వీలు “కానీ” నామ
వీలు “కానీ” నామ
అర్జున్, ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి చాలామంది లాగ Btech చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, ఆ రోజు తన 30వ పుట్టిన రోజు, అందరు ఫోన్లో విష్ చేస్తున్నారు, ఆఫీస్ లో బాగా హడావుడిగా ఉంది, అందరు తన చుటూ నించొని బర్త్డే పాట పాడుతున్నారు, అప్పుడే తనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది, అప్పటి దాకా సంతోషంగా ఉన్న తను, ఉన్నట్టు ఉండి డల్ అయిపోయాడు, ఏడవడం మొదలు పెట్టాడు, అందరు ఏమైంది అని అడిగినా సమాధానం చెప్పలేదు, వాళ్ళ బాస్ దెగ్గర పర్మిషన్ తీసుకొని తన రూంకి వెళ్లిపోయాడు, తన ప్రేయసి పద్మ రూంలోనే ఉండడంతో ఏమైంది అప్పుడే వచ్చేసావు అని అడిగింది, సమాధానం చెప్పే లోపే ఎవరో భార్యాభర్తలు తన రూంకి వచ్చి అర్జున్ ని రూంలో చూసేసరికి సంతోషించి, తనకి విషెస్ చెప్పారు, అప్పుడే పద్మ వాళ్ళని పరిచయం చేస్తుంది, వాళ్ళు తన అమ్మ నాన్న అని, కానీ తనకి ఏమి చెప్పాలో తెలీక, రూమ్ లోపలకి వెళ్లి తలుపు వేసుకుంటాడు.
పద్మ ఎంత సేపు తలుపు కొట్టినా అర్జున్ తీయలేదు,మన పెళ్ళికి మా అమ్మ నాన్నా ఒప్పుకున్నారు, నువ్వు ఈ వార్త వింటే సంతోషిస్తావు అనుకుంటే, నువ్వేమో రూమ్ లోపలకి వెళ్లి తలుపు వేసుకున్నావు, అసలు ఏమి జరిగింది అని అడిగితే, ఏడుచుకుంటూ బయటకి వచ్చి, జరిగిందంతా చెప్తాడు, అది విని పద్మ కళ్ళు తిరిగి పడిపోతుంది. అక్కడే ఉన్న వాళ్ళ అమ్మ నాన్న పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి తీసుకువెళతారు, తాను ఎంత సేపటికి స్పృహలోకి రాలేదు, అక్కడ ఉన్న డాక్టర్ని అడిగితే, విన కూడని మాట ఒకటి విన్నట్టు ఉంది అందుకే తాను షాక్ కి గురైంది, తాను ఎప్పుడు స్పృహలోకి వస్తుందో చెప్పలేం అని చెప్పి వెళ్లి పోయాడు డాక్టర్.
అసలు ఏమి జరిగిందో కనుక్కుందాం అని పద్మ వాళ్ళ నాన్న రూంకి వెళ్ళాక చూస్తే అర్జున్ అక్కడ లేడు, వాళ్ళ ఆఫీస్ కి వెళ్తే తను ఇందాకే ఫోన్ చేసి కొద్దీ రోజులు లీవ్ పెట్టి ఊరు వెళ్తున్నా అని చెప్పాడు, తన ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఏమి చేయాలో అర్ధం కాక పద్మ వాళ్ళ నాన్న మళ్లి హాస్పిటల్ కి వెళ్ళాడు, అక్కడ పద్మ కి స్పృహ వచ్చింది అని తెలిసి సంతోషించాడు,లోపలకి వెళ్లి, తనని మాట్లాడిద్దాం అనుకుంటుండగా, అక్కడ జరుగుతున్న విషయాలని చూసి షాక్ అయ్యాడు, అప్పుడే వచ్చిన డాక్టర్, పద్మ గతం మొత్తం మర్చిపోయిందని, ఎవరైతే ఆ షొక్కింగ్ విషయం చెప్పాడో తానే మళ్ళి వచ్చి అది నిజం కాదు అని చెప్తే తప్ప తను మామూలు మనిషి కాదు అని చెప్పిన వెంటనే, పద్మ వాళ్ళ నాన్నకి బాగా కోపం వచ్చి వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు.
ఇంతలో అర్జున్ వాళ్ళ ఊరు చేరుకున్నాడు, వాళ్ళ నాన్న ని నిలదీసి అడిగాడు, అసలు మీరు చెప్పేది నిజమేనా, ఆలా ఎలా జరిగింది, అని గట్టిగా వాళ్ళ నాన్నని హత్తుకొని ఏడవడం మొదలు పెట్టాడు, తాను చెప్పిందంతా నిజమే అని, ఇప్పుడు ఏమి చేయాలో తనకి కూడా అర్ధం కావటం లేదని తనూ ఏడవడం మొదలు పెట్టాడు. ఊరులో వాళ్ళందరూ ఆ ఏడుపు విని, వచ్చి ఓదార్చటం మొదలు పెట్టారు. అప్పుడే ఛార్జింగ్ పెట్టిన అర్జున్ ఫోనికి ఆఫీస్లోని తన సహా ఉద్యోగి నుంచి ఒక ఫోన్ వచ్చింది,అర్జున్ మొత్తం విషయం వినకుండా, తన బాధలో ఉంది పోయాడు. పద్మ వాళ్ళ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడని, పోలీసులు ఏ టైములో నైనా రావొచ్చని, జాగ్రత్త గా ఉండమని చెప్తుంటే, ఉన్నట్టు ఉండి ఫోన్ పేలిపోయింది.
ఇలాంటి పరిస్థితి పగావాడికి కూడా రావొద్దు అని, చాలా జాగ్రత్తగా ఉండమని అర్జున్ వాళ్ళ నాన్న సలహా ఇస్తాడు, ఆ రాత్రంతా నిద్ర కూడా సర్రిగా పోలేదు, పొద్దున్నే ఎవరో తలుపులు కొడుతున్నారు, ఎవరా అని వాళ్ళ నాన్న తలుపు తీసి చూస్తే పోలీసులు, వాళ్ళని చూసి అర్జున్ వాళ్ళ నాన్న షాక్, అర్జున్ గురించి వివరాలు అడుగుతుండగా, తాను పైనుంచి మెట్లు దిగుతుంటాడు, పోలీసులని చూసి పారిపోతుంటాడు, వెతికి మరి పట్టుకుంటారు.
పోలీసులు అర్జునుని జైల్లో పెట్టి చిట్టకొట్టి సమాధానం రాపెట్టాలని చూస్తున్నారు, కానీ తనని ఎందుకు అరెస్ట్ చేసారో తనకి అర్ధం కాకా, పోలీసులు ఏమి అడిగిన నాకు తెలీదు, నాకు తెలీదు అని సమాధానం చెప్తున్నాడు.
ఇంతలో అర్జున్ వాళ్ళ నాన్న వచ్చి జరిగిందంతా చెప్పి అర్జునుని విడిపిస్తాడు, పోలీసులు అది విని ఆశ్చర్య పోయారు, ఈ కాలం లో కూడా ఇంత ఘోరం జరుగుతుందా అని విస్మయం వ్యక్తం చేశారు. పొలుసుల్లో ఒక కానిస్టేబుల్ ఆ దేవుడే అర్జున్ ని కాపాడాలి అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ బోరున ఏడవడం మొదలు పెట్టారు.
అందరు కలిసి పద్మ వాళ్ళ ఇంటికి వెళ్లి, ఎలా చేయాలి ఏమి చేయాలి అని తర్జన భర్జన పడుతున్నారు, అందరు కలిసి ఒక మాటకి వచ్చారు, పద్మకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ దెగ్గరికి తీసుకెళ్లి డాక్టర్ తో ఒక ఇంజక్షన్ ఇప్పించి జరిగిందంతా అబద్దం, ఒక ప్రాంక్ చేశా అని చెప్పి అర్జున్ పద్మతో చెప్తాడు, కొద్దీ సేపటి తరువాత పద్మ స్పృహలోకి వచ్చి ఏంటి నువ్వు చెప్పింది అబద్దమా అని అడగగానే అవును అని సమాధానం ఇచ్చాడు అర్జున్, అందరు చాలా సంతోషితారు, అందరు ఒప్పుకొని వాళ్ళ ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోతుంది.
ఆలా పెళ్లి జరిగి కొన్ని రోజులు గడుస్తుంది, ఒక రోజు పద్మ అర్ధరాత్రి నిద్రలో నుంచి ఉల్లిక్కి పది లేస్తుంది, ఎదో పీడ కల వచ్చి బాగా భయపడింది, ఆలా రోజు పీడ కల రావడం, పద్మ భయపడటం ఇలా లాభం లేదు అని ఒక రోజు ఆఫీస్ కి సెలవు పెట్టి ఒక psychiatrist దెగ్గరికి తీసుకు వెళ్తాడు ఆ డాక్టర్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తుంది పద్మ కలలో ఏమి కనిపిస్తాయి అన్న ప్రశ్నకి 9 మంది , 9 మంది , 9 మంది అని చెప్పబోయి స్పృహ కోల్పోతుంది, ఎవరా 9 మంది ఏంటా కథ అర్ధం కాక డాక్టర్ తలా పీక్కుంటాడు, ఎన్ని మందులు వాడిన తగ్గదు. ఏమి చేయాలో అర్ధం కాదు అర్జున్ కి.
కొద్దీ రోజులు పుట్టింట్లో ఉంటె బావుంటుంది అనుకోని తీసుకెళ్లి అక్కడ వదిలేస్తాడు, అక్కడ అదే తంతు, కొద్దీ రోజుల గడిచాక అర్జున్ వాళ్ళ మామగారు ఫోన్ చేసి, అల్లుడుగారు ఆస్తి పనులు ఎంతవరకు వచ్చాయి అని అడుగుతాడు, ఏ ఆస్తి గురించి మీరు మాట్లాడేది అని అడుగుతాడు, ఏమి తెలీనట్టు మాట్లాడుతున్నారు, మీ తాతగారు మీ పేరున రాసి ఆస
్థి గురించి నాకు తెలుసు, నేను మీ గురించి ఎంక్వయిరీ చేయడానికి మీ ఊరిలో ఒకతన్ని పెట్టా, వాడు మీ నాన్న గారు మీతో మాట్లాడడం విన్నాడు మీకు 40 సంవత్సరాలు నిండాక 100 ఎకరాలు ఆస్థి రాబోతుంది ఆ విషయం నాకు తెలుసు అనగానే, అయ్యో మామయ్య మీరు వినింది ఆ ఒక్క పాయింట్ మాత్రం దాంట్లో గొళ్ళాలు చాలా ఉన్నాయ్, అవునా అవి నాకు తెలీదు, ఏంటవి.
- 40 సంవత్సరాల లోపు నేను కనీసం 9 మంది పిల్లని కనాలి లేదంటే నాకు ఆ ఆస్థి చెందదు.
- అది కూడా కట్టుకున్న భర్య ద్వారానే కనాలి.
- దత్తత తీసుకోవటం కానీ, ఇంకో వివాహం చేసుకోవటం కానీ చేయకూడదు
ఇలాంటివి చాలానే ఉన్నాయి అని చెప్పాగానే మామగారు ఖంగు తిన్నాడు, మీ అమ్మాయికేమో చిన్న పిల్లలు అంటే అస్సలు పడదు. నా దురదృష్టం కొద్దీ నాకే ఇలాంటి కండిషన్ పెట్టాడు మా తాతయ్య, మా తాత ఒక్కడే కొడుకు, మా నాన్న ఒక్కడే కొడుకు నేను 9 మందిని కని పోషిచాలంటే అది కూడా మీ అమ్మాయితో అంటే నేను నరకం లో ఉన్నట్టే ఉంటుంది.
మొన్న మీ అమ్మాయికి వచ్చిన పీడ కలలో కూడా కనిపించింది ఆ 9 మంది పిల్లలే, ఆ విషయం నాకు తప్ప ఎవ్వరికి అర్ధం కాలేదు, ఎవ్వరికి తోచిన సలహా వాళ్ళు ఇస్తున్నారు కానీ అసలు విషయం ఎవ్వరికి చెప్పలేను. ఇప్పుడు ఏమి చేద్దాం అనుకుంటున్నావు అర్జున్, నిజం తెలిసాక మామగారి పిలుపు మారింది అని మనసులో అనుకుంటుండగా అప్పుడే ఒక ఫోన్ వచ్చింది అని చెప్పి కాల్ కట్ చేసాడు అర్జున్.
పద్మ వాళ్ళ అమ్మ ఇంకా నాన్న ఏవో మాయ మాటలు చెప్పి పద్మని ఎలాగైనా 9 మంది పిల్లల్ని కనాలి అని ప్రోత్సహిస్తారు,100 ఎకరాల ఆస్థి వస్తుందని, ఆస్తి చేతికి వచ్చాక పిల్లల్ని ఎవరికైనా ఇచ్చేయొచ్చు అని, ఇష్టం లేక పోయిన అన్నింటికీ ఒప్పుకుంటుంది పద్మ. వెంటనే అర్జున్ కి ఫోన్ చేసి వాళ్ళ మామగారు, పద్మ ఒప్పుకుంది అన్న మాట చెప్పగానే ఎగిరి గంతేస్తాడు అర్జున్.
ఆలా వాళ్ళ ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టారు ఆలా 8 సంవత్సరాలు గడిచిపోయాయి, అర్జున్ వాళ్ళ నాన్న ఇంకా పద్మ వాళ్ళ నాన్న ఇద్దరు కాలం చేసారు. సంవత్సరానికి ఒక్కరు చొప్పున 8 మందిని కనేసారు. అర్జున్ ఇంకా పద్మ, హైద్రాబాద్ లో ఉండలేక అర్జున్ వాళ్ళ ఊరు మారిపోయారు, అర్జున్ హైద్రాబాద్లో రూంలో ఉంటూ వారానికి ఒక్కసారి వచ్చి వెళ్లేవాడు.
ఒక రోజు హైదెరాబాద్ కి బయలుదేరుతుండగా అప్పుడే అక్కడికి వాళ్ళ ఫామిలీ లాయర్ వచ్చాడు, ఇతనే వాళ్ళ తాతగారి వీలునామా రాసింది, అర్జున్ ఇంకా పద్మని చూసి చాలా సంతోషించాడు, అదేంటి ఇంకా పిల్లల్ని కనలేదా అని అడుగుతుండగా ఒక్కొకరుగా ఏడుపు మొదలు పెట్టారు, అంతమందిని చూసి ఖంగు తిన్నాడు ఆ లాయర్, అదేంటి ఇంత మంది పిల్లల్ని ఈ కాలంలో కూడా కనే వాళ్లకు ఉన్నారా అని అడిగితే, మా తాతగారు చేసిన నిర్వాకం అని చెప్పాడు అర్జున్.
ఆయనేం చేసాడు పోయి చాలా రోజులు అయింది కదా అంటే, వీలునామ లో ఆలా రాసాడు కదా, మీరు ఏమి తెలీనట్టు మాట్లాడతారు అన్నాడు అర్జున్. రాసింది నేనే, నాకు తెలీదా, అలాంటి కండిషన్ పెట్టినట్టు నాకు గుర్తు లేదు. ఒక్క సారి ఆ వీలు నామ తీసుకురా అనగానే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తీసుకొచ్చాడు అర్జున్.
మీ ఇంటి పేరు ఏంటి అని అడిగాడు, కుయ్యో అన్నాడు, పక్కింటి వాళ్ళ ఇంటి పేరు ఏంటి అదే మీ తాతగారి ప్రాణ స్నేహితుడి ఇంటి పేరు ఏంటి అన్నాడు, మొర్రో అని సమాధానం ఇచ్చాడు అర్జున్. నీ పేరు కుయ్యో అర్జున్, పక్కింటి మనవాడి పేరు మొర్రో అర్జున్. అక్కడ వచ్చింది ఈ కన్ఫ్యూషన్. నేను అమెరికా లో ఉన్నప్పుడు మా అసిస్టెంట్ కూడా కాంఫుసే అయిపోయి మీది వాళ్ళకి వాళ్ళది మీకు ఇచ్చినట్టు ఉన్నాడు.
మీ తాతగారు వాళ్ళ తాతగారు ప్రాణ స్నేహితుడవడం, వాళ్ళ ఇద్దరి పేర్లు కుయ్యో రామయ్య, మొర్రో రామయ్య , ఇద్దరికీ మనవాళ్ళు ఒకేసారి పుట్టడం, వాళ్ళ పేర్ల లాగ మనవళ్ల పేర్లు ఒకే లాగ పెట్టాలి అనుకోవడం పైగా వీలునామ రాసినప్పుడు, ఇంటి పేరుని ఒక్క మొదటి పేజీలోనే ఉండటం అది కూడా రాసి చాలా కలం అవ్వటం, వల్ల ఇలా జరిగింది.
ఇంతకీ మా వీలు నామ ఎక్కడ ఉంది అని అడిగితే, ఒక్క సారి మీ పక్కింట్లో అడిగి చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ లాయర్, కొద్దీ రోజుల తరువాత, వచ్చి ఇదిగో మీ వీలునామా దొరికింది అని చెప్పి అందులో ఏముందో చదివాడు లాయర్.
40 సంవత్సరాల లోపు కనీసం 1 పిల్ల లేక పిల్లాడినైనా కనాలి, అది కూడా సొంత భార్యతో నే కనాలి అని స్పష్టంగా ఉంది అని చదవగానే , గుండె ఆగినంత పని అయ్యింది అర్జున్ ఇంకా పద్మకి, ఆగండి ఇంకా ఒక పాయింట్ ఉంది. యావదాస్తిలో కొంత అంటే 100 ఎకరాలలో కేవలం 99 ఎకరాలు దేవుడి గుడికి ఇచ్చేసి మిగతాది నీకు నా ఆస్తిగా మొత్తం 1 ఎకరా ని ఇస్తున్నాను పండగ చేసుకో అని రాసి ఉంది అని చెప్పగానే, ఇద్దరు కళ్ళు తిగిరి పడిపోయారు. అక్కడే ఉన్న లాయర్ నీళ్లు చల్లి లేపగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు అర్జున్,
ఒక ఎకరాని ఇచ్చి పెద్ద బకరాని చేసాడు మా తాత, అప్పటికి ఆస్థి వొద్దు పాస్తీ వొద్దు అనుకుంటున్నా, మా అత్త మామలు వినలేదు, కూతురు సంతోషంగా ఉంటుంది అని ఇప్పుడు ఇంత పని చేసారు, 6 మంది పిల్లలు పుట్టాక ఆఫీస్ వాళ్లకు నన్ను అరడజన్ అర్జున్ అని పిలవడం మొదలు పెట్టారు అప్పుడే ఆపేద్దాం అనుకున్న అని బోరున ఏడ్చేశారు అర్జున్ ఇంకా పద్మ.
పోనిలే ఇప్పటికైనా మించి పోయింది లేదు 8 మంది తో ఆపేయండి అనగానే అర్జున్ భార్య కడుపు వంక చూసి(మనసులో ఆల్రెడీ మిషన్ ఆసీకంప్లిషెడ్) అని అనుకున్నాడు.
అవును ఇంతకీ పక్కింటి వాళ్ళ వీలు నామాలో ఏమి రాసుంది అని అడిగితే, 9 మంది పిల్లల్ని కంటే 100 ఎకరాల భూమి ఆస్తిగా వస్తుంది అని ఉంది, అంటే వాడు ఇంకో రెండు సంవత్సరాలలో 7 మందిని కనాలా అని ప్రస్నార్ధకమైన మొహం పెట్టాడు కుయ్యో అర్జున్.