Shaik Sameera

Thriller


4  

Shaik Sameera

Thriller


ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

4 mins 123 4 mins 123

              ఎపిసోడ్ -20

రిథిమా చేతి కట్టు వంశ్ ని మార్చమంటుంది వంశ్ నానమ్మ అందుకు రిథిమా అక్కర్లేదు నేను తరువాత చేంజ్ చేసుకుంటాను అని వెళ్లబోతుంటే వంశ్ రిథిమాని ఆపుతాడు తన చేయి అడ్డుపెట్టి.రిథిమాతో వంశ్ ఎందుకు టెన్షన్ గా కనిపిస్తున్నావు. నాకెందుకో ఏదో దాస్తున్నావని అనిపిస్తుంది బ్యాండేజ్ మార్చుకోవడానికి ఎందుకు అంతలా హెసిటేట్ చేస్తున్నావు అని వంశ్ రిథిమాని అనుమానిస్తాడు.వంశ్ రిథిమాని సోఫాలో కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని రమ్మంటాడు.రిథిమా మనసులో వంశ్ బ్యాండేజ్ మారిస్తే షీరా దొరికిపోతుందని టెన్షన్ పడుతుంది.వంశ్ తన చేయి పట్టుకోగానే రిథిమా నొప్పి కలిగినట్టు నటించి అరుస్తుంది.రిథిమా అరుపు విని వంశ్ నానమ్మ వంశ్ జాగ్రత్తగా చూసుకో రిథిమాని అనడంతో వంశ్ డైవర్ట్ అయ్యి నానమ్మ వైపు చూస్తూ వుండగా రిథిమా తన చేతి నుండి షీరా తీసి పసుపు ఉన్న గిన్నెలో ఎవరికీ కనపడకుండా పెట్టేస్తుంది.

వంశ్ రిథిమా చేతికి ఉన్న కట్టు తీసేసి వేరే బ్యాండేజ్ కడతాడు.రిథిమా షీరా పెట్టిన గిన్నెని వంశ్ అమ్మ అనుప్రియ గిన్నె తీసుకొని వెళ్లి పసుపు ఉన్న అలాంటి మరో 3గిన్నెలతో కలిపి పెట్టేస్తుంది.రిథిమా వంశ్ బ్యాండేజ్ చేంజ్ చేసినందుకు థాంక్స్ చెబుతుంది.వంశ్ షీరా దొరకలేదని ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు.రిథిమా అక్కడ ఉన్న 4గిన్నెల్లో దేంట్లో షీరా ఉందో కనిపెట్టాలి అనుకుంటుంది.వంశ్ నానమ్మ పసుపు ఫంక్షన్ కి రిథిమాని కూర్చోబెడుతుంది.మొదట వంశ్ అమ్మ అనుప్రియ రిథిమాకి పసుపు పూస్తుంది ఆ గిన్నెలో ఉందేమో అనుకుంటుంది.కానీ అందులో షీరా ఉండదు.అనుప్రియ పసుపు రాసాక నాకు నమ్మకం ఉంది నీపైన నువ్వు నా వంశ్ ని మరియు నా వంశాన్ని కూడా కాపాడుతావని అని ఒక హారాన్ని గిఫ్ట్ గా ఇస్తుంది.అది చూసి ఇషాని జాగ్రత్త ఇది నకిలీది కాదు నిజమైనది లక్షల విలువ చేస్తుంది అని చెబుతుంది.వంశ్ గమనిస్తూ ఉంటాడు అందరిని.రాజ్ వంశ్ దగ్గరికి వస్తాడు.అందరిని గమనిస్తూ ఉండు షీరా తీసినవారు ఎంత తెలివైన వాళ్ళు అయిన వాళ్ళు చేసే చిన్న తప్పు షీరా వరకు మనలన్నీ తీసుకెళ్తుంది అంటాడు.

రిథిమాకి వంశ్ పిన్ని చంచల ఇంకో గిన్నె తీసుకొని పసుపు రాస్తూ designer డ్రెస్సెస్ లో చాలా అందంగా కనిపిస్తున్నావు అని పసుపు పూస్తుంది. ఆర్యన్ కి కాల్ రావడం చూసి వంశ్,రాజ్ అతని వెనక వెళ్ళిపోతారు.చంచల టెన్షన్ లో గిఫ్ట్ ఇవ్వకుండా వెళ్తుంటే వంశ్ నానమ్మ చెప్పడంతో ఇచ్చేసి తొందరగా వెళ్ళిపోతుంది అక్కడ నుండి.వంశ్ నానమ్మ ఇషానిని కూడా పసుపు రాయమంటే నా నెయిల్స్ పాడవుతాయని అంటుంది.అందుకు నానమ్మ నెయిల్స్ తో కాదు కదా పెట్టేది పసుపు అనగానే ఇషాని కూడా వెళ్లి పసుపు పూస్తుంది అందులో కూడా షీరా ఉండదు.సియా నేను పసుపు రాస్తాను అని మిగిలిన ఒక్క పసుపు గిన్నె తీసుకునేలోపు రిథిమా షీరా అందులో ఉంది అనుకోని ఆ గిన్నె తనే తీసుకొని పసుపు అంత సియాకి పూస్తుంది.కానీ ఆ గిన్నెలో కూడా షీరా లేకపోవడంతో షీరా ఏమైంది ఎవరు తీసుకున్నారని ఆలోచిస్తూ అందరూ చూస్తున్నారని సియాకి పసుపు రాస్తూ ఆటపట్టిస్తుంది.అది చూసి అందరూ నవ్వుతారు.

