అం“తరం”
అం“తరం”
సుజాత, ఎవరోచ్చారో చూడు….
వంట చేస్తున్న సుజాత పరిగెత్తుకుంటూ వచ్చింది…
రేఖ నువ్వా…రండి రండి…ఎన్ని రోజులు అయ్యింది మనం కలిసి….
రేఖ, తన భర్త భరత్, కొడుకు శ్రీరామ్ తో కలిసి వచ్చింది…
ఏమండీ మీకు తెలుసా..చినప్పుడు రేఖ ఎంత అల్లరి చేసేదో…అంటూ సుజాత లొడలొడ మాట్లాడుతూనే ఉంది…
వాళ్ళని కూర్చొనిస్తావ లేదా..వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు…అన్నాడు మురళి…
అయ్యో నా మతి మండ…కూర్చోండి…ఇప్పుడే వస్తా అని చెప్పి లోపలకి వెళ్ళింది సుజాత…
సన్నీ, చూడు మన ఇంటికి చుట్టాలు వచ్చారు…బయటకి రా…అని మురళి పిలిచాడు…ఎంత సేపటికీ బయటకి రాక పోయేసరికి మురళి లేచి ఒక స్విచ్ ఆఫ్ చేస్తాడు…ఇంతలో చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకొని హల్లోకి వస్తాడు…
అదిగో అన్నయ్య వచ్చాడు వెళ్లి ఆడుకో శ్రీ అని భరత్ చెప్తాడు…పిల్లలిద్దరూ కలిసి సన్నీ రూంలోకి వెళ్తారు…వెంటనే మురళి ఆఫ్ చేసిన స్విచ్ ఆన్ చేస్తాడు…ఏంటి మీ ఇంట్లో లోకూడా ఇదే తంతా.. మా ఇంట్లో కూడా అంతే.. వైఫై ఆఫ్ చేస్తే తప్ప.. పిల్లవాడు మొబైల్ పక్కన పెట్టడు అనింది రేఖ.. ఇంతలో అక్కా ఏం చేస్తున్నావ్…అంటూ లోపలకి వెళ్ళింది…ఆ రేఖ నీకు చెప్పడం మర్చిపోయా..సాయత్రం మా నాన్న గారు వస్తున్నారు అనింది సుజాత…
ఎంటి పెదనాన్న వస్తున్నాడ…తప్పకుండా కలవాలి…
మురళి ఇంక భరత్ హాల్ లో కూర్చొని మాట్లాడుతున్నారు…
ప్రపంచం చాల చిన్నది….ఎప్పుడు ఎక్కడ ఎవరు తారసపడతారో చెప్పలేము అని మురళి అనగానే.. అవును అండి…ఎప్పుడో చిన్నప్పుడు పక్క పక్క ఇంట్లో ఉండే వీళ్ళు ఇలా ఇక్కడ కలుస్తారు అని వాళ్ళు కూడా ఊహించి ఉండరు..అని భరత్ సమాధానం చెప్తాడు…
మీ అన్నా తమ్ముళ్లు ఇవి తింటూ మాట్లడుకోండి అని సుజాత వాళ్ళ ముందు కొన్ని స్నాక్స్ పెడుతుంది…
అవును మరిది గారు…ఎలా ఉంది మా చెల్లి ఇంకా చిన్నప్పటి లాగానే అల్లరి చేస్తుందా…అని సుజాత అడగగానే…ముసి ముసి నవ్వులు నవ్వుతాడు భరత్….
