SATYA PAVAN GANDHAM

Abstract Inspirational Thriller

4  

SATYA PAVAN GANDHAM

Abstract Inspirational Thriller

"శ్రీ కృష్ణ మహా భారతం - 45"

"శ్రీ కృష్ణ మహా భారతం - 45"

6 mins
324


"శ్రీ కృష్ణ మహా భారతం - 44" కి

కొనసాగింపు...

"శ్రీ కృష్ణ మహా భారతం - 45"

పాండు కుమారులు పాంచాల దేశం నుండి హస్తీనాకు బయలు దేరి వెళ్తుండగా...

మార్గమధ్యలో వాళ్ళకి దుర్యోధనుడు అతడి సోదరులు ఎదురవుతారు.

దుర్యోధనుడు తనతో ద్వంద యుద్ధం చేయవలసిందిగా కోరుతాడు.

ఎందుకంటే, ఇప్పుడు కనుక ఇరువురు హస్తిన పురికి చేరితే, ద్రుపదుడను ఓడించింది పాండు కుమారులే కాబట్టి వాళ్ళకే పట్టాభిషేకం జరుగుతుంది, తాను ఇంకెప్పటికి రాజుని కాలేడు అనే దురాశ, భయం, అభద్రతా భావం దుర్యోధనుడిలో...

అదే వీళ్ళని ఇక్కడే యుద్ధం చేసి, అంతం చేస్తే ఇక తనకు తిరుగు ఉండదనే నమ్మకం. అతని నూరుగురు సోదరులు ఈ పాండు కుమారులను ఎలాగైనా ఓడిస్తారనే అతి విశ్వాసం.

ఇక భీముడు, అర్జునుడు నకుల సహదేవులు కూడా దుర్యోధనుడి ఆహ్వానానికి సై అంటారు.

కానీ, యుధిష్ఠిరుడు దానికి అడ్డుపడతాడు.

"సోదరా దుర్యోధనా...!

మేము మీతొ యుద్ధం చేయడానికి సిద్దంగా లేము. ఒకవేళ మన ఇరువురి మధ్య యుద్దమే కనుక జరిగితే, అది మన హస్తినకు అప్రతిష్టను తెచ్చి పెడుతుంది.

ఎలాగైతే రెండు కట్టెలు యుద్ధం చేసినప్పుడు నిప్పు చెలరేగి, రెండు కట్టెలు పూర్తిగా దగ్ధమవుతాయో అలా..!" అని యుధిష్ఠిరుడు నచ్చ చెప్తుంటే,

"ఇప్పుడు నీ ప్రవచనాలు నాకు అవసరం లేదు. కేవలం నాకు కావల్సింది పరిణామం మాత్రమే...

యుద్ధం చేస్తావా ?

లేక రాజ్యాధికారాన్ని నాకు అప్పగిస్తావా ?" అంటూ దుర్యోధనుడు చాలా స్వార్థంతో మాట్లాడతాడు.

అప్పుడే అర్జునుడు...

"బ్రాతా ...

మీరు ఏదైనా భీష్మ ప్రతిజ్ఞ చేసే ముందు, ఒకసారి మన పితృ దేవుల కోరికను కూడా గుర్తుపెట్టుకోండి. స్వర్గంలో ఉన్న ఆయన్ను బాధ పెట్టడం మంచిది." అంటూ ఎక్కడ యుధిష్ఠిరుడు తన మంచితనంతో దుర్యోధనుడికి రాజ్యం అప్పగిస్తానని వాగ్దానం చేస్తాడోనని, తాను ప్రతిజ్ఞ చేసేముందు సూచనలు ఇస్తాడు.

"నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏ నిర్ణయం అయితే హస్తినా పుర మహారాజు తీసుకుంటారో...?

దానికి సదా మేము కట్టుబడి ఉంటాము." అని యుధిష్ఠిరుడు ప్రతిజ్ఞ చేస్తాడు.

కౌర కుమారుల మొహంలో ఆనందం, మిగిలిన పాండు సోదరుల మొహాల్లో విచారం వ్యక్తమవుతుంది ఆ మాటతో...

ఎందుకంటే, మనకు తెలుసు హస్తిన మహారాజు దృతరాష్ట్రడు దుర్యోధనుడి పక్షపాతి అని.

ఇక, దుర్యోధనుడు...

"నీకు తెలియనిది కాదు, మా పితృ దేవులు, హస్తిన పుర మహారాజు దృతరాష్ట్రల వారు అతని పుత్రుడైన నన్ను మాత్రమే హస్తిన పురికి రాజును చెయ్యాలని ఆకాక్షించారు. ఇక నా పట్టాభిషేకం అనివార్యం" అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు.

ఇక ఇటు హస్తినలో...

