Shaik Sameera

Thriller


4  

Shaik Sameera

Thriller


ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

4 mins 280 4 mins 280

              ఎపిసోడ్-24

రిథిమా మౌనంగా ఉండటం చూసి వంశ్ కి కోపం పెరుగుతూ ఉంటుంది.రిథిమా చేతికి ఉన్న రక్తాన్ని చూసి నీ చేతికి ఏమైంది రిథిమా అని వంశ్ నానమ్మ అడుగుతుంది.రిథిమా కబీర్ తో జరిగినది గుర్తు చేసుకుంటుంది.కబీర్ తన గన్తో షూట్ చేసుకోబోతుంటే రిథిమా ఆపుతుంది.

రిథిమా -పిచ్చివాడిలా చేయకు నువ్వు ఒక మాట మర్చిపోతున్నావు నీ జీవితం నీది మాత్రమే కాదు.నువ్వు ఎంత అయితే వంశ్ రాయ్ సింఘానియాని ద్వేషిస్తున్నావో అంతే నన్ను ప్రేమిస్తున్నావు.నేను ఎప్పుడైతే రాజ్ షూట్ చేసిన గన్ సౌండ్ విని నిన్ను చంపేశాడు అనుకున్న అదే సమయంలో నేను కూడా చచ్చిపోయాను.నా నుండి నా జీవితాన్ని లాక్కోలేవు నువ్వు.కానీ రిథిమా మాటలకి కబీర్ కళ్ళు మూసుకుంటాడు.

రిథిమా వంశ్ నానమ్మతో నేను జారి కింద పడిపోయాను అని చెబుతుంది.అది విని వంశ్ రిథిమా ఏదో దాచిపెడుతుంది అని మనసులో అనుకుంటాడు.పూజారిగారు ముహూర్త సమయం అయిపోతుంది వధువుని తీసుకొనిరండి అంటారు.వంశ్ కోపంగా రిథిమా దగ్గరికి వెళ్లబోతాడు వంశ్ నానమ్మ తనని ఆపేసి మిగిలిన మాటలు తరువాత మాట్లాడుకుందాం శుభకార్యం శుభముహూర్తంలో అయిపోవాలి అంటుంది.రిథిమా వంశ్ ఇద్దరు కలిసి పెళ్ళిపీటల మీద కూర్చొని అగ్ని గుండంలో పూలు వేస్తూ పూజ చేస్తూ ఉంటారు రిథిమా బాధగా పూజ చేస్తూ ఉండటం గమనిస్తాడు.పూజారిగారు కొంగుముడి వేయమనగానే కబీర్ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటుంది.

రిథిమా కబీర్ కళ్ళు మూసుకొని షూట్ చేసుకోబోతుంటే ప్లీజ్ అని ఏడవటంతో గన్ కిందకి దించేస్తాడు.

రిథిమా-కబీర్ ప్లీజ్ listen to me comly.నీ చావు వంశ్ గెలుపు అవుతుంది.మనం బ్రతికి ఉంటే మనతోపాటు మన లక్ష్యం బ్రతికే ఉంటుంది.ఈరోజు మనం ఓడిపోతే ఏం అవుతుంది రేపు మనం తప్పకుండా గెలుస్తాము.

కబీర్ -ఎలా గెలుస్తాం రిథిమా మనం. ఏముంది మన దగ్గర ఇంత కష్టపడిన ఒక చిన్న ప్రూఫ్ కూడా సాదించలేకపోయాము వంశ్ ఒక క్రిమినల్ అని ఎలా ప్రూఫ్ చేయగలము.మన ప్రయతాలన్నీ ఫెయిల్ అయిపోయాయి.We have nothing to proove vansh is a bleddy criminal.మన దగ్గర యే దారి కూడా లేదు రిథిమా.నేను నా జీవితాన్ని ,నా ప్రేమని పణంగా పెట్టేసాను నా డ్యూటీ కోసం.అయిన నేను డ్యూటీని చేయలేకపోయాను.I have the lost all .

