Shaik Sameera

Thriller

4  

Shaik Sameera

Thriller

ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

5 mins
333


              ఎపిసోడ్-26

రిథిమా తలకి గురి పెట్టిన గన్ షూట్ చేస్తాడు వంశ్ కానీ అందులో బులెట్ లేకపోవడంతో రిథిమాకి ఏం కాదు రిథిమా హా అని అరుస్తుంది.అది చూసి వంశ్ గన్ కిందపెట్టేసి ఏమైంది భయపడ్డావా డోంట్ వర్రీ ఈరోజు నా భార్యగా నీకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాను అలాంటి ఇదే రోజున జీవితాన్ని ఎలా అంతం చేస్తాను అని నవ్వుతాడు.రిథిమా టెన్షన్ పడుతూవుండగా వంశ్ ఏం ఆలోచిస్తున్నావు పెళ్ళైన మొదటిరాత్రి రోజు ఇలాంటి బహుమతి ఏంటి అని ఆలోచిస్తున్నావు కదా డోంట్ వర్రీ నేను ఎక్సప్లయిన్ చేస్తాను అని బెడ్ మీద కూర్చుంటాడు వంశ్.U

వంశ్ -ఏడు అడుగులు ఏడు ప్రమాణాలు ఇవన్నీ మాములు మనుషులు మధ్య ఉంటాయి.నువ్వే అన్నావు కదా మన ఇద్దరి మధ్య నార్మల్ గా ఏది లేదని రైట్.అందుకే స్పెషల్గా వంశ్ &రిథిమా కోసం ఎనిమిదోవ ప్రమాణం ఈ గన్.నన్ను మోసం చేయాలనీ పొరపాటున కూడా అనుకోవద్దు.ఒకవేళా నువ్వు చేసిన మోసం నాకు తెలిసేలోపు నువ్వు ఈ గన్ తో నిన్ను నువ్వే అంతం చేసేసుకో అని బెడ్ మీద నుంచి రిథిమా దగ్గరికి వచ్చి ఒక వేళా నేను నిన్ను మోసం చేసిన నీకు తెలిసేలోపు నన్ను నేనే అంతం చేసేసుకుంటాను డీల్.గిఫ్ట్ బాక్స్ దగ్గరికి వెళ్లి సెకండ్ డ్రా ఓపెన్ చేయమంటాడు రిథిమాని.

రిథిమా వింతగా చూస్తూ ఉంటుంది.అది చూసి వంశ్ ఇలా భయపడితే ఎలా మన బంధాన్ని ఎలా నిలబెట్టగలవు.డోంట్ వర్రీ ఈ గిఫ్ట్ నీకు చాలా నచ్చుతుంది ఐ ప్రామిస్ అంటాడు.కానీ రిథిమా డ్రా ఓపెన్ చేయదు.వంశ్ యే డ్రా ఓపెన్ చేస్తాడు బంగారపు రోజా పువ్వు ఉంటుంది.ఆ రోజాని తీసుకొని వంశ్ అందంగా ఉంది కదా ఇలాంటి అందమైన జీవితం నువ్వు కూడా బ్రతకగలవు రిథిమా.నీకు నిజాయితీగా ఉండటం అంటే ఏంటో తెలిస్తే.నేను నిన్ను ఒక్కసారి క్షమించగలను అది నన్ను నువ్వు మోసం చేసిన అదే నా నమ్మకాన్ని మోసం చేస్తే క్షమించను అని రోజా పువ్వుని గన్ పైన పెడతాడు.ఇప్పుడు choice is yours నేను అయితే రెండే నమ్ముతాను జీవితంలో గన్స్ అండ్ రోజెస్ ఇది తప్ప ఇక ముందు వెనక ఏం ఉండదు అంటాడు.

రిథిమా-ఈ ఆలోచన మీది .నాకు అయితే రెండిటి మీద నమ్మకం లేదు.మన బంధం భవిష్యత్తు ఏంటో రాబోయే కాలమే నిర్ణయిస్తుంది.

