kavi voleti

Crime

4.3  

kavi voleti

Crime

డిటెక్టివ్ నెంబర్ వన్

డిటెక్టివ్ నెంబర్ వన్

7 mins
974


"మూడు రోజుల క్రితం గౌతమి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి అరుణ శవం ఇంకా లభ్యం కాలేదు.కాగా భార్య ఆత్మహత్య కేసులో తనే కారణం అని ఆమె భర్త మనోజ్ ఒప్పుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. నేడో రేపో నిందితుడికి శిక్ష పడే అవకాశం ఉంది".

 పేపర్ చదివి నిట్టూర్చాడు సిద్ధార్థ. ఎందుకలా జరిగింది .

చేయని నేరాన్ని మనోజ్ ఎందుకు ఒప్పుకున్నాడు?

 అర్థం కాలేదు .

కాసేపు అలాగే ఉండిపోయాడు సిద్ధార్థ.

      ****


"ఏమయ్యా యాదయ్య ..తిరుపతి ప్రయాణం బాగా జరిగిందా?'

 అడిగాడు

ఎస్సై వెంకట్.


" జరిగింది సార్" సమాధానం ఇచ్చాడు కానిస్టేబుల్ యాదయ్య.


" సరే నాలుగో నెంబరు సెల్లో ఉన్నవాడిని కొంచెం జాగ్రత్తగా చూడు. రేపు వాడిని కోర్టుకు తీసుకెళ్లాలి" అని చెప్పి బయటికి వెళ్లాడు ఎస్సై.


 కానిస్టేబుల్ యాదయ్య నలుగురితో కలుపుగోలుగా ఉండే మనిషి.

 సెల్ దగ్గరికి వచ్చాడు లోపల ప్రశాంతంగా కూర్చున్న మనోజ్ ని చూసాడు. కాస్త ఆశ్చర్యం వేసింది.

 బయట కానిస్టేబుల్స్ మాట్లాడుకుంటుంటే విషయం ముందే తెలిసింది తనకి .

"ఏమయ్యా నిన్ను చూస్తే మంచివాడిలాఉన్నాడు ఎందుకలా చేసావ్" అడిగాడు యాదయ్య.

" నేను చేయలేదు "

సూటిగా చెప్పాడు మనోజ్ .

"మరి ఎందుకు నేరాన్ని ఒప్పుకుంది" ఆశ్చర్యంగా అడిగాడు యాదయ్య.


" మీకు తెలియంది ఏముంది సార్ "

ఒప్పుకోక పోతే మీ సీఐ ఊరుకుంటారా."

 అంతే వేగంగా బదులిచ్చాడు మనోజ్.

 కాసేపు ఏం మాట్లాడలేదు యాదయ్య .

మళ్లీ మనోజ్ అన్నాడు

" సర్ ఏమీ అనుకోకపోతే ఒక్క మాట నేను మీరు ఎంతో నిబద్ధతతో ఉంటారని విన్నాను. నిజానికి నా భార్య ఆత్మహత్య చేసుకోవడానికి నేను కారణం కాదు. అయితే హంతకుడికి సీఐ తో సంబంధం ఉంది. అందుకే నన్ను బుక్ చేసారు మీరు నాకు ఒక సాయం చేస్తే నేను బయట పడగలను"


' ఏంటది చెప్పు చేతనైతే చేస్తాను' యాదయ్య ఆసక్తిగా అడిగాడు.


" సార్ నా భార్య డైరీ ఉంది దాంట్లో ఆధారాలు ఉంటాయి కానీ నే చూపిస్తే సీఐ ఆధారాన్ని నాశనం చేసే అవకాశం ఉంది అందుకే దాన్ని నేను డైరెక్ట్ గా కోర్టులో సబ్మిట్ చేద్దామనుకుంటున్నా."


" మంచి ఆలోచన మరి ఆ డైరీ ఎక్కడ ఉంది "

" చెబుతా సార్ . అది మా ఇంట్లోనే ఉంది"


" అంటే నేను మీ ఇంటికి వెళ్లి డైరీ తేవాలా ?"


"అసలు వద్దు సార్. మీరు తేలేరు. నాకు ఒక సాయం చేయండి చాలు. నా స్నేహితుడు సిద్ధార్థ ఒక డిటెక్టివ్.తానే ఆ పని చేయగలడు. తనని ఇక్కడికి పిలిచి నాకు తనతో రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తే వెంటనే తనే డైరీ తీసుకుని రేపు కోర్టు కు వస్తాడు మీకు ఎటువంటి ఇ ఇబ్బంది ఉండదు"

 అన్నాడు

" సరే సరే తను ఎక్కడ ఉంటాడు ఇప్పుడు?"

