Shaik Sameera

Thriller


4  

Shaik Sameera

Thriller


ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

5 mins 243 5 mins 243

            ఎపిసోడ్-22

వంశ్ వచ్చి పెళ్లి పీటల మీద కూర్చుంటాడు.వంశ్ నానమ్మ ఇషానిని రిథిమా రెడీ అయ్యిందో లేదో చెక్ చేసి రమ్మంటుంది.అందుకు ఇషాని నేను చూడను వెళ్లి ఇంకా పెళ్లే కాలేదు తను ఆటిట్యూడ్ చూపిస్తుంది నాకు అనగానే సియా ప్లీజ్ తీసుకొనిరావా అని బ్రతిమాలాగానే వెళ్తుంది రిథిమాని తీసుకొనిరావడానికి.కబీర్ రిథిమా ఏ రూంలో ఉందో తెలియక వెతుకుంటూ వస్తూ ఉంటాడు.ఇషాని వచ్చి రిథిమా రూమ్ డోర్ కొట్టి రిథిమా మేడం రెడీ అయ్యావా అని అనటం కబీర్ విని దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు.రిథిమా లోపల నుండి almost ready 5మినిట్స్లో వస్తాను అనగానే ఇషాని ఇది పెళ్లి కాదు irritation అని మొబైల్ లో ఎవరితోనో కాల్ మాట్లాడుతూ ఉంటుంది.రిథిమా ఇషాని నన్ను తీసుకెళ్ళకుండా ఇక్కడ నుండి వెళ్లేలా లేదు షీరా ని ఎలా వెతకాలి అని కబీర్ ఇచ్చిన లాకెట్ చూస్తూ కబీర్ ఎక్కడ ఉన్నావు నీ అవసరం ఉంది ఇప్పుడు నాకు చాలా అని బాధపడుతూ ఉంటుంది.ఇషాని ఫోన్లో బిజీగా ఉండటం చూసి కబీర్ రిథిమా దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న గ్లాస్ కింద పడేస్తాడు ఇషాని వెనక్కి తిరిగి కబీర్ ని తిట్టి మళ్ళీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది కబీర్ డోర్ ని knock చేస్తాడు.రిథిమా ఇషాని అనుకోని డోర్ ఓపెన్ చేయగానే మాస్క్ వేసుకున్న కబీర్ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు రిథిమా ఎవరో అనుకోని ఎవరు అని భయపడుతుంటే కబీర్ మాస్క్ తీసేస్తాడు.ఇషాని సౌండ్ విని మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది కబీర్ లేకపోవడం చూసి పట్టించుకోదు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది.రిథిమా కబీర్ ని చూసి ఏడుస్తూ ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది.షీరా దొరికిందని తనకి వంశ్ ఇల్లీగల్ బిజినెస్ ప్రూఫ్ అని చెప్పబోతుండగా కబీర్ రిథిమాని statue అని చెప్పి ఆపేస్తాడు.రిథిమా statue లా నిలబడి ఉంటే తను రిథిమా చుట్టూ తిరుగుతూ నీ నుండి ప్రేమించడమే కాదు ఇది కూడా నేర్చుకున్నాను అని రిథిమా పెళ్లి లెహంగా చూసి రిథిమా ఇది అదే లెహంగా కదా మన పెళ్లిలో కట్టుకోవాలని అని నువ్వు కోరుకున్నది అంటాడు.అదే లెహంగా అని ఏడుస్తుంది.రిథిమా ఎవరికీ అంత ధైర్యం ఉంది మన కలలన్ని నాశనం చేయడానికి ఈ పెళ్లి జరగనివ్వను భయపడకు అని రిలీజ్ అంటాడు.

వంశ్ పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటాడు.ఆర్యన్ పిచ్చి రిథిమా తనకి తెలియదు తను ఎలాంటి ఊబిలో దిగబోతుందో వంశ్ తో ఉండటం అంత సులభం కాదు తన ప్రాణం విలవిలలాడిపోతుంది అని చంచల తో చెబుతాడు.రిథిమాని ఇషాని మళ్ళీ పిలుస్తుంది అది విని రిథిమా 5మినిట్స్ రెడీ అయిపోయాను అనగానే ఇషాని సరే అయితే నువ్వు రెడీ అని నానమ్మతో చెబుతాను రెడీగా ఉండు నిన్ను ఎప్పుడైనా కిందకి పిలవొచ్చు అని వెళ్ళిపోతుంది.

