వాచ్ మేన్
వాచ్ మేన్


(ఉదయం 10 గంటలకి......
....... ఫోన్ రింగ్ అవుతుంది)
" హలో..! ఇందాకటి నుంచి కాల్ చేస్తుంటే తీయవేరా? " అని కోపడాడ్డు సుబ్రహ్మణ్యం.
" చెప్పరా.. ఇంత పొద్దునే ఏంటంత కొంపలు మునిగిపోయే విషయం? " అని ఆవ్వులిస్తూ అంటాడు .
" పొద్దునా...!? టైం పదిగంటలైంది.ఇంకా నిద్రపోతున్నావురా వేదవ ? "
" నైట్ బాగా లేటయ్యిందిలే గాని మ్యాటరెంటో చెప్పు ముందు ."
" నువ్వెదయినా జాబ్ చూడమన్నావు కదా అది దొరికింది." "నిన్ననే కదరా చెప్పింది! అప్పుడే చూసేశావా? ఎందుకంత తొందర నీకు..? ఓ రెండు రోజులు ఆగొచ్చు కదా. "
" ఎందుకు... తినేసి మళ్ళీ పొనుకోడానికా ? "
" ఇంతకీ ఏం జాబు ? "
" బీచ్ రోడ్లో ఓ బంగళాకి సడన్ గా నైట్ డ్యూటీ చేసే వాచ్ మేన్ మానేసాడంట! అర్జెంటుగా ఎవరైనా ఉంటే చూడమని తెలిసిన ఆయన ఫోన్ చేసి చెప్పాడు.నువ్వెలాగో ఖాళీగానే వున్నావు గా... అందుకే మా ఫ్రెండ్ ఒకడు వున్నాడు వాడు వస్తాడని చెప్పాను. "
"రేయ్! నా రేంజ్ కి తగ్గ పని చూడరా అంటే నువ్వు ఇలా వాచ్ మేన్ పని చూస్తావ్ అనుకోలా. "
" నువ్వు చదివిన చదువుకి కలెక్టర్ జాబ్ ఇస్తారా ఏంటి మూసుకొని దొరికిన పని చేసుకో తరువాత నేనే ఎలా గోలా ఎక్కడో దిక్కా జాబ్ సెట్ చేస్తాను,అంతవరకూ దీంతో సెటిల్ అవ్వు. "
"ఓ! అలా అంటావా, సరే ఎప్పుడు రమ్మన్నారు?"
"ఈరోజు నుంచి పనిలోకి వచ్చేయమన్నారు వెళ్ళు."
"మరి ఈరోజంటే కష్టంరా సుబ్బు."
"తమరు రూమ్ లో ఉండి పీకేదేమి లేదు గాని... వెళ్ళి తొందరగా జాయిన్ అవ్వు లేకపోతే అది కూడా దొరకదు."
"సరేలే! అడ్రస్ మెసేజ్ చేయి." అని ఫోన్ కట్ చేసి, రాత్రి మిగిలిపోయిన ఇంగ్లీష్ సినిమా చూడటం స్టార్ట్ చేస్తాడు.
(తరువాత టీ తాగడానికి వీధిలో ఉన్న టీ షాప్ కి వెళ్తాడు )
"అన్న ఒక టీ !" అని టీషాప్ ఓనర్ తో అంటాడు
అప్పుడు టీషాప్ ఓనర్ ఆ అబ్బాయితో " ఏం తమ్ముడు ! ఏదైనా పని చూసుకోవచ్చుగా ఇంకా ఎన్ని రోజులని ఖాళీగా ఉంటావ్ చెప్పు " అని అబ్బాయితో అంటాడు.