వంశ్-కాలమా? నా జీవితంలో ఏం జరగాలో కాలం డిసైడ్ చేయదు.నా జీవితంలో ఏం జరగాలో నేనే డిసైడ్ చేస్తాను.ఈ సమయంలో నేను నిన్ను MS.రిథిమా నుండి MRS.రిథిమా వంశ్ రాయ్ సింఘానియాగా మార్చేసాను.ఇంటరెస్టింగ్ కదా మన రాబోయే లైఫ్ కూడా చాలా ఇంటరెస్టింగ్ గా ఉండబోతుంది అనిపిస్తుంది trust me.

రిథిమా-9వ ప్రమాణం నాది. పూర్తిగా ప్రయత్నిస్తాను మీ విష్ పూర్తి చేయడానికి అలాగే మీ లైఫ్ ఇంటరెస్టింగ్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాను.

వంశ్- నీ ప్రమాణం పూర్తి అయ్యేంతవరకు ఎదురు చూస్తాను MRS.రిథిమావంశ్ రాయ్ సింఘానియా అని రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతాడు.

రిథిమా-వంశ్ వెళ్ళాక రిథిమా మనసులో ఇప్పటివరకు వంశ్ వినాశనం నీ లక్ష్యo కబీర్.ప్రేమ కోసం ఇంత పెద్ద మూల్యం చెల్లించాక ఈ లక్ష్యం నాది ఇక.

వంశ్ రాజ్ స్టడీ రూంలో కలుసుకుంటారు.

రాజ్-బాస్ are you all right.మీరు కనుకున్నారా ?షీరా తనే దొంగతనం చేసిందని ఒప్పుకుందా.

వంశ్-టైమ్ యే మన సాక్ష్యం రాజ్.Infact తనే తిరిగొచ్చి నన్ను పెళ్లి చేసుకుంది.Just doesnt make in sense.

రాజ్- మనం పొరపాటున రిథిమాని అనుమానిస్తున్నామా.వంశ్ షీరా ఇవ్వమనగానే రాజ్ ఇస్తాడు.

వంశ్ -నాకెందుకో షీరా దొంగతనం రిథిమా కాదు వేరే ఎవరో చేసినట్టు నాకనిపిస్తుంది ఇప్పటికి అంటాడు వంశ్.ఎవరో కావాలనే షీరా ని రిథిమా రూమ్లో పెట్టారు ఎందుకంటే నా సందేహం రిథిమా పైకి పోవాలని చేసారు.

రాజ్-కానీ ఎవరు ? ఎందుకిలా చేసారు ?

రిథిమా రూమ్ నుండి బయటికి వచ్చి ఎవరు లేరని చెక్ చేసుకొని ఎలాగైనా షీరా ని వెతకాలని చంచల రూంలో షీరా లేకపోతే ఎవరి దగ్గరైన ఉండొచ్చు షీరా ని ఎలాగైనా సాధించాలని వెతకడానికి వెళ్తుంది.

చంచల- ఆర్యన్ రూంలో గోల్డెన్ షీరా పెన్ డ్రైవ్ ఎంత రేట్ ఉంటుందో దాన్ని అమ్మేసి రెండు గాజులు కొనుకునేదాన్ని అని చంచల అంటుంది.

ఆర్యన్ -నేను చెప్పాను కదా అమ్మ షీరా పేరు పొరపాటున కూడా ఎత్తొద్దు అని ఈ ఇంట్లో గోడలు కేవలం వినడమే కాదు మాటలు కూడా చెబుతాయి.వంశ్ కి తెలిసింది అనుకో షీరా నువ్వు తీశావని చేతులకి గాజులు కాదు మీదకి ఉరితాడు బిగిస్తాడు అంటాడు.

చంచల-స్వార్ధపరుడు ఆ వంశ్.మీ నాన్న ఎంత కష్టపడతారు పగలు రాత్రి తేడాలేకుండా బిజినెస్ కోసం.కానీ ఆయనకి ఎలాంటి గౌరవం దక్కాలో అది దక్కుతుందాలేదు కదా.ఆ షీరా ఎంత ముఖ్యమో తెలుసు కదా దాని అడ్వాంటేజ్ తీస్కోవచ్చు కదా మీరు.పూర్తి బిజినెస్ మన కంట్రోల్ లోకి తెచ్చుకునేవాళ్ళము కదా.

