Shaik Sameera

Thriller


4  

Shaik Sameera

Thriller


ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

5 mins 301 5 mins 301

             ఎపిసోడ్-29

రిథిమా-మీనుండి అయితే నేను ఇది ఆశించడం లేదు ఒక ఫీజియోథెరపిస్ట్ లేదా మీ భార్యలో తేడాని చూస్తారని .నా మనసులో కూడా ఒక ప్రశ్న ఉంది నేను MRS.వంశ్ రాయ్ సింఘానియాగా మన ఇంట్లో స్వేచ్ఛగా తిరగకూడదా

వంశ్-నవ్వుతూ ఇంటరెస్టింగ్.ఈరోజు భార్య అనే ఫీలింగ్ కలుగుతుందా నీ మనసులో.ఉఫ్ రిథిమా మన పెళ్ళిలో అగ్నిగుండంలో ఎవరి తెలివి,ఎవరి పొగరు కాల్చేసావు అని ముందుకి రిథిమా దగ్గరికి రాబోతే తను ఆపేస్తుంది తన చేయి అడ్డుపెట్టి.

రిథిమా-తప్పకుండా నేను మీ భార్యనే కానీ మీరు కోరుకునే విధంగా కాదు.ఎవరు అయితే మిమ్మలన్నీ చిన్నప్పటి నుండి తన ఒడిలో ఆడించారో అలాంటి ఆమెతో అలా behave చేయడంతో క్యూరియస్ అయ్యాను ఇక్కడ అంతలా ఏముంది మీరు దాచడానికి అంతలా ట్రై చేస్తున్నారు ఎవరికీ కనిపించకుండా అందుకే చూడటానికి వచ్చేసాను.నేను మళ్ళీ చెబుతున్న మీ భార్యలా నాకు ఆ మాత్రం తెలుసుకునే హక్కు లేదా .

వంశ్-you are right.భార్య లేదా సర్వెంట్ లో తేడా ఉంటుంది కదా.భార్యలాగా తెలుసుకోవడానికి ప్రయతించావు కాబట్టి క్షమిస్తున్నాను కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో రిథిమా ఇక ముందు ఎటువంటి తప్పుకి బంధాలు కూడా అడ్డురావు.Beter to Credited in your mind MRS.VR.

రిథిమా చాలా భయపడుతుంది.రిథిమా వాష్ రూమ్లో ఫేస్ వాష్ చేసుకుంటూ VR పేరు ఉన్న రింగ్ పెట్టుకున్న STATUE ఎవరిదీ అయ్యిఉంటుంది అని ఆలోచిస్తూ బయటికి వచ్చేసరికి డిసోజా వస్తుంది తన కోసం లంచ్ తీసుకొని.డిసోజాని చూసి బ్యాక్ యార్డులో ఉన్న statue ఎవరిది అని అడుగుతుంది దానికి డిసోజా చాలా కంగారు పడుతుంది.

డిసోజా-మీరు బ్యాక్ యార్డుకి వెళ్ళారా?ప్లీజ్ ఎవరికీ చెప్పొద్దు మీరు బ్యాక్ యార్డుకి వెళ్లినట్టు అలాగే దాని గురించి కూడా మాట్లాడొద్దు ఎందుకంటే పెద్ద అపశకునంలా భావిస్తారు.ఎవరు ఆ విగ్రహం గురించి కూడా మాట్లాడరు.

రిథిమా-ప్లీజ్ రిలాక్స్ అవ్వండి.నేను ఏం అడగాలి అనుకుంటున్నానో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.

డిసోజా-నో మీరు నా మాట వినండి ప్లీజ్ ఇంకోసారి ఈ తప్పు చేయొద్దు.ఈ తప్పు మళ్ళీ చేస్తే అని టెన్షన్ పడుతూ వెళ్ళిపోతుంది.

రిథిమా-ఏం అవుతుంది డిసోజా అని తన వెనకే వెళ్ళబోతుంది కానీ ఇషాని రిథిమాని కింద పడేలా చేస్తుంది.