ధృతరాష్ట్రడు తన ఏకాంత మందిరంలో దుర్యోధనుడు పరాజయానికి చింతిస్తూ... మదన పడుతూ ఉంటాడు.

సరిగా అప్పుడే గాంధారి అతని మందిరానికి వచ్చి,

"మహారాజా..!

రేపు మన రాకుమారులు పాంచాల దేశం నుండి విజయంతో తిరిగి వస్తున్నారు. వాళ్ళకి స్వాగతం పలకడానికి ఉత్సవాలను ఘనంగా ఏర్పాటు చెయ్యాలి." అని అంటుంది.

దానికి దృతరాష్ట్రడు...

"ఏ ఉత్సవాలు గాంధారి..!

ఉత్సవాలు విజయానికి జరుగుతాయి గాంధారి, పరాజయానికి కాదు. నేను మాకు పరాజయం జరిగింది గాంధారి.

పరాజయం..!" అని దుర్యోధనుడు ఓడిపోయిన బాధతో అంటాడు.

"మన రాకుమారులు విజయంతోనే తిరిగి వస్తున్నారు కదా మహారాజా..!

ఎంతైనా ప్రజలు ఉత్సవ ప్రియులు వారి కోసమైనా..!" అని గాంధారి అంటుండగా

"ఎలా గాంధారి..!

ఒక పక్క ఉత్సవాలతో వాద్య పరికరాలు మ్రోగుతుంటే, అసలే ఓటమి బాధలో ఉన్న దుర్యోధనుడు వాటిని విని తట్టుకోగలడా ?

పాండు కుమారులకు ప్రజలు జేజేలు పలుకుంతుంటే, అతడి మానసిక స్థితి ఏమవుతుందో ఊహించగలవా ?

పాపం నా ప్రియ పుత్రుడు దుర్యోధనుడు ఈ రాజ్య అధికారం పై, ఈ రాజ్య సింహాసనం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు అతడి అశలు అడియాశలు అయ్యాయి. వాటికి ఎలా సమాధానం చెప్పమంటావ్ గాంధారి..!" అంటూ దృతరాష్ట్రడు చింతిస్తాడు.

"దర్పణం మన మొహాన్ని ప్రతిభింబించినపుడు, అది అంధ వికారంగా కనిపిస్తే, ఆ దోషం దర్పణానిధి కాదు.

అలాగే ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మీరైనా, నేనైనా కట్టుబడి ఉండాలి మహారాజా..!

ఇక్కడ మనం ఒప్పుకోవాల్సిన ఇంకో నిజమైన విషయం ఏంటంటే, ఈ రాజ్య సింహాసనానికి అన్ని విధాలా అర్హుడు యుధిష్ఠిరుడు మాత్రమే..!" అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది గాంధారి.

దానికి బదులుగా దృతరాష్ట్రడు

"యువరాజు కావాలన్న తన స్వప్నాన్ని దుర్యోధనుడు ఏ విధంగా వదులుకుంటాడు.?

యుధిష్ఠిరుడు ఎదుట ఏ విధంగా తన మస్తకాన్ని వంచుతాడు ?" అంటూ గాందారితో అంటూ తనలో తానే మధన పడతాడు.

                       ************

పాంచాల దేశంలో ద్రుపదుడు తనకి కలిగిన ఓటమికి , జరిగిన అవమానానికి విపరీతంగా బాధపడుతూ, కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

అప్పుడే అక్కడికి శిఖండి వస్తుంది. ఆమెను చూస్తూ...

ఎన్నో ఏళ్లుగా కాపాడుకున్న సామ్రాజ్యం ఈ రోజు సర్వ నాశనం అయ్యింది. మన పూర్వీకుల కూడా గట్టిన ఈ రాజ్యం పతనమైనది. ఎన్నో ఏళ్లుగా పెరిగి మహా వృక్షాలుగా ఎదిగిన ఒక అడవి ఎలా అయితే అగ్నికి ఆహుతి అవుతుందో అలా..!" అంటూ భీకరంగా అరుస్తాడు.

దానికి శిఖండి...

"పిత్రువర్యా...!

అగ్నికి ఆహుతి అయిన అడవి కూడా మళ్ళీ చిగురిస్తుంది.

అలాగే ఇప్పుడు పతనమైంది అనుకుంటున్న మన రాజ్యం కూడా మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుంది. నమ్మండి పిత్రుదేవా..!" అని అంటుంటే,

"ఆ పూర్వ వైభవం నువ్వు తీసుకొస్తావా...!

నువ్వొక స్త్రీ వి, అబలవి. నువ్వు వారితో యుద్ధం చేయగలవా..!

హమ్...

అర్జునుడు పరాక్రమం చూడలేదు నువ్వు...!

