Devarakonda Phanishyam

Thriller action drama

4.0  

Devarakonda Phanishyam

Thriller action drama

స"న్నిధి"

స"న్నిధి"

6 mins
22.7K


బారెడు పొద్దెక్కింది లేస్తానమ్మ...

రాత్రి పడుకునే సరికి చాలా లేట్ అయ్యింది ఇంకొద్ది సేపు పడుకో నాన్న..

రాత్రిళ్ళు ఎక్కువ సేపు మేల్కొని ఎందుకు నాన్న ఆరోగ్యం పాడుచేసుకుంటావ్..

నేను చేసే పని అలాంటిది..

ఏమి ఘనకార్యం వెల్లబొడుస్తున్నావ్ బాబు రాత్రిళ్ళు మేల్కొని...ఎదో ఒకటి ఇంటర్నెట్లో సెర్చ్ చేయటమే కదా..అదే నువ్వు రీసెర్చ్ చేసే సైంటిస్ట్ లాగా మాట్లాడుతున్నావ్ కదా రా..

సెర్చ్ అయిన రీసెర్చ్ అయిన ఒక్కటే కద నాన్న...ఏదయినా చేస్తేనే విషయం తెలుస్తుంది...

వాడ్ని ఏమి అన్నొద్దు అండి..మొన్నే కదా డిగ్రీ పూర్తి చేశాడు..కొద్దిరోజులు ఎంజాయ్ చేసి ఉద్యోగంలో చేరతాడు..

ఉద్యోగమా నేను చేయను..

పోనీ నాన్నగారికి వ్యాపారంలో సహాయం చేస్తావా..

వ్యాపారమూ నావల్ల కాదు...

ఉద్యోగము చేయక , వ్యాపారము చేయక..మరి ఏమి సాధిస్తావు...నన్ను మీ అమ్మనా...

మీకు ఇప్పుడు అలానే ఉంటుంది...నేను విజయం సాదించాక..మీరే నన్ను పొగుడుతారు..

నువ్వు ఏమైనా చేస్తే కదా విజయం సాదించడానికి..

మీరు ఊరికే ఉండండి..వాడు ఎదో పెద్ద ప్లాన్ లో ఉన్నట్టు ఉన్నాడు...నా కొడుకు తప్పకుండా విజయం సాధిస్తాడు.. ఆ నమ్మకం నాకు ఉంది...

నీకు నీ కొడుకు మీద నమ్మకం ఉండొచ్చు...కానీ..వాడు అనుకున్నట్టు విజయం సాదించక పోతే అప్పుడు..నాకు ఉంటుంది..అమ్మకం(ఆస్తి,పాస్తులు)..

ఇంతకీ నువ్వు చేసే పనెంటో చెప్పు నాన్న...

ఇప్పుడు చెప్పను అమ్మ..తరువాత చెప్తా...

సరే నీ ఇష్టం ...టిఫిన్ ఏమితింటావు నాన్న..

నాకొద్దు అమ్మ..నేను బయట తింటా...

సరే..పని ధ్యాసలో పడి.. తిండి మానొద్దు...

సరే అమ్మ..

పని లేని వాడికి ద్యాసతో ఏమిటే పని..నువ్వు మరీ చెప్తావ్..

మీరూ ఎప్పుడు వాడిని ఎదో ఒకటి అనకుండా ఉండలేరు కదా...

------------------  ###### ------------------ ####### ----

హలో అంజలి..నిన్న మనం అనుకున్న చోటికి 10.30 కి వచ్చేయి..నేను ఇప్పుడే బయలుదేరుతున్నా..

సారి కొంచం లేట్ అయ్యాను.. ఎంత సేపు అయ్యింది వచ్చి...

ఏమి పర్లేదు అంజలి...నేనూ ఇందాకే వచ్చాను...ఏమి తింటావు చెప్పు ఆర్డర్ ఇస్తా...

నీ ఇష్టం...ఇంతకీ..నువ్వు అనుకున్నది..ఎంత వరకు వచ్చింది...

