Shaik Sameera

Thriller

4  

Shaik Sameera

Thriller

ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

5 mins
410


            ఎపిసోడ్-30

అనుప్రియ-నీకేమనిపిస్తుంది నువ్వు ఏం చేసిన తెలుసుకోలేనంత పిచ్చివాళ్ళలాగా కనిపిస్తున్నామా? ఆపేయి ఇలాంటి పిచ్చి పనులు ఏ హక్కులేదు ఈ ఇంటి గతంలోకి తొంగిచూడటానికి నీకు.నువ్వు ఈ ఇంటి కోడలిలాగానే ఉండు ఇంట్లో అందరిని సంతోషంగా ఉండేలా చూడు అంతే కానీ బాధపెట్టాలని చూడకు.సమాధి తవ్వితే ఖజానా దొరకదు బూడిద మాత్రమే దొరుకుతుంది.listen రిథిమా వార్నింగ్ అనుకో లేదా advice అనుకో నువ్వు ఈ ఇంటి rules మార్చడానికి ట్రై చేయకు.ఈ ఇంటికి తగ్గట్టు నువ్వు మారాలి అంతే కానీ ఈ ఇల్లు నీకు తగ్గట్టు మారదు.ఇంకోసారి వంశ్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మర్యాదగా ఉండదు నీ హద్దులో నువ్వు ఉంటే మంచిది లేకపోతే హద్దులకి మించి బాధపడాలిసి వస్తుంది.

రిథిమా -మనసులో ఈ కుటుంబంలో ఎవరు ఆ statue రహస్యం గురించి ఎవరు చెప్పరు నాకు. ఏదో ఒకటి చేసి వంశ్ నుండే ఆ statue గురించి తెలుసుకోవాలి.వంశ్ సియా రూమ్ బయట నుండి మొత్తం చూస్తూ ఉంటాడు.

రిథిమా హాల్ లోకి వచ్చి వంశ్ ఇచ్చిన VR సింబల్ ఉన్న రింగ్ చూస్తూ వంశ్ కి కోపం తెప్పించి తన ఇగో హర్ట్ చేస్తే కోపంలో ఆ statue రహస్యం చెప్పేస్తాడేమో అని ఆ రింగ్ తీసేస్తుంది తన వేలి నుండి.వంశ్ అప్పుడే తన వెనక వచ్చి నిలబడతాడు.

వంశ్-చెప్పాను కదా నీకు ఈ రింగ్ నేను స్పెషల్ వ్యక్తులకే ఇస్తాను అని అలాగే ఈ గిఫ్టుకి రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పాను కదా.కానీ నువ్వు ఈ రింగ్ ని తీసేసావా how dare you.

రిథిమా-హా నేను ఈ రింగ్ తీసేసాను.కేవలం రింగ్ తొడిగితే నేను స్పెషల్ కాను వంశ్.స్పెషల్ అని నేను ఎప్పుడు అనుకుంటాను అంటే నీ భార్యగా నువ్వు ఎప్పుడు నిజం చెబుతావో ఈ రింగ్ కి సంబందించినది.

వంశ్-భార్యవా ? interesting very intersting.భార్య గూఢచారిలాగా ఇంట్లో తిరుగుతుందా? భార్య ఇంట్లో వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తుందా?చూసాను నేను సియా రూంలో నువ్వు ఏం చేసావో.నా భార్యవి అనుకుంటే నేను ఇచ్చిన రింగ్ ని ఎందుకు తీస్తావు.

రిథిమా-చెప్పమంటావా నేను రింగ్ ఎందుకు తీసానో.నాకు ఈ రింగ్ నచ్చలేదు.ఈ రింగ్ నాకు ఆ statue ని గుర్తు చేస్తుంది.ఆ statue కూడా ఇలాంటి VR సింబల్ ఉన్న రింగ్ యే పెట్టుకొని ఉంది కదా నువ్వే చెబుతావు కదా ఇలాంటి రింగ్ ఎవరి వేలికి ఉంటుందో వాళ్ళు నీకు చాలా దగ్గరవాళ్ళు అని.నాకు ఆ మాత్రం తెలుసుకునే హక్కు లేదా ఆ statue తో నా భర్తకి ఎలాంటి బంధం ఉందో? ఇలా ఎంత మంది స్పెషల్ అమ్మాయిలు ఉన్నారు మీ జీవితంలో వాళ్ళకి ఈ రింగ్ తొడిగావు.వంశ్ నీకు అనిపించవచ్చు నేను కూడా ఆ స్పెషల్ అమ్మాయిల్లో ఒకదాన్ని అని కానీ కాదు.