ఆర్యన్ కాల్ లో సాయంత్రం లోపు పని అయిపోవాలి అని మాట్లాడుతూ వుండగా వంశ్ రావడం చూసి మళ్ళీ మాట్లాడతాను అని కాల్ కట్ చేస్తాడు.అది చూసి వంశ్ ఎవరు ఫోన్ లో అని అడుగుతాడు.అందుకు ఆర్యన్ వంశ్ తో ఇంట్లో కొత్త రూల్ పెట్టారా ఫ్యామిలీ మెంబెర్ ఎవరితో మాట్లాడిన మీకు రిపోర్ట్ ఇవ్వాలా అని వెళ్లబోతుంటే వంశ్ ఆపేస్తాడు.వంశ్ ఆర్యన్ తో ఇంత చిన్న క్వశ్చన్ ఆన్సర్ చెప్పడానికి నీకు ఇంత కష్టంగా ఉందా .నీ గుండెకి ప్రశాంతంగా సమాధానం చెప్పడం నేర్పించు లేకపోతే అది ఆగిపోవచ్చు ఎప్పుడైనా అంటాడు వంశ్.అప్పుడు ఆర్యన్ ఏం చేయాలి అన్నయ్య నా గుండె ఇలాంటి బెదిరింపులకు భయపడదు.రిలాక్స్ అన్నయ్య మీకు వ్యతిరేకంగా ఎలాంటి ప్లాన్ చేయడం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు.వంశ్ ఆర్యన్ వెళ్ళిపోయాక రాజ్ కి ఏదో ప్లాన్ చెప్పి పంపిస్తాడు తన చెవిలో.రిథిమా పసుపు క్లీన్ చేసుకుంటూ షీరా ఎవరు తీసుంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది.వంశ్ కి వ్యతిరేకంగా ప్రూఫ్ దొరికి కూడా దాన్ని కాపాడుకోలేకపోయాను అని తన మీదే తనే fraustrate అవుతుంది.రిలాక్స్ అయ్యి పసుపు ఫంక్షన్ అప్పుడు ఏం జరిగిందో గుర్తుచేసుకుంటుంది చంచల టెన్షన్ గా ఉండటం ఎడమ చేతితో గిఫ్ట్ ఇవ్వడం గుర్తొచ్చి తనే తీసుకొని ఉంటుంది అని అర్ధమయ్యి వంశ్ కి తెలియక ముందే షీరా తీసుకోవాలని అనుకుంటుంది.చంచల షీరా కి ఉన్న పసుపుని క్లీన్ చేస్తూ ఉంటుంది తన రూంలో.చంచల షీరా ని చూసుకుంటూ బంగారం దొరికింది నాకు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన సేఫ్ లో పెట్టుకొని లాక్ చేసుకొని కీస్ తన నడుము దగ్గర ఉన్న పాకెట్ లో వేసుకుంటుంది.అదంతా రిథిమా చంచల రూమ్ బయట నుండి చూస్తూ ఉంటుంది.చంచల వెళ్ళిపోయాక రిథిమా తన రూంలోకి వెళ్లబోతుంటే వెనక నుండి వంశ్ వేరే వాళ్ళ రూమ్ లోకి తొంగి దొంగలాగా చూడటం చాలా తప్పు అంటాడు.

 రిథిమా- నేనేం దొంగలాగా చూడటం లేదు చంచల అత్తయ్యతో పని ఉండి వచ్చాను పెళ్లి కదా పెద్దవాళ్ళతో పని ఉంటుంది కదా అంటుంది.

వంశ్ -పెళ్ళికి గిఫ్ట్ తీసుకోవా నా నుండి.రేపు నేను నీతో పెళ్లి చేసుకోవట్లేదు అంటాడు.

రిథిమా షాక్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతుంది.

వంశ్ -గుడ్ న్యూస్ ఇంకా ఉంది.ప్లాన్ చేంజ్ పెళ్లి రేపు కాదు ఈరోజే ఇంకొన్ని గంటల్లోన్నే మన పెళ్లి అంటాడు.