రిథిమా-ఈ ఓటమికి కారణం నువ్వు కాదు కబీర్.ఈ పని కోసం నువ్వు నన్ను ఎంచుకున్నావు నేను చేయలేకపోయాను.నాకు తెలుసు ఈ మిషన్ నీకు ఎంత ముఖ్యమో నేను చేయలేకపోయాను iam sorry.కానీ మనం ఓటమిని ఒప్పుకోకుండా మన చివరి శ్వాస దాక పోరాడదాం.నేను పోరాడతాను నువ్వు ఏం చెబుతావో అది నేను చేస్తాను ఎలాంటి హద్దు వరకు అయిన వెళ్తాను నేను నా ప్రాణం ఇవ్వవలసి వచ్చిన ఇస్తాను.నిన్ను ఇలా ఓడిపోయినా స్థితిలో నేను చూడలేను.కేవలం మన మనసులే కాదు శ్వాస కూడా కలిశాయి మనవి.నా శ్వాస ఉన్న ఆగిన అది నీతోనే.రిథిమా మళ్ళీ మాములు స్టేజికి వచ్చేస్తుంది.

ఇషాని రిథిమా చీరకి వంశ్ కి కలిపి కొంగు ముడేస్తుంది.అప్పుడు పూజారిగారు ఈ పవిత్రమైన కొంగుముడి మిమ్మలిద్దరని ఒకరి కోసం ఒకరిని ఏడుజన్మల వరకు కట్టి ఉంచుతుంది.ఇద్దరినీ పూజారిగారు సప్తపది కోసం నిలబడమంటే వంశ్ లేచి నిలబడతాడు కానీ రిథిమా లేవదు మళ్ళీ కబీర్ తో జరిగిన ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటుంది.

రిథిమా-ఈ లక్ష్యం నీదే కాదు మనది.నువ్వు అలోచించి చూడు ఏదో ఒక దారి కనిపిస్తుంది మనకి.ఇలా ఓటమిని ఒప్పుకుంటే ఎలా.

కబీర్ -నువ్వు అన్నావుగా నాకోసం ప్రాణాలు ఇస్తాను అని నేను నీ నుంచి ఒకటి అడుగుతాను అది చావు కంటే కూడా చాలా భయంకరమైనది.ఇస్తావా నువ్వు.

రిథిమా-అడిగి చూడు.కేవలం మాటలు మాత్రమే చెప్పట్లేదు నేను నీకోసం ఏదైనా ఇస్తాను అని చెబుతుంది. 

రిథిమా పైకి లేవలేదని సప్తపది కోసం అందరూ తననే చూస్తూ ఉంటారు.ఆర్యన్ చంచలతో తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదేమో అంటాడు.వంశ్ నానమ్మ రిథిమా లేచి నిల్చో తల్లి అనగానే నిల్చుంటుంది.పూజారిగారు రిథిమా వంశ్ కి వరమాల ఇచ్చి ఇద్దరినీ మార్చుకోమంటారు.రిథిమానే మొదట వరమాలని వంశ్ మెడలో వేస్తుంది.తరువాత వంశ్ కూడా వరమాలని రిథిమా మెడలో వేసేస్తాడు.వంశ్ నానమ్మ చాలా సంతోషపడుతుంది.వంశ్,రిథిమా అగ్నిగుండం చుట్టూ ఏడు అడుగులు వేస్తూ ఉంటారు పూజారిగారు మొదటి అడుగులో వరుడు వధువుకి తన భార్యగా అన్ని అధికారాలు ఇస్తున్నట్టు మాట ఇస్తాడు.అలాగే తన సుఖదుఃఖాల్లో తోడుగా అండగా ఉంటానని చెబుతాడు.

కబీర్-రిథిమా నేను ఈరోజు నీ నుండి ఎలాంటి ప్రేమ మూల్యం అడగబోతున్నాను అంటే అది ఇంతవరకు ఎవరు ఎవరని అడిగిఉండరు అడగరు కూడా.రిథిమా విషం త్రాగి చావడం సులభం కానీ విషం తీసుకొని బ్రతకడం చాలా కష్టం నువ్వు నా ప్రేమ కోసం ఇలాంటి మూల్యం చెల్లించగలవా.రిథిమా నువ్వు నా లక్ష్యం కోసం వంశ్ ని పెళ్లి చేసుకోగలవా.

