Shaik Sameera

Thriller

4  

Shaik Sameera

Thriller

ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

5 mins
326


             ఎపిసోడ్-27

వంశ్-నువ్వు ఇక్కడే ఉంటావు రిథిమా ఈ బంధనంలో.నేను ఈ పజిల్ ని సాల్వ్ చేసి నా ప్రశ్నలకి సమాధానాలు పొందుతాను.

రిథిమా సోఫా మీద పడుకోవటానికి బేడీషీట్ రెడీ చేసుకుంటూ ఉంటుంది.

వంశ్-నీకు అనిపిస్తుందా మన ఇద్దరం ఈ సోఫాలో కంఫోర్టుబుల్ అవ్వగలమా.

రిథిమా-మీరు మర్చిపోతున్నారు ఇది సాధారణమైన పెళ్లి కాదు.నేను మీతో ఈ బెడ్ షేర్ చేయలేను అనగానే వంశ్ రిథిమా దగ్గరకి వస్తూ ఉంటాడు రిథిమా వెనక్కి వెళ్తూ ఉంటుంది.తలుపు తగిలేసరికి రిథిమా వీపుకి ఆగిపోతుంది వంశ్ రిథిమా దగ్గరికి వచ్చి రిథిమాని కదలకుండా తన చేతులు తలుపు పైన పెడతాడు.

వంశ్- చెబుతారు నిజం చేదుగా ఉంటుంది అని కానీ నువ్వు నీ చేదు నిజంతో పాటు బ్రతకడం అలవాటు చేసుకో.నువ్వు ఇప్పుడు MRS.రిథిమావంశ్ రాయ్ సింఘానియావి అనగానే రిథిమా వంశ్ ని వెనక్కి తోస్తుంది .

రిథిమా-MR.వంశ్ రాయ్ సింఘానియా మీ రూల్స్,మీ బలంవంతం ఇంటి మిగతా సభ్యుల మీద చెల్లుతుందేమో నా మీద మీ బలవంతం పనికి రాదు.So stay away.

వంశ్-ఎలాంటి బలవంతం నేను అయితే ఈ బేడీషీట్ తీసుకుందామని వచ్చాను.ఏంటంటే నాకు నా బెడ్ సర్దుకునే అలవాటు లేదు thanks for that.నేను కూడా తెలియని వ్యక్తితో నా బెడ్ షేర్ చేసుకోను అని బెడ్ షీట్ తీసుకొని సోఫా మీద పడుకుంటాడు.రిథిమా కోపంగా వెళ్లి బెడ్ మీద పడుకోవటానికి వెళ్తుంది.రిథిమా గుడ్ నైట్ అని చెప్పి వంశ్ తననే చూస్తూ ఉంటాడు.రిథిమా వంశ్ చూస్తున్నాడని అటు తిరిగి పడుకుంటుంది.

రిథిమా మనసులో-పెళ్లైన మొదటి రాత్రి ప్రతి అమ్మాయి కల అవుతుంది.కానీ నేను ఎవరిని అయితే కోరుకున్నానో అతని కోసం వేరే అతనితో ఉన్నాను.ఏముంది ఈ రాత్రిలో నాకోసం బాధ తప్ప.

కబీర్ బాధపడుతూ చంద్రుడిని చూస్తూ ఉంటాడు.అప్పుడే మిశ్రా వచ్చి సారీ సార్ నేను అర్థం చేసుకోగలను మీరు ఎలాంటి బాధని అనుభవిస్తున్నారో ఇంత చేసి కూడా రిథిమాని కాపాడలేకపోయారు కోల్పోయారు తనని అంటాడు.

 కబీర్- కోల్పొలేదు నేను తనని.నేను ఒప్పుకోను ఈ పెళ్లిని. ఇదంతా మిషన్లో ఒక భాగం మాత్రమే.రిథిమా ఏదైతే చేస్తుందో అదంతా నేను చెప్పిందే చేస్తుంది.నా మిషన్ కోసం రిథిమా చాలా పెద్ద త్యాగం చేసింది తన ప్రాణాలన్నీ తనే ప్రమాదంలో నెట్టుకుంది నాకోసం కేవలం నాకోసం మాత్రమే.నేను చాలా రుణపడిపోయాను రిథిమాకి ఈ దేశం కూడా రుణపడిపోయింది తనకి.తను చాలా గొప్ప జీవితం deserve చేస్తుంది.ప్రపంచంలో ఉన్న ప్రతి సంతోషాన్ని deserve చేస్తుంది తను.ప్రతి సంతోషాన్ని తనకి ఇస్తాను నేను కొంచమైనా తన రుణాన్ని తీర్చుకోగలను.తను తొందరగా సాక్ష్యాలు తీసుకొని నా దగ్గరకు వస్తే తనని సుఖంగా చూసుకుంటాను.