రిథిమా -షాక్ అయ్యి ఇలా జరగకూడదు నేను ఈ పెళ్లి చేసుకోను అనేస్తుంది.అది విని వంశ్ తన దగ్గరికి వస్తాడు తన వైపు కోపంగా చూస్తూ.నేను చెప్పేదానికి అర్థం అది కాదు ఏం అంత అవసరం ప్లాన్ చేంజ్ చేయడానికి రేపటి పెళ్లి ముహూర్తానికి అన్నీ ఏర్పాట్లు రేపటి కోసం అయిపోయాయి కదా ఇప్పుడు చేంజ్ చేయాలిసిన అవసరం ఉంది అంటుంది.

వంశ్ -జీవితంలో మొదటిసారి ఇంత అసహనంగా ఉన్నాను.నీ పాత ఐడెంటిటీ తొలగించి కొత్త ఐడెంటిటీ ఇవ్వడం కోసం.నిన్ను MS.రిథిమా నుండి MRS.రిథిమా వంశ్ రాయ్ సింఘానియాలా మార్చడానికి ఇంకా ఎదురు చూడలేను నేను.నానమ్మ కూడా చెప్పింది ఇంకొన్ని గంటల్లో మంచి ముహూర్తం ఉందని అందుకే ఈ గుడ్ న్యూస్ నేనే నీకు స్వయంగా చెప్పాలని వచ్చాను అంటాడు.రిథిమా ఏదో చెప్పేలోపు పిన్ని తన రూంలో లేదు నీకేం కావాలో అమ్మకి చెప్పి ఆరెంజ్ చేస్తాను వెళ్ళమన్నట్టు చేయి చూపిస్తాడు.

రిథిమా పెళ్లి ఈరోజే అని వంశ్ చెప్పడంతో తనకి కబీర్ తో ఉన్న జ్ఞాపకాలు గుర్తు వస్తాయి.ఈరోజే పెళ్లి అని కబీర్ కి ఎలా inform చేయాలి అని బాధపడుతూ వెళ్తుంది.కబీర్ వంశ్ రిథిమా పెళ్లి ఈరోజే అని న్యూస్ రావడం చూసి తన చైర్ విసిరి కొట్టి ఈ పెళ్లి జరగకూడదు నేను రిథిమాని వెనక్కి తీసుకొని రావాలి i want ridhima back అని అనగానే మిశ్రా ఎలా తీసుకొస్తారు సార్ మిలటరీ ఫోర్స్ రేపు వస్తుంది ఇంత తక్కువ టైములో వాళ్ళని తీసుకొని రావడం impossible అంటాడు.వంశ్ గేమ్ ఆడేసాడు సార్ ఫోర్స్ లేకుండా మాన్షన్ లోకి వెళ్లడం అంటే చావడమే అంటాడు.అందుకు కబీర్ అయితే ఏం చేద్దాం ఇక్కడే కూర్చొని ఉందామా రిథిమాని వదిలేయనా తను అక్కడ ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతూ ఉంటుంది.i dont care ఎంత పెద్ద రిస్క్ అయిన నేను మాన్షన్ లోకి వెళ్లి తీరాలి వంశ్ రిథిమాని పెళ్లి చేసుకోవడం కాదు కనీసం తనని తాకనివ్వను అని మిశ్రాతో చెబుతాడు.రిథిమా షీరా గురించి కబీర్ కి చెప్పాలని అనుకుంటూ వుండగా సియా ఫోన్ లో పెళ్లి arrangements గురించి మాట్లాడటం చూసి సియా దగ్గరికి వచ్చి ఒక ఫోన్ కాల్ చేసుకోవాలని తీసుకుంటుంది.రిథిమా కబీర్ కి కాల్ చేస్తే కనెక్ట్ కాదు సిగ్నల్ పోవడం చూసి సిగ్నల్ లేదు అంటుంది.అందుకు సియా ఇలా జరుగుతూ ఉంటుంది మాన్షన్ లో నేను మీ దగ్గరకే రావాలి అనుకున్న అమ్మ మీ రూంలో మీ పెళ్లి చీర పెట్టింది త్వరగా రెడీ అవ్వండి పెళ్ళికి కొన్ని గంటలే టైమ్ ఉంది అంటుంది.కబీర్ వాచ్ చూసుకుంటూ చాలా తక్కువ టైమ్ ఉంది నా దగ్గర రిథిమా నువ్వు నా దానివి నిన్ను వంశ్ నా నుండి దూరం చేయనివ్వను అని బాధపడతాడు.రిథిమా కూడా కబీర్ నేను నీ దాన్ని వంశ్ తో పెళ్లి చేసుకోలేను ప్లీజ్ కబీర్ త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళు అని ఏడుస్తూ వెళ్తుంది.Rate this content
Log in

More telugu story from Shaik Sameera

Similar telugu story from Thriller