Shaik Sameera

Thriller

4  

Shaik Sameera

Thriller

ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

5 mins
316


           ఎపిసోడ్-28

రాజ్ తో వంశ్ డిసోజాని బయటికి గెంటేయమని చెప్పడంతో రాజ్ డిసోజా చేతికి కట్టి ఉన్న తాడుని పట్టుకోగానే వంశ్ నానమ్మ ఆగు అని ఆపుతుంది.

వంశ్ నానమ్మ-ఇదేం జరుగుతుంది వంశ్.ఇన్ని ఇయర్స్ నుండి తను మనకి సేవ చేసింది తనతో ఇలా ప్రవర్తించడం మంచిది కాదు.

వంశ్-నానమ్మ తను తప్పు చేసింది.

వంశ్ నానమ్మ-నేను ఒప్పుకుంటాను తనవల్ల తప్పు జరిగింది అని దానికోసం తను క్షమాపణ కూడా చెబుతుంది కదా.నువ్వే స్వయంగా చెబుతూ ఉంటావుగా డిసోజా కూడా ఈ కుటుంబంలో భాగమే అని.మరి మన కుటుంబంవాళ్ళతో నువ్వు ఇలానే ప్రవర్తిస్తావా.తనని ఇంట్లో నుంచి వెళ్లనివ్వదు.

వంశ్-అలాగే నానమ్మ మీరు చెబుతున్నారు కాబట్టి తనకి ఇంకో అవకాశం ఇస్తాను.లేకపోతే నన్ను మోసం చేసేవాళ్ళు ఈ ఇంట్లోనే కాదు ఈ ప్రపంచంలో బ్రతికి ఉండటం కూడా నేను భరించలేను అని వెళ్ళిపోతాడు.

డిసోజా-థాంక్ యు నానమ్మ మీరు నన్ను కాపాడారు అని ఏడుస్తుంది.

వంశ్ నానమ్మ-బాధపడకు ఏం కాదు నీకు.

కిచెన్ నుండి ఏదో కాలిన వాసనా వస్తూ ఉండటంతో అందరూ కిచెన్ లోకి వెళ్తారు.అది చూసి ఇషాని నవ్వుతూ తన చేతిలో ఉన్న లైటర్ చూసుకుంటూ రిథిమా నెయ్యి గిన్నె పెట్టి గ్యాస్ వెలిగించకుండగానే వచ్చేస్తుంది.కానీ ఇషాని కావాలని గ్యాస్ వెలిగించి వచ్చేస్తుంది దానితో గిన్నె కాలి మాడిపోతుంది.

ఇషాని మనసులో-ఇంట్లో వాళ్ళకి స్వీట్ తినిపించాలని అనుకుంది నీ మార్నింగ్ ని చాలా బాధగా నేను చేస్తాను అని అందరితో పాటు తను వెళ్తుంది కిచెన్ లోకి.

రిథిమా కాలిన గిన్నెని వాష్ బేసిన్ లో పెట్టేస్తుంది.

అనుప్రియ-అది చూసి అనుప్రియ ఏంటి రిథిమా నెయ్యి గిన్నె పెట్టి మర్చిపోయావా ఇంత మాత్రం కూడా ధ్యాస పెట్టలేవా ఇంత పెద్ద అపశకునం చేసేసావు ఏంటి.కృష్ణుడికి ప్రసాదం గా ఇది పెడతావా.

ఇషాని-మామ్ ఈ ఇంటి కోసం మంచి జరగాలని కోరుకున్నావు కదా.నీ కోడలి చేత పాయసం చేయించి కృష్ణుడికి ప్రసాదంగా సమ్పరించాలని అనుకున్నావు కదా.ఇప్పుడు చూడు నీ కొత్త కోడలు తనతో పాటు ఎలాంటి శుభాలు తీసుకొని వచ్చిందో చూడు.వంశ్ అన్నయ్య డిసోజాతో కనీసం ఎప్పుడు పెద్దగా అరిచి కూడా మాట్లాడలేదు అలాంటి అన్నయ్య ఈరోజు తనని శిక్షించాలని అనుకున్నాడు.ఇక్కడ ప్రసాదంగా పెట్టాలనుకున్న పాయసం మాడిపోయింది.తెలియదు ఇంకా ఈ ఇంట్లో ఇంకేం జరుగుతాయో?