రిథిమా- కబీర్ తో నిన్ను చాలా మిస్ అయ్యాను.నాకైతే తెలియదు నువ్వు ఎలా వస్తావో లేవో కానీ నమ్మకం మాత్రం ఉంది నువ్వు తప్పకుండా వస్తావని నాకోసం.

కబీర్ -వచ్చేసాను కదా నీ నమ్మకాన్ని వమ్ము కానివ్వలేదు కదా నీ పెళ్లి పల్లకిని ఇక్కడ నుండి నా ఇంటికి తీసుకొని వెళ్ళడానికి వచ్చేసాను పద వెళ్దాం అంటాడు.

రిథిమా- షీరా దొరికింది నాకు.వంశ్ ఇల్లీగల్ బిజినెస్ కి సంబంధించిన సాక్ష్యం.దానితో వంశ్ ని అంతం చేయొచ్చు.కానీ షీరా చంచల లాకర్లో ఉంది దాని కీ చంచల దగ్గరే ఉంది .

కబీర్- చంచల రూమ్ ఎక్కడ ఉందో చెప్పు చాలు మిగతాది నేను చూసుకుంటా షీరా ని నేను తీసుకొస్తాను. నువ్వు బ్యాక్ డోర్ దగ్గరికి వెళ్ళు అక్కడ మిశ్రా కేటర్స్ వాన్ తో ఉంటాడు అతని దగ్గరే ఉండు. నేను షీరా తీసుకొని వస్తానని ఇద్దరం కలిసి వెళ్దాం అని ప్లాన్ చెబుతాడు.

రిథిమా -ఓకే కానీ వంశ్ రాజ్ తో అందరిని గమనిస్తూ ఉండమని చెప్పాడు జాగ్రత్తగా ఉండు i love you kabir.

కబీర్ - i to love you. నీ ప్రేమ ఉంది కదా నాతో అదే నన్ను చూసుకుంటుంది.అంత సరి అయిపోతుంది.ఒక్కసారి షీరా దొరకగానే వంశ్ కి శిక్ష వేద్దాం మనం చట్టం తరపున అలాగే వంశ్ నిన్ను పెట్టిన కష్టం తరపున కూడా.నేను వంశ్ ని వదలను మనం గెలుస్తాం రిథిమా అంటాడు.

రిథిమా-ఈసారి ఓటమి కేవలం వంశ్ ది అవుతుంది.Take care అంటుంది.

కబీర్ మాస్క్ వేసుకొని రిథిమా రూమ్ నుండి చంచల దగ్గరికి వచ్చి రిథిమా చెప్పిన కీ ఉన్న బ్యాగ్ చూస్తాడు.చంచల వెనకే వెళ్తాడు అప్పుడే డిసోజా జ్యూస్ ఉన్న గ్లాస్ తీసుకొస్తూ ఉంటుంది కబీర్ కావాలని డిసోజా కి అడ్డంగా వచ్చి జ్యూస్ చంచల శారీ మీద పడేలా చేస్తాడు.జ్యూస్ పడగానే చంచల కీ ఉన్న బ్యాగ్ టేబుల్ మీద పెట్టి శారీ క్లీన్ చేసుకుంటూ డిసోజా నీ కళ్ళు కిచెన్ లో వదిలేసావా శారీని పాడు చేసావు శారీ కాస్ట్ నీ నగలు అమ్మి ఇస్తావా అని తిడుతూ ఉంటుంది.కబీర్ కీ తీసుకొని వెళ్తూ ఉంటే రాజ్ వచ్చి హెల్ప్ చేయి అని చెప్పగానే కబీర్ ట్రే లో కీ పెట్టి క్లీన్ చేస్తాడు జ్యూస్.కబీర్ క్లీన్ చేసి కీస్ వెతికితే ట్రై లో ఉండవు డిసోజా కీస్ ఉన్న ట్రే తీసుకొని కిచెన్ లోకి వెళ్లడం కబీర్ చూసి తన వెనకే వెళ్తాడు.కిందకి వచ్చిన ఇషానిని చూసి.

