దేవరకొండ ఫణి శ్యామ్

Drama Thriller

3  

దేవరకొండ ఫణి శ్యామ్

Drama Thriller

మిత్రత్రయం

మిత్రత్రయం

5 mins
278


త్రినేత్ర, ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన శేఖరం గారి ఒక్కగానొక్క అబ్బాయి స్వతహాగా బ్రాహ్మణుడు అవడంతో చిన్నప్పటినుంచే ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు పాటించే అలవాటు ఉంది.

వాళ్ళు ఉండే ఊరి పేరు చెన్నపురం..అక్కడ శివాలయం చాలా ప్రసిద్ధి..ఆ గుడి పూజారి, స్వయానా త్రినేత్రకి బాబాయి.

త్రినేత్ర కి శివుడు అంటే చాలా ఇష్టం, ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్లడం అలవాటు,మూడవ తరగతి చదువుతున్న రోజుల్లో ఇద్దరు స్నేహితులు బాగా దగ్గరయ్యారు వాళ్లే విక్రాంత్, రమేష్ .

అందరూ వీళ్ల ముగ్గురిని త్రివిక్రమ్ అని పిలిచేవారు.

ఒకరోజు రమేష్ వాళ్ల మామయ్య అమెరికా నుంచి వచ్చాడు, రమేష్ కోసం ఒక కెమెరా తీసుకొని వచ్చాడు..దాన్ని స్నేహితులకి చూపించడానికి తీసుకు వెళ్ళాడు, సరదాగా రోజు కొన్ని వీడియోలు తీసుకునేవారు... అలా కొన్ని రోజులు గడిచి పోయాయి.

ఒకరోజు త్రినేత్ర ,రమేష్ ని ఆటపట్టించడం కోసం కెమెరాని లాక్కున్నాడు.. త్రినేత్ర ఒక వీడియో తీయడం మొదలుపెట్టాడు.అదే టైమ్ లో కెమెరా అనుకోకుండా కింద పడి పగిలిపోయింది.. రమేష్ కి చాలా కోపం వచ్చింది.. విక్రాంత్ ఎంత చెప్పినా కూడా రమేష్ వినలేదు.

త్రినేత్ర మరియు రమేష్ బాగా గొడవ పడ్డారు.. త్రినేత్ర కోపం తట్టుకోలేక రమేష్ ని కొట్టాడు... అది చూసి విక్రాంత్ త్రినేత్ర నీ తిట్టాడు..అప్పట్నుంచి విక్రాంత్ మరియు రమేష్.. త్రినేత్ర తో మాట్లాడ్డం మానేశారు..పగిలిన కెమెరా ని రిపేర్ చేయిస్తానని త్రినేత్ర తన వెంట తీసుకొని వెళ్ళాడు...

ఇంటికి రాగానే వాళ్ళ నాన్న ఒక వార్త చెప్పారు. తనకి వేరే ఊరు ట్రాన్సఫర్ అయింది. వెంటనే మనం ఊరు ఖాళీ చేసి వెళ్లాలి అన్నాడు. అప్పుడు త్రినేత్ర వాళ్లు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళి పోయారు..

త్రినేత్ర కి మరియు రమేష్ ,విక్రాంతి కి ఇంకా దూరం పెరిగిపోయింది.రోజులు గడిచాయి, త్రినేత్ర బీటెక్ లో EEE చేశాడు ఉద్యోగం కోసం, తిరుగుతున్నాడు, ఒక రోజు తనకి ఒక కాల్ వస్తుంది...ట్రై కలర్ అనే కంపెనీ లో ఇంటర్వ్యూ కి రమ్మని దాని సారాంశం..

కొద్దీ రోజుల తరువాత త్రినేత్ర ఇంటర్వ్యూ కి వెళ్తాడు..అక్కడ చాలా మంది వస్తారు, ఒక్కొకరిని లోపలకి పిలుస్తూఉంటారు , అందరితో పాటు త్రినేత్ర కూడా పిలుపుకోసం ఎదురు చూస్తున్నాడు..