అతడి ధనుర్భాణ విద్యను చూస్తుంటే, సాక్షాత్తు ఇంద్రుడే వచ్చి యుద్ధం చేసినట్టు అనిపించింది. అతడి ముందు నువ్వు నిలవగలవా..!

అయినా మొదటి యుద్ధంలో ఓడిపోయిన ఒక నిస్సహాయారాలువి నువ్వు..!

ఇవన్నీ నీకేం తెలుస్తాయి.

నువ్వు నాకు హిత బోధ చేస్తున్నావా..!" అంటూ అసలే ఓటమి బాధలో ఉన్న ద్రుపదుడు తన ఓటమికి పుత్రిక శిఖండే కారణం అన్నట్టు ఆమెను దూశిస్తాడు.

"పిత్రువార్యా..!

నాకు ఆ భీష్ముడిని వధించే వరకూ చావు లేదు. ఆ విషయం మీకూ తెలుసు..!" అని శిఖండి అంటుంటే,

"ఆ ఒట్టి మాటలు కట్టి పెట్టు. అసలు నీకు ఆ పరమ శివుడు అనుగ్రహం నిజంగానే లభించిందా. ఇదంతా నాకు నమ్మశక్యంగా లేదు. అది కూడా ఈ రోజు నీ ఓటమిని చూసిన తర్వాత..

నాకు పుత్రుడు లేని లోటు ఉందన్న విషయం ఈ పరాభవంతో తెలిసి వచ్చింది. నాకు పుత్రుడు జన్మించనంత వరకూ నేను సంతాన రహితుడనే.

నాకు ఎలాంటి పుత్రుడు కావాలంటే, ద్రోణుడి శిరస్సుని ఖండించేవాడు. హస్తిన పుర సింహాసనం పై కూర్చునే వాడు. అలాంటి ఒక ఉత్తముడైన పుత్రుడు జన్మించేవరకూ...

నేను సంతాన రహితుడనే." అంటూ కోపంగా చూట్టుపక్కల ఉన్న వస్తువులను ద్వంసం చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

ఆ మాటలకు శిఖండికి చాలా బాధ కలుగుతుంది.

                        **********

పాండుకుమారులు, కౌర కుమారులు హాస్తినాకు చేరుకుంటారు.

దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఆ రోజు రాత్రి తన తండ్రి దృతరాష్ట్రుని కలిసి, దుర్యోధనునినే రాజుగా ప్రకటించాలని కోరతారు.

కానీ, దానికి దృతరాష్ట్రడు...

"ఏ విధంగా అలా చేయమంటావ్ పుత్రా...!

ఏదైనా ఒక్క కారణం చెప్పు , పాండు కుమారులు యోగ్యత లేనివారు, వారికంటే నువ్వు యోగ్యత కలవాడవని,

లేదా కనీసం ఒక్క కారణమని చెప్పు ద్రోణుడు, ద్రుపదుడు నిన్ను వంచించి నీ పై గెలిచారు అని" అని దృతరాష్ట్రడు అంటాడు.

దానికి దుర్యోధనుడు...

"సూర్యుడు ఉదయించినపుడు ఏ విధంగా అయితే చంద్రుడు, నక్షత్రాలు మయమవుతాయో...?

అదే విధంగా మీరు మహారాజు స్థానంలో ఉండగా మీ నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారం ఎవరికీ ఉంటుంది." అని దుర్యోధనుడు అంటాడు.

దానికి దృతరాష్ట్రడు..

"రాజు ఎన్నటికీ స్వతంత్రుడే, కానీ స్వచ్ఛందుడు కాలేడు పుత్రా..!

పాండు కుమారులు యోగ్యత లేని వారు అని నువ్వే నిరూపించలేనప్పుడు ఇక రాజ్య ప్రజలను నేనలా ఒప్పించగలను పుత్రా ..!" అని బదులు ఇస్తాడు.

"అంటే, తమరిప్పుడు యుధిష్ఠిరుడును యువరాజుని చెయ్యాలి అనుకుంటున్నారా పితృ దేవా..!

నేను మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాను.

రేపు కనుక మీరు పాండు పుత్రులను రాజుగా ప్రకటిస్తే, నేను విద్రోహం చేస్తాను" అంటూ దుర్యోధనుడు దృతరాష్ట్రడను బెదిరిస్తాడు.

(విధ్రోహం అంటే, స్వయంగా తన రాజ్యంపై యుద్దానికి పూనుకోవడం)

"విద్రోహం చెయ్యొద్దు పుత్రా...!

నువ్వు అలా చేయడానికి వీల్లేదు." అని దృతరాష్ట్రడు కంగారు పడతాడు.