రిథిమా-చంద్రుడిని చూస్తూ ఉంటుంది రిథిమా కూడా.షీరాపోతే ఏమైంది వంశ్ కి వ్యతిరేకంగా ఏదో ఒక సాక్ష్యం సంపాదిస్తాను.తను అంతా సులభంగా తప్పించుకోలేడు వంశ్ తను చేసిన పాపాలకి తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు.నేను చాలా కలలు కన్నాను నా పెళ్లి గురించి.ఈ క్షణాలు నా జీవితంలో అందమైనవిగా నిలిచిపోతాయి అనుకున్నాను అని నిద్రపోతున్న వంశ్ ని చూస్తూ నేను నా జీవిత మూల్యాన్ని చెల్లించాను వంశ్ ఇప్పుడు నీ వంతు.I promise kabir చాలా తొందరలో వంశ్ నీ కస్టడీలో ఉంటాడు.

తెల్లవారుతుంది రిథిమా ఫ్రెష్ అయ్యి తన జుట్టుని టవల్ తో తుడుచుకుంటూ అద్దం ముందు నిలబడుతుంది.కొత్త ఉదయం కొత్త సాక్ష్యం వెతకడానికి మొదలు కాబోతుంది ఈరోజు నుండి అని గాజులు వేసుకుంటూ వుండగా వెనక నుండి వంశ్ తన డ్రెస్ కి వెనక ఉన్న దారాలు కడుతూ ఉంటాడు.రిథిమా అది చూసి ఏం చేస్తున్నారు నేను కట్టుకోగలను అని ప్రయతిస్తూ ఉంటుంది కానీ తనకి అందక ఇబ్బంది పడుతూ ఉండటం చూసి వంశ్ తన దగ్గరికి వచ్చి కట్టబోతు ఉంటే వంశ్ నేను చేసుకోగలను అంటుంది కానీ వంశ్ కడతాడు తన మాట వినకుండా.

వంశ్ -డోంట్ వర్రీ i know కొన్ని పనులు కొంచెం కష్టంగా ఉంటాయి.నీకు నచ్చిన నచ్చకపోయినా నీకు బాగున్నా బాగాలేకపోయిన నీ వెనక నీడలాగా నేను నిలబడి ఉంటాను అని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్ళిపోతాడు.

రిథిమా-అన్నిటికన్నా కన్నా కష్టమైనది నీతో ఒకే ఇంట్లో కలిసి ఉండటం.అలాగే నువ్వు పీలుస్తున్న గాలి పీల్చడం అంత కంటే కష్టం.I wish షీరా నాకు దొరికిఉంటే ఈ పాటికి నేను కబీర్ తో ఉండేదాన్ని.నేను ఓడిపోలేదు వంశ్ ఇప్పుడే ప్రారంభం అయింది నిన్ను త్వరలోనే నీస్థానంలో ఉంచుతాను.

రిథిమా చేత వంశ్ నానమ్మ,అనుప్రియ గణపతికి పూజ చేయిస్తారు.వంశ్ ని నానమ్మ పిలిచి పెళ్ళైన రెండోరోజు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకో అని పిలవడంతో వంశ్ వచ్చి నానమ్మ పాదాలు ఆశీర్వాదం కోసం తాకబోతుంటే ఆపుతుంది .పెళ్లి అయ్యాక ప్రతి పని ఇద్దరు కలిసే చేయాలి అంటుంది.వంశ్ రిథిమాని చూస్తాడు ఇద్దరు కలిసి వంశ్ నానమ్మ ఆశీర్వాదం తీసుకుంటారు.అలాగే అనుప్రియ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోబోతుంటే పర్లేదు its ok అత్తయ్య ఆశీర్వదిస్తే అందరూ ఆశీర్వదించినట్టే అంటుంది.వంశ్ నానమ్మ బంగారపు గాజులు ఇచ్చి వంశ్ కి రిథిమా చేతులకి తొడగమంటుంది.అందుకు రిథిమా ఇవేం వద్దు నానమ్మ మీ ఆశీర్వాదం దొరికింది కదా చాలు అంటుంది.నా ఆశీర్వాదం ఎప్పుడు నీతో ఉంటుంది రిథిమా కానీ ఈ గాజులు మా వంశపుగాజులు మా వంశపు ఆచారం కూడా.అనుప్రియ అందుకు నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి ఈ అన్ని అధికారాలు నీ వంతు అంటుంది.వంశ్ గాజులు తీసుకొని చేయి ముందుకి చాపు రిథిమా అంటాడు.రిథిమా చేయి చాపగానే గాజులు తొడిగేస్తాడు వంశ్.Dont worry ప్రారంభం మాత్రమే ఇక ముందు కూడా ఇలాంటి బహుమతులు ఎన్నో వస్తూ ఉంటాయి అనగానే వంశ్ రిథిమా కోపంగా చూస్తుంది వంశ్ ని.