అనుకోకుండా ఒక పేరు వినిపించింది , అదే విక్రాంత్ అని. త్రినేత్ర ఉలిక్కి పడతాడు..అది తన చిన్ననాటి స్నేహితుడు పేరు, తనేమో అని ఆలోచిస్తుండగా..ఆ వ్యక్తి లోపలకి వెళ్తాడు..

చిన్నప్పుడు చూసిందే, ఇప్పుడు ఎలాఉంటారో వాళ్ళకి తెలీదు.

బయటకి వచ్చేలోపు త్రినేత్ర కి పిలుపు వస్తుంది...విక్రాంత్ అనే వ్యక్తిని కలవడం కుదరదు..

త్రినేత్ర కి ట్రై కలర్ అనే కంపెనీ లో ఉద్యోగం దొరికింది. 30 వేల జీతం.. అలా రోజులు గడిచాయి..

ఆఫీసులో గాయత్రి అనే ఒక అమ్మాయి కొత్తగా ఉద్యోగంలో చేరింది చూడగానే త్రినేత్ర కి బాగా నచ్చింది.గాయత్రి తన టీం లోనే జాయిన్ అయింది ,త్రినేత్ర ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు..

నాన్నగారు ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయారు, అమ్మ పెళ్లి చేసుకోమని కోరుతుంది.... వయసు 30 దాటింది, .

త్రినేత్ర , గాయత్రిలు ఇద్దరూ బాగా దగ్గరయ్యారు.ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మొదలు పెట్టారు..

ఒక రోజు ఇద్దరు హోటల్ లో కూర్చొని మాట్లాడుకుంటుండగా..గాయత్రి కి ఒక ఫోన్ వస్తుంది...

తను మాట్లాడుతూ...ఎప్పుడు వస్తున్నావ్ అన్నయ్య అని అవతలి వ్యక్తిని అడిగింది.. సరే అంటూ ఫోన్ పెట్టేసింది గాయత్రి..

ఎవరు ఫోన్లో అని అడిగాడు త్రినేత్ర...మా అన్నయ్య..రెండు రోజుల్లో ఇక్కడికి వస్తున్నాడు..ఎదో కోర్ట్ పని ఉంది అన్నాడు అని చెప్పింది..

నీకో అన్నయ్య ఉన్నట్టు ఎప్పుడు చెప్పలేదు అన్నాడు త్రినేత్ర, మా అమ్మ వాళ్ళకి నేను ఒక్కదాన్నే.. కానీ తాను మా పెదనాన్న కొడుకు...వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు..

అవునా..సరే మళ్ళీ కలుద్దాం అని ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు..

మూడు రోజులు అయ్యింది..గాయత్రి , త్రినేత్రతో మాట్లాడి..ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ ఇస్తే సమాధానం లేదు..ఆఫీస్ కి కూడా సెలవు పెట్టింది..

త్రినేత్ర ఏమైందో తెలీక ,ఖంగారు పడుతుండగా..గాయత్రి ఫోన్ చేసింది..కోపంలో త్రినేత్ర గాయాత్రిని బాగా కోపడతాడు...గాయత్రి, ఏడుస్తూ..నేను చెప్పేది ముందు విను..అనింది..సరే చెప్పు అన్నాడు..

మా అన్నయ్య ఊరినుంచి వచ్చాడు..వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు..చాలారోజులనుంచి..జైల్లో ఉన్నాడు..ఎన్ని రకాలుగా ప్రయత్నస్తున్న ..అయ్యానని నిర్దోషి అని రుజువు చేయలేక పోతున్నారు...వాళ్ళ ఫ్రెండ్కి ఆక్సిడెంట్ అయ్యి లెవలేని స్ధితిలో ఉన్నాడు..

అవునా అయ్యో పాపం, ఇప్పుడు ఎలా అని అడిగాడు..అదే అర్ధం కాక నేను మా అన్నయ్య ఆలోచిస్తూ కూర్చున్నాం..అని గాయత్రి సమాధానం చెప్పింది.

నేను ఏమైనా సహాయం చేయగలన అని అడిగాడు..నువ్వు ఇక్కడికి వస్తే నాకు కొంచం ధైర్యం వస్తుంది..అని గాయత్రి చెప్పింది..

