Shaik Sameera

Thriller


5  

Shaik Sameera

Thriller


ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

4 mins 288 4 mins 288

          ఎపిసోడ్ -19

వంశ్ కబీర్ పంపిన మెసేజ్ పేపర్ చూస్తాడని రిథిమా వంశ్ దగ్గరికి వెళ్లి తన లెహంగాతో కప్పేస్తుంది పేపర్ అనుప్రియని కూడా డాన్స్ చేయటానికి తీసుకెళ్తూ ఏదో తగిలినట్టు నటించి కిందపడిన పేపర్ వంశ్ చూడకుండా తీసుకుంటుంది. రాజ్ మాన్షన్లో షీరా కోసం అన్ని రూమ్స్ సెర్చ్ చేస్తూ ఉంటాడు.వంశ్ రిథిమా డాన్స్ చేస్తూ ఉండటం గమనిస్తూ ఉంటాడు.రిథిమా అందరూ సంగీత్ లో బిజీ గా ఉండటం చూసి బయటికి వెళ్ళిపోతుంది.రాజ్ షీరా దొరకలేదని వంశ్ కి చెప్పడానికి వస్తాడు.వంశ్ షీరా ఎలా మాయం అయింది ఎవరు తీసి ఉంటారని ఆలోచిస్తూ రిథిమా తన చేతిని కాల్చుకోవడం అవన్నీ గుర్తొచ్చి i think i know షీరా ఎవరు తీసుకున్నారో తెలుసు అంటాడు వంశ్ . రిథిమా బయటికి వెళ్తుంటే ఆర్యన్ వచ్చి అడ్డుగా నిలబడతాడు.

రిథిమా -నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని రిథిమా ఆర్యన్ ని అడుగుతుంది.

ఆర్యన్ -నా గురించి వదిలేయి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడైనా పెళ్లికూతురు తన సంగీత్ వదిలి పారిపోతుందా.పారిపోతున్నావా అంటాడు 

రిథిమా- నేనెందుకు పారిపోతాను సంగీత్ లో కొంచెం ఇబ్బందిగా అనిపించింది అందుకే గాలి కోసం బయటికి వచ్చాను అంటుంది.

ఆర్యన్-రిలాక్స్ అవ్వడానికి బయటికి వస్తే ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు.అయిన వంశ్ అన్నయ్య నిన్ను గమనిస్తూనే ఉన్నాడు ప్రతి క్షణం నువ్వు ఇక్కడ నుండి వెళ్లడం అసాధ్యం వదిన అని వెళ్ళిపోతాడు.

రిథిమా ఆర్యన్ వెళ్ళిపోయాక డస్ట్ బిన్ దగ్గరికి వెళ్లి షీరా కోసం వెతుకుతూ ఉన్నప్పుడు తన మెహందీ డస్ట్ బిన్ కి అంటుకుంటుంది. వంశ్ కూడా రిథిమాని వెతుకుతూ బయటికి వస్తాడు అక్కడ డస్ట్ బిన్ కిందపడి ఉండటం చూసి MRS.డిసోజా అని గట్టిగా అరుస్తాడు ఇక్కడ ఇలా పనులు జరుగుతాయా ఏంటి ఇదంతా ముందు క్లీన్ చేయండి అని చెప్పి వెళ్ళేటపుడు వంశ్ కి డస్ట్ బిన్ మీద మెహందీ కనిపిస్తుంది ఇక్కడ ఎవరో ఏదో వెతకడానికి ట్రై చేసారు ఎవరి చేతి మెహందీ చెరిగిపోయిందో వాళ్లే చేసి ఉంటారు అని అనుకుంటూ వుండగా రాజ్ వచ్చి బాస్ రిథిమా ఫ్యామిలీతో డాన్స్ చేస్తుంది లోపల మనం అనవసరంగా బయట వెతుకుతున్నాము అంటాడు.అప్పుడు వంశ్ రిథిమా ఏదైతే బయటికి చూపిస్తుందో అదంతా ఒక భ్రమ మాత్రమే నా అనుమానమే నిజం కాబోతుంది iam coming ridhima అని లోపలికి వెళ్తాడు.