 వంశ్ నానమ్మ -రెడీ అయిందా తను అని అడుగుతుంది. 

ఇషాని -అయిపోయి ఉంటుంది నేను అలిసిపోయాను అంటుంది.

నానమ్మ- అయిపోయి ఉంటుంది అంటే ఏంటి అర్థం నిన్ను రెడీ చేసి తీసుకొని రమ్మన్నాను కదా అంటుంది.

ఇషాని- నేనేం తన సెక్రటరీ కాదు

నానమ్మ-నీ కాబోయే వదినకి రెడీ అవ్వడంలో హెల్ప్ చేస్తే సెక్రటరీ అయిపోవు.నీ వదిన కోసం మనసులో గౌరవం పెట్టుకో అంటుంది.

ఇషాని -అందరూ నాకు జ్ఞాన బోధ చేసే వాళ్లే.ఇంత జ్ఞానo ఎక్కడ పెట్టుకోను.తనే చెప్పింది 5minutes లో తనే రెడీ అయ్యి కిందకి వస్తానని అంటుంది.

రాజ్ కేటర్స్ ఓనర్ పీటర్ తో ఫోన్లో మాట్లాడుతూ మీరు పంపిన మనుషులు వచ్చారు.నేను చెప్పిన instructions చెప్పారు కదా పెళ్ళిలో ఎలాంటి లోటు ఉండకూడదు అనగానే పీటర్ చెప్పాను సార్ కరోనా వలన ఇద్దరినే పంపగలిగాను అని చెబుతాడు.రాజ్ ఇద్దరు కాదు మొదట ఇద్దరు తరువాత ఇద్దరు వచ్చారు అంటాడు.అందుకు కేటర్ ఓనర్ మా నుండి ఇద్దరినే పంపించాము అనగానే కేటర్స్ రూపంలో ఇద్దరు శత్రువులు వచ్చారని తెలుసుకుంటాడు.కబీర్ డిసోజా వెనకే వచ్చి ట్రే క్లీన్ చేయబోతుంటే నేను చేస్తాను అని టెన్షన్గా ఉండటం చూసి ఏమైంది ఎందుకు కంగారు పడుతున్నావు అని అనుమానంగా అడుగుతుంది కబీర్ని.ఎవరో డిసోజాని పిలవడంతో తను వెళ్ళిపోతుంది.కీస్ వాష్ బేసిన్ హోల్ లో పడిపోయి ఉంటాయి కబీర్ వాటిని తీసుకుంటాడు.రిథిమా ఒక కంబళి కప్పుకొని రూమ్ నుండి బయటికి వస్తుంది వెనక నుండి ఎవరో ఆగు అంటారు.కబీర్ కీస్ తీసుకొని చంచల రూంకి వెళ్లి లాకర్ ఓపెన్ చేస్తాడు అందులో షీరా ఉండదు.రిథిమా షీరా ఇక్కడే ఉంది అనింది ఇక్కడ లేదు ఏమైంది అని వెళ్ళిపోతాడు.రిథిమాని చంచల ఆపుతుంది.

చంచల- పెళ్లి కొడుకు మండపంలో ఉంటే పెళ్లికూతురు పారిపోతుందా ఏం జరుగుతుంది అని నిలదీస్తుంది రిథిమాని.

 రిథిమా- అదేం లేదు అత్తయ్య నా మేకప్ టచ్ అప్ చేసుకోవడానికి వెళ్తున్న అంటుంది.

చంచల-మేకప్ టచ్ అప్ కి ఇటు వైపు ఎక్కడికి వెళ్తున్నావు.

రిథిమా-నేను సియా రూంకి వెళ్తున్న నా రూమ్ బల్బ్ ఫ్యూజ్ పోయింది అందుకని.

చంచల-ఈ కంబళి ఎందుకు కప్పుకున్నావు.ఇటు ఇవ్వు కంబళి.