రిథిమా షాక్ అయ్యి కబీర్ నుండి దూరంగా జరిగి కింద కూలబడిపోతుంది.కబీర్ కూడా రిథిమాకి ఎదురుగా కింద కూర్చుంటాడు. వంశ్,రిథిమా పైన అందరూ పూలు వేస్తూ ఉంటారు.పూజారిగారు ఐదోవ అడుగులో వధువు ముందు నడవాలని అనడంతో రిథిమా ముందుకి వస్తుంది.పూజారిగారు సతి సావిత్రి kadha లాగా భార్య తన భర్తపైన వచ్చే ప్రతి ప్రమాదం నుండి రక్షించాలి అంటారు.కానీ రిథిమా అడుగులు వేయకుండా సడెన్ గా ఆగిపోతుంది.వంశ్ వెనక నుండి రిథిమా పద నాకనిపిస్తుంది ఈరోజు పెళ్లి కన్నా నీ లైఫ్ లో ఏదో ముఖ్యమైనది ఉంది అని దానివలన నువ్వు ఇక్కడ ఉండి కూడా లేనట్టు ఉన్నావు.అందుకు రిథిమా కాదు ఈ సమయంలో పెళ్లి కన్నా ఏది ముఖ్యం కాదు నా లైఫ్ లో అంటుంది.

కింద కూలబడిన రిథిమా పైకి లేచి నిల్చుంటుంది.

కబీర్ -రిథిమా నాకు తెలుసు మన బంధంలో నేను ఈ బాధ తప్ప ఏం ఇవ్వలేదు నీకు.ఈరోజు నీతో మన ప్రేమకి యిలాంటి మూల్యం అడిగాను నీతో పాటు నేను కూడా మెల్లగా అంతం అవుతూ పోతాను .చెప్పు రిథిమా నా ప్రేమకోసం ఈ మూల్యం ఇవ్వగలవా.

రిథిమా-ప్రేమ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యాను కదా అదే అడగొచ్చు కదా కబీర్ నా సంతోషాలు అయిన అడిగి ఉండొచ్చు కానీ నువ్వు చావు కన్నా ఘోరమైనా జీవితాన్ని బ్రతకమని కోరుతున్నావు.

కబీర్ -రిథిమా అని బాధపడతాడు.

రిథిమా-వెనక్కి తిరిగి మాన్షన్ వైపు చూసి తన కన్నీళ్లు తుడుచుకుంటూ కబీర్ ముందు కింద కూర్చొని నా ప్రేమకి ఇదే మూల్యం అయితే నేను చెల్లించడానికి రెడీ నేను అనగానే కబీర్ షాక్ అయ్యి రిథిమానే చూస్తూ ఉంటాడు.

వంశ్ రిథిమా మెడలో మంగళసూత్రం వేస్తాడు.

రిథిమా- కబీర్ తో ఎందుకంటే నాకోసం ఈ ప్రపంచంలో నా జీవితం,నా ప్రేమ,నాకు కావాల్సినవారు అంటూ ఉన్నది ఈ లోకంలో నువ్వే.నీకోసం ఏదైనా చేస్తాను.

వంశ్ రిథిమా నుదిటి పైన సింధూరం పెడతాడు.

రిథిమా-అయితే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి కాదనకూడదు.నువ్వు ఇప్పుడే ఈ మాన్షన్ నుండి బయటికి వెళ్ళాలి అది మన అనబోయి i mean నీ విడుదలకి కావలసిన దారిలో నడవాలి అని పైకి లేచి వెళ్ళిపో నువ్వు అని వెళ్ళబోతుంది.

కబీర్-బాధపడుతూ రిథిమా అని పిలుస్తాడు.

రిథిమా-తను ఏడుస్తూ వద్దు ఇంకేం మాట్లాడొద్దు నువ్వు.ఇంకా ఒక్క మాట మాట్లాడిన నువ్వు నేను ఇది చేయలేను.ప్లీజ్ వెళ్ళిపో కబీర్ అని తన మొహంకూడా చూడకుండా చెప్పడంతో కబీర్ తన గన్ తీసుకొని బాధగా వెళ్తూ ఉంటే రిథిమా చీర కొంగు కబీర్ షర్ట్ బటన్కి చిక్కుకుంటుంది.కబీర్ చిక్కుకున్న చీరని తన చేతికి ఉన్న గాయం వలన తీయలేకపోతాడు.రిథిమా కబీర్ చేతికి ఉన్న గాయాన్ని చూసి తన చీరని చించి కబీర్ చేతికి కట్టు కడుతుంది.కబీర్,రిథిమా బాధగా చూసుకుంటూ విడిపోతారు.కబీర్ మాన్షన్ నుండి బయటికి వెళ్లే దారి వైపు వెళ్తాడు.రిథిమా మాన్షన్ లోకి వెళ్ళిపోతుంది.వంశ్ రిథిమా పెళ్లి అయిపోతుంది.వంశ్ రిథిమాని అనుమానంగా చూస్తూ ఉంటాడు.Rate this content
Log in

More telugu story from Shaik Sameera

Similar telugu story from Thriller