రిథిమా-లేదు నానమ్మ నేను గ్యాస్ ఆన్ చేయలేదు ఇదేం అపశకునం కాదు నన్ను నమ్మండి ప్లీజ్ అని నాకు కొంచెం సమయం ఇవ్వండి నేను ఏదో ఒక స్వీట్ చేస్తాను అని అటుకులతో పాయసం చేస్తుంది.

వంశ్ నానమ్మ-తల్లి జన్మాష్టమి రోజు కృష్ణుడికి స్వీట్ ప్రసాదంగా అర్పించు అనగానే అటుకుల పాయసాన్ని రిథిమా ప్రసాదంగా కృష్ణుడి ముందు అరిటాకులో కొంచెం పెట్టి అర్పిస్తోంది.

రిథిమా ప్రసాదం పెట్టడం వంశ్ చూస్తూ ఉంటాడు.

రిథిమా-ప్రసాదాన్ని వంశ్ దగ్గరికి తీసుకొని వచ్చి పాయసం అయితే చేయలేకపోయాను కానీ ఇదైతే పాయసమే అటుకుల పాయసం మీరు ఎప్పుడైతే తినకపోయి ఉండొచ్చు మా మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే ఇది స్వీట్ డిష్ లాంటిది అని టేస్ట్ చూడండి మనసులో ఉన్న చేదు కొంచెమైనా తగ్గుతుంది అని వంశ్ కి ఇస్తుంది.

వంశ్-పాయసం తిని వంశ్ not bad అంటాడు.

వంశ్ నానమ్మ-చూసావా వంశ్ తననే అంటారు నిజమైన కోడలు అని ఈరోజు చెడు జరిగేది కానీ రిథిమా తన చతురతో ఈ అశుభఘడియని శుభఘడియగా మార్చేసింది.

వంశ్-మామ్ నాకు చాలా అర్జెంటు మీటింగ్ ఉంది 2గంటలకి నేను వెళ్తున్న అని వెళ్ళిపోతాడు.

రిథిమా-కిచెన్ క్లీన్ చేద్దామని లోపలికి వెళ్తుంది రిథిమా డిసోజా అక్కడికి వచ్చి మీరు వెళ్ళండి నేను క్లీన్ చేస్తాను అంటుంది.రిథిమా డిసోజా చేతికి ఉన్న గాయాలన్ని చూసి రిథిమా ఆయింట్మెంట్ రాస్తూ సారీ డిసోజా నీకు జరిగినదానికి నేనేం చేయలేకపోయాను అంటుంది.

డిసోజా-చిన్నప్పటి నుండి వంశ్ బాబా ని నా ఒడిలో ఆడించాను.తను చిన్నవాడు నుండి పెద్దగా అయ్యే వరకు చూసాను.పొరపాటున చిన్న తప్పు చేస్తే ఇంత పెద్ద శిక్ష వేసాడు ఇదెక్కడి జస్టిస్ అని బాధపడుతుంది.

రిథిమా-నాకు తెలుసు మీరు బాగా హర్ట్ అయ్యారని వంశ్ తరపున నేను మీకు సారీ చెబుతున్న iam really sorry అంటుంది.అయిన అంతలా ఏముంది బ్యాక్ యార్డులో అక్కడికి వెళ్లినందుకు ఇంత పెద్ద పనిష్మెంట్ వేస్తున్నారు.

డిసోజా-ఇంటి నౌకర్లు,ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి వెళ్ళకూడదు.కనీసం బ్యాక్ యార్డ్ గురించి మాట్లాడకూడదు ప్లీజ్ మాట్లాడొద్దు అని వెళ్ళిపోతుంది.

రిథిమా-అక్కడికి వెళ్లడంతోనే వంశ్ కి అంత ప్రాబ్లెమ్ ఉంది అంటే అక్కడ ఏదో రహస్యం దాగి ఉంది.వంశ్ ప్రస్తుతo నుండి అయితే ఏది వెతకలేకపోయాను కానీ గడిచిపోయినా కాలంలో ఏదైనా రహస్యం దాగి ఉందేమో దానితో వంశ్ ని జైలుకి పంపించగలనేమో.వంశ్ మీటింగ్ కి వెళ్లడం గుర్తొచ్చి వంశ్ వచ్చేలోపు బ్యాక్ యార్డుకి వెళ్లాలని వెళ్తుంది.

