Shaik Sameera

Thriller

5  

Shaik Sameera

Thriller

ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ -3

ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ -3

4 mins
399


               ఎపిసోడ్ -3

రిథిమా క్రూయిజ్ లోకి వెళ్లడం కబీర్ దూరము నుండి బైనాక్యూలర్స్ లో చూస్తూ ఉంటాడు. రిథిమా కబీర్ చెప్పినవి గుర్తు చేసుకుంటూ మెట్లు ఎక్కుతుంది. వంశ్ తో మాట్లాడేటప్పుడు చాలా నార్మల్ గా ఉండాలని కొంచెం టెన్షన్ పడిన వంశ్ కి డౌట్ వస్తుందని చెబుతాడు. కబీర్ రిథిమా కి ఒక ట్రాన్స్మిటర్ ఇస్తాడు అక్కడ ఏం జరుగుతుందో తను వినేలా ఒక డైమండ్ క్లిప్ ఇస్తాడు ఎలాంటి చెకింగ్ మెషిన్ లో కూడా దొరకదని అని చెప్పి ఇస్తాడు. రిథిమా ఆ క్లిప్ తన హెయిర్ లో పెట్టుకొని క్రూయిజ్ లోపలికి వెళ్తుంది. రిథిమా లోపలికి వెళ్లి సెక్యూరిటీ కెనాల్ దాటేటప్పుడు సెక్యూరిటీ కెనాల్ అలారం మ్రోగిస్తుంది. అంతా వింటున్న కబీర్ ట్రాన్స్మిటర్ ఎలా స్కాన్ అయింది కెనాల్ లో వంశ్ రిథిమాని ఏం చేస్తాడో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అది చూసి వంశ్ మనుషులు రిథిమా ని ఒక ప్లేస్ కి తీసుకెళ్తారు. అక్కడ వంశ్ ఉండటం చూసి రిథిమా షాక్ అవుతుంది. 

వంశ్ రిథిమా ని చూసి ఎవరో మనలన్నీ ప్లాన్ చేసి కలుపుతున్నట్టు మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉన్నాము ఇంటరెస్టింగ్ వెరీ ఇంటరెస్టింగ్ అంటాడు. నిన్ను ఎందుకు పిలిచానంటే లాస్ట్ ఈవెంట్ లో చేసినట్టు తప్పు లు చేసి వాటిని నువ్వు ఒప్పుకోలేదు అలానే ఈ ఈవెంట్ లో కూడా ఏదైనా తప్పు చేస్తావని చెబుదామని పిలిచాను. ఈ ఈవెంట్ లో చిన్న తప్పు జరిగిన నేను ఒప్పుకోను. ఇది నా పరువు కి సంభందించిన ఈవెంట్ చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేయి అంటాడు. అలాగే సార్ అని రిథిమా వెళ్ళబోతే సెక్యూరిటీ కెనాల్ ఎందుకు అలారం మ్రోగించింది ఏం క్యారీ చేస్తున్నావు అని అడుగుతాడు వంశ్. నేనేం క్యారీ చెయ్యట్లేదు సార్ అంటుంది అబద్ధం నీ మొబైల్ వలన అలారం రింగ్ అయింది మొబైల్ నాట్ allowed ఇక్కడ అని తన మనుషులతో మొబైల్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. కబీర్ అంతా విని రిథిమా కి ఏం కాలేదని రిలాక్స్ అవుతాడు.

