins 310 6 mins 310

              ఎపిసోడ్-21

వంశ్ తన రూంలో రెడీ అవుతూ అక్కడికి వచ్చిన రాజ్ తో మాన్షన్ లో కాల్స్ రాకుండా బ్లాక్ చేసావా అని అడుగుతాడు.చేశాను అని రాజ్ పెళ్లి ఒక రోజు ముందే ఎందుకు చేసుకుంటున్నారు బాస్ దీని ద్వారా ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది మనకి అని అడుగుతాడు.అందుకు వంశ్ రాజ్ చెస్ అందరూ ఆడుతారు కానీ చెస్ గ్రాండ్ మాస్టర్ ఒక్కడే ఉంటాడు.అతనే ప్రతి కదలికలో తన ఎత్తు మారుస్తూ ఎదుటివాడు తప్పు చేసేలా చేస్తాడు అలాగే నేను శత్రువు ఎవరైనా షీరా ని రేపు పెళ్లి రోజు ఇవ్వాలి అనుకుంటున్నాడు.అందుకే ప్లాన్ చేంజ్ పెళ్లి ఈరోజుకే మార్చేసాను అతను తొందరలో షీరా ని ఇచ్చేయాలని చేసే తప్పే మనకి అతన్ని పట్టిస్తుంది. రాజ్ ఆర్యన్ మీద అనుమానం ఉంది కదా మీకు అంటాడు.వంశ్ అందుకు ఆర్యన్ కి నేనేంటే ఇష్టం లేదు తను ఇలా చేస్తాడనని అనుకోను ఎలాంటి ప్రూఫ్స్ లేవు కాబట్టి నేనేం చెప్పలేను. ఆర్యన్ మాత్రమే కాదు ఎవరైనా అవ్వొచ్చు.ఆకాశంలో ఎగిరే పక్షిని చూసి ఎవరైనా గురి పెట్టే అవకాశం ఉంది.ఎవరో అతను మన ముందుకు వచ్చేవరకు ఎదురు చూడాలి సెక్యూరిటీ పెంచమంటాడు.ఆ శత్రువు ఎవరో వచ్చేవరకు ఎదురు చూద్దాం.వంశ్ మాన్షన్ నుండి ఈరోజు ఎవరు వెళ్లిన పర్లేదు కానీ మన శత్రువు,షీరా మాత్రం బయటికి వెళ్ళకూడదు.Iam really sorry Boss మీ పెళ్లి జరిగే రోజు కూడా ఇలాంటివి చేయవలసి వస్తుంది అని రాజ్ అంటాడు.అందుకు dont feel రాజ్ జీవితంలో ఛాలెంజ్ స్ లేకపోతే జీవితంలో మజా ఏం ఉంటుంది.ఇంకెప్పుడు నా గురించి సారీ ఫీల్ అవ్వకు i hate that అంటాడు వంశ్.Life,surprises,games,fun అన్నీ గెలిచేది వంశ్ రాయ్ సింఘానియా.