వంశ్ లోపలికి వచ్చేసరికి అందరూ డాన్స్ చేయటం చూసి ఒక పిక్చర్ తీసుకుందాం అందరూ వాళ్ళ చేతి మెహందీ చూపిస్తే పిక్చర్ చాలా బాగుంటుంది అంటాడు.ముందుగా రిథిమానే తన చేతికి ఉన్న మెహందీ చూపిస్తుంది అది చెరిగిపోయి ఉండటం చూసి నా అనుమానమే నిజం అయింది రిథిమా నువ్వే డస్ట్ బిన్ దగ్గర ఏదో వెతికావు అని తన మొబైల్ తీసి ఫోటో తీస్తూ అందరి చేతి మెహందీ చెరిగిపోయి ఉండటం చూసి షాక్ అయ్యి అందరి మెహందీ ఎలా చెరిగిపోయింది అనుకుంటూ ఫోటో తీస్తాడు.రిథిమా వంశ్ బయటికి రావటం డస్ట్ బిన్ మీద తన మెహందీ అంటుకోవడం చూసి లోపలికి వచ్చి అందరి చేత మెహందీ చెరిగేలా డాన్స్ చేపిస్తుంది అలాగే వంశ్ రాకముందే డస్ట్ బిన్ నుండి షీరా ని తీసుకొని తన చేతికి ఉన్న బ్యాండేజ్ లోపల దాచిపెడుతుంది ఎవరికీ తెలియకుండా.వంశ్ నానమ్మ రిథిమా చేతికి ఉన్న మెహందీ చెరిగిపోవడం చూసి ఏం కాదులే మెహందీ తన రంగుని వదిలింది కదా దీని అర్థo మీ బంధంలో ప్రేమ,నమ్మకం ఎప్పుడు తక్కువ కావు అంటుంది.రిథిమా మనసులో వంశ్ ని చూసి నీకు భరోసా ఉంది నీ బలం పైన కానీ నాకు నా ప్రేమ,నిజాయతీ మీద విశ్వాసం ఉంది అందుకే ఈరోజు విజయం నాది అయింది.ఇప్పుడు నీ నాశనం కోసం నా చేతిలో ఉంది షీరా నా దగ్గర undi.ఇప్పుడు నీ వినాశనం కోసం నేను రెడీగా ఉన్నాను వంశ్ అనుకుంటుంది.వంశ్ నానమ్మ రిథిమా చేతికి ఉన్న మెహందీ రంగుని చూసి దీనర్ధం వంశ్ నిన్ను చాలా ప్రేమిస్తాడు అంటుంది.అందుకు రిథిమా నా చేతి మీద కబీర్ పేరు ఉన్న మెహందీ ఉండాలి అది నువ్వే లాగేసుకున్నావు వంశ్ అనుకోని వెళ్ళిపోతుంది.