రిథిమా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూ టెన్షన్ గా వంశ్ చెల్లెలు ఇషాని కి డాష్ ఇస్తుంది. అపుడు తన చేతిలో ఉన్న డ్రింక్ ఇషాని డ్రెస్ పైన తన శాండీల్స్ పైన పడుతుంది. రిథిమా సారీ చెబుతుంది కానీ ఇషాని అసలు ఎవరు నువ్వు నీకు ఎంత ధైర్యం నా డ్రెస్, శాండీల్స్ మీద డ్రింక్ పడేలా చేస్తావా అసలు వీటి కాస్ట్ ఎంతో తెలుసా నువ్వు అమ్ముడు పోయిన కూడా వాటి కాస్ట్ అంతా కూడా ఉండదు నీ లైఫ్ అని రిథిమా ని అవమానిస్తుంది. రిథిమా మర్యాదగా మాట్లాడండి నేను ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ ని అని చెబుతుంది. ఇషాని నువ్వు ఈవెంట్ ఆర్గనైజర్ వా నిన్ను చూస్తే సర్వెంట్ లాగా ఉన్నావు ముందు నా శాండీల్స్ పైన పడిన డ్రింక్ ని నీ చేతులతో క్లీన్ చేయి అంటుంది. రిథిమా నేను చేయను నేనేం సర్వెంట్ ని కాదు అంటుంది. వంశ్ రాయ్ సింఘానియా చెల్లెలని ఎదిరిస్తావా క్రూయిజ్ నుండి వెళ్ళిపో గెట్ అవుట్ అంటుంది ఇషాని. ఆర్యన్ అక్కడికి వచ్చి క్రూయిజ్ స్టార్ట్ అయిపోయింది తను బయటికి ఎలా వెళ్తుంది సముద్రంలో దూకాలసిందే అంటాడు. అదే చేస్తుంది అని ఇషాని రిథిమా చేయి పట్టుకొని తీస్కెళ్లబోతే ఆర్యన్ వదిలేయి అంటాడు రిథిమా వెళ్ళిపోతుంది. ఈ గొడవ అంతా దూరం నుండి వీల్ చైర్ పై నుండి చూస్తూ ఉంటుంది వంశ్ ఇంకో చెల్లెలు సియా. 

ఆర్యన్ రిథిమా వెళ్లిన వైపే చూస్తూ ఉంటే ఇషాని తను నీ టైప్ కాదు డేటింగ్ అవి చేయడానికి కనీసం నీ వైపు కూడా చూడదు కావాలంటే బెట్ వేసుకుందాం అంటుంది. అందుకు ఆర్యన్ ఓకే బెట్ రిథిమా తో డేటింగ్ చేస్తాను అంటాడు. రిథిమా ఇషాని తనకు చేసిన అవమానానికి ఏడుస్తూ ఉంటుంది. వంశ్ చెల్లెలికి ఇంత అహంకారం ఉంటే వంశ్ కి ఇంకెంత ఉంటుంది ఇలాంటి మనుషుల మధ్య ప్రూఫ్స్ ఎలా సంపాదించగలను అని ఏడుస్తూ ఉంటుంది. కబీర్ అంతా విని రిథిమా కి జరిగిన అవమానానికి బాధపడతాడు. అది చూసి మిశ్రా కబీర్ తో ఎందుకు సార్ రిథిమా ని పంపించారు. రిథిమా ఒక మాములు అమ్మాయి తను ఎలా వంశ్ కి సంబంధించిన ప్రూఫ్స్ తెస్తుంది. మన ఆఫీసర్ మేఘ తనే వంశ్ ని ఏం చేయలేక తన చేతిలో చనిపోయింది అంటాడు. కబీర్ రిథిమా మంచితనమే ఈ మిషన్ లో వంశ్ ని ఇరుకునేలా చేస్తుంది అంటాడు. ఇషానిరిథిమా కి చేసిన అవమానం చూసిన సియా రిథిమా దగ్గరికి వెళ్లి ఇషాని తరపున తనకి సారీ చెబుతుంది. సియా తన మెడని కంఫర్ట్ గా పెట్టలేకపోవడం చూసి రిథిమా సియా చేత స్ట్రెచ్ చేపిస్తుంది సియా కొంచెం రిలీఫ్ అవుతుంది. సియా ఇది మీరు ఎలా చేసారు అని అడుగుతుంది. రిథిమా నేను ఒక ఫీజియోథెరపిస్ట్ అని సియా కి చెబుతుంది. సియా ఇషాని అక్క గురించి తప్పు గా అనుకోవద్దని తను మంచిదని చెబుతుంది. రిథిమా కి సియా కూడా వంశ్ చెల్లెలని అర్థం అయ్యి సారీ మేడం అంటుంది. 