వంశ్ నానమ్మ-పెళ్ళైన మొదటిరోజు కదా అందరికోసం ఏదైనా స్వీట్ చేయి వంశ్ కి అయితే పాయసం చాలా ఇష్టం.ఈరోజు జన్మాష్టమి కూడా అందుకే ప్రొద్దునే వెన్న తయారు చేసి నా కృష్ణుడికి సమర్పించాను ప్రసాదంగా.

రిథిమా-కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం కదా అందుకే కృష్ణుడిని వెన్నదొంగ అని కూడా అంటారు కదా నానమ్మ.మీ మాటలతో అనిపిస్తుంది జన్మాష్టమి అంటే మీకు చాలా ఇష్టంలా ఉంది నానమ్మ.

వంశ్ నానమ్మ-చాలా ఇష్టం.నా ఇష్టం జరిగే పనైతే ఇంట్లో భజనలు ఏర్పాటు చేసేదాన్ని.కానీ ఈ కరోనా నా ఆశ లా పైన నీళ్లు చల్లేసింది.అయిన దేవుడు చాలా దయగల వాడు అన్ని అర్థం చేసుకుంటాడు.మనం ఏది భక్తిగా అర్పించిన స్వీకరిస్తాడు.నా కోడలు వంశ్,కృష్ణుడికి కోసం పాయసం చేస్తుంది కదా అంటుంది.

రిథిమా-నానమ్మ నేను ఎప్పుడు పాయసం చేయలేదు.నాకు సరిగా ఎలా చేస్తారో కూడా తెలియదు అంటుంది.

అనుప్రియ-ఓహో ఈ ఇంటి కోడలుగా అయ్యే పెద్ద పనే నువ్వు చేసావు ఇలాంటి చిన్న పనులకి భయపడతావు ఎందుకు పద అని రిథిమాని కిచెన్ లోకి తీసుకెళ్తుంది.కిచెన్లోకి వెళ్ళాక అనుప్రియ నీకు తెలుసు కదా ఈ ఇంటి కోడలుగా నా మనసులో నీకు ఎలాంటి స్థానం ఉండదు.కానీ నీమీద కన్నా నా కొడుకు తీసుకున్న నిర్ణయం మీద నాకు నమ్మకం ఎక్కువ.ఈ ఇల్లు నీ మీద పెట్టుకున్న నమ్మకం పోయిన భరిస్తాను ఏమో కానీ నా వంశ్ పెట్టుకున్న నమ్మకాన్ని ఎవరైనా పోగొడితే నేను భరించలేను అనగానే రిథిమా సరే అన్నట్టు తల ఊపుతుంది.నేను డిసోజాని పంపిస్తాను తను నీకు పాయసం చేయడంలో సహాయం చేస్తుంది అంటుంది.ఇషాని వస్తుంది అప్పుడే 

ఇషాని-మామ్ ఇలాంటి వాళ్ళకి సర్వెంట్ అవ్వడం అలవాటు ఉంటుంది కానీ సర్వెంట్ పెట్టడంలో కాదు.ఇంత పెద్ద ఇంటికి కోడలు అయిన దానికోసం ఇంతైనా చేయగలదు కదా.ఈ పాయసం ఒంటరిగా చేయగలవు కదా వదిన.అనుప్రియ మనసులో ఈ డిసోజా ఎక్కడ ఉంది అనుకుంటూ ఉంటుంది.