కబీర్ రిథిమా ఫోటోని తన మొబైల్ లో చూసుకుంటూ రిథిమా వంశ్ నీ చేతిని మాత్రమే నా నుండి లాగేసుకున్నాడు అంతే.నిన్ను నా నుండి లాక్కోనివ్వను నేను వస్తున్నా రిథిమా నిన్ను తీసుకెళ్లడానికి నీ దగ్గరికి ఈ పెళ్లి అస్సలు జరగనివ్వను అని బాధపడుతూ మిశ్రాని వంశ్ మాన్షన్ బ్లూప్రింట్ తీసుకొని రమ్మంటాడు.వంశ్ రాయ్ సింఘానియా నా నుండి నా రిథిమాని లాక్కోవాలి అని అనుకోని నీ జీవితంలో చాలా పెద్ద ఆఖరి తప్పు చేసావు వంశ్ నిన్ను నా నుండి ఎవరు కాపాడలేరు.వంశ్ తన ఫ్యామిలీ అండ్ రిథిమా ఫొటోస్ అన్నీ ఒక వీల్ లో సెట్ చేసి తిప్పుతూ చూస్తూ ఉంటాడు .రాజ్ బాస్ అందరి రూమ్స్ చెక్ చేశాను ఏం దొరకలేదు అంటాడు.సరిగా దృష్టి సారించి చూడు రాజ్ వీళ్లందరిలో ఒక్కరే అబద్దపు ముసుగు వేసుకొని ఉన్నారు ఆ ముసుగు తొలగించాలి అని కత్తి వీల్ మీదకి విసురుతాడు.కబీర్ బ్లూప్రింట్ చూస్తూ వుండగా మిశ్రా వచ్చి మిలటరీ ఫోర్స్ ని ఎప్పుడు రమ్మని చెప్పాలి రేపా ఎల్లుండా మీ ప్లాన్ అయితే ఎల్లుండే కదా పెళ్లి రోజే కదా మనం వెళ్ళేది అంటాడు.అందుకు కబీర్ రేపు నేను వెళ్తాను V R మాన్షన్ లోకి అందరూ పెళ్లి పనుల్లో ఉంటారు నేను వంశ్ కి వ్యతిరేకంగా ఉన్న ప్రూఫ్స్ సంపాదిస్తాను అంటాడు.అది విని మిశ్రా వంశ్ మాన్షన్ లోకి వెళ్తారా అది మాన్షన్ కాదు పులి గుహ అక్కడికి వెళ్లడం అసాధ్యం అంటాడు.అందుకు కబీర్ అసాధ్యం అనేది ఉండదు మిశ్రా రిథిమా కోసం ప్రాణాలు ఇవ్వడానికి అయిన తీసుకోడానికి అయిన రెడీ నేను రిథిమా తో వంశ్ పెళ్లి జరగనివ్వను అంటాడు.రిథిమా తన రూంలో తన బ్యాండేజ్ ఉన్న షీరా ని తీసుకొని చెక్ చేస్తుంది అది ఒక పెన్ డ్రైవ్ అని వంశ్ బిజినెస్ సీక్రెట్స్ అన్నీ షీరా లో ఉన్నాయని తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది.వంశ్ పేరు ఉన్న తన చేతిని చూసుకొని వంశ్ బలవంతంతో ప్రేమ పుట్టదు.మనసు కోరుకునేదే ప్రేమ నువ్వు నా చేతి మీద పేరు మాత్రమే రాయగలిగావు కానీ నా నుదిటి మీద సింధూరం పెట్టేది కబీర్ మాత్రమే.రేపు పసుపు ఎల్లుండి పెళ్లి అప్పటివరకు వెయిట్ చేయలేను నేను రేపే షీరా కబీర్ కి ఇచ్చి కబీర్ తో పాటు గెలుపుని పంచుకోవాలి అనుకుంటూ పడుకుంటుంది.తెల్లారగానే వంశ్ రిథిమా రూంకి వచ్చి షీరా ఎక్కడ ఉంది అని అడుగుతాడు రిథిమాని షీరా ఏంటి నాకు తెలియదు అంటుంది వంశ్ కి షీరా పిల్లో కింద దొరుకుతుంది దాన్ని తీసుకొని వంశ్ ఎవరు నువ్వు ఎందుకు నన్ను మోసం చేయాలనీ వచ్చావు అని రిథిమా కల కంటుంది.వెంటనే రిథిమా షీరా తీసుకొని తన బ్యాండేజ్ లో పెట్టేసుకుంటుంది.అప్పుడే వచ్చినఇషాని ఏం చేస్తున్నావు అని అడుగుతుంది రిథిమా భయపడుతుంది షీరా చూసిందేమో అని అది చూసి ఇషాని నేను కదా నిన్ను చూసి భయపడాలి ఏం మంత్రం వేశావో కానీ అంత పెద్ద బిజినెస్ టైకూన్ ని పడేసావు నానమ్మ పసుపు కోసం నిన్ను పిలుస్తుంది అంటుంది.అందుకు రిథిమా వస్తాను అంటుంది.రిథిమా పసుపు కోసం పసుపు లెహంగా వేసుకొని కిందకి వస్తూ సాయంత్రం వరకే టైమ్ ఉంది నా దగ్గర షీరా తో పాటు కబీర్ దగ్గరికి వెళ్ళాలి లేదా షీరా అయిన కబీర్ దగ్గరికి పంపించాలి అనుకుంటుంది.వంశ్ నానమ్మ రిథిమా చేతికి ఉన్న కట్టు డర్టీ గా ఉండటం చూసి బ్యాండేజ్ మార్చమని.బ్యాండేజ్ మార్చకపోతే గాయం మానదని త్వరగా నేను మారుస్తాను అంటుంది.అందుకు రిథిమా పసుపు ఫంక్షన్ అయిపోయాక బట్టలు మార్చాలి కదా అప్పుడు మార్చుకుంటాను అంటుంది.అదంతా వింటున్న వంశ్ నేను నీ చేతి కట్టు మారుస్తాను పద అంటాడు రిథిమా టెన్షన్ పడుతుంది.Rate this content
Log in

More telugu story from Shaik Sameera

Similar telugu story from Thriller