అదేంటి అలా నవ్వుతారు…చెప్పొచ్చూకద.. అలా ఏమి లేదు అని…చిన్నగా గిల్లుతుంది రేఖ…
అది చూసి అక్కడ ఉన్న అందరూ నవ్వుతారు…నువ్వు ఏమి మారలేదు రేఖ…అని సుజాత లోపలకి వెళ్తుంది…
మురళి ఇంకా భరత్…సిగిరెట్ తాగడానికి బాల్కనీ లోకి వెళ్తారు…వాళ్ళ వాళ్ళ వృత్తుల గురించి మాట్లాడుకుంటారు…
ఎలా ఉంది మీ ప్రొఫెసర్ జాబ్…చాల మంది పిల్లల్ని హ్యాండిల్ చేయటం కష్టం అనుకుంటా అని భరత్ అనగానే…మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగ కాదు కదా మా ఉద్యోగం.. ఒక చోట కూర్చోలేము…కాలేజీలో ఎంత మంది పిల్లలని అయినా హ్యాండిల్ చేయొచ్చు..కానీ ఇంట్లో వాళ్ళని హ్యాండిల్ చేయటేమే చాల కష్టం..అని మురళి అనగానే…
వింటున్నా వింటున్నా…మీరు మాట్లాడేది అన్ని వింటున్నా…వీళ్ళు వెళ్ళిపోనివ్వండి మీ పని చెప్తా..అంటూ సుజాత రుస రూస గా మాట్లాడింది…
ఐతే వీళ్ళు ఇక్కడే ఉంటారులే అని కన్ను కొడతాడు మురళి…మీకోసం ఏదైనా సరే అన్నయ్య అని భరత్ అంటాడు…
ఐతే మీరు మీరు ఒక్కటయ్యారన్నమాట…చూసుకుందాం మీరో మేమో….ముందైతే భోజనానికి రండి…అని సుజాత పిలుస్తుంది…
అక్కా…మావాడు నేను తినిపిస్తే కానీ తినడు…నువ్వు తినేసేయి నేను వాడికి తినిపించేసాక తింటా…అని రేఖ అనగానే…ఐతే నువ్వు మా బాపతే నా…మా వాడు అంతే…సరే పద… డైనింగ్ టేబుల్ పైన అన్ని సర్దేసి మీరే వడ్డించుకోండి అని చెప్పి …సుజాత ఇంకా రేఖ పిల్లలకి తినిపించటానికి లోపలకి వెళ్తారు…
ఏంటో ఇప్పటి పిల్లలు…చేతిలో మొబైల్ లేకపోతే ముద్ద కూడా తినరు…మన చిన్నప్పుడే నయం…అవునక్కా…మూడో తరగతికి వచ్చాడు అయినా నేను తినిపించాలి అంటే ఎలా అక్కా…
మీ వాడు మూడో తరగతి…మరి మా వాడు ఆరో తరగతి…నేను ఎవ్వరికీ చెప్పుకోవాలి అని నిట్టురుస్తుంది సుజాత…ఎవడు కనిపెట్టాడో ఈ మొబైల్ నీ…వాడ్ని గొంతు పిసికి చంపాలి..
అయినా మనం మొబైల్ని తిట్టుకుంటున్నం కానీ దాని వల్లే కదా ఇన్నీ సంవత్సరాల తరువాత కలుసుకోగలిగాం…ఔను అక్కా…ఆ సంగతే మర్చిపోయా…
కానీ ఇప్పటికీ వింతగా ఉంది కదా మనం “వదిలిస్ధాం రా” లో కలవడం…ఔను అక్కా. వేరే ఏవైనా మాన్పించడానికి ప్రయత్నాలు చేశారా…అని రేఖ అడగగానే…జరిగింది చెప్తుంది…సుజాత..