ఆర్యన్-ఇదే ప్రాబ్లెమ్ అమ్మ.వంశ్ ని నువ్వు పెదనాన్న కొడుకులాగానే చూస్తున్నావు.వంశ్ బంధాలన్నీ నిలబెట్టుకోవడంలో బాగా కఠినంగా ఉంటాడు అందుకే షీరా ని అలాంటి ప్లేస్ లో దాచాను నీ పైన ఎప్పటికి అనుమానం రాదు.

చంచల-ఎక్కడ దాచిపెట్టావు.

ఆర్యన్-సరైన స్థానంలో దాచిపెట్టేసాను.బయట ఏదో సౌండ్ వచ్చేసరికి ఆర్యన్ బయటికి వచ్చి చూస్తాడు అక్కడ ఫ్లవర్ vase కింద పడటం చూసి లోపలికి వెళ్ళిపోతాడు.రిథిమా ఆర్యన్ కి కనపడకుండా దాక్కుంటుంది షీరా ఆర్యన్ కి దొరికితే తనే ఎక్కడో దాచాడని రిథిమాకి తెలుస్తుంది.ఎక్కడ దాచిపెట్టి ఉంటాడు వంశ్ స్టడీ రూమ్లోన i think అక్కడే దాచిపెట్టే possibility ఉంది అని వెతకడానికి వెళ్తుంది.

ఆర్యన్-లోపలికి వచ్చి చంచలతో రిథిమా రూంలో దాచిపెట్టాను.అందుకే నీ మీద అనుమానపడకుండా వంశ్ రిథిమాని అనుమానిస్తాడు.ఇంకెప్పుడు షీరా పేరు ఎత్తొద్దు అని వార్నింగ్ ఇస్తాడు చంచలకి .

వంశ్-ఎవరైనా అతను చాలా స్మార్ట్.చాలా స్మార్ట్ గా ప్లాన్ చేసాడు.రిథిమా ఈ ఇంట్లో కొత్తగా వచ్చింది అందుకే నా అనుమానం తన పైన వచ్చేలా చేసారు.

రాజ్-బాస్ మీరు చెబితే రిథిమా వెనక నా మనుషులని పెడతాను.తన నిజం కూడా బయటికి రావడం చాలా అవసరం కదా అనగానే వంశ్ రాజ్ వైపు కోపంగా చూస్తాడు.

వంశ్-రాజ్ తను ఇప్పుడు నా భార్య.తనతో అలా చేయడానికి కూడా ఆలోచించొద్దు మనం వేరే వాళ్ళతో చేసినట్టు.ఎవరి మీద అయితే మనకి అనుమానం ఉందో వాళ్లతో చేసినట్టు.వంశ్ షీరా ని hammer తీసుకొని విరగొట్టేస్తాడు.రిథిమా నిజమా? అబద్దమా ?అనేది నేనే తెలుసుకుంటాను అని ఎవరికో కాల్ చేసి ఒక పని ఉంది listen to me carefully ఇంకోసారి అడగొద్దు.

వంశ్ ని చూసి రిథిమా వంశ్ బిజీగా ఉన్నాడు వంశ్ రాకముందే రూంలోకి వెళ్ళిపోవాలి రేపు ప్రొద్దున్నే వంశ్ లేవకముందే స్టడీ రూంకి వచ్చి షీరా ని వెతకాలి అనుకోని రూమ్లోకి వెళ్తుంది కానీ వంశ్ ముందే లోపలికి వచ్చి ఉంటాడు.