వంశ్-తన లాప్టాప్ లో ఎవరితోనో వీడియో కాల్ లో మాట్లాడుతూ ఈ డీల్ గురించి నా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు.మొత్తం ఇన్ఫర్మేషన్ విరిగిపోయిన నా పెన్ డ్రైవ్ లో ఉంది.నేను డబల్ అమౌంట్ pay చేయడానికి రెడీ నాకు ఎలా అయిన ఈ డీల్ కావాలి ఎలాగైనా.నా నుంచి ఈ డీల్ డన్ అనుకోండి అని లాప్టాప్ ఆఫ్ చేసేస్తాడు.ఏది కోల్పోలేదు నేను చాలా తొందరలోనే ఈ ఇంట్లో నమ్మకద్రోహి ఎవరో తెలుస్తుంది.

రిథిమా మనసులో వంశ్ మీటింగ్ అయ్యేలోపు నేను బ్యాక్ యార్డుకి వెళ్ళాలి అని వెళ్తూవుండగా ఆర్యన్ కనిపిస్తాడు.

ఆర్యన్-ఎందుకు ఏదో భయపడుతున్నట్టు కనిపిస్తున్నావు.ఏదైనా తుఫాను సృష్టించే పని చేసే మూడ్ లో ఉన్నావా.

రిథిమా-నీ పని నువ్వు చూసుకుంటే మంచిది.

ఆర్యన్-i think i know వంశ్ అన్నయ్యతో బంధం నిలుపుకోవడం ప్లాప్.నీకు ఏదైనా అవసరం ఉంటే నా హెల్ప్ తీసుకోవడానికి వెనుకాడొద్దు. నువ్వు నా హెల్ప్ తీసుకుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను.నువ్వు నన్ను సొంతవాడిలా అనుకో అంటాడు.

రిథిమా-ఆర్యన్ నేను నీ వదినని.నాకు ఏదైనా కావాలన్నా ఏదైనా సహాయం కావాలన్నా వంశ్ ని అడగగాలను.Thank you అని వెళ్ళిపోతుంది.

వంశ్ -ఆ నమ్మకద్రోహి రిథిమా అయిన తను తప్పించుకోలేదు.నేను సాక్ష్యం లేకుండా ఎవరిని దోషిగా అనలేను.షీరా రిథిమా గదిలో దొరకడం సాక్ష్యం కాదు.మనం వెతికేది రిథిమానే అయితే తను చాలా తొందరగానే ఏదో ఒక తప్పు చేసి మనకి దొరుకుతుంది అని రాజ్ తో అంటాడు.ఇలాంటి బంధనంలో బంధిస్తాను తనని రిథిమా నిజం మనకి తెలిసిపోతుంది చాలా సులభంగా.

రిథిమా ఆర్యన్ వెళ్ళిపోయాక బ్యాక్ యార్డ్ కి వెళ్తుంది.తన అడుగుల గుర్తులు పడకుండా డిసోజా అడుగుల గుర్తులలో అడుగులు వేస్తూ వెళ్తుంది.డిసోజా అడుగులా గుర్తులు ఫాలో అవుతూ వెళ్తుంది.వంశ్ రాజ్ తో రిథిమాకి తన మీద తనకి నమ్మకం ఎక్కువ నాకు తెలియకుండానే తను అన్ని చేయగలుగుతుంది అనుకుంటుంది.అది తన అమాయకత్వం తన నీడ కూడా నన్ను దాటి వెళ్ళదు.రిథిమా బ్యాక్ యార్డులో ఒక రూమ్ లాంటి ఏరియా లోకి వెళ్లి ఏముందో చూస్తూ ఉంటుంది.