రిథిమా తన రూంలో పెట్టిన రెడ్ కలర్ పెళ్లి చీరని చూసి కబీర్ తో తన పెళ్లి కోసం ఏ చీర అయితే కావాలని కోరుకుందో అదే చీర ఉండటం చూసి కబీర్ తనకోసం అదే చీర తెస్తాను అనడం గుర్తొస్తుంది తనకి.రిథిమా నేను నీకు ప్రామిస్ చేశాను కబీర్ నా చేతి మీద నీ పేరు మాత్రమే ఉంటుందని నీతో మాత్రమే నా పెళ్లి జరుగుతుందని కానీ ఇప్పుడు వంశ్ పేరు ఉన్న మెహేంది,పసుపు ఎక్కడకి వచ్చి ఇరుకున్నాను. నేను వంశ్ తో ఈ పెళ్లి చేసుకోను అని ఏడుస్తుంది.ఈ పెళ్లి చీర కబీర్ కోసం తప్ప ఎవరి కోసం కట్టుకోను ఈ పెళ్లి చీరే కాల్చేస్తాను అని అగ్గిపెట్ట తెచ్చి అగ్గిపుల్ల వెలిగించి కబీర్ నేను నీ దాన్ని మాత్రమే అనుకుంటుంది.కబీర్ మాన్షన్ కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే మిశ్రా ఇంకో సారి ఆలోచించుకోండి సార్ వంశ్ మాన్షన్ లోకి వెళ్లడం అంటే అగ్ని గుండంలోకి దూకి బూడిద అవ్వడమే అంటాడు.కబీర్ రిథిమా తను ఉన్న ఫోటో చూస్తూ రిథిమా కోసం అగ్ని గుండంలో దూకి కాలిపోవడానికి కూడా రెడీనే నేను అంటాడు.రిథిమా అగ్గి పుల్లని చీరకి కొంచెం దూరంలో పడేయటంతో కర్టెన్ కి మంట అంటుకుంటుంది.ఎవరో వస్తున్నా సౌండ్ వినిపించేసరికి తన కన్నీళ్లు తుడుచుకొని నార్మల్ గా నిలబడుతుంది.వంశ్ రిథిమా రూంలోకి వస్తాడు వంశ్ ని చూసి రిథిమా కిటికీ వైపు తిరుగుతుంది వంశ్ కూడా తన పక్కన వెళ్లి నిలబడతాడు పై నుండి కర్టెన్ వాళ్ళ ఇద్దరి పైన పడుతుంది.ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు.రిథిమా కర్టెన్ తీయాలని ట్రై చేస్తూ ఉంటుంది.అప్పుడే వంశ్ కర్టెన్ కాలడం చూసి తన చేతులతో మంట ఆర్పడానికి ట్రై చేస్తాడు తన చేయి కాలడంతో పిల్లో తీసుకొని మంటలు ఆర్పేస్తాడు వంశ్.

వంశ్ -ఎలా జరిగింది ఇది అని రిథిమాని అడుగుతాడు.

రిథిమా -పొరపాటున జరిగింది అంటుంది 

వంశ్ -పొరపాటు ఎలా జరిగింది.అది ఇలాంటి పొరపాటు ఎలా .

రిథిమా -పొరపాట్లు అలోచించి జరగవు కదా. మీ చేయి కాలిపోయింది .

వంశ్ -ఈ గాయాన్ని భరించగలను నేను సులంభంగా మానిపోతుంది కూడా .కానీ మోసం వలన వచ్చే గాయాలు భరించలేను వాటిని మానానివ్వను కూడా నేను.నేను నమ్ముతున్నాను నువ్వు నాకు అలాంటి గాయాన్ని ఇవ్వవు అని.అగ్నితో ఆడితే చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది అది మనది లేదా మనకి దగ్గరి వాళ్ళ ప్రాణం ఇచ్చి . అని పెళ్లి చీర కింద పడి ఉండటం చూసి ఈ ఎరుపు రంగు ప్రేమ గుర్తు అలాగే నీ పెళ్లి చీరని జాగ్రత్తగా పెట్టుకో అని వెళ్ళిపోతూ ఉంటాడు వంశ్ .

రిథిమా -రక్తo రంగు కూడా ఎరుపే కదా అంటుంది.

వంశ్ -తెలుసు అలాగే ఈ ఎరుపు రంగు ప్రమాదానికి కూడా గుర్తు.అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు నాకంటే ప్రమాదాలతో చాలా బాగా పరిచయం ఉంది.నీకు అస్సలు ప్రమాదాలతో పరిచయమే లేదు అని వెళ్ళిపోతాడు.

రిథిమా -వంశ్ వెళ్ళిపోయాక ఈరోజు నిర్ణయించబడుతుంది ఏ రంగు గెలుస్తుందో నాది కబీర్ ప్రేమదో,వంశ్ ప్రమాదానిదో లేదా రక్తంలో కలిసి పోయిన కొన్ని ప్రాణాలదో తెలిసిపోతుంది అనుకుంటుంది.