అదే పనిలో ఉన్నా అంజలీ...ఇంకో రెండు రోజుల్లో..ప్లాన్ అంత రెడి అవుతుంది...

నువ్వు..మంచి మార్కులతో డిగ్రీ పూర్తి చేసావు... మీ నాన్న కొంత ఆస్తి సంపాయించారు.....ఎదో ఒక ఉద్యోగమో లేక మీ నాన్నగారి వ్యాపారంలో చుసుకోక...నీకు ఇవన్నీ అవసరమా...ఈ కాలంలో కూడా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావ్ అంటే..నాకు నవ్వొస్తుంది...చదువుకున్నవాడెవ్వడు ఇలా ఆలోచిస్తారు అనుకోలేదు..

అది కాదు అంజలి...ఉద్యోగమంటే..ఒకరి కింద పని చేయాలి..వ్యాపారం మా నాన్న మొదలు పెట్టారు. నేను నా సోతంగా ఏదయినా చేయాలి..అది కూడా నాకు చిన్నప్పటినుంచి...ఉన్న ఒక కల ఇన్నాళ్లకు నిజం చేసుకోపోతున్నా..

నువ్వు చేసేది ఎంత పెద్ద రిస్కో తెలుసా...

తెలుసు అంజలి...పోలీసులకి దొరికితే జైల్లో వేస్తారు...నేను చేసే ప్రయాణం..ప్రాణాలతో చెలగాటం...కానీ అన్ని దాటుకుని వస్తేనే విజయం...

నేను మన ఇద్దరి జీవితం గురించి..ఎన్నో కలలు కన్నా...

పిచ్చి అంజలి..ఇప్పడు.. కలల్ని కను...తరువాత..నిజం చేసుకుందాము..

సరే ఎల్లుండే నా ప్రయాణం...జాగ్రత్తగా ఉండు అంజలి... ఈ విషయం గురించి..ఎవ్వరికి చెప్పొద్దూ..

సరే..నువ్వు జాగ్రత్త...నా గుర్తుగా..ఈ ఉంగరం నీదెగ్గర పెట్టుకో...

సరే..తిరిగి వచ్చి నిన్ను కలుస్తాను...ఉంటా అంజలి..

------------------  ###### ------------------ ####### ----

అమ్మా, నేను ఎల్లుండి ఊరెళ్తున్నా..ఒక వారం రోజుల తరువాత వస్తా...

వారం రోజులా..నిన్ను చూడకుండా..అన్ని రోజులు ఎప్పుడు లేను నాన్న...

నీకొడుకుని ప్రయోజకుడిగా చూడాలి అంటే తప్పదు అమ్మ...కుదిరితే..రోజూ ఫోన్ చేస్తా...

మీ నాన్నగారికి చెప్పావా...

ఇంటికి రాగానే చెప్తా....

------------------  ###### ------------------ ####### ----

ఈ వంకాయ కూర వేసుకో నాన్న...

చాలమ్మ....ఇప్పటికే కడుపు నిండి పోయింది..నాన్నగారు తిట్టిన తిట్లతో...

మీకు చాలా సార్లు చెప్పాను...వాడ్ని ఏమన్నొద్దు అని...అయిన మీరు వినట్లేదు...చూడండి...వాడు అన్నం కూడా తినకుండా వెళ్ళిపోయాడు..

వెళ్ళితే వెళ్ళాడు...ఇలాంటి వాడికి పెట్టె బదులు...ఏ కుక్కకో పెట్టినా..విశ్వాసంగా చెప్పినట్టు వింటుంది...నువ్వు చేసిన గారాబం వల్లే వాడు ఇలా తయారయ్యాడు...

ఏంటండి మీరు ఇలా కన్నకొడుకుని..అనరాని మాటలు అంటున్నారు..

మరి ఏంచేయమంటావో చెప్పు..అందరూ...ఎదో ఒకటి చేసుకొని బ్రతుకుతున్నారు...వీడు.ఇలా తయారయ్యాడు..

మీరు ఏమైనా చెప్పండి..ఈ సారికి వాడికి నచ్చినట్టు ఉండనివ్వండి..

సరే నీ ఇష్టం..నీ కొడుకు ఇష్టం...ఏమైనా చేసుకోండి...

------------------  ###### ------------------ ####### ----

అమ్మా నేను బయలుదేరుతున్నా...నన్ను ఆశీర్వదించమ్మ..

క్షేమంగా వెళ్లి లాభంగా రా నాన్న...

తప్పకుండా అమ్మా...నాన్నకి చెప్పు...మళ్ళీ నన్ను ఎదో ఒకటి అంటారు...

సరే నేను చెప్తాలే...

------------------  ###### ------------------ ####### ----

చిన్నప్పటి నుంచి కన్న కలలు అన్ని ఇవాళ నిజం కాబోతున్నాయి...

అదే నిధి వేట(Treasure Hunt)... ఎన్నో సార్లు సినిమాలలో చూడడం...పుస్తకాలలో చదవటం...ఇలా నన్ను inspire చేసాయి...

నా కల, నాకు ,అంజలి కి తప్ప ఎవ్వరికి తెలీదు...

మొన్న ఇంటర్నెట్ లో వెతికేటప్పుడు..ఓక నిధి గురించి..తెలిసింది...

అక్కడికి వెళ్లడం అంత సులువు కాదు అని తెలుసు..అది కూడా ఒక్క చోట కాదు నాలుగు చోట్లకి వెళ్ళాలి...

అన్ని కూడా చాలా దూరం...తోడు ఎవ్వరు లేరు...ఒక్కడినే..

ఈ ప్రయత్నంలో నాకు ఏమైనా జరుగచ్చు...అలా జరిగితె....ఒక లేఖ రాసి నా కంప్యూటర్ మానిటర్ కింద పెట్టా...అది చదివి...నా గురించి మా అమ్మ వాళ్ళు తెలుసుకుంటారు...

అంజలి ఇచ్చిన ఈ ఉంగరం , తనని గుర్తు చెస్తుంది..

ఈ ప్రయాణం ఎలా జరుగుతుందో చూద్దాం...

------------------  ###### ------------------ ####### ----

అర్ధరాత్రి దాటింది...చిమ్మ చీకటి...అడవిలో ప్రయాణం..భయంకరంగా ఉంది...

చుట్టూ చెట్లు...నాదెగ్గర ఉంది ఈ టార్చ్ లైట్ ఒక్కటే...ఏ మూల నుంచి ఏమి వస్తుందో తెలీదు...

నా దెగ్గర ఉన్న map ప్రకారం ..ఇంకా...5 మైళ్లు వెళ్ళాలి...ఆకలి మొదలయింది...కూర్చోని తినే వీలు లేదు...నడుచుకుంటూ.. తింటూ వెళ్తా..అనుకున్నాడు..

మొదటి గమ్యాన్ని ఎలాగో అలా చేరుకున్నాడు...

అక్కడకి వెళ్ళాక..బాగా నిద్రొచ్చి అక్కడే పడుకున్నాడు...

తెల్లారింది...లేచిన వెంటనే..మాప్ లో ఉన్న మొదటి క్లూ చదివాడు..

"ఛత్రపతి శివాజీ చేతిలో ఉండేది.." అని ఉంది..

ఏముంది...కత్తి... అయితే ఇక్కడ ఒక కత్తి ఉంటుంది అన్నమాట అని మనసులో అనుకొని...కత్తి కోసం వెతకడం మొదలు పెట్టాడు...

ఒక చెట్టు కొమ్మకి కత్తి కట్టి ఉంటుంది...అది చూసి..చాలా సంతోషించాడు

అది తీసి చూసాడు.....అందులో ఒక కాగితం ముక్క ఉంది దానిపై...ఒక లైన్ రాసి ఉంటుంది...

"ప్రతి వారం మొదలు అయ్యేది దానితోటే...ముగిసేది దానితోటే.."

ఏదోలే అని..ఆ కాగితం తన దెగ్గర ఉన్న బ్యాగులో పెట్టుకున్నాడు..

అక్కడి నుంచి రెండో గమ్యానికి బయలుదేరాడు...

------------------  ###### ------------------ ####### ----

ఇక్కడి నుంచి..రెండో గమ్యస్థానం చాలా దూరం...కొద్దీ దూరం వెళ్ళేసరికి..ఉరుములతో కూడిన వర్షం పడుతోంది...దెగ్గరలో ఒక పెద్ద శబ్దం వినిపించింది..ఆది విని...తన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది..

అది పిడుగు పడిన శబ్దం...తనకి కొద్ది దూరంలో ఒక చెట్టు కాలిపోవడం చూసి..ఇంకా భయం ఎక్కువైంది..

అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను అని మనసులో..అమ్మని నాన్నని తలచుకొని బాధ పడ్డాడు..

ధైర్యం కూడగొట్టుకొని...map ప్రకారం రెండో గమ్యస్థాననికి చేరుకున్నాడు...

అక్కడ map లో క్లూ ప్రకారం..."గాల్లో ఎగురుతుంది..." అని ఉంది..

గాల్లో ఎగిరెవి చాలా ఉన్నాయి...ఏదైఉంటుంది అని ఆలోచిస్తున్నాడు...

ఉన్నట్టు ఉండి.. ఒక పక్షి ఆకారంలో ఉన్న కొమ్మ కనిపించింది.. అప్పుడు తనకి తట్టింది..అది పక్షి గురించే అని...

దానికి ఒక కాగితం ఉంది.. దానిపై...ఇలా ఉంది...

"మనం వాహనం నడిపేటప్పుడు..ఒకటి తీసుకుంటాం..కానీ దాన్ని ఇంకొలా అంటారు"

తరువాత చూద్దాం అని..ఇది కూడా బ్యాగులో పెట్టుకున్నడు..

అక్కడే పొద్దుపోయింది...అక్కడే పడుకొని..పొద్దున్నే వెళ్దాం అని అనుకోని...టెంట్ వేసుకొని..పడుకున్నాడు...చుట్టూ చీకటి... జంతువులు రాకుండా బయట..మంట వేసుకున్నాడు...

రాత్రి 2.00 టైం లో ఏదో శబ్దం వినిపించింది...ఏదో జంతువు అనుకోని...పడుకున్నాడు...కానీ...కొద్ది సేపటి తరువాత...కళ్ళు తెరచి చూసాడు...ఒక మనిషి ఆకారం...లాగా కనిపించింది...భయం వేసింది...

బయటకి వెళ్లి చూసాడు...కానీ ఏమి కనిపంచలేదు..మళ్ళీ టెంట్ లోపలకి వచ్చి..పడుకున్నాడు..

తెల్లవారింది....map తీసి...మూడో గమ్యస్థానానికి దారి చూసుకున్నాడు...

------------------  ###### ------------------ ####### ----

మూడో గమ్యస్థాననికి చేరుకున్నాడు...map లో క్లూ ప్రకారం...

"అలుపెరుగని జీవి..."

అలుపెరుగని జీవీ కూడా ఉంటుందా...అదేంటి అనుకున్నాడు...

చుట్టు వెతికాడు... అక్కడ ఎటువంటి జీవి లేదు...ఇదేంటి అనుకున్నాడు...

ఉన్నట్టుండి కాలుకి ఒక చీమ కరిచింది...తను కాలు పెట్టింది చీమల పుట్టపైన...అక్కడ ఉన్నజీవి అదొక్కటే...

అప్పుడు అర్ధమైంది...అలుపెరుగని జీవి అంటే చీమ అని...అక్కడే ఉన్న ఒక కాగితం తీసుకున్నాడు..

దాని పైన ఒక లైన్ ఉంది..

"రెండు అంకెలులో పెద్ద అంకె ఏది?"

ఇందులో ఏముంది..99(Ninety nine)...ఏ కదా..అని..ఆ కాగితం తన బ్యాగులో వేసుకున్నాడు..

అక్కడి నుంచి నాలుగో గమ్యస్థాననికి బయలుదేరాడు...

మార్గమధ్యలో ఓక అతను కోన ఊపిరితో కనిపించాడు....తనకి చాలా భయమేసింది...కత్తితో చాలా సార్లు పొడిచినట్టు ఉన్నారు...

దాహం దాహం అన్నాడు...తనదెగ్గర ఉన్న కొన్ని నీళ్ళని ఇచ్చాడు...ఏమి చేయాలో పాలు పోవవటం లేదు...

కొద్దీ సేపటి తరువాత ఆ మనిషి చనిపోయాడు...తిను గట్టిగా ఏడ్చాడు...ఒక మనిషి ప్రాణం కాపాడలేక పోయాను..అని...ఏడ్చుకుంటు...అక్కడినుంచి..బయల్దేరాడు..

------------------  ###### ------------------ ####### ----

దారి అంతా..ఆ చనిపోయిన మనిషి గురించే ఆలోచన...ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను...అస్సలు ఎందుకు ఇలా జరిగిందో..తనకి అర్ధం కాలేదు...

ఎలాగైనా..నిధి సంపాయించాలి అని అనుకొని..map లో ఉన్నదాని ప్రకారం ....చేరుకొని...క్లూ చూసాడు...

"భ్రమ్మచారి దేవుడు..." అని ఉంది..

అంటే ఆంజనేయ స్వామి ...అయితే. ఇక్కడ ఆయన విగ్రహం ఉంటుంది...అని వెతికాడు...

దొరికింది...దానిమీద ఒక కాగితం ముక్క ఉంది...అందులో...

"వీడిగురించి నీకు బాగా తెలుసు అనుకుంటావు ...కానీ ఏమీ తెలీదు " అని ఉంది...

అర్ధం కాక ఆ కాగితం కూడా బ్యాగులో వేసుకున్నాడు...

ఇవన్నీ బానే ఉన్నాయి చివరి క్లూ కూడా దొరికింది..కానీ నిధి జాడ ఎక్కడాలేదు...

అక్కడే చాలా సేపు కూర్చుండిపోయాడు...

ఇంతా కష్ట పడ్డా ఫలితం దక్కలేదు...ఇంటికి వెళ్లి నేను మొహం ఎలా చూపించాలి అని అనుకోని...తిరుగు ప్రయాణం అయ్యాడు...

------------------  ###### ------------------ ####### ----

రెండు రోజులు ప్రయాణించి...ఇంటికి చేరుకున్నాడు...

ఎలా ఉన్నావు...ప్రయాణం బాగా జరిగిందా...ఏమి మాట్లాడకుండా అలా వెళ్లిపోతున్నావ్ ...ఏమైంది నాన్న...

ఏమి లేదు...తరువాత చెప్తా...అని రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు..

కొన్ని రోజులుగా ఎవరితో మాట్లాడట్లేదు...సర్రిగా తినట్లేదు...నాకు ఎందుకో భయం వేస్తోంది...మీరు వాడితో మాట్లాడండి...

ఏమి కాదులే...కొన్నిరోజుల తరువాత వాడే మాములు మనిషి అవుతాడు...

ఏమండీ, ఇంటికి పోలీసులు వచ్చారు..ఎందుకో కనుక్కోండి..

నేను మాట్లాడుతా...నువ్వు ఏమి కంగారు పడకు...

మా అబ్బాయి గురించి ఎందుకు అడుగుతున్నారు...

మీ అబ్బాయి ఒక హత్య చేశాడు...అందుకే అరెస్ట్ చేయాలి అనుకుంటున్నాం....

హత్య , మా అబ్బాయి...ఎవర్ని, ఎప్పుడు..

ఎవరో అర్జున్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశాడు..

మా అబ్బాయి ఈ హత్య చేశాడు అని మీకు ఎలా తెలిసింది ..

హత్య జరిగిన ప్రాంతంలో..ఒక కత్తి దొరికింది...అక్కడే మీ అబ్బాయి ఆధార్ కార్డ్ దొరికింది...

ఇది మీ అబ్బాయిదే కదా...

అవును, వాడిదే... నేను మా లాయర్ తో వచ్చి మాట్లాడుతాను...

అదేం కుదరదు...మీ అబ్బాయిని...మేము అరెస్ట్ చేస్తాం...ఎమున్నా మీరు కోర్ట్ లో మాట్లాడుకోండి...

ఏమండీ...ఏదయినా చేయండి...మన వాడు ఈ హత్య చేయటం ఏంటి...

నువ్వు ఖంగారు పడకు..నేను..లాయర్ తో మాట్లాడి...వాడిని దీనినుంచి బయట పడేస్తా..

------------------  ###### ------------------ ####### ----

జైల్లో కూర్చొని...డల్ గా ఉన్న అతన్ని...నాన్న వచ్చి పలకరించాడు

అసలు ఏమి జరిగింది...నువ్వు ఎవర్నో హత్య చేయటం ఏంటి...నాకు ఏమీ అర్ధం కావట్లేదు..

నాకూ కూడా అలానే ఉంది నాన్న...అసలు జరిగింది మొత్తం చెప్తా...

అలా అనుకోకుండా నా ఆధార్ కార్డ్ పడిపోయినట్టు ఉంది..నేను ఇందులో ఇర్రుకోవడం అంత అనుకోకుండ జరిగింది...

మీ మాటలు విని, ఏ ఉద్యోగమో..వ్యాపారమో చేసుకొని ఉంటే బావుండేది...

ఎవ్వరి మాట వినకుండా ఇలా చేయని హత్యలో ఇర్రుకు పోయాను...

నిన్ను గట్టిగా హత్తుకొని క్షమించమని అడగాలని ఉంది...

మరి ఇంకెందుకు లేట్ అడుగు మరి...

నాన్న నన్ను క్షమించు...నేను ఈ హత్య చేయలేదు..నువ్వు చెప్పినట్టే వింటా..

ఇతన్నేనా నువ్వు ఆరోజు చనిపోతూ చూసింది..

అవును..ఇతన్నే.. కానీ ఇక్కడ..ఇలా. .

ఇతను నాకింద కొత్తగా చేరాడు..నీలో మార్పు రావాలనే ఇదంతా చేశ...

సరే పద మరి ఇంటికి...

------------------  ###### ------------------ ####### ----

అంజలి..నువ్వు మా ఇంట్లో...

నువ్వు ఖంగారు పడకు...నీ గురించి...మీ నాన్నకి కి నువ్వ వెళ్లే రెండు రోజుల ముందే మొత్తం చెప్పా...

అవునా...

నీకు ఇచ్చిన ఉంగరంలో GPS ఉంది..నిన్ను నేను, మీ నాన్న ఇద్దరం మొదటినుంచి ఫాలో అవుతున్నాం..

నీకు ప్రతి చోట కొన్ని క్లూస్ దొరికెఉంటాయి...

అవును దొరికాయి...నా బ్యాగులో ఉన్నాయి...

మరి వాటి గురించి ఆలోచిస్తే నీకు ఒక విలువైన నిధి దొరుకుతుంది...

అవునా..సరే ఆలోచిస్తా...ఇదిగో ఇదే ఆ క్లూస్...

మరి ఆన్సర్ పేపర్ పైన రాయి...

సరే మొదటిది..

"ప్రతి వారం మొదలు అయ్యేది దానితోటే...ముగిసేది దానితోటే.."

ఏంటబ్బా అది...

సరే ఇంకో క్లూ నేను ఇస్తాను...సమాధానాలు అన్ని ఇంగ్లీషులో ఉంటాయి.....మొదటి అక్షరం మాత్రమే తీసుకోవాలి...

అవునా...అయినా తట్టట్లేదు...

మొద్దు..వారంలో మొదటి రోజు..ఏది..

Sunday..

మరి చివరిది

Saturday

అంటే ఏంటి సమాధానం

S.. ఓహ్ ..ఇంతేనా...

సరే మరి రెండోది..

"మనం వాహనం నడిపేటప్పుడు..ఒకటి తీసుకుంటాం..కానీ దాన్ని ఇంకొలా అంటారు"

మనం వాహనం నడిపేటప్పుడు..ఏమి ఏమి తీసుకుంటాం

లెఫ్ట్ తీసుకుంటాం..రైట్ తీసుకుంటాం..యూ టర్న్ తీసుకుంటాం

దెగ్గరికి వచ్చావు...

ఇప్పుడు తట్టింది...అస్సలైతే మనం తీసుకునేది n టర్న్ కానీ దాని u టర్న్ అంటారు..

అంటే సమాధానం ఏంటి

U

కరెక్ట్

ఇంక మూడోది...

"రెండు అంకెలులో పెద్ద అంకె ఏది?"

ఇది చాలా ఈజీ...99 అంటే Ninety Nine

అంటే సమాధానం ఏంటి

NN

కరెక్ట్

ఇంకా చివరిది...

"వీడిగురించి నీకు బాగా తెలుసు అనుకుంటావు ...కానీ ఏమీ తెలీదు "

ఎవడు వాడు..నాకు బాగా తెలుసు అనుకుంటాను..కానీ ఏమి తెలియకపోవడం ఏంటి..నాకు ఒక్క ముక్క కూడా అర్ధం కావట్లేదు...

ఇలా రా..ఆ అద్దంలో చూడు..

చూసా..నేనె కనిపిస్తున్న..

అదే సమాధానం

ఏంటి నేనా...

అవును...You

అంటే Y అన్న మాట...అయినా నాగురించి నాకు తెలియక పోవడం ఏంటి..

నీగురించి..నీకు పూర్తిగా తెలీదు..తెలుసుకుంటే నువ్వు జీవితంలో చాలా పైకి ఎదుగుతావు...

అది సరే గాని క్లూస్ అన్ని సమాధానం దొరికాయి కదా..అన్ని కలిపి చూడు

SUNNY.. ఇదేంటి నా పేరు వచ్చింది..

నువ్వు వేతకడానికి వెళ్ళింది నిన్నే...నువ్వే ఒక పెద్ద నిధి..నీకైనా,నాకైనా , మీ అమ్మానాన్నకైనా...

అవును రా....ఎవడికి వాడే ఒక పెద్ద నిధి..సర్రిగా వెతుకుతె వాడిలోనే ఒక పెద్ద నిధి దొరుకుతుంది...ప్రతీ కొడుకు/కూతురు తల్లి తండ్రులకి ఒక నిధి...

నాన్న నిజంగా మీరు నా కళ్ళు తెరిపించారు...

ఇంకో విషయం చెప్పాలి...నువ్వు ఇంటర్నెట్ లో నిధి గురించి..వెతుకున్నావ్ అని తెలిసి..అంజలి నే ఈ ప్లాన్ అంతా వేసింది...ఇంటర్నెట్లో కూడా తానే ఆ నిధి గురించి ఇన్ఫర్మేషన్ అంతా తయారు చేసింది...

అంజలి...నువ్వు ఎంతపని చేసావు....అయినా నా మంచి కోసమే కదా.. లవ్ యూ అంజలి...

ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఒక నిధి...

అది వెతకడం వాళ్ళ వాళ్ళ విధి(Duty)..

ఈ కధలో..సన్నీ ఒక నిధి..అందుకే ఈ కథ పేరు స"న్నిధి"..



Rate this content
Log in

Similar telugu story from Thriller