ఇషాని-రిథిమాని చూసి ఇషాని ముసుగులోనే ఉండనివ్వు ముసుగు మాత్రం తీయకు ముసుగు తొలిగిపోతే ప్రాణంపోతుంది అని పాట పాడుతుంది.ఉఫ్ రిథిమా ఎంత క్యూరియస్ అవుతున్నావు బ్యాక్ యార్డ్ గురించి తెలుసుకోవడానికి నాతో చెబితే నేను అన్నయ్యతో చెప్పేదాన్ని కదా ఆ తరువాత oh my god ఆలోచిస్తూ ఉంటేనే వణుకు వచ్చేస్తుంది.ఇషాని నవ్వి నీతో కూడా అదే జరుగుతుంది తనతో పాటు ఏం జరిగిందో అదే.

రిథిమా-ఎవరు తను ఏం జరిగింది తనకి 

ఇషాని-24గంటల్లోనే నీ నిజమైన రూపం చూపించడం స్టార్ట్ చేసేసావా తిరిగి నాకే ఎదురు ప్రశ్నలు వేస్తున్నావు.Anyway doll నువ్వు ఎప్పుడైనా వంశ్ అన్నయ్యని అడిగావా తను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో?

రిథిమా-అంటే అర్థం ఏంటి

ఇషాని-రిథిమా వంశ్ అన్నయ్య ఇంటెన్సిటీ చూశావా ఎప్పుడైనా భగభగలాడే లావా ఉంది తనలో.లావా నుంచి ఎవరు తప్పించుకోలేరు.కాలిపోయి చావడం చాలా సులభం కానీ లావాలో కరిగిపోయి చావడంలో ఉండే బాదే వేరుగా ఉంటుంది అని ఆపిల్ లోకి కత్తి గుచ్చి నీకు ఈ ఆపిల్ లాగా అవ్వాలి అని ఉంటే ఆ statue history గురించి తప్పకుండా అడుగు iam sure వంశ్ అన్నయ్య నిన్ను కూడా హిస్టరీలా మార్చేస్తాడు చంపేస్తాడు అన్నట్టు చూపించి వెళ్ళిపోతుంది.

రిథిమా-అందరికి తెలుసు కానీ ఎవరు చెప్పాలి అనుకోవట్లేదు.అయిన ఏమై ఉంటుంది ఆ statue రహస్యం.అయిన ఇషాని నా వైపు చూస్తూ చచ్చిపోతాను అన్నట్టు ఎందుకు యాక్షన్ చేసింది

వంశ్ గార్డెన్లో బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటే రాజ్ చూస్తూ ఉంటాడు.

రాజ్-మళ్ళీ వదిన బ్యాక్ యార్డుకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అని రాజ్ మాటలు రిథిమా విని అక్కడే దాక్కొని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది.

వంశ్-రాజ్ చెబుతారు మొదటి తప్పుని క్షమించు రెండో తప్పుకి న్యాయం చేయమంటారు.రిథిమా అర్థం చేసుకోవాలి నా మాట వినకపోతే దాని ఫలితం ఎలా ఉంటుందో.రిథిమాకి ఎప్పటికి ఆ విగ్రహ రహస్యం తెలియకూడదు అని బాల్ బౌన్స్ చేస్తూ ఉంటాడు.ఆ విగ్రహరహస్యం ఎవరైనా తెలుసుకోవడానికి ప్రయతించినా వాళ్ళతో ఇది జరుగుతుంది అని బాల్ ఫోర్స్ గా గోడకేసి కొట్టి వెళ్ళిపోతాడు.

రిథిమా-అంతలా ఏముంది ఆ విగ్రహం వెనక రహస్యం ఇంట్లో ప్రతి ఒక్కరు దాన్ని దాచిపెట్టాలని చూస్తున్నారు.షీరని అయితే దక్కించుకోలేకపోయాను వంశ్ కానీ ఆ విగ్రహరహస్యం తెలుసుకొని తీరుతాను.రిథిమా ప్రొద్దున్నే కళ్ళు తెరిచి చూడగానే బెడ్ మీద వంశ్ ఉండటం చూసి నువ్వా ఇక్కడ ఏo చేస్తున్నావు.