 " ఇందిరా పార్క్ చివరి గేటు దగ్గర నాలుగో నెంబర్ బెంచి మీద ఒక్కడే కూర్చుని ఉంటాడు. వెళ్లి మనోజ్ రమ్మన్నాడని చెప్పండి.

తనతో ఇంకేమీ చెప్పకండి "


"సరేగాని అతనొక్కడే అక్కడే ఉంటాడని ఎలా చెప్పగలవు?" 


"సర్ ప్రతి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకి మేమిద్దరం అక్కడే కలుస్తాం. అతను పేపర్ చదివి ఉంటే ఈపాటికే నన్ను చూడడానికి వచ్చేవాడు రాలేదు అంటే నాకోసం ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి...."


" సరే సరే నేను ఇప్పుడే వెళ్లి తనని తీసుకొస్తాను."


 అన్నట్టుగానే 10 నిమిషాలలో వచ్చాడు సిద్ధార్థ .


"ఏంటి ఇది ..ఎందుకు నేరం మీద వేసుకున్నావ్ .. "

బాధగా అన్నాడు సిద్ధార్థ .


" తప్పలేదు రా..ఇంకో దారి లేదు. అదంతా వదిలేయ్ సిద్ధార్థ.

 చెప్పేది విను ఒక్కసారి మా ఇంటికి వెళ్ళు .మధ్య హాలు లో చివర బీరువా ఉంటుంది. అది ఓపెన్ చేస్తే అండర్ గ్రౌండ్ కి మెట్లు ఉంటాయి .కింద కి వెళ్ళు అక్కడ ఒక పెట్టె ఉంటుంది. అందులో డైరీలు ఉంటాయి. నా భార్య డైరీ అందులో ఉంది .అందులో తాను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది అన్న కారణం కూడా ఉంటుంది.

ఆ ఒక్కటి ఉంటే నేను కేసు నుంచి బయటికి వస్తాను. నాకు తెలిసి మన సిఐ కి హంతకుడికి సంబంధం ఉండి ఉండాలి .ఆయన ప్రెషర్ తెస్తున్నట్టు నాకొక కానిస్టేబుల్ చెప్పాడు. అందుకే నేను ఆధారాన్ని పోలీసులకు ఇవ్వలేదు." ముగించాడు మనోజ్.


"నీకోసం ఈ మాత్రం చెయ్యనా ఇప్పుడే మీ ఇంటికి వెళ్తాను సరేనా నా నువ్వు ధైర్యంగా ఉండు" చెప్పాడు సిద్ధార్థ.


"ఇంకో మాట విను సిద్ధార్థ .

నువ్వు మా ఇంటి గేటు దగ్గర మా తమ్ముడు ఉంటాడు. వాడిని అడిగి ఇంటి తాళాలు తీసుకో. దానితోపాటు ఒక బ్యాగు కూడా ఇస్తాడు అది భుజానికి తగిలించుకో.

 ఎందుకంటే నీకు తెలుసు కదా నా ఇంటికి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు మామూలుగా తాళం తీసినా తలుపు తెరుచుకోదు. నీ వెనుక బ్యాగ్ లో మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది.దానివల్ల తలుపు సులభంగా తెరుచుకుంటుంది.

 ఆ బ్యాగ్ ని బయటకు వచ్చే వరకు అలాగే ఉంచుకుని వచ్చేటప్పుడు బ్యాగ్ తాళాలు తమ్ముడికి ఇచ్చేయ్ సరేనా.

 నేను యాదయ్య ఫోన్ లో నుంచి తమ్ముడికి చెప్పే ఉంచుతాను." అన్నాడు.

" సరే "

అని చెప్పి బయటికి వెళ్లాడు సిద్ధార్థ.


 ఈలోగా బయట ఎస్సై ఎవరితో మాట్లాడుతూ ఉండడం చూసాడు యాదయ్య.

 సరే బాబు నేను టిఫిన్ చేసి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు యాదయ్య.

 ఓ ముప్ఫయి నిమిషాలు గడిచాక మళ్లీ మనోజ్ దగ్గరికి వచ్చాడు.

 మౌనంగా కూర్చున్నాడు మనోజ్. "ఏంటయ్యా నీలో అసలు టెన్షన్ కనిపించట్లేదు ఏం అంత ధైర్యం?'" అడిగాడు యాదయ్య .

"తెలీదు"

 చెప్పాడు మనోజ్.

" సరే మీ ఇల్లు ఇక్కడి నుంచి కనీసం గంట ప్రయాణం అని విన్నాను. మీ ఫ్రెండ్ ఎప్పటికి వెళ్తాడు" బాధగా అన్నాడు యాదయ్య .