రిథిమా-అది కాదు అత్తయ్య నానమ్మ చెప్పింది పెళ్ళికి ముందు పెళ్లి కూతురు ఎవరి ముందుకి రాకూడదని అందుకే కంబళి కప్పుకున్న అని వెళ్ళిపోతుంది.

చంచల-ఈ కాలపు అమ్మాయిలు మేకప్ లేకుండా అద్దంలో కూడా మొహం చూసుకోవట్లేదు అని తను తన ఫేస్ అద్దంలో చూసుకొని వెళ్లి ఆర్యన్ పక్కన కూర్చుంటుంది.

చంచల ఆర్యన్ ని షీరా ని ఏం చేసావు అని అడుగుతుంది.అప్పుడు ఆర్యన్ దాని గురించి వదిలేసి అమ్మ పెళ్లి మీద ధ్యాస పెట్టు అని జరిగింది తలుచుకుంటాడు.చంచల దగ్గర ఉన్న షీరా ని చూసి గుర్తు పట్టి ఇది గోల్డ్ కాదు పెన్ డ్రైవ్ ఇందులోనే వంశ్ సీక్రెట్స్ అన్నీ ఉన్నాయి నాకు ఇవ్వు తీసుకుంటాడు.వంశ్ కి తెలిసిందో షీరా దొంగతనం మనం చేశామని తెలిస్తే మనలన్నీ బయటికి తోసేస్తాడు అనగానే చంచల నేనేం దొంగతనం చేయాలా పసుపు గిన్నెలో దొరికిందని చెప్పి వంశ్ కి ఇచ్చేస్తాను అంటుంది.అందుకు ఆర్యన్ వంశ్ నమ్మడు నేనే ఏదో ఒకటి చేయాలి. నేనే దాచిపెడతాను అది ఎవరు ఆలోచించని ప్లేసులో అని తీసుకుంటాడు ఆర్యన్ షీరా ని.చంచలతో ఆర్యన్ పొరపాటున కూడా షీరా పేరు నీ నోటి నుండి రానివ్వద్దు అమ్మ అంటాడు.అంతలో పూజారి గారు ముహూర్త సమయం రాబోతుంది పెళ్లి కూతురిని తీసుకొని రండి అంటారు.వంశ్ నానమ్మ ఇషానిని రిథిమాని తీసుకొని రమ్మని పంపుతుంది.కబీర్ షీరా చంచల రూమ్ నుండి ఎలా మాయం అయింది త్వరగా షీరా ని వెతికి రిథిమాని తీసుకొని వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు.రాజ్ ఒక కేటర్స్ అతన్ని తీసుకొని వెళ్ళిపోతాడు.అందరూ ఇషాని రిథిమాని ఇంకా తీసుకొని రాలేదని కంగారు పడుతూ ఉంటారు.రాజ్ వంశ్ దగ్గరికి వచ్చి మన శత్రువులు మన దగ్గరే బందీలుగా ఉన్నారు మీ అనుమానమే నిజం అయింది వాళ్ళు పెళ్లికి వచ్చారు అంటాడు.అందుకు వంశ్ శత్రువులకు నా పెళ్లి కానుక నీ చేతులతోనే ఇవ్వు అంటాడు .రాజ్ నవ్వుతూ వెళ్ళిపోతాడు.రిథిమా స్టోర్ రూమ్ లోకి వెళ్లి దాక్కుంటుంది.రాజ్ ఫోన్లో ఎవరితోనో బాస్ శత్రువులని చంపేయమని ఆర్డర్ ఇచ్చారు అని చెప్పడం విని కబీర్ ని పట్టుకున్నారేమో అని భయపడుతుంది.కబీర్ కి ఏమైనా అయితే తను కూడా చనిపోతానని ఎలా కాపాడాలి కబీర్ ని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఏడుస్తూ వుండగా రాజ్ గేమ్ ఓవర్ అని గన్ షూట్ చేయడం విని రిథిమా షాక్ అయ్యి అలాగే ఉండిపోతుంది.


Rate this content
Log in

More telugu story from Shaik Sameera

Similar telugu story from Thriller