వంశ్-ఎప్పుడు తెలుసుకోలేదు తను V R మాన్షన్ ఇంటి గోడలు ఎలాంటి రహస్యాలు వాటిలో దాచుకున్నాయో.ఒకవేళ tanu తెలుసుకోవడానికో ప్రయతించిందో తను పట్టుబడిపోతుంది మనకి.Interesting very interesting.

రిథిమాకి ఆ రూంలో కొన్ని బాక్స్ కనిపిస్తాయి ఏది దొరకదు తనకి.త్వరగా వెతకాలి అనుకుంటూ వుండగా ఎవరో వెనక నుండి పట్టుకున్నట్టు అనిపిస్తుంది.వంశ్ అనుకోని sorry వంశ్ నడుస్తూ తిరుగుతూ తిరుగుతూ దారి తప్పి ఇటు వైపు వచ్చేసాను సారీ అని వెనక్కి తిరుగుతుంది అక్కడ ఎవరు ఉండరు తన పైట టేబుల్ తగిలి ఉంటుంది.తన పైట తీసుకుంటూ వుండగా ఒక statue పరదా వెనక కనిపిస్తుంది తనకి.రిథిమా అక్కడికి వెళ్లి పరదా తీస్తే ఒక అమ్మాయి విగ్రహం కనిపిస్తుంది తనకి.ఇది ఎవరి statue అని ఆలోచిస్తూ వుండగా ఆ statue వేలికి VR అనే పేరు ఉన్న రింగ్ కనిపిస్తుంది.VR అంటే వంశ్ రాయ్ సింఘానియా కదా.వంశ్ పేరు ఉన్న రింగ్ తన చేతిలో ఎందుకు ఉంది ఎవరు ఈ అమ్మాయి తెలుసుకోవాలి అనుకుంటూ వెళ్లిపోతుండగా మళ్ళీ తన చున్నీ పట్టుకున్నట్టు అనిపిస్తుంది తను మళ్ళీ టేబుల్ కి పట్టుకొని ఉంటుందని వెనక్కి తిరగకుండానే లాగడానికి ట్రై చేస్తుంది.రాకపోయేసరికి వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ వంశ్ తన చున్నీ పట్టుకొని ఉంటాడు తన చేతిలో.

వంశ్-రిథిమాని చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు MRS.డిసోజా చెప్పిందా ఈ statue గురించి నీకు 

రిథిమా-కాదు అని తన చున్నీ తీసుకుంటుంది.తనేం చెప్పలేదు తను ఎందుకు చెబుతుంది.

వంశ్-Dont play with me రిథిమా.నీకు ఎందుకు అనిపిస్తుంది నా దృష్టి నీపైన లేదని.

రిథిమా-ఎవరు నాకు చెప్పలేదు వంశ్.ప్రొద్దున డిసోజాతో జరిగినది తెలిసి తను మళ్ళీ నీ నమ్మకాo పోయేలా ఎందుకు చేస్తుంది

వంశ్-ఇంటరెస్టింగ్ చెబుతారు ఇతరులు చేసిన తప్పులతో మనం పాఠాలు నేర్చుకుంటామని డిసోజాకి జరిగింది తెలిసి కూడా నువ్వు ఇక్కడికి వచ్చే ధైర్యం చేసావా.Why sweet heart why.

రిథిమా-అలా ఏం లేదు మాన్షన్ చూస్తూ తిరుగుతూ ఉన్నాను అలా తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చేసాను అంతే

వంశ్ రిథిమా మాటలకి కోపo వచ్చి అక్కడ ఉన్న కత్తి తీసుకొని రిథిమా పైకి విసురుతాడు.అది రిథిమా భుజం పక్క నుండి వెళ్లి బాక్స్ కి తగులుతుంది.

వంశ్-నేను గురి తప్పుగా చూసాను అనుకోవద్దు.నేను నా ప్రశ్నలకి సమాధానం దొరికేవరకు నీకు శిక్ష కూడా వేయలేను.నీ కళ్ళ ముందే ఇక్కడికి వచ్చినందుకు డిసోజాని బయటికి వెళ్ళబోతు తప్పించుకుంది చూసి కూడా నువ్వు ఇక్కడికి రావడానికి ధైర్యం చేసావు ఎందుకు?



Rate this content
Log in

Similar telugu story from Thriller