"అదేం లేదు అరగంటలో..

 ఈపాటికి వెళ్లే ఉంటారు.." అన్నాడు మనోజ్ .


"ఉంటారా ఒక్కడే కదా"

 అన్నాడు యాదయ్య 

"కాదు తను మీ ఎస్ఐ ని కూడా తీసుకు వెళ్తాడు "చెప్పాడు మనోజ్.


"ఓహో..ఎస్సై మీకు తెలుసన్న మాట"


"లేదు.." 

"అదేంటి అప్పుడు నీకు పెద్ద కష్టమే వస్తుంది" ఇంకా బాధపడ్డాడు యాదయ్య.

" లేదు వాళ్ళిద్దరూ పోలీస్ జీప్ లో వెళ్తారు కాబట్టి అరగంటలో వెళ్లిపోతారు"

 చెప్పాడు మనోజ్.

      ********

ఎస్సై ,సిద్ధార్థ ఇద్దరు మనోజ్ ఇంటికి చేరుకున్నారు.

 వీధి చివర జీపును ఆపి ఎస్ ఐ అక్కడే నిలబడ్డాడు.

 సిద్ధార్థ మాత్రం మనోజ్ ఇంటికి వెళ్ళాడు. గేటు దగ్గర మనోజ్ తమ్ముడు నిలబడి ఉన్నాడు.

 "నిన్ను ఎప్పుడూ చూడలేదు ఇదే మొదటిసారి"

 అన్నాడు సిద్ధార్థ .

'అవును సర్ నేను ఇక్కడ ఎక్కువగా ఉండను "చెప్పాడు ఆ కుర్రాడు.


 తాళాలు ఒక బ్యాగ్ సిద్ధార్థ కి ఇచ్చి తను అక్కడినుంచి వెళ్లిపోయాడు.

 వెంటనే ఎస్ఐకి సైగ చేసాడు సిద్ధార్థ. ఇద్దరూ గేటు తీసుకుని లోపలికి వెళ్లారు.

 "ఈ బ్యాగ్ ఏంటి "

అడిగాడు ఎస్సై.

 "ఇది మ్యాగ్నెటిక్ బ్యాక్ దీని సాయంతో మనం తలుపులు తీయగలం" అన్నాడు సిద్ధార్థ .

"నీ స్నేహితుడు చాలా తెలివైనవాడు

పాపం '' నవ్వాడు ఎస్సై.

       ******


"సరేగాని ఎస్ ఐ గారి వల్ల మీకు భయం లేదా బాబు " అడిగాడు యాదయ్య .

" ఉంది ఇందాక నేను అన్నట్టు మీ 

సి ఐ కాదు మీ ఎస్ఐ య్యే హంతకులలో ఒకడు." చెప్పాడు మనోజ్ .

ఉలిక్కిపడ్డాడు యాదయ్య.

"మరి దొంగ చేతికి తాళాలు ఇచ్చారా?"

   *******


"ఇద్దరు ,లోపలికి వెళ్లారు .

వాళ్లు తలుపు తీయగానే లోపల ఆటోమేటిక్గా లైట్లు వెలుగుతున్నాయి "చాలా బాగుంది ఈ ఆలోచన" అనుకున్నాడు ఎస్ ఐ .

ఇద్దరు బీరువా తలుపులు తీసి మెట్ల మార్గంలో అండర్ గ్రౌండ్ కి వెళ్లారు. అక్కడ పెట్టె కనిపించింది .

"శభాష్ మన చేతిలో కి డైరీ చిక్కింది." సంతోషంగా అన్నాడు ఎస్ ఐ .

"అవును' అంటూ పెట్టి మూత తీశాడు సిద్ధార్థ.

 అందులో వరుసగా నాలుగైదు డైరీలు ఉన్నాయి వాటిలో ఆ సంవత్సరం డైరీ తీసాడు.

" ఒక్కసారి చదువు తను ఏం రాసిందో తెలియాలి" అన్నాడు ఎస్ ఐ.

" సరే సరే "

అంటూ పుస్తకం తెరిచాడు సిద్ధార్థ.

   ******


 "అది సరే బాబు మరి ఇప్పుడు ఎలా డైరీ వాళ్ళకి చిక్కితే ?"

తల పట్టుకున్నాడు యాదయ్య.


"దొరకదు స్వామి ఎందుకంటే అక్కడ డైరీ లేదు" అన్నాడు మనోజ్.

" అదెంటయ్యా.. మరి ఎక్కడుంది డైరీ" అడిగాడు యాదయ్య.


" సమస్య డైరీ కాదు సర్ మీరు కాసేపట్లో ఒక వార్త