వంశ్-నాకు అనిపించేది కేవలం కోపం అనే జ్వాలలోనే కాలిపోతున్నావు అని.అసూయలో కాలుతూ కోపం కూడా వస్తుంది నీకు అని అనుకోలేదు.

రిథిమా-అసూయ అది నీకోసం.ఎవరైతే తన కుటుంబాన్ని బెదిరించి భయపెట్టి తనకి వ్యతిరేకంగా మాట్లాడకుండా చేసాడో కనీసం ఇంట్లో స్వతంత్రం కూడా తిరగకుండా చేసిన నీలాంటి మనిషి కోసం అసూయ కలుగుతుందా నాకు లేదు వంశ్.నీకు ఒకటి చెప్పనా వంశ్ ఇక్కడ ఇల్లు,కుటుంబం ఉండదు నువ్వు నీ బిజినెస్ మాత్రమే ఉంటుంది ఇక్కడ.నువ్వు ఇంత పెద్ద మహల్ నిర్మించావు కానీ దీన్ని ఇల్లుగా మాత్రం ఎప్పటికి చేయలేవు ఎప్పటికి.నీలాంటి మనిషి కేవలం మనుషుల నుండి భయాన్ని మాత్రమే పొందగలవు.ఈ ప్రేమ,అసూయ అనే ఎమోషన్స్ నీలాంటి వాళ్ళకోసం కాదు అవి నీకు ఎప్పటికి అర్థం  కూడా కావు.

వంశ్ -enough shutup will you

రిథిమా-ఎందుకు shutup నేను నిజం చెబుతున్నానా.?నిజాలు చెప్పడం భరించలేకపోతున్నావా.?కానీ వంశ్ నేను నిజాలు చెబుతాను నేను ఆ statue గురించి తెలుసుకోవడానికి ప్రయతించాను.నీకు తెలుసా నేను ఏం తెలుసుకున్నానో నువ్వు ఎలా ఈ ఇంట్లో వాళ్ళని నీ భయం అనే పంజరంలో ఎలా బంధించావో.ఈ ఇంట్లోవాళ్ళని బంధిస్తూ నువ్వు కూడా ఒక పంజరంలో బందివి అయిపోయావు.అయిన నువ్వు నీ ఫ్యామిలీ వాళ్ళతో ఏదైనా చేసుకో కానీ నా మాట విను నేను నిన్ను చూసి భయపడను నేను నీ బానిసని కాదు ఈ పంజరం నాకోసం కాదు.

వంశ్-మంచిది అయితే ఛాయస్ ఉందా నీ దగ్గర ?

రిథిమా-ఇక్కడ మాట ఛాయిస్ ది కాదు వంశ్ ధైర్యం గురించి.నాలో ధైర్యం మొదట్లో లేదు కానీ ఇప్పుడు ఉంది.నా మనసులో ఏం అనిపిస్తే అదే చేస్తాను నీలాగా లోపల చాలా రహస్యాలు దాచుకొని తిరగను.నీకు నువ్వు అలాంటివాడివి కాదు అనిపిస్తే చెప్పు statue రహస్యం ఏంటో statue గురించి నాకు తెలియకూడదని ఎందుకు అనుకుంటున్నావు.తప్పులన్నీ మాత్రమే దాచిపెడతాము.యే బంధం ఉంది ఆ statue తో నీకు.

వంశ్-నేను చెప్పాను కదా చాలు అని.