సరే ఇవాళ సాయంత్రం నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను.. నేను కూడా మీకు నా వంతు సహాయం చేస్తాను అన్నాడు..త్రినేత్ర..

అనుకున్నటే, సాయంత్రం ఆఫీస్ నుంచి గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు త్రినేత్ర..అక్కడ గాయాత్రికి తనని చూసి చాలా ధైర్యం వచ్చింది..గట్టిగా గుండెలకు హత్తుకుంది..

వాళ్ళ అన్నయ్యకి, త్రినేత్రని పరిచేయం చేసింది..అప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటం మొదలు పెట్టారు..నా పేరు..విక్రాంత్..మాది చెన్నపట్నం..మా చిన్ననాటి స్నేహితుడు రమేష్ వాళ్ళనాన్నని 15 సంవత్సరాల క్రితం ఒక మర్డర్ కేసులో అరెస్ట్ చేశారు..

త్రినేత్ర కి ఎదురుగా ఉన్నది తన చిన్ననాటి స్నేహితుడు అని అర్ధం అయ్యింది..కానీ త్రినేత్ర, తనగురించి..మొత్తం చెప్పలేదు..చెపితే తను కచ్చితంగా తనతో మాట్లాడడు, సహాయానికి ఒప్పుకోడూ.. అని తన పేరు మాత్రమే చెప్పి, మిగతా మాటలు దాటేశాడు...

మీ స్నేహితుడు రమేష్ కి ఏమైంది అని అడుగగా, తనకి ఒక పెద్ద ఆక్సిడెంట్ అయ్యింది..ప్రస్థుతానికి లెవలేని పరిస్థితులలో ఉన్నాడు..అని చెప్పాడు విక్రాంత్..

సరే నాకు తెలిసిన సీనియర్ లాయర్ ఒకాయన ఉన్నాడు..చాలా అనుభవం ఉన్న వ్యక్తి..ఆయన్నీ ఒక్కసారి కలిసి..ఆయన సలహా తీసుకుంటా అన్నాడు త్రినేత్ర..

త్రినేత్ర ఇంటికి వెళ్ళాక, చిన్ననాటి స్నేహితుడిని కలిసా అని అనంద పడాలో లేక..ఇలా జరిగింది అని బాధ పడాలో అర్ధం కాక అయోమయ స్థితి లో ఉన్నాడు..

వారం రోజుల తరువాత , త్రినేత్ర ఆఫీస్ లో ఉండగా వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు..మీ బాబాయిని పోలీసులు అరెస్ట్ చేశారు అని..

ఇంకొద్దిసేపటి తరువాత, గాయత్రి కి ఫోన్ వస్తుంది..విక్రాంత్ మాట్లాడుతూ..రమేష్ వాళ్ళ నాన్నని నిర్దోషిగా విడుదల చేసారు అని చెప్తాడు....తను వచ్చి త్రినేత్రతో ఈ విషయం చెప్పగా..చాలా సంతోషిస్తాడు...

రెండు రోజుల తరువాత, ఇద్దరు కలిసి..హోటల్ కి వెళ్తారు..అక్కడ గాయత్రి త్రినేత్రతో ఒక విషయం అడుగుతుంది..

ఇన్ని సంవత్సరాలుగా తేలనిది..ఈ వారంలో ఎలా సాధ్యమయ్యిందో నాకు ఇప్పటికి అర్ధం కాలేదు అని గాయత్రి , త్రినేత్రని అడిగింది...

అప్పుడు త్రినేత్ర, గాయత్రి కి ..మొత్తం చెప్పడం మొదలు పెట్టాడు..

తన చిన్నపుడు జరిగింది మొత్తం చెప్తాడు..విక్రాంత్, రమేష్ ఇద్దరూ తన చిన్ననాటి స్నేహితులని, కెమెరా వల్ల వాళ్ళ మధ్య జరిగిన గొడవ గురించి..అలా చెప్పుకుంటూ వస్తాడు..