రిథిమా-వంశ్ ని చూసి షాక్ అయ్యి మీరు ఇక్కడ 

వంశ్-ఇప్పటిదాకా బయట ఉన్న ఇప్పుడు లోపలికి వచ్చేసాను.ఇది నా ఇల్లు.ఈ ఇంట్లో దారి ఎటు వైపు వెళ్తుందో నీకు తెలియడానికి కొంచెం సమయం పడుతుంది.జాగ్రత్తగా ఉండు ఎక్కడైనా ఇరుకునేవు.వంశ్ మాటలకి రిథిమా వెళ్లి బెడ్ పైకి వెళ్లి కూర్చుంటుంది.Strange కదా మొదటి రాత్రి రోజు పెళ్లి కూతురు గదిలో లేదు ఎక్కడికి వెళ్ళావు అని రిథిమా దగ్గరికి వచ్చి అడుగుతాడు.ఏదైనా కావాలా లేదా ఏదైనా వెతుకుతున్నావా ఎవరికీ చెప్పలేనిది.రిథిమా సమాధానం చెప్పకపోయేసరికి వంశ్ రిథిమాకి దగ్గరగా వస్తాడు రిథిమా దిండుని అడ్డంగా పెడుతుంది వాళ్ళ ఇద్దరి మధ్య.వంశ్ గోడపైన ఉన్న సాలీడుని చేతిలోకి తీసుకొని రిథిమాకి చూపిస్తూ తీసి కిందపడేస్తాడు.So నువ్వు ఏదైతే వెతకడానికి వెళ్ళావో అది దొరికిందా నీకు.Come on sweet heart ఇంత కష్టం నీకెందుకు నాతో చెప్పు నేను వెతికిస్తాను అంటాడు.రిథిమా మాట్లాడకపోయేసరికి షీరా ముక్కలు రిథిమాకి ఇచ్చి dust bin లో వేయమని చేతిలో పెడతాడు .

రిథిమా-వాటిని చూసి రిథిమా ఇవి షీరా ముక్కలు అని చూస్తుంది.

వంశ్ -ఏమైంది పడేయాలని లేదా నీకు.అయిన ఇది నీకు ఏం పనికొస్తుంది దీనికోసం వెతకడానికి వెళ్ళలేదు కదా నువ్వు.

రిథిమా-నాకేం తెలుసు ఇదేంటో మరి దీనికోసం నేను ఎందుకు వెతుకుతాను.రిథిమా బెడ్ షీట్ తీసుకొని పక్కకి వచ్చి సర్దుకుంటుంది.

వంశ్-విరిగిపోకముందు ఇది నాకు చాలా పనికొచ్చింది.ఎవరో దొంగతనం చేసారు చాలా కష్టంగా దొరికింది.దొరకగానే destroy చేశాను.నీకేమనిపిస్తుంది ఎవరు తీసి ఉంటారు నా వస్తువుని.

రిథిమా-ఇది మీ ఇల్లు కదా.మీరే చెబుతుంటారు కదా మీ ఇంటి నుండి మీ పర్మిషన్ లేకుండా ఆత్మ కూడా బయటికి వెళ్ళలేదు అంటారుగా.అలాంటపుడు మీ ఇంత విలువైన వస్తువు ఎవరైనా దొంగతనం చేసే పొరపాటు ఎలా చేయగలరు.

వంశ్-పొరపాట్లు మనుషులతోనే జరుగుతాయి.కానీ ఆ మనిషికి తెలియదు ఆ తప్పు విలువ ఏంటో అంతే.నువ్వు కూడా నన్ను కొంచెం కొంచెం అర్థం చేసుకుంటున్నావు ఇంటరెస్టింగ్ అంటాడు.

రిథిమా ఆ మాటకి బెడ్ షీట్ తీసుకొని సోఫాలో పడుకోవడానికి వెళ్ళిపోతుంది.

వంశ్- రిథిమా దగ్గరికి వచ్చి మన పెళ్లి అయిపోయింది ఈరోజు కానీ ఇప్పటికి నువ్వు నాకు ఒక పజిల్ వే.

రిథిమా-అయితే మీతో చాలా పెద్ద తప్పు జరిగింది.పెళ్లి మనం ఎవరి గురించి అయితే మనకు బాగా తెలిసిఉంటుందో వాళ్లనే పెళ్లి చేసుకుంటాము.

వంశ్-నేను అయితే ఎవరి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నానో వాళ్లనే పెళ్లి చేసుకున్నాను.పజిల్స్ అంటే నాకు చాలా ఇష్టం.అంధకారం చాలా ఇష్టం.అంధకారంలోనే కరెక్టుగా వెళ్ళగలo.నువ్వంటే ఇష్టం .నా వల కనపడదు రిథిమా నువ్వు ఇప్పుడు ఇక్కడే నా వలలోనే ఉండాలి నో రెసిగ్నషన్ నో వాక్ అవుట్ రిథిమా అంటాడు.

రిథిమా-నీ వల ఎలాంటిది అయిన నిన్ను నా నుంచి ఎవరు కాపాడలేరు వంశ్ అనుకుంటుంది మనసులో.



Rate this content
Log in

Similar telugu story from Thriller