రిథిమా-కాదు వంశ్ ఈరోజు అయితే చాలదు.నువ్వు వినిపిస్తావు కదా అవతలి వాళ్ళకి నువ్వు కూడా వినడం అలవాటు చేసుకో.లేదా ఈ ఇంట్లో ఉండేవాళ్ళని ఫ్యామిలీ అంటావు కదా వాళ్ళని ఫ్యామిలీ అని కాదు నౌకర్లు లేదా బానిసలూ అను.నాకు తెలుసు నువ్వు ఎందుకు సమాధానం చెప్పవో.నువ్వు ఇందుకు వంశ్ రాయ్ సింఘానియావి కాదు నువ్వు ఎవ్వరికి దగ్గరకావు అందుకు.ఎవరైనా నీకు దగ్గరగా వచ్చిన నువ్వు ఎవరితో అయిన బంధం పెట్టుకున్న ఎవరికైనా నువ్వు హక్కు ఇవ్వాలన్న నీకు భయపడతావు నువ్వు.చెప్పాను కదా నీకు భయం మాత్రమే అర్థం అవుతుంది.నీకు వేరే వాళ్ళ ఎమోషన్స్ తో పనిలేదు అలాంటపుడు నేను ఎందుకు నీ ఫీలింగ్స్ గురించి ఎందుకు పట్టించుకోవాలి.నువ్వు ఇచ్చిన ఈ స్టుపిడ్ రింగ్ నేను ఎందుకు పెట్టుకోవాలి.ఎందుకు పట్టించుకోవాలి ఇలాంటి మనిషి గురించి ఎవరి మనసులో అయితే ఎలాంటి ఫీలింగ్స్ లేవో కేవలం రాయివి మాత్రమే నువ్వు.నిజం విని బాదేస్తుందా నీకు తెలుసు కదా నీకు రాయిలాంటి మనసు అని అందులో ఎవరి మీద ఎలాంటి ఫీలింగ్స్ రెస్పెక్ట్ లేదు.

వంశ్ కోపంతో ఫ్లవర్ వాజ్ నేలకేసి కొడతాడు రిథిమా మాటలకి.రిథిమా మనసులో వంశ్ కి కోపం వచ్చింది దేవుడా ఇలాగే తోడుగా ఉండు నాకు అనుకుంటుంది.

రిథిమా-ఏమైంది కోపం వచ్చిందా నిజం వినే అలవాటు లేదు కదా నీకు.ఆ statue రహస్యం గురించి నాకు చెప్పాలని లేదు కదా చెప్పొద్దు నేనే స్వయంగా తెలుసుకుంటాను అని వెళ్ళబోతుంది.

వంశ్-నీకు ఆ statue హిస్టరీ తెలుసుకోవాలని ఉంది కదా నీ భర్తలాగా నీ ఈ కష్టాన్ని కూడా నేనే తీరుస్తాను పద వెళ్దాం అని వంశ్ వెళ్తాడు.

రిథిమా మనసులో thank గాడ్ నాకు ఇంత ధైర్యం వంశ్ ముందు మాట్లాడటానికి ఇచ్చినందుకు వంశ్ ని చూస్తే అనిపిస్తుంది statue రహస్యం మొత్తం చెప్పేలా ఉన్నాడు నాకు.

వంశ్ &రిథిమా statue దగ్గరికి వెళ్తారు.

వంశ్- statue ని చూస్తూ వంశ్ తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నావు కదా ఎవరో తను? యే రహస్యం ఉందో ?తన వెనక యే కధ ఉందో ?

రిథిమా-హా 

వంశ్-ఈ రింగ్ నేనే ఇచ్చాను తనకి.తను చాలా దగ్గర నా జీవితానికి.తను నా ex ఫియాన్సీ తన పేరు రాగిణి.నేను ఇక్కడికి ఎవరిని రానివ్వను.నేను మూసేసిన గదుల్లో ఎవరిని తొంగి చూడనివ్వను అని రిథిమాని చూస్తూ ఉంటాడు.

రిథిమా-నేను నీ విషయాల్లో ఎప్పుడు రాను వంశ్.గుర్తు చేస్తాను ఈ రింగ్ నువ్వే ఇచ్చావు నాకు స్వయంగా నేను నీ సొంతం అన్నావు.మరి సొంతమైనవాళ్ళతో రహస్యాలు ఉండవు కదా.వంశ్ వెళ్లబోతుంటే నువ్వు చెప్పలేదు తను నీ ఫియాన్సీ అయితే నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు.

వంశ్-ఎందుకంటే తను ఈరోజు నా జీవితంలో లేదు.తనతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు.అందుకే నువ్వు ఇప్పుడు నా భార్యవి.

రిథిమా-అయితే ఏమైంది తనకి.ఎందుకు ఇలా statue లా పెట్టావు అనగానే వంశ్ తన చేతిని టేబుల్ కి ఉన్న మేకుకి గుచ్చుకునేలా చేసుకుంటాడు బ్లడ్ వస్తూ ఉంటుంది.చెప్పండి అంటుంది రిథిమా.

వంశ్-నువ్వు కేవలం ఈ statue పేరు ఈ statue తో నాకు ఉన్న బంధం గురించి మాత్రమే తెలుసుకోవాలి అనుకున్నావు తెలుసుకున్నావుగా చాలు ఇక దీనికన్నా ఇంకా ఒక్క ప్రశ్న కూడా వేయొద్దు.