వంశ్ పిన్ని చంచల ఈ కరోనా కూడా ఇప్పుడే రావాలా అన్నీ పనులు నేనే చేయవలసి వస్తుంది.రాయ్ సింఘానియా ఇంట్లో పెళ్లి ఎలాంటి గెస్ట్స్ రాకుండానే జరుగుతుంది.కేటరింగ్ వాళ్ళు అయిన వచ్చారు లేకపోతే నేనే వంట చేయవలసి వచ్చేది అని అనుకుంటూ వెళ్ళిపోతుంది.రిథిమా చంచలని ఫాలో అవుతూ షీరా ఉన్న లాకర్ కీ తీసుకొని షీరా తో పాటు కబీర్ దగ్గరికి వెళ్ళిపోవాలి అని ఫాలో అవుతూ ఉంటుంది.కబీర్,మిశ్రా కేటర్స్ లాగా మాస్క్వేసుకొని మాన్షన్ లోకి వెళ్ళడానికి రెడీ అయ్యి మాన్షన్ ముందు కేటర్స్ వాన్ నుండి దిగుతారు.డిసోజా వచ్చి కొన్ని బాక్స్ తీసుకొని మిగిలినవి వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది.రిథిమా చంచలకి కనపడకుండా కర్టెన్ వెనక దాక్కొని తన నడుము దగ్గర ఉన్న బ్యాగ్ ని తీసుకోవాలని ట్రై చేస్తుంది.కబీర్ ,మిశ్రా లోపలికి రావడం చూసి రాజ్ ఆపి వాళ్ళని ఎవరు మీరు అని అడుగుతాడు.అందుకు మిశ్రా కేటరింగ్ వాళ్ళము అనిచెబితే వాళ్ళ id కార్డ్స్ చూపించమంటాడు.చంచలకి తన బ్యాగ్ ఎవరో లాగినట్టు అనిపిస్తే వెనక్కి తిరిగి కర్టెన్ తీసి చూస్తుంది అక్కడ రిథిమా ఉండదు.కబీర్ id కార్డ్స్ చూపిస్తాడు రాజ్ కి.ముందుగానే కబీర్ రెండు fake id cards create చేసి తీసుకొని వస్తాడు.రాజ్ అవి చూసి వాళ్ళ పేర్లు అడిగి కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ ఏ వస్తువుని కూడా తాకొద్దు అలాగే ఫేస్ మీద నుండి మాస్క్ షీల్డ్ తీయొద్దు.all clear అని చెప్పి రాజ్ వెళ్ళిపోతాడు.

రిథిమా డల్ గా నిలబడి ఉంటుంది కీస్ దొరకలేదని కబీర్ అక్కడ నుండి లోపలికి వెళ్తాడు కానీ వాళ్ళు ఒకరిని ఒకరు చూసుకోరు.రిథిమా బయట ఉండటం చూసి వంశ్ అమ్మ అను ప్రియా రిథిమా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది.ఏం లేదు ఊరికే బయటికి వచ్చాను అంటుంది. అందుకు అనుప్రియ నాకెందుకు ఇలా అనిపిస్తుంది నువ్వు ప్రతిసారి బయటికి వెళ్లాలని ఎందుకు ప్రయతిస్తున్నావు.నిన్న కూడా మెహేంది రోజు కూడా బయటికి వెళ్ళడానికి ట్రై చేసావు ఈరోజు ఇంకొంచెంసేపటిలో నీ పెళ్లి ఇప్పుడు కూడా బయటే ఉన్నావు దీనికి కారణం ఏంటి అని అడుగుతుంది. ఏం లేదు అంటుంది రిథిమా.అది విని అనుప్రియ రిథిమా ఇంకో గంటలో నీ పెళ్లి నువ్వు ఇలా బయట తిరుగుతూ ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా ఇదంతా వంశ్ కి చెప్పనా అంటుంది.వద్దు వంశ్ కి ఏం చెప్పవద్దు అంటుంది రిథిమా నేను చంచల అత్తయ్య నుండి మేకప్ కోసం హెల్ప్ అడగటానికి వచ్చాను అనగానే అనుప్రియ రిథిమా నీ రూంలో మేకప్ సామాను,జ్యువలరీ,నీ శారీ అన్నీ పెట్టించాను.నీకు ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే ఇషాని ని పంపిస్తాను నీకు హెల్ప్ చేయడానికి నువ్వు నీ ధ్యాస మొత్తం నువ్వు రెడీ అవ్వటం లో పెట్టు నిన్ను ఇంకో 45నిముషాలలో కిందకి పిలుస్తారు అని చెప్పగానే రిథిమా వెళ్లబోతుంటే.రిథిమా నువ్వు ఇంతకూ ముందు నీ లైఫ్ ఎలా ఉందో అదంతా మర్చిపో ఇప్పుడు నువ్వు ఈ ఇంటికి కోడలు కాబోతున్నావు తప్పులు చేయటం మానేయి పెళ్ళికి ముందు పెళ్లి కూతురు అటు ఇటు పరిగెత్తడం శోభనివ్వదు వెళ్ళు అంటుంది.