టీ తాగుతూ " నేను ఉద్యోగం కోసం వైజాగ్ వచ్చి ఆరు నెలలయింది.చదివిన చదువుకి సరిగ్గా జీతం వచ్చే ఉద్యోగం ఒక్కటంటే ఒకటి కూడా దొరకలేదు.ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి.ఒక్క రూపాయి కూడా లేకపోతే ఈ సిటీలో బతకడం కష్టమని కూడా తెలుసు.అలాగని ఇంటికెళ్లి పోదామనుకుంటే నాన్న ఏం అంటాడో అన్న భయం.ఏం చేయాలో అర్థం కాకా నా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం సలహా అడిగాను.నిజానికి వాడు వున్నాడన్న ధైర్యంతోనే నేను ఈ సిటీ వచ్చింది.వాడు ఇక్కడ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు,మనకి ఆ బ్యాంకులో జాబ్ కొట్టే అంతా బ్రెయిన్ లేకపోయే.అందుకే ఏదైనా చిన్న ఉద్యోగంలో అయినా చేరిపోతే కనీసం తిండి కైనా,రూమ్ రెంట్ కైనా డబ్బులొస్తాయి కదా అనుకొని,మా ఫ్రెండ్ కి అదే విషయం చెప్పాను.దానికి మొదలే ఈ వాచ్ మేన్ ఉద్యోగం."అని టీషాప్ ఓనర్ తో చెప్తాడు.
("సాయంత్రం ఐదు గంటలయ్యే సరికి రెడీ అయ్యి , తన ఫ్రెండ్ చెప్పిన అడ్రస్ కి బయలు దేరుతాడు".)
బీచ్ కి దగ్గరలో వున్న ప్రదేశం అది చుట్టూ పెద్దగా ఇల్లు కూడా వుండవు.దూరం దూరంగా అక్కడక్కడా ఉంటాయి.వాటిలో చాలా వరకు మనుషులు పెద్దగా లేనివే.కొన్ని కొన్ని పాడుబడి దాదాపు ఇటుక ముక్కలా స్థాయికి చేరుకున్నాయి.అబ్బాయి వాచ్ మేన్ గా పని చేయబోయే బంగళా మాత్రం కొంచెం బాగానే ఉంటుంది.చుట్టూ ఎతైన కాంపౌండ్ గోడ, దాని మీద కరెంటు తీగలతో ఫెన్సింగ్ కూడా ఉంటుంది.గేటు దగ్గర మాణిక్యం(Ex.ఎం.ఎల్.ఏ) అని ఇంగ్లీష్ లో ఉంటుంది.
అప్పుడు అబ్బాయి మనసులో " ఎవరో పొలిటిషన్ అనుకుంటా! అయినా పదివిలో వున్నపుడు దొంగతనంగా సంపాదించడం,ఇలా ఎక్కడ బడితే అక్కడ ఇల్లు కట్టి వదిలేయడం మాములులే. తిండి దొరక్క చస్తుంటే,వీడు తిండి వున్న ఏడుస్తున్నాడు..." అని అనుకుంటుండంగా అప్పుడు ఒక అతను వచ్చి " ఎవరు నువ్వు?" అని అడుగుతాడు.
అప్పుడు ఆ అబ్బాయి తిరిగి చూస్తే వాచ్ మేన్ డ్రెస్ వేసుకున్న ఒకతను అబ్బాయి వైపు నడుచుకుంటూ వస్తాడు. పగలు డ్యూటీ చేసేవాడేమో అని అబ్బాయి అనుకుంటాడు, అతను చూడడానికి సన్నగా,నల్లగా ఉంటాడు నేరుగా ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి "నీకు ఏం కావాలి?" అంటాడు.
దానికి సమాధానంగా " నైట్ వాచ్ మేన్ పోస్టు..." అని అబ్బాయి అనబోతుంటే అప్పుడు అతను "ఒక నిమిషం." అంటూ గేట్ తీసుకొని లోపలికెళ్ళి , ఐదు నిమిషాల తరువాత మళ్ళీ బయటకొచ్చి అబ్బాయితో "రా! లోపలికి రా" అంటూ పిలుస్తాడు.అబ్బాయి లోపలికెళ్లి సరికి,ఎవరో పెద్ద మనిషి ఇంటిని లాక్ చేస్తూ కనిపిస్తాడు.