రిథిమా-ఎందుకు వేయకూడదు వంశ్ పూర్తి విషయం ఎందుకు చెప్పవు.చెప్పోద్దులే నాకు అయితే అర్థం అయింది నేను ఎలాంటి బాధని రోజు అనుభవిస్తున్నానో తను కూడా అలాంటి బాధనే అనుభవించి ఉంటుంది.నీతో పూర్తి జీవితం కాదు ఒక్క క్షణం గడపడమే చాలా కష్టం.నీకు అవతలివాళ్ళలో నీ శత్రువే కనిపిస్తాడు.Loyality అంటే నీకు చాలా ఇష్టం కదా లాయల్టీ రెస్పెక్ట్ deserve చేస్తుంది.నువ్వు చెబుతూ ఉంటావు నీకు నమ్మకద్రోహం అంటే విసుగు అని నువ్వు ఎప్పుడైనా ఇది తెలుసుకోవడానికి ట్రై చేసావా ప్రతి నమ్మకద్రోహం వెనక ఒక కారణం ఉంటుంది ఆ కారణం కేవలం నువ్వే.నువ్వు ఇతరుల జీవితాలని ఎలా బందిస్తావు అంటే వాళ్ళు నిస్సహాయులు అయిపోతారు నమ్మకద్రోహం చేయడానికి నీకు.తనతో కూడా అదే జరిగిఉంటుంది.నువ్వు ఇతరులకి గిఫ్ట్స్ తప్పకుండా ఇస్తావు ఇలాంటి గిఫ్ట్స్ అని రింగ్ ని చూపిస్తూ వాళ్ళ ఇష్టాలని చూడవు.వాళ్ళకి బందాలని ఇస్తావు కానీ వాళ్ళకి హక్కులని ఇవ్వవు.అప్పుడు ఎవరైనా ఎందుకు మోసం చేయరు నిన్ను వాళ్ళ లాయల్టీ ,నమ్మకం,ప్రేమ చూడకుండా కేవలం శిక్షించాలి అనుకుంటావు అంతే.రాగిణి statue చూస్తూ ఉంటే రిథిమా వంశ్ వెళ్ళిపోతాడు.వంశ్ వెళ్ళాక వంశ్ మౌనం చెబుతుంది నువ్వు గడిచిపోయినా గతానివి మాత్రమే కాదు చాలా పెద్ద రహస్యం ఉంది నీ వెనక.

వంశ్ ఇంట్లోకి వెళ్లి తన పియానో కోపంతో ప్లే చేస్తూ రిథిమా మాటలు తలుచుకుంటూ ఉంటాడు.రిథిమా వంశ్ పియానో ప్లే చేయడం చూసి వంశ్ ఎందుకు ఇలా behave చేస్తున్నాడు.నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా నేను ఏదైనా తప్పు చేసానా అని వంశ్ దగ్గరికి వెళ్లబోతుంటే వెనక నుండి ఆర్యన్ నేను నీ ప్లేస్ లో ఉంటే వంశ్ అన్నయ్య నుండి ఇలాంటి postion లో సోషల్ డిస్టెన్స్ యే కాదు అంత కంటే ఎక్కువ డిస్టెన్సులో ఉంటాను.trust me ఈ టైములో దేవుడు కూడా వంశ్ అన్నయ్యని disturb చేసే తప్పు చేయడు.అందుకు రిథిమా వంశ్ వైఫ్ ని నేను నేను తెలుసుకోవాలి అనుకున్న రాగిణి వంశ్ మధ్య ఏమైందో తను ఎందుకు ఇలా behave చేస్తున్నాడు.ఆర్యన్ నేను అయితే ఇంతే చెప్పగలను వంశ్ తో ఇలా ఎప్పుడు జరుగుతుంది అంతే తన ప్రేమ ఎప్పుడు హద్దు దాటుతుందో ఎప్పుడైతే హద్దు దాటుతుందో తన ప్రేమ విషంలా మారిపోతుంది.విషం జీవితం కాదు చావుని ఇస్తుంది అంటాడు.రిథిమా అందుకు మర్డర్ వంశ్ హంతకుడా?వంశ్ హంతకుడు అని నీ దగ్గర సాక్ష్యం ఏముంది అని ఆర్యన్ ని అడుగుతుంది.ఆర్యన్ వెళ్ళిపోతాడు.రిథిమా పియానో ప్లే చేస్తున్నా వంశ్ నే చూస్తూ ఉంటుంది .



Rate this content
Log in

Similar telugu story from Thriller