డిసోజాని చేతులు కట్టేసి తాడుతో రాజ్ బ్యాక్ యార్డ్ నుండి లాక్కొని వస్తూ ఉంటాడు కోపంగా.డిసోజా ఏడుస్తూ ఉంటుంది వదిలేయమని.

రిథిమా-sure నేను చేయగలను i will do it.

ఇషాని-హా పాయసం అయితే నువ్వు చేయగలవు డిసోజా అవసరం ఇంట్లో ఇతర పనుల్లో కూడా ఉంది.ప్రొద్దున నుంచి నా షూస్ కనిపించట్లేదు నువ్వు అయితే ఈ ఇంటికి కొత్త మెంబెర్వి నీలాగా అందరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకోరుగా.ఈ ఇంట్లో నౌకర్లకి బాగా స్వేచ్చని ఇచ్చారు వీళ్ళకి వాళ్ళ జాబ్ వాళ్ళ స్థాయి గుర్తు చేయాలిసిన అవసరం ఉంది అని రిథిమా వైపు చూస్తుంది.

అనుప్రియ-ఇషాని పద ఇక్కడ నుండి రిథిమాని ఆచారాన్ని నెరవేర్చనివ్వు అని తీస్కెళ్లిపోతుంది.

రిథిమా పాయసం కోసం అన్ని రెడీ చేసుకొని గ్యాస్ మీద గిన్నె పెట్టి వెలిగించబోతుంటే గ్లాస్ పగిలిన సౌండ్ విని బయటికి వస్తుంది.అక్కడ వంశ్ డిసోజాతో నేను వద్దన్నాక కూడా అక్కడికి వెళ్ళడానికి నీకు ఎంత ధైర్యం అని కోపడతాడు.తప్పు అయిపోయింది సారీ అని ఏడుస్తూ కింద మోకాళ్ళ మీద కూర్చొని ఇన్ని ఇయర్స్ గా సర్వీస్ చేశాను believe me ఇంకెప్పుడు వేళ్ళను బ్యాక్ యార్డ్కి అంటుంది.

వంశ్-exactly ఎన్నో ఇయర్స్ నుండి ఇక్కడ పని చేస్తున్నావు ఆ మాత్రం తెలియదా ఎవరికీ బ్యాక్ యార్డుకి వెళ్ళడానికి పర్మిషన్ లేదని.నా దగ్గర తప్పుకి క్షమాపణ తప్ప మిగతా అన్ని ఉంటాయి.

డిసోజా-తప్పు అయిపోయింది నాతో.ప్లీజ్ క్షమించండి అంటూ ఏడుస్తుంది.

వంశ్-ప్రపంచానికి తెలుసు నాకోసం నా జీవితం రెండో స్థానంలో ఉంటుంది .కానీ నమ్మకం మొదటిస్థానంలో ఉంటుంది.How dare you నా నమ్మకాన్ని ఎలా విరగొట్టావు.నా చిన్నప్పటి నుండి నన్ను పెంచావు అందుకే ప్రాణాలతో వదిలేస్తున్నా.ఇంకెవరైనా నీ స్థానంలో ఉంటే ఇలా చేసేవాడిని చావు బిక్ష పెట్టమని నన్ను అడుకునేంతగా నరకం చూపించేవాడిని.నన్ను పెంచినందుకు ప్రాణాలతో వదిలేస్తాను అంతే కానీ ఇక్కడ ఉండటానికి వీల్లేదు నువ్వు get out .

డిసోజా-క్షమించండి సార్ ఇంకెప్పుడు ఇలా చేయను సార్ అని బ్రతిమాలుతుంది.నేను ఇక్కడ నుండి ఇలా వెళ్లాలని లేదు సార్.

రిథిమా-వంశ్ ప్లీజ్ క్షమించండి అనగానే వంశ్ అరుస్తూ డోంట్ say ani చేతితోనే మాట్లాడొద్దు అని ఆపేస్తాడు తనని.రిథిమాకి ఇంతకుముందు తను యార్డ్ కి వెళ్లడం వంశ్ ఎవరితోనో అక్కడ మాట్లాడటం గుర్తొస్తుంది.ఎవరితో మాట్లాడాడు వంశ్ ఏముంది బ్యాక్ యార్డ్ అంతలా వంశ్ ఇంతలా కోప్పడుతున్నాడు.



Rate this content
Log in

Similar telugu story from Thriller