వీడు పొద్దస్తమానం మొబైల్ చూస్తున్నాడు ..చిన్న వయసులోనే కళ్ళజోడు వచ్చేసింది…మొబైల్ ఉంటే కానీ అన్నం తినడు ….ఇలానే వదిలేస్తే ఇంకా ఎన్ని సమస్యలు వస్తాయో అని మాకు చాల భయం వేసింది…
ఒకరోజు వాళ్ళ క్లాస్ టీచర్ ని వీడిని మందలించమని చెప్తే …ఆమె కూడా తన బాధ మాతో చెప్పి వాపోయింది వాళ్ళ పిల్ల వాడు కూడా అంతే అంట…మేము ఒక్కరమే ఈ సమస్యతో బాదపడుతున్నాం అనుకున్నాను…ఆ టీచర్ చెప్పేది విన్నాక…రోజు ఎవరో ఒక పేరెంట్ వచ్చి కంప్లయింట్ చేస్తున్నారట..అని తెలిసి ఆశ్చర్యపోయాం…
అది విన్నాక పగలబడి నవ్వింది రేఖ…ఔను అక్కా…శ్రీ వాళ్ళ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ కోసమని వెళ్ళినప్పుడు…అక్కడ అందరూ దీనిగురించి మాట్లాడుకుంటున్నారు…
అక్కా నీకొక విషయం చెప్పనా..గూగుల్ లో వెతికి మంచి రేటింగ్ ఉన్న చైల్డ్ సైకాలజిస్ట్ దెగ్గరికి వెళ్ళాం…ఇల్లు క్లినిక్ అంత ఒకటే చోట ..అక్కడకి వెళ్ళాక ఆయనకి జరిగిందంతా చెప్పా…అన్ని విని..ఓసిని అంతేనా.. నేను చూసుకుంటా అని శ్రీ కీ కౌన్సెలింగ్ ఇస్తూ ..మొబైల్ ఫోన్ ఎక్కువ వాడకూడదు..అని చెప్తున్నారు.. అయన చెప్పేది విని హమయ్య మా సమస్యకి పరిష్కారం దొరికింది అని సంతోష పడే లోపలే …
“నాన్న నీ మొబైల్ లో ఈ గేమ్ రావట్లేదు చూడు” అని ఆ డాక్టర్ గారి పాప అక్కడికి ఏడ్చుకుంటూ వచ్చింది…
నీకు ఎన్ని సార్లు చెప్పాలి నేను బిజీగా ఉన్నప్పుడు ఇక్కడికి రావొద్దు అని…ఇంతలో ఆ డాక్టర్ గారి భార్య కూడా వచ్చి..చూడండి ఆ గేమ్ రావట్లేదంటా….అన్నం తినట్లేదు…ఆ డాక్టర్ నీళ్ళు నమలడం మొదలు పెట్టాడు…
ప్రపంచంలో మనమే కాదు మన లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు…అని సుజాత పగలబడి నవ్వింది…
ఎంతసేపు పిల్లల గోలేనా మమ్మల్ని పట్టించుకునేది ఏమైనా ఉందా లేదా అని మురళి అరిచేసరికి ఖంగారుపడి పరిగెత్తుకుని వచ్చింది సుజాత…
ఏమైంది ఇప్పుడు…ఆ మాత్రం వడ్డించుకోలేర ఎంటి..అని చూసేసరికి…మురళి ఇంకా భరత్ లు తినేసి…డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి…సుజాత ఇంకా రేఖ ల కోసం అన్ని సిద్ధం చేశారు…అది చూసి ఆడవాళ్ళు ఇద్దరు షాక్ అయ్యారు…పోనీలే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారన్న మాట…
ఔను భరత్…ఇంతకీ మీ వాడిలో ఏమైనా మార్పు వచ్చిందా…ఇంకా లేదు అండి…వాడిలో మార్పు కోసమే ఎదురుచూస్తున్నాం…మరి మీ వాడు…మేము మొన్నే గా చేర్పించింది…చూడాలి…అయినా..వాటికి కూడా ఇలాంటివి ఉంటాయి అన్న సంగతి పేపర్లో యాడ్ చూసేదాకా తెలీదు…
ఔను బావగారు…మొదట్లో నేను అదే అనుకున్నా…కానీ ఇప్పుడు అదొక పెద్ద వ్యాపారం అయ్యింది…మేము ఒక రోజు బయటకి వెళ్తే….ఒక పెద్ద ప్రకటన చూసాము…
“ మీరు మీ పిల్లల ప్రవర్తనతో విసిగిపోయారా”
“మీ పిల్లలు మొబైల్ లేకుండా ఉండలేక పోతున్నారా”
“ అన్నం తినాలి అన్నా మొబైల్ చూసుకుంటూ తింటున్నారా”...
అయితే మేము మీకోసమే ఉన్నాం..
మీ పిల్లల్ని పట్టి పీడిస్తున్న పిశాచిని(మొబైల్) వదిలించడానికి మేము సిద్ధంగా ఉన్నాం…మీరు సిద్ధమేనా?
ఐతే వెంటనే కింద రాసి ఉన్న నంబర్లకు కాల్ చేసి మీ సీట్ రిజర్వెంచేసుకోండి…
ఇట్లు మీ
“వదిలిస్తాం రా”
యాజమాన్యం…
అది చూసినప్పట్నుంచి నేను మా వారి వెంట పడి మరీ తీసుకెళ్ళా…అని రేఖ చెప్తుండగా….నువ్వు ఆగు నేను చెప్తా ఇక్కడినుంచి అని భరత్ చెప్పడం మొదలు పెట్టాడు…
శనివారం రోజు ఫోన్ చేసి వివరాలు కనుక్కునా…వాళ్ళు మరుసటి రోజు ఉదయం 6 గంటలకల్లా రమ్మనారు…
ఆ ఏముంటుంది లె అని అలవాటు లేకపోయినా తెల్లవారు జాము 8.00 గంటలకి లేచి “వదిలిస్థాం రా” సెంటర్ కి వెళ్ళాం…
చూస్తే పెద్ద లైన్…ఆ లైన్ లో జనాలు కొట్టుకుంట్టు తన్నుకుంటూ ఉన్నారు…ఇంత మంది మొబైల్ బాధితులు ఉన్నారా అని ఆశ్చర్య పోయాం.. చచ్చి చడి నా వంతు వచ్చేసరికి మధ్యానం 1.00 గంట అయ్యింది…తీరా వాళ్ళు చెప్పిన వివరాలు చూస్తే నా కళ్ళు తిరిగాయి…వారానికి పది వేలు అలా ఒక నాలుగు వారాలు…రోజు సాయంత్రం పూట ఒక గంట సేపు ఏవో వీడియోస్ చూపిస్తారు…
అవును మరిదిగారు నేను అవ్వని చూసి షాక్ అయ్యే .. ఏదైనా స్కూల్ లో అడ్మిషన్ కన్నా ఎక్కువ వీళ్లకి బాగా డిమాండ్ ఉంది..
ఇప్పటికి మూడు వారాలు అయ్యాయి కానీ వాడిలో ఏ మార్పు లేదు….ఇంకో వారం రోజులు ఉంది చూడాలి అప్పుడైన మారతాడేమో అని…
అప్పుడే సుజాత వాళ్ళ నాన్నరామరావు గారు వస్తారు…రేఖని చూసి గుర్తు పట్టమని సుజాత చెప్పేసరికి ఎవరా ఎవరా అని ఆలోచిస్తూ ఉండగా…లోపల నుంచి శ్రీ వస్తాడు…అమ్మ అమ్మ ఈ ఫోన్ పని చేయట్లేదు అని ఏడుస్తుంటే…శ్రీ నీ చూసి నువ్వు రామమూర్తి కూతురు రేఖ కదా అని అనగానే…ఎలా పెదనాన్న ఎలా గుర్తుపట్టారు అని రేఖ అడిగితే…వాడు అచ్చం నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉన్నాడు…
అందరూ కలిసి ముచ్చటించుకున్నారు…ఆ రాత్రికి అక్కడే ఉండమని సుజాత ఇంకా వాళ్ళ నాన్నా అడిగితే పొద్దున్నే వేరే పని ఉందని వెళ్ళక తప్పదు అని భరత్ చెప్పాడు…సరే ఎంత లేట్ అయినా సరే రాత్రి భోజనం చేసే బయలు దేరాలి అని కండిషన్ పెడితే…సరే అన్నారు రేఖ ఇంకా భరత్…
డిన్నర్ టైం అయ్యింది….సుజాత డైనింగ్ టేబుల్ అన్ని పెట్టీ రేఖతో కలిసి పిల్లలకి తినిపించడానికి సన్నీ రూంలోకి వెళ్ళారు…పొద్దున్నించి ఏం మాట్లాడుకున్నారు…ఇప్పటి జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారు అని వాళ్ళ మామయ్యతో చెప్పారు ఇద్దరు అల్లుళ్ళు…
అన్ని విని మీరు ఎవరి దగ్గరకి వెళ్ళినా…ఎన్ని డబ్బులు ఖర్చు చేసి జాయిన్ చేసినా పిల్లలు మారరు…
అదేంటి మామయ్య అలా అంటారు…భరత్ మొదట నీ దగ్గరకి వస్తా….నువ్వు ఆ “వదిలిస్తాం రా” లో జాయిన్ చేసావు కదా…వాళ్ళు ఏం చేస్తున్నారు…పిల్లల్లో మార్పు కోసం కొన్ని వీడియోస్ చూపిస్తున్నారు…అని భరత్ సమాధానం చెప్పాడు…
మరి ఆ వీడియోస్ ఎక్కడ చూపిస్తున్నారు…మొబైల్ లో అని రేఖ సమాధానం చెప్పింది…నువ్వు మొబైల్ మాన్పించాలి అని మొబైల్ లోనే చూపిస్తే ఏం లాభం…రేఖ ఇంకా భరత్ ఇద్దరు తలదించుకున్నారు…
ఇప్పుడు మీ వంతు…మొబైల్ ని ఎవరు మర్చిపోవాలి…సన్నీ అని సమాధానం చెప్తుంది సుజాత…కాదు..తల్లి తండ్రులు….
అదేంటి నాన్నా…ఔను….పిల్లలు మొబైల్ చూస్తున్నారు అంటే తప్పు ఎవరిది…తల్లి తండ్రులదే….వాడికి మొబైల్ అంటే ఏంటో తెలియని వయసులో మీరు వాడి ఏడుపు ఆపడానికి..లేక మీ పనులు చేసుకోవడానికి..అలవాటు చేసారు…మీరు చేసిన అలవాటు మీరే మన్పించాలి…కొద్దీ రోజుల్లోనే వాడు దానికి అలవాటు పడి…. మావాడు మొబైల్ బాగా ఆపరేట్ చేస్తున్నాడు.. అది ఓపెన్ చేస్తున్నాడు.. అని అనుకుంటూ మురిసిపోతున్నారు తప్ప.. మేరె ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో మర్చిపోతున్నారు..
వయసు పెరిగే కొద్దీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారో అదే పిల్లలు చేస్తారు…నేను సాయత్రం నుంచి చూస్తున్నా..నాతో మాట్లాడుతూనే ఫోన్ చూసుకుంటున్నారు…ఒక పది నిమిషాలు కూడా ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు …
“నీగొట్టం” లో వీడియోలోచూడడం … “ఏముంది పైన” లో చాటింగ్ చేయటం.. ఇదే కదా అందరు చేసేది..
తప్పు పాత తరానిది కాదు కొత్త తరానిది కాదు..వాటి మధ్య ఉన్న అంతరానిది..
నిజాల చెపితే ఈ తరం వాళ్ళు ఒప్పుకోరు…తప్పులు అందరూ చేస్తారు…కానీ ఆ చేసిన తప్పులని ఒప్పుకొని సరిదిద్దుకుంటే నే బావుంటారు..
వాళ్ళ తప్పు తెలుసుకున్న సుజాత, మురళి, రేఖ ఇంకా భరత్…ఆ రోజు నుంచి మొబైల్ వాడకం తగ్గించేసారు…టైం దొరికినప్పుడల్లా పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు….మెల్లిగా పిల్లలు కూడా పెద్దవాళ్ళని చూసి మారిపోయారు…