అతను ఆ అబ్బాయిని చూసి " నువ్వేనా సుబ్రహ్మణ్యం ఫ్రెండువి?" అంటాడు కాస్త పెద్దగా.
అప్పుడు ఆ అబ్బాయి "హమ్మయ్య ఇప్పటికైనా అడిగారు "అని మనసులో అనుకుంటూ "అవును సర్" అని అంటాడు కొంచెం వినయం నటిస్తూ.
"ఏం పేరు?"అని అడుగుతాడు అబ్బాయిని.
" శీను సర్ " అని బదులిస్తాడు.
అతను ఓసారి కింద నుంచి పైదాకా చూసి " పర్వాలేదు బానే వున్నావ్" అని, జీతం గురించి,టైమింగ్స్ గురించి వివరంగా చెప్పి "ఈరోజు నుంచి డ్యూటీ లో చేరిపో మిగతా విషయాలు నీకు మురుగన్ చెప్తాడు.నేను అర్జెంటు గా బయలుదేరాలి."అని, ఇంతక ముందు కనిపించిన వాచ్ మెన్ కి పరిచయం చేసి ,అతను వచ్చిన కార్ లోనే తిరిగి వెళ్ళిపోతాడు.
మురుగన్ ఆ అబ్బాయికి యూనిఫామ్ ఇచ్చి వేసుకోమంటాడు.గేటు పక్కనే వున్నా వాచ్ మెన్ రూంలో ఏ వస్తువులు ఎక్కడెక్కడ వుంటాయో చూపిస్తాడు. ఆ తరువాత అరగంట సేపు ఏదేదో మాట్లాడి,సరిగ్గా ఏడు గంటలు కాగానే "సరే తమ్ముడు ,నేను వెళ్తాను ఇక అంతా నువ్వే చూసుకోవాలి" అని చెప్పి వెళ్ళిపోతాడు.ఇక అక్కడి నుంచి పొద్దున్న ఏడింటి వరకు ఆ అబ్బాయి డ్యూటీ.అప్పటికే బాగా చీకటి పడిపోతుంది.అప్పుడు ఆ అబ్బాయి కిటికీలోంచి బయటికి చూస్తాడు,ఒక్కో అలా ఒడ్డుని తాకి, మళ్ళీ వెనక్కి వెళ్లిపోతుంటది,అచ్చం ఆ అబ్బాయి ఆలోచించినట్టుగా ,ఓ రెండు గంటలు ఖాళీగా కూర్చుంటాడు.
కొంత సేపటికి ఆ అబ్బాయికి తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఓ గంట మాట్లాడతాడు.ఆ తరువాత అబ్బాయి మళ్ళీ ఏం చేయాలో అర్థం కాకా సైలెంట్ గా కూర్చుంటాడు,బాగా ఆకలేస్తే,తెచ్చుకున్న పార్సెల్ తీసి తినడం స్టార్ట్ చేస్తాడు.అయిపోయాక టైం చూస్తాడు అప్పటికే టైం పదకొండు అయి ఉంటుంది.ఇక అతనికి నిద్ర రావడం స్టార్ట్ అవుతుంది దానుంచి తప్పిచుకోవడానికి,సెల్ఫోన్లో కాసేపు ఓ యాక్షన్ సినిమా చూస్తాడు.బ్యాటరీ తక్కువుగా ఉండడంతో ఇక అక్కడితో ఫోన్ ఆఫ్ చేసి,తన బ్యాగులో వున్నా ఒక హారర్ స్టోరీ బుక్ తీసి చదవడం మొదలుపెడతాడు.ఒంటరిగా చదువుతుండడంతో కాస్త భయపడతాడు,తరువాత టైం ఎంతో చూస్తాడు అప్పటికే టైం పనేండు ముప్పైఅయుంటుంది.సముద్ర తీరంలో వున్నా కొబ్బరి చెట్లు,బుక్ లో రాసినట్టుగా,దెయ్యం పట్టినట్టు ఊగుతుంటాయి.