వంశ్-గుడ్ మార్నింగ్ MRS వంశ్ రాయ్ సింఘానియా.రిథిమా వంశ్ ముందుకు రాబోతుంటే భయపడి వెనక్కి వెళ్తూ బెడ్ మీద నుంచి పడబోతే తన డ్రెస్ పట్టుకొని ఆపుతాడు.రిలాక్స్ స్వీట్ హార్ట్ ఎందుకు ఇంతలా భయపడుతున్నావు happily married భార్యాభర్తలం మనం.నువ్వు ఒక్కదానివే ఒంటరిగా భార్యవి కాలేవు కదా.భార్య అనే హక్కుతో రిమోట్ కంట్రోల్ లేని ఒక డ్రోన్ లాగా అటు ఇటు తిరుగుతూ ఉంటావు కదా.భర్తఅనే హక్కుతో నన్ను కూడా నీ బెడ్ మీద పడుకోనివ్వాలి కదా అనగానే రిథిమా సోఫా వైపు చూస్తుంది అక్కడ పిల్లో,బేడీషీట్ ఉండటం చూస్తుంది.

రిథిమా-కోపంగా జోక్స్ లిమిట్ లో ఉండి వేస్తే భరించవచ్చు.నాకు ఇలాంటి జోక్స్ నచ్చవు.

వంశ్-మరి గిఫ్ట్స్.గిఫ్ట్స్ అయితే ప్రతి అమ్మాయికి నచ్చుతాయి కదా అని బెడ్ నుంచి కిందకి దిగి రిథిమా దగ్గరికి వస్తాడు.తన చేయి పట్టుకొని తన వేలికి VR సింబల్ ఉన్న రింగ్ statue వేలికి ఉన్నట్టుగానే రిథిమా వేలికి తొడుగుతాడు.నచ్చిందా నీకు అని అడుగుతాడు.ఈ రింగ్ చాలా స్పెషల్ నాకు ఈ రింగ్ ఎవరి వేలికి ఉందో వాళ్ళు కూడా నాకు అంతే స్పెషల్ నా జీవితంలో.అలాగే నువ్వు నాకు చాలా స్పెషల్ రిథిమా.I hope నువ్వు ఈ గిఫ్టుకి రెస్పెక్ట్ ఇస్తావు అనుకుంటాను అని వెళ్ళిపోతాడు.

రిథిమా-వంశ్ ఈ రింగ్ నాకెందుకు ఇచ్చాడు ఏం కోరుకుంటున్నాడు తను. నన్ను స్పెషల్ అని ఎందుకు అన్నాడు తన మనసులో ఏం ఆలోచిస్తున్నాడు.యే రింగ్ అయితే తన దగ్గరి వాళ్ళకి ఇస్తాడో అది నాకెందుకు ఇచ్చాడు.ఇదే రింగ్ ఆ statue వేలికి ఉండటం చూసాను ఏం అర్థం కావటం లేదు.కబీర్ తన వేలికి రింగ్ తొడగటం గుర్తొచ్చి కబీర్ ఈ వేలిలో నీ రింగ్ ఉండాలిసింది వంశ్ రాయ్ సింఘానియా ఎంత నాకు దగ్గరికి వస్తున్నాడో అంతే అసహ్యం పెరుగుతుంది నాలో.ఈ రింగ్ ఆ రహస్యం వరకు నన్ను చేరుస్తుంది.ఈ రింగ్ వంశ్ గతంతో ముడిపడి ఉంది తప్పకుండా తెలుసుకుంటాను.

రిథిమా సియా చేత స్ట్రెచింగ్ చేపిస్తూ ఆ statue రహస్యం సియాకి కూడా తెలిసే ఉంటుంది ఎలా అడగాలి తనని అని ఆలోచిస్తూ స్ట్రెచ్ చేపిస్తూ తన రింగ్ సియా చూసేలా చేస్తుంది.

సియా-ఆ రింగ్ చూసి సియా షాక్ అయ్యి వదిన ఈ రింగ్ మీకు ఎక్కడిది?