వంశ్ తన కంపెనీ ఎక్విప్మెంట్స్ గురించి డీల్ చేస్తూ ఉంటాడు వేరే కంపెనీ వాళ్ళతో. ఆ కంపెనీ వాళ్ళు వంశ్ కంపెనీ ఎక్విప్మెంట్స్ కరెక్టుగా లేవని డీల్ కాన్సల్ చేసుకొని వెళ్ళిపోతూ వుంటే వంశ్ వాళ్ళని ఆపుతాడు. వంశ్ ఆ కంపెనీ వాళ్ళతో ఛాలెంజ్ చేస్తాడు తన కంపెనీ ఎక్విప్మెంట్స్ తనే స్వయంగా చెక్ చేస్తానని వాటిలో ఏం ప్రాబ్లెమ్ లేదు అంటే ఆ కంపెనీ షేర్స్ లో 50% తనకి షేర్ ఇవ్వాలని అలాగే తన డీల్ accept చేయాలనీ అంటాడు. ఆ కంపెనీ వాళ్ళు ఎక్విప్మెంట్స్ లో ప్రాబ్లెమ్ వుంటే అంటారు డీల్ క్యాన్సల్ చేస్తానని వంశ్ ఛాలెంజ్ చేస్తాడు. వంశ్ ఛాలెంజ్ గురించి తెలిసి వంశ్ ఫ్యామిలీ, రిథిమా వంశ్ ఏం చేస్తాడో అని చూస్తూ ఉంటారు. వంశ్ సముద్రం లో తన కంపెనీ తయారు చేసిన మెషిన్ పైన నిల్చొని ఎటువంటి సపోర్ట్ లేకుండా అలలపైనా సర్ఫ్ చేస్తూ ఉంటాడు. వంశ్ సడెన్ గా సముద్రం లో మునిగిపోతాడు.అందరు టెన్షన్ గా చూస్తూ ఉంటారు. రిథిమా క్లిప్ ద్వారా వంశ్ చనిపోయాడేమో అంటుంది అపుడు కబీర్ వంశ్ అంత త్వరగా చావడు అంటాడు. అప్పుడే వంశ్ సముద్రం నుండి బయటికి వస్తాడు. 

వంశ్ ఛాలెంజ్ గెలవడం తో ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళ షేర్స్ లో 50%,అలాగే డీల్ కూడా accept చేస్తారు. వంశ్ కంపెనీ వాళ్ళతో లెట్స్ డూ పార్టీ అని డ్రింక్ తీసుకుంటాడు. సియా చున్నీ వీల్ చైర్ లో ఇర్రుకొని సియా మెడ చుట్టూ చున్నీ బిగుసుకొని ఉంటుంది సియా కి ఊపిరి ఆడకుండా ఉండటం రిథిమా దూరం నుండి చూసి సియా ని కాపాడాలని పరిగెత్తుతూ సియా దగ్గరికి వెళ్లబోతుంది. వంశ్ రిథిమా పరిగెత్తుతూ సియా దగ్గరికి వెళ్లడం చూసి సియా మీద రిథిమా ఎటాక్ చేస్తుందని అనుకోని తన పాకెట్ నుండి కత్తి తీసి రిథిమా పైకి విసురుతాడు. రిథిమా సియాకి హెల్ప్ చేద్దామని చున్నీ తీసేలోపు వంశ్ కత్తి రిథిమా భుజానికి తగిలి అరుస్తూ కిందపడిపోతుంది అప్పుడే తన హెయిర్ లో ఉన్న క్లిప్ సముద్రంలో పడిపోతుంది. రిథిమా అరుపు విన్న కబీర్ రిథిమాకి ఏమైంది అని ట్రాన్స్మిటర్ కి కనెక్ట్ చేయాలనీ చూస్తాడు కానీ కనెక్ట్ కాదు. రిథిమా కి ఏదో అయ్యిందని కబీర్ బాధపడతాడు. 



Rate this content
Log in

Similar telugu story from Thriller