ఇవన్నీ సరే కానీ, రమేష్ వాళ్ళ నాన్నని నిర్దోషిగా ఎలా నిరూపించారు..అని అడిగిన ప్రశ్నకు బదులుగా..

సర్టిఫికెట్ల కోసం ఇల్లు సర్దుతూ ఉండగా పగిలిన కెమెరా ఒకటి దొరికింది.విరిగిన కెమెరాని, బాగు చేయించినతరువాత, ఇంటికి వచ్చి ,ఫోటోలు , వీడియోలు ఒక్కొక్కటిగా చూడడం మొదలు పెట్టా.. అందులో ఒక వీడియో చూస్తున్నప్పుడు..దూరంగా ఎవరో గోడవపడటం గమనించా..కానీ అప్పుడు నాకు ఇంటర్వ్యూ కాల్ రావడం, ఆ హడావిడిలో దాని గురించి..మర్చిపొయా.. మళ్ళీ విక్రాంత్ ని కలిసి, రమేష్ వాళ్ళ నాన్న గురించి..విన్నాక అది గుర్తొచ్చి ఆ వీడియో మొత్తం చూసా..అందులో మొత్తం రికార్డ్ అయ్యింది..

ఆ ఖూనీ చేసింది..మా బాబాయి, చనిపోయింది రమేష్ వాళ్ళ మావయ్య, వాళ్లిద్దరూ ఒక్కపుడు స్నేహితులు...

రమేష్ వాళ్ళ అతయ్య తరచూ గుడికి వచ్చేది అక్కడ మా బాబాయి ప్రేమించాడు..కానీ..రమేష్ వాళ్ళ మావయ్య పెళ్లిచేసుకోవడం ..అది ఇష్టం లేక..పగ పెంచుకొని..మా బాబాయి తనని చంపడం జరిగింది..

ఇలా మొత్తం అందరికి న్యాయం జరిగింది..అది చాలు నేను చాలా సంతోసంగా ఉన్నా అన్నాడు త్రినేత్ర..

మరి..నువ్వే చిన్నపుడు త్రినేత్రవి అని చెప్పొచ్చుకదా అని అడిగింది..గాయత్రి..

నేను చిన్నపుడు చేసిన తప్పు వాళ్ళు ఇంకా మర్చిపోయుండరు...మళ్ళీ ఎందుకు గుర్తుచేసి బాధ పెట్టడం అని అనుకుంటున్నాను అన్నాడు త్రినేత్ర..

త్రినేత్ర, గాయత్రి ఇద్దరు వాళ్ళ ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పిస్తారు..

ఇద్దరు పెళ్లి చేసుకుంటారు.. అసలు విషయం తెలియని విక్రాంత్ , రమేషులు వస్తారు..వదువరుల్ని ఇద్దర్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారు..

కొన్ని రోజుల తరువాత విక్రాంత్ కి గాయత్రి మొత్తం చెప్తుంది..చాలా సంతోషితాడు.. కానీ రమేష్ కి చెప్తే ఎలా రియాక్ట్ అవుతడో తెలీదు , అస్సలే పెళ్లి కుదిరి ఆ హడావిడిలో ఉన్నాడు..అని గమ్మున్న ఉంటాడు విక్రాంత్..

ఆ రోజు రమేష్ పెళ్లి, అక్కడికి త్రినేత్ర , గాయత్రిలు వెళ్లారు..

సాయంత్రం పెళ్లి హడావిడి అయ్యక రమేష్ తన భార్యతో కలిసి , బహుమతులు చూస్తుంటారు..

రమేష్ భార్య, ఒక బహుమతి చూపించి..ఇదేంటండి..ఎవరో పాత కెమెరా ఇచ్చారు అని అడుగుతుంది..ఇలా ఇవ్వు నేను చూస్తా అని చూడగా..అప్పుడు తనకి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి..

రమేష్ వెంటనే విక్రాంత్ కి ఫోన్ చేస్తాడు..విక్రాంత్ జరిగింది మొత్తం చెప్తాడు...చాలా సంతోషించి..మర్నాడు..అందరూ కలిసి ఆనందంగా గడుపుతారు...



Rate this content
Log in

Similar telugu story from Drama