పౌర్ణమి వల్లనేమో సముద్రం పైకి ఎగిరెగిరి పడుతుంది.బుక్ పక్కన పెట్టేసి ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాడు.కిటికీలోంచి గట్టిగా వస్తున్నా చల్లటి గాలికి తెలియకుండానే నిద్ర పోతాడు.మళ్ళీ లేచి చూసేసరికి టైం ఒంటిగంట దాటివుంటుంది,చేయాల్సిన పని గుర్తొచ్చి ఓసారి అటుఇటు వైపులా పూర్తిగా చూస్తాడు.దూరంగా కనిపించిన సంగటన చూసి ఒక్కసారిగా ఆ అబ్బాయి ఒళ్ళు ఒక్కసారి అలా ఉల్లిక్కిపడుతుంది.ఎవరో ఓ అమ్మాయి...! ఒంటరిగా సముద్రపు ఒడ్డున నిల్చుని ఉంటుంది.తెల్లటి డ్రెస్ వేసుకొని,సముద్రం వైపే చూస్తుంటది.ఆ అమ్మాయి డ్రెస్ చున్నీ గాలికి అలా ఎగురుతుంటది.అది చూసి ఆ అబ్బాయి శరీరం భయంతో వణికిపోతుంటది.
"ఇంత రాత్రి పూట ఎవరబ్బా..!అది మనుషులు తిరగని ఈ ప్లేసులో ,కొంపదీసి దెయ్యమా...!? అనే ఆలోచన రాగానే అబ్బాయి ఒళ్ళంతా చెమటలు పట్టడం స్టార్ట్ అవుతాయి ,అప్పుడు అతనికి అర్థమవుతుంది ఇంతక ముందున్న నైట్ వాచ్ మెన్ ఎందుకు సడన్ గా మానేశాడో అబ్బాయికి అర్ధమవుతుంది.అతని హార్ట్ బీట్ ఫాస్టుగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది ,పారిపోవాలనుకుంటాడు కానీ బయటికి అడుగు పెట్టడానికి భయపడుతూ ఉంటాడు.ఎందుకైనా మంచిదని చిన్నగా కిటికీ మూసి,తన ఫ్రెండ్ సుబ్బుకి కాల్ చేస్తాడు.
తన ఫ్రెండ్ నిద్రలో ఉండటంతో ఎంతసేపు రింగయినా ఫోన్ ఎత్తడు,మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాడు కానీ ఫోన్ లో బ్యాటరీ లేకపోవడంతో స్విచ్ ఆఫ్ అవుతుంది,అబ్బాయికి ప్రాణం పోయేంత పని అవుతుంది చార్జర్ మర్చిపోయి వచ్చినందుకు అతన్ని అతనే తిట్టుకుంటాడు.ఇక చేసేదేమి లేక అబ్బాయి మెల్లగా చెమటను తుడుచుకొని , ఏమైందో చూద్దామని కిటికీ తెరిచి చూస్తాడు,అప్పుడు కూడా ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది.
" ఈరోజు నా చావు ఖాయం " అని అనుకుని కిటికీ మూస్తాడు.అప్పుడు ఓ ఇద్దరు అబ్బాయిలు ,ఆమె వైపు నడుస్తూ కనిపిస్తారు ఆ అబ్బాయికి వెంటనే ఏం జరుగుద్దో చూద్దామని టెన్షన్ తో కిటికీ సగం మూసి చూడడం స్టార్ట్ చేస్తాడు.