రిథిమా-ఈ రింగ్ మీ అన్నయ్య నాకు ఈరోజు ప్రొద్దునే గిఫ్టుగా ఇచ్చారు.

సియా-అన్నయ్య ఇచ్చాడా.మరి ఇది అయితే 

రిథిమా-బ్యాక్ యార్డులో ఉన్న statue వేలికి కూడా ఇదే రింగ్ ఉంది కదా అదే కదా చెప్పాలనుకున్నది నువ్వు.

సియా-ఆ statue గురించి మీకు తెలుసా ?

రిథిమా-ఇప్పుడు నీకు ఏది అయితే చెప్పానో అంత వరకు మాత్రమే తెలుసు.నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఆ statue వెనక ఉన్న నిజం ఏంటి అని.మీ వదినతో అయితే ఏది దాచిపెట్టావు కదా నువ్వు.

సియా-లేదు వదిన నాకేం తెలియదు.

రిథిమా-నీ కళ్ళు చెబుతున్నాయి నీకు అంత తెలుసు అని.ప్లీజ్ సియా చెప్పు నువ్వు చెప్పడంతోనే ఫీజియోథెరపిస్టుగా ఈ ఇంటికి వచ్చాను నేను ఈరోజు మీ వదినని కనీసం నువ్వు అయిన నన్ను బయటి వ్యక్తిలాగా నన్ను చూడకు.నేను నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఆ విగ్రహం వెనక యే రహస్యం ఉందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను ప్లీజ్ చెప్పు సియా అని బ్రతిమాలుతుంది.నేను కూడా ఈ ఫ్యామిలీలో ఒక భాగమే కదా ఇప్పుడు ప్లీజ్.

సియా-వదిన అది 

రిథిమా-హా సియా చెప్పు 

సియా చెప్పేలోపు అనుప్రియ వచ్చి సియా నువ్వు చిన్నపిల్లవి కాదు ఎవరికీ ఏం చెప్పాలో తెలియదా అని అరుస్తుంది.రిథిమా నువ్వు కోడలివి కోడలిలాగానే ఉండు గూఢచారిలాగా ఇన్వెస్టిగేట్ చేయడం ఆపేయి ప్రతి ఇంటికి ఒక గతం ఉంటుంది అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఆ గతo గురించి తెలియాలి అనే రూల్ లేదు అనగానే రిథిమా లేదు అత్తయ్య మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు.అందుకు అనుప్రియ కేవలం నీకు మాత్రమే చూడటం వచ్చు అనుకోవద్దు రిథిమా.నేను నిన్ను గమనిస్తూనే ఉన్న నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఏదో వెతుకుతున్నావు.ఎక్కడికి వెళ్లకూడదో అక్కడికి వెళ్ళిపోతున్నావు.ఈ ఇంట్లో కోడలు కాదు గూఢచారి అడుగు పెట్టినట్టు ఉంది అనగానే రిథిమా అదేం లేదు అత్తయ్య నేను నిజం చెబుతున్న నాకు తెలియదు మీకు ఎందుకు ఇలా అనిపిస్తుందో అంటుంది.అందుకు అనుప్రియ చూశావు కదా డిసోజాని పర్మిషన్ లేకుండా బ్యాక్ యార్డుకి వెళ్లినందుకు శిక్ష పడబోయింది అది తెలిసి కూడా నువ్వు గూఢచర్యం చేయడానికి నువ్వు బ్యాక్ యార్డుకి వెళ్ళావు.అందరిని statue గురించి అడుగుతున్నావు అస్సలు నీకేం కావాలి.నువ్వు ఏం కోరుకుంటున్నావ్ నీకేమనిపిస్తుంది మేమందరం ఏమైనా మూర్ఖులమా నువ్వు చేసే పనులు మాకు అర్థం కావు అనుకుంటున్నావా.స్మశానంలో మట్టి తవ్వితే నీకు ఖజానా దొరకదు కేవలం బూడిద మాత్రమే దొరుకుతుంది అంటుంది.Rate this content
Log in

More telugu story from Shaik Sameera

Similar telugu story from Thriller