"అలా చేస్తే, మీరే స్వయంగా నా మీదకి సైన్యాన్ని పంపిస్తారు. అది మీకు సమ్మతమేనా పితృ దేవా...!" అని దుర్యోధనుడు

"స్వయంగా తమ కుమారుల పైకి తమరే సైన్యాన్ని పంపిస్తారా పితృ వర్యా..!" అంటూ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దుస్సాసునుడు ఇంకోవైపు దృతరాష్ట్రడుని బెదిరిస్తాడు.

ధృతరాష్ట్రడు కి ఒకవైపు పుత్ర ప్రేమ, మరొక వైపు రాజ్య భారంతో ఇరకాటంలో పడతాడు.

వాళ్ళిద్దరినీ దగ్గరకి తీసుకుని,

"బొగ్గు కూడా అగ్ని నుండే జనిస్తుంది. కానీ, అదే బొగ్గును అగ్నిలో వేస్తే బూడిద అవుతుంది." అని చెప్తుంటే,

రాజ్య మందిరం వెలుపల నుండి,

"పాండు కుమారులకు జయము, జయము..!

పాండు కుమారులకు జయము, జయము..!" అంటూ ప్రజలు చేస్తున్న కరతాళధ్వనులు వినిపిస్తాయి.

దాంతో అప్పటికే చిరాకులో ఉన్న దుర్యోధనుడు...

ఇంకాస్త సహనం కోల్పోయి..

"గుర్తు పెట్టుకోండి పిత్రుదేవా..!

రేపు కనుక మీరు యుధిష్ఠిరుడిను యువరాజు గా ప్రకటిస్తే, నేను ఈ హస్తిన పుర మాన, ప్రాణ ప్రతిష్టలకు భంగం కలిగిస్తాను" అని బెదిరించి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు.

"వద్దు దుర్యోధన...

వద్దు దుర్యోధన...

దుర్యోధన ఆగు...

దుర్యోధన ఆగు..." అంటూ దృతరాష్ట్రడు పిలుస్తున్నా అతని మాట లెక్క చేయకుండా వెళ్ళిపోతాడు దుర్యోధనుడు.

పాండు కుమారులు సాగర స్వాగతాల మధ్య రాజ్యానికి విచ్చేస్తారు.

భీష్ముడు, విదురుడు, గాంధారి, కుంతీ వారి వీరత్వానికి, పాంచల దేశంపై విజయం సాధించినందుకు విజయంతో పొంగిపోతూ ఉంటారు.

ఇక యుధిష్ఠిరుడు నేరుగా మహారాజు దృతరాష్ట్ర మహారాజు వద్దకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని,

"మహారాజా..!

మీ ఆశీర్వాదం తోనే నేను విజయం సాధించాము.

గురుదేవుల ద్రోణుల గురుదక్షిణ చెల్లించాము." అని చెప్తాడు.

దానికి దృతరాష్ట్రడు

"కళ్యాణ మస్తు..!" అని దీవించి

"మీ గురు దక్షిణ పట్ల ధ్రొణులు వారు చాలా సంతోషించి వుంటారే..!" అంటూ కొంచెం దెప్పి పొడుపు గా అంటుంటే,

అక్కడున్న వారందరికీ రాజు మాటల్లో ఇంకేదో ఆంతర్యం దాగి ఉన్నట్టు ఆశ్చర్యంగా చూస్తారు.

ఇక యుధిష్ఠిరుడు గాంధారి ఆశీర్వాదం తీసుకుంటుంటే,

ఆమె మాత్రం నిష్పక్షపతంగా వ్యవరిస్తూ...

"కళ్యాణ మస్తూ...!

స్పర్ధ గెలిచినందుకు చాలా సంతోషం..!" అంటూ వాళ్ళని అభినందిస్తుంది. అది నచ్చని దృతరాష్ట్రడు అక్కడి నుండి కోపంగా వెనుదిరిగి వెళ్ళిపోతాడు.

"స్పర్ధ అంటే, పట్టాభిషేకానికి పెట్టిన పోటీ అని అర్థం)

ఇక అక్కడున్న వారిలో యుధిష్ఠిరనుని రాజుని చెయ్యాలనే ఆలోచన రాజుకి ఏ మాత్రం లేదనే అభిప్రాయం వారందరిలో బలపడుతుంది.

మరి దృతరాష్ట్రడు నుండి సభలో తీసుకునే నిర్ణయం ఏమిటి ?

అతడు వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే, అతడికి అడ్డు చెప్పేవారు ఉండరా..?

ఒకవేళ పాండవులకు సానుకూల నిర్ణయం తీసుకుంటే దుర్యోధనుడు అన్నంత పని చేస్తాడా..?

లాంటి విషయాలన్నీ తర్వాతి భాగాలలో తెలుసుకుందాం.

"శ్రీ కృష్ణ మహా భారతం" కొనసాగబోతుంది.

తర్వాతి భాగం "శ్రీ కృష్ణ మహా భారతం - 45"

అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.

అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Abstract