ఆ ఇద్దరు ఆమెతో నవ్వుతూ మాట్లాడుతూ వుంటారు,ఆమె కూడా నవ్వుతూ ఉంటుంది.అప్పుడు ఆ అబ్బాయికి అసలు సంగతి అర్థమవుతుంది , ఆ పిల్ల దెయ్యం కాదు ,ప్రాస్టిట్యూట్ అని లేకపోతే అంత రాత్రిలో అక్కడెందుకుంటుంది? అని అనుకుంటాడు.వాళ్ళిద్దరూ ఆమెతో మనీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
వెంటనే అబ్బాయికి భయంపోయి ఇంటరెస్ట్ మొదలవుతుంది తరువాత కిటికీని పూర్తిగా తెరిచి చూడడం మొదలుపెడతాడు,చూస్తే అక్కడ మనీ మేటర్ గురించి కుదిరినట్టు లేదు అనుకుంటాడు .వాళ్ళామేతో అరుస్తూ ఉంటారు కాసేపటికి ఆ అరుపులు కాస్తా గొడవగా మారుద్ది ,వాళ్ళిద్దరిలో ఒకడు పాకెట్ నుంచి కత్తి బయటికి తీస్తాడు.ఆ అమ్మాయి భయంతో వాళ్ళని దోసి అక్కడినుంచి పరిగెడుతుంది.ఆ అబ్బాయికి ఏం చేయాలో అర్థంకాక ఒకవేళ ఎదో ఒకటి చేయకపోతే ఆ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం అని వెంటనే వేగంగా ఆలోచించడం మొదలుపెడతాడు.
సరే! ఏం జరగాలంటే అది జరుగుద్ది ముందు ఆ అమ్మాయిని ఎలాగైనా సేవ్ చేయాలి అనుకోని కర్ర తీసుకుని ఫాస్ట్ గా పరిగెడతాడు.
ముందు ఆ అమ్మాయి,వెనుక వాళ్ళిద్దరూ,వాళ్ళిద్దరి వెనక ఈ అబ్బాయి ఫాలో అవుతూ ఉంటాడు.అప్పుడు ఆ అబ్బాయి మనసులో " వాళ్ళిద్దరూ వున్నారు నేనేమో ఒకడ్ని చూస్తే చంపేస్తారేమో అని భయమేస్తుంది " అని అనుకుంటాడు.మళ్ళీ ఏదైతే అది అయింది ఇలాంటి సాహసాలు చేస్తేనే మనకంటూ ఒక గుర్తింపు వస్తది సొసైటీలో అని అనుకుంటాడు.
ఏమో ఈమెను కాపాడితే నాకు దేవత లాంటి అమ్మాయి కాకపోయినా,కనీసం అవేరేజ్ గా వుండే అమ్మాయి అయినా దొరుకుతుంది ఏమో అని, రేపు పొద్దున్న పేపర్లో నా గురించి రాబోయే వార్త గుర్తుకు తెచ్చుకుంటాడు.
"అర్థరాత్రి బీచ్ రోడ్లో అమ్మాయిని బలవంతం చేయబోయిన ఇద్దరు ,ప్రాణాలకు తెగించి కాపాడిన ఓ అబ్బాయి ,అతను ఏ సూపర్ మెనో ,స్పైడర్ మెనో కాదు ,ఒక మాములు వాచ్ మెన్."అనే వార్త తలుచుకోగానే సంతోషంతో మురిసిపోతాడు ఆ అబ్బాయి.పొద్దునకల్లా తను ఫేమస్ అవుతాడన్న అనే ఊహ అతనికి కాంఫిడెన్స్ ఇస్తుంది.
ఆమె పరిగెత్తుకుంటూ ఒక పాడుబడిన బంగళాలోకి వెళ్తుంది,ఆ ఇద్దరు కూడా అటు వైపే వెళ్తారు,ఈ అబ్బాయి కూడా వాళ్ళ వెనకనే వంగి వంగి ఫాలో చేస్తాడు." వాళ్ళిద్దరూ పెద్ద పెద్ద బాడీలతో వున్నారు నేను ఉండేది అంతంత మాత్రమే ,ఆవేశ పడి వాళ్ళ మీద పడడం కన్నా ,అలోచించి వెళ్ళడం కరెక్ట్ " అని మనసులో అనుకుంటాడు.