రిథిమా ఏడుస్తూ తన రూంలోకి వెళ్లి తలుపు వేసుకొని ఏం చేయను షీరా తీసుకొని బయటికి ఎలా వెళ్ళాలి అని బాధపడుతుంది.కబీర్ మిశ్రాతో మిగతా బాక్స్ వాన్ నుండి తెమ్మని చెప్పి రిథిమాని వెతకాలని వెళ్తాడు.రిథిమా రూంలో టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటుంది డోర్ ఎవరో కొట్టినట్టు సౌండ్ విని కబీర్ అంటుంది కానీ ఇషాని వస్తుంది excuse me ఏం అన్నావు అని అడుగుతుంది రిథిమాని.రిథిమా అందుకు ఏం లేదు ఎవరు అని అడిగాను అంటుంది.ఇషాని మీ హాస్టల్ లో పెళ్ళిలో కూడా నీ మిడిల్ క్లాస్ down market లాంటి లెహంగానే వేసుకుంటావా అంటుంది.అందుకు రిథిమా ఏదైనా పని ఉందా నాతో అని అడుగుతుంది.అప్పుడు ఇషాని నీతో నీ సీక్రెట్ అడగటానికి వచ్చాను నిన్ను I was wondering నీలో ఏదో సీక్రెట్ క్వాలిటీ ఉండి ఉండాలి నీలో లేకపోతే వంశ్ అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎందుకు అనుకుంటాడు.నాకైతే అలాంటి క్వాలిటీ ఏం కనిపించట్లేదు నీలో నాకు నీతో మాట్లాడటమే చిరాకు కలుగుతుంది నాకు అంటుంది.పద అద్దం ముందు కూర్చో అనగానే రిథిమా కూర్చుంటుంది అరగంటలో రెడీ చేసి నిన్ను కిందకి తీసుకొని వెళ్ళాలి ఈ కరోనా వలన చాలా మందిని పిలవలేము లేకపోతే నన్ను రెడీ చేయడానికి 10మంది designers వచ్చేవాళ్ళు అందుకే నిన్ను రెడీ చేయడానికి నన్ను పంపించారు lets so start అనగానే రిథిమా మీ హెల్ప్ అవసరం లేదు అంటుంది.అందుకు ఇషాని అవసరం లేదు అంటే అర్థం ఏంటి పెళ్లి చేసుకునే మూడ్ లేదా ఏంటి babes లేకపోతే చెప్పేయి అది happiest news in my life అవుతుంది నేను వెళ్లి అన్నయ్యకి చెప్పేస్తాను అంటుంది.నేను చెప్పేదానికి అర్థం అది కాదు నేనే రెడీ అవుతాను అంటుంది రిథిమా.Babes మీ middle class మేకప్ కాదు పెళ్లి మేకప్ చేయాలి నీతో ఒంటరిగా కాదు కూర్చో చేస్తాను అంటుంది.అందుకు రిథిమా నేను మీ అన్నయ్య తో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోగలిగాను ఒంటరిగా అంటే ఇక్కడ కూర్చొని మేకప్ చేసుకోలేనా అనగానే ఇషాని relax babes అయిన నాకు ఇంటరెస్ట్ లేదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది.రిథిమా టెన్షన్ పడుతూ అద్దంలో చూసుకుంటుంది.వంశ్ నానమ్మ కరోనా వలన మన బంధువులందరిని పిలవలేకపోయాము కనీసం పంతులు గారు అయిన దొరికారు అనుకుంటూ అనుప్రియ ఎక్కడ ఉంది అనగానే పెళ్లి కొడుకుగా రెడీ అయిన వంశ్ ని తీసుకొస్తూ ఉంటుంది.రిథిమా పెళ్లి కూతురులా రెడీ అయ్యి ఎలా వెళ్ళాలి ఇక్కడ నుండి కబీర్ ఎక్కడ ఉన్నావు నీ హెల్ప్ చాలా అవసరం నాకు ఇపుడు అని బాధపడుతూ ఉంటుంది కబీర్ రిథిమా రూమ్ కోసం వెతుకుతూ ఉంటాడు.వంశ్ వచ్చి పెళ్లి మండపంలో కూర్చుంటాడు.Rate this content
Log in

More telugu story from Shaik Sameera

Similar telugu story from Thriller