ప్రేమ సంఘర్షణ
ప్రేమ సంఘర్షణ
ఎపిసోడ్ -2
మేఘ ని చంపేసి వెళ్తున్న వంశ్ రాయ్ సింఘానియా ని కబీర్ ఫాలో అవుతూ వెళ్తాడు. కబీర్ తనని ఫాలో అవుతున్నాడని తెలిసి వంశ్ కబీర్ ని పోర్ట్ వైపుకి తీసుకెళ్తాడు. కబీర్ వంశ్ ఒకరికి ఒకరు ఎదురు పడతారు. కబీర్ మేఘ ని చంపినందుకు వంశ్ ని అరెస్ట్ చేస్తాను అంటాడు. వంశ్ మేఘ ని చంపినట్టు ప్రూఫ్ లేదు కబీర్ లైట్ హౌస్ పైన నేను మేఘ సారీ మీ సిబిఐ ఆఫీసర్ మాత్రమే ఉన్నాము మేఘ చనిపోయింది సో నో ప్రూఫ్ నో అరెస్ట్. ఓడిపోవడం అలవాటు చేసుకో కబీర్ నన్ను ఓడించడం నీవల్ల కాదు అంటాడు. కోపంతో కబీర్ గన్ తీసి వంశ్ మీద గురి పెడతాడు. లైట్ హౌస్ లాగే ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నాము. నేను నిన్ను చంపేసిన నో కేస్ నో ప్రూఫ్ అంటాడు. వంశ్ కబీర్ నువ్వు నన్ను చంపలేవు అంటాడు. చంపేయాలి అనుకుంటే ఇంత గేమ్ ఎందుకు ఆడతావు నన్ను పట్టుకోవాలని ఒక సిబిఐ ఆఫీసర్ ని ఎందుకు పంపిస్తావు ప్రూఫ్స్ కోసం అంటాడు.
రిథిమా కబీర్ కోసం వాళ్ళు రెగ్యులర్ గా కలిసే పార్క్ బెంచిని డెకరేట్ చేసి కబీర్ కోసం కొన్న గిఫ్ట్ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది. కబీర్ కోపంతో వంశ్ మీద ఎటాక్ చేస్తాడు. వంశ్ కబీర్ ఫైట్ చేస్తూ ఉంటారు. కబీర్ పైన వంశ్ యే ఎక్కువగా ఎటాక్ చేస్తాడు అందుకు కబీర్ వంశ్ కళ్ళలో మట్టి వేస్తాడు వంశ్ ని కొట్టాలని. కానీ వంశ్ మట్టి పడగానే తన కళ్ళ పైన తన పాకెట్ నుండి ఒక క్లోత్ తీసుకొని కట్టుకొని కబీర్ కి ఒక్క పంచ్ ఇస్తాడు. కబీర్ పంచ్ దెబ్బకి కంటైనర్ కి తగిలి కింద పడిపోయి పైకి లేవలేకపోతాడు. అప్పుడు వంశ్ గుడ్ బై కబీర్ అని కబీర్ చుట్టూ మంట వేసి వెళ్ళిపోతాడు. వంశ్ తన V R మాన్షన్ కి వెళ్తాడు. రిథిమా చేతిలోని రింగ్ కింద పడిపోతుంది అది చూసి కబీర్ కి ఏదైనా అయిందేమో అని టెన్షన్ పడుతుంది. అప్పుడే వర్షం పడుతోంది కానీ రిథిమా కబీర్ కోసం వర్షంలోనే వెయిట్ చేస్తూ ఉంటుంది.
వంశ్ తన మాన్షన్ లోకి వెళ్ళగానే తన సర్వెంట్స్ అందరిని సీరియస్ గా చూస్తూ తన చేతికి అంటుకున్న బ్లడ్ ని క్లీన్ చేసుకుంటాడు. వంశ్ తల్లి అనుప్రియ వంశ్ చేతికి ఉన్న గాయాన్ని చూసి నీకు ఏదైనా గాయం అయితే దాని బాధ నాకు కలుగుతుంది అని వంశ్ చేతికి కట్టు కడుతుంది. వంశ్ బాడీ గార్డ్ అయిన రాజ్ ని కోపంగా చూస్తుంది అది గమనించిన వంశ్ మామ్ రాజ్ తప్పేం లేదు నేనే ఒక మ్యాటర్ సెటిల్ చేద్దామని ఒంటరిగా వెళ్ళాను అంటాడు. అప్పుడే వంశ్ బాబాయి రాఘవ్ రాయ్ సింఘానియా వంశ్ చేతికి దెబ్బ తగిలింది అంటే అవతల వాళ్ళు చనిపోయి ఉంటారు సింహం లాంటి వాడు నా వంశ్ ఎవరు ఏం చేయలేరు అంటాడు. రాఘవ్ కొడుకు ఆర్యన్ ఎస్ డాడ్ నిజం చెప్పారు అన్నయ్య ఒక సిబిఐ ఆఫీసర్ అయిన అమ్మాయిని ఎటాక్ చేయడానికి వెళ్ళాడు అని అవమానించినట్టు మాట్లాడుతూ మందు తాగుతూ వంశ్ కి చీర్స్ చెప్పబోతాడు . వంశ్ కోపంతో ఆర్యన్ ఏం చేస్తున్నావు అంటాడు అన్నయ్య నువ్వు సాధించిన విక్టరీకి పార్టీ చేసుకుంటున్న అంటాడు. వంశ్ ఆర్యన్ నువ్వు కూడా ఏదైనా సాధిస్తే పార్టీ చేసుకోవాలని అనుకుంటున్నాను కానీ నువ్వు నాకు ఆ ఛాన్స్ యిచ్చేలా లేవు అని చెప్పి వెళ్ళిపోతాడు. అనుప్రియ ఆర్యన్ వంశ్ ఉంటేనే ఈ ఫ్యామిలీ ఉంది లేకపోతే మన ఫ్యామిలీ ఉండదు అని చెప్పి వెళ్ళిపోతుంది. రాఘవ్ కూడా అన్నయ్య తో ఎలా మాట్లాడాలో నేర్చుకో అని ఆర్యన్ నే తిట్టి వెళ్ళిపోతాడు.
రిథిమా వర్షంలోనే వెయిట్ చేస్తూ ఉండగా కబీర్ వచ్చి రిథిమా అని అరుస్తూ కిందపడిపోతాడు. రిథిమా కబీర్ దగ్గరికి వచ్చి గాయాలు చూసి ఏమ
ైంది కబీర్ ఎవరు చేసారు ఇలా అని అడుగుతూ ఉండగా వంశ్ రాయ్ సింఘానియా అని కబీర్ అస్సిటెంట్ మిశ్రా చెబుతాడు. రిథిమా కబీర్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. కబీర్ తెల్లారేసరికి కోలుకొని రిథిమా ని వాళ్ళు రెగ్యులర్ గా కలిసే ప్లేసుకి తీసుకెళ్తాడు. కబీర్ రిథిమా కి సారీ చెబుతాడు తను ఒక సిబిఐ ఏజెంట్ అని తనకి చెప్పనందుకు. కబీర్ నువ్వు ఒక సింపుల్ నార్మల్ PT టీచర్ అనుకున్న కానీ నువ్వు యిప్పుడు దేశాన్ని కాపాడే సిబిఐ ఏజెంట్ అని తెలిసాక చాలా గర్వంగా ఉంది అంటుంది. కబీర్ రిథిమా ముందు మోకాళ్ళ పైన కూర్చొని ఐ లవ్ యు రిథిమా అంటాడు రిథిమా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కబీర్ ని హాగ్ చేసుకుంటుంది. కబీర్ రిథిమా తెచ్చిన రింగ్ ని తన వేలికి తొడుగుతాడు. రిథిమా కి తను రిథిమా ఫోటో ఉన్న లాకెట్ ఇస్తాడు. ఈ లాకెట్ నీకు మన పెళ్లి అయ్యాక ఇద్దామనుకున్న ఎందుకంటే నేను ఏదైనా మిషన్ మీద బయటికి వెళితే ఈ లాకెట్ నీతో ఉంటే నేను నీతో ఉన్నట్టు ఉంటుంది అంటాడు.
రిథిమా నీకు ఇంకా బాగా నా ప్రేమ గురించి చెప్పాలనుకున్న నా మిషన్ సక్సెస్ అయ్యి ఉంటే కానీ ఓడిపోయాను నేను అని బాధపడుతూ ఉంటాడు కబీర్. కబీర్ యిప్పుడు నువ్వు ఓడిపోయినా మళ్ళీ తప్పకుండ గెలుస్తావు నీకు ఛాన్స్ వస్తుంది అంటుంది. లేదు రిథిమా వంశ్ రాయ్ సింఘానియా అన్ని ఆప్షన్స్ క్లోజ్ చేసాడు అలాగే మా సిబిఐ ఆఫీసర్ మేఘ ని చంపేశాడు. ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క ఆప్షన్ వంశ్ రాయ్ సింఘానియా ని పట్టుకోవాలంటే ఒక అమ్మాయి కావాలి తనకి ఎటువంటి పోలీస్ బ్యాక్ గ్రౌండ్ ఉండకూడదు అలాంటి అమ్మాయి వంశ్ మనసులో తన పైన నమ్మకాన్ని స్థానాన్ని సంపాదించాలి వంశ్ ప్రేయసిలాగా మారాలి అలా నువ్వు నాకోసం చేస్తావా రిథిమా అని అడుగుతాడు.
రిథిమా షాక్ అయ్యి ఏం అడుగుతున్నావో తెలుసా కబీర్ నా ప్రాణాన్ని అడిగి ఉన్న ఇచ్చేసేదాన్ని సంతోషంగా ఇలా చేయడం నా వల్ల కాదు చేయలేను అంటుంది. కబీర్ రిథిమా నా లైఫ్ లో రెండే ముఖ్యమైనవి ఒకటి దేశం రెండు నువ్వు ఇలా చేయడం నీకే కాదు నాకు కష్టమే కానీ ఏం చేయను నాకున్న ఒకే ఒక ఆప్షన్ నువ్వే వంశ్ రాయ్ సింఘానియా ని పట్టుకోవడానికి మేఘ చావుకు న్యాయం జరిపించడానికి అంటాడు. నా ప్రేమ కోసం నా కోసం చేయి రిథిమా ప్లీజ్ అని తన హాండ్స్ పట్టుకొని బ్రతిమాలుతాడు. రిథిమా చేస్తాను అని ఒప్పుకుంటుంది నీ ప్రేమ కోసం ఏదైనా చేస్తాను అంటుంది. కబీర్ రిథిమా ని హాగ్ చేసుకొని థాంక్ యు రిథిమా అంటాడు. ఒక వేళ వాళ్ళకి నేను పట్టుబడితే వాళ్ళు నన్ను చంపేస్తారు కదా అని రిథిమా ఏడుస్తుంది. అందుకు కబీర్ నీకేమైనా అయితే నేను బ్రతకలేను నీకు ఏం కాకుండా చూసుకుంటాను ప్రామిస్ చేస్తాడు రిథిమాకి. వంశ్ చాలా డేంజరస్ ఎవరిని అంతా త్వరగా నమ్మడు పైకి మాత్రమే అతను ఒక బిజినెస్ మాన్ లోపల స్మగ్లింగ్ ఇల్లీగల్ బిసినెస్ లాంటివి ఎన్నో చేస్తున్నాడు అండర్ వరల్డ్ లో. అతని చీకటి ప్రపంచం గురించి ప్రూఫ్స్ తీసుకొని రావాలి రిథిమా నువ్వు అంటాడు. రేపు వంశ్ పోర్ట్ లోని ఒక క్రూయిజ్ లో పెద్ద పెయింట్స్ ఎక్సిబిషన్ పెడుతున్నాడు. నువ్వు ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి వెళ్ళాలి వంశ్ ఎక్సిబిషన్ పేరుతో చేసే అతని ఇల్లీగల్ బిజినెస్ కి సంబంధించిన ప్రూఫ్స్ సంపాందించాలి అంటాడు. రిథిమా క్రూయిజ్ దగ్గరికి వెళ్తుంది మెట్లు ఎక్కుతూ కబీర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. వంశ్ ఎవరిని నమ్మడు వాళ్ల బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయిస్తాడు మన మిద్దరం ఇదే చివరి సారి కలవడం మన మిషన్ పూర్తి అయ్యాక కలుద్దాం అంటాడు అది తలుచుకొని రిథిమా బాధపడుతూ ఉంటుంది.