వాళ్ళిద్దరూ బంగళా లోపలికి వెళ్తారు ఇతను కూడా లేట్ చేయకుండా చిన్నగా బంగళా లోపలికి వెళ్తాడు.లోపలంతా సైలెంట్ గా ఉంటుంది కేవలం పక్షుల అరుపులు తప్ప ఇంకేం వినిపించదు అబ్బాయికి ,వాళ్ళు ఎటువైపు వెళ్లారో కూడా అర్థం కాదు అబ్బాయికి , తరువాత బాగా అలోచించి ఏమైనా సౌండ్ వినపడుతుందేమో అని చుట్టూ చూస్తాడు,అప్పుడే మేడమీద నుంచి టక్..టక్..టక్..అని సౌండ్ వినిపిస్తుంది అబ్బాయికి.
వెంటనే మేడమీదకి వెళ్తాడు ,ఆ అమ్మాయి కోసం ఒక్కో రూంని చెక్ చేస్తూ ఎక్కడ ఉందో వెతుకుతాడు.ఇంతలో మళ్ళీ పరిగెడుతున్న సౌండ్ విన్పిస్తుంది ,వాళ్ళిద్దరూ ఆమె కోసం వెతుకుతూ వుంటారు ,వాళ్ళ కన్నా ముందు తను కనిపెట్టాలను కుంటాడు.మళ్ళీ వెతకడం మొదలు పెడతాడు.కొన్ని నిమిషాల తరువాత " కాపాడండి...కాపాడండి"అని కేకలు వినిపిస్తాయి అబ్బాయికి .వాళ్ళామేను పట్టేసుకున్నారేమో అని అరుపులు వినిపించిన రూంవైపు పడిగెడతాడు,వెళ్ళి చూస్తే ఆ రూంలో ఎవరు వుండరు ,నేను రావడం వాళ్ళు చూశారేమో అనుకుంటాడు ,చెమటతో షర్ట్ మొత్తం తడిసిపోతుంది ,అయినా ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్తాడు ,వెంటనే పక్క రూమ్ నుంచి ఎవరిదో ఏడుపు వినపడుతుంది వెంటనే ఆగిపోతుంది అది ఆ అమ్మాయి ఏడుపే అని కనుకుంటాడు.
ఆ ఇద్దరు ఎలాంటి పని చేసారో అని అనుకుంటూ మెల్లిగా తలుపు తీసుకుని లోపలికెళ్ళబోయి,తలుపు దగ్గరే అలా నిలబడిపోతాడు.లోపల ఏముందో చూద్దామని చూస్తే అతని గుండె ఆగిపోయి నట్టు అనిపిస్తుంది.ఆ ఇద్దరు రక్తం కక్కుకొని నేల మీద పడి వుంటారు.
ఆ అమ్మాయి కిటికీలోంచి బయటకు చూస్తూ,పెద్ద పెద్దగా ఏడుస్తూవుంటుంది ,ఆమె జుట్టులో దాగి వున్నా అమ్మాయి ముఖం సరిగ్గా అబ్బాయికి కనిపించడం లేదు.అబ్బాయికేమో భయంతో చెమటలు పడుతూ ఉంటాయి,అతనికి కాళ్ళు చేతులు ఆడటం లేదు.ఇంతలో ఆ అమ్మాయి తలతిప్పి అతని వైపు చూస్తుంది.ఆ అమ్మాయికి కళ్ళు వుండవు,కళ్ళు ఉండాల్సిన చోట గుంతలు ఉంటాయి.ముఖం మీద ముడతలు పడి గోరంగా ఉంటుంది,పళ్ళన్నీ బయటికొచ్చి ఉంటాయి.వెంటనే ఆ అబ్బాయి భయంతో బంగళా మొత్తం వినపడేలా పెద్దగా అరుస్తాడు.
అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ మెట్లు దిగి వున్నా బలాన్ని మొత్తం వాడి పరిగెత్తుకుంటూ మెయిన్ డోర్ వైపు వెళ్తాడు సడన్ గా ఎవరో వెనుక నుంచి అతన్ని బలంగా తలపై కొడతారు. ఆ దెబ్బకి కళ్ళు తిరిగి అక్కడే పడి పోతాడు ఆ అబ్బాయి.
( "రెండు రోజుల తరువాత ")
కళ్ళు తెరిచి చూసేసరికి ఆ అబ్బాయి హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు.నర్స్ అతన్ని చూసి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది.కాసేపటికి అతని దగ్గరికి డాక్టర్ పోలీసులు వస్తారు.డాక్టర్ అతన్ని తలను చెక్ చేసి " యూ కెన్ టాక్ టూ హిం" అని చెప్పేసి వెళ్ళిపోతాడు.
అతనికి ఏం అర్థం కాకా ఇన్స్పెక్టర్ వైపు చూస్తాడు.అప్పుడు ఆయన అతనితో " నువ్వు వాచ్ మెన్ గా పనిచేస్తున్న బంగళాలో రాత్రి దొంగతనం జరిగింది.పొద్దునే వచ్చిన వాచ్ మెన్ కి నువ్వు కనపడకపోవడంతో మాకు ఫోన్ చేసాడు ,మేం వచ్చి చుట్టూ పక్కల మొత్తం సెర్చ్ చేయగా నువ్వు ఒక పాడుబడిన బంగళాలో నేల మీద పడిపోయి వున్నావ్"అంటూ పక్కనే వున్నా కానిస్టేబుల్తో " ఆ కవర్ ఇలా ఇవ్వు "అని అన్నాడు.
అప్పుడు ఇన్స్పెక్టర్ అందులోంచి ఓ మాస్క్ తీసి "ఈ మాస్కు నువ్వు పడ్డున్న బంగళా మేడ మీద వున్నా రూంలో దొరికింది." అంటూ చూపిస్తాడు.
అప్పుడు ఆ అబ్బాయికి అర్ధమవుతుంది "అంటే రాత్రి అదే మాస్కు వాడి నన్ను ట్రాప్ చేసి ,నేను కాపలాగా ఉన్న బంగళాలో డబ్బులు కొట్టేశారన్నమాట" అని మనసులో అనుకుంటాడు.
తరువాత జరిగింది మొత్తం చెప్పేస్తాడు ,ఇన్స్పెక్టర్ దాని స్టేట్మెంట్ గా తీసుకుని వెళ్ళిపోతాడు.అరగంట తరువాత అతని ఫ్రెండ్ సుబ్బు వచ్చి కాసేపు మాట్లాడి బ్యాంకుకి బయలుదేరుతాడు.
మనసులో అతను" నా తెలివి తక్కువ తనానికి నా మీద నాకే కోపం వస్తుంది" అని అనుకుంటాడు.అవమానంతో చస్తున్నా ఆ అబ్బాయి కొంచెం రిలాక్సేషన్ కోసం దగ్గరలో ఉన్న టీవీ ఆన్ చేస్తాడు.టీవీ లో ఒకతను న్యూస్ చెప్తుంటాడు.
అందులో"బ్రేకింగ్ న్యూస్ రాత్రి బీచ్ రోడ్డులో వాచ్ మెన్ ను మోసం చేసి ఓ బంగళాలో దొంగలు పడ్డారు.పోయిన డబ్బు దాదాపు రెండు కోట్లు అని చెబూతున్నారు పోలీసులు .."అది విన్న అతనికే ఎవరో సుత్తితో గట్టిగా తల మీద కొట్టినట్టు అనిపిస్తుంది.
మళ్ళీ నీరసంతో కళ్ళు తిరిగి పడి పోతాడు......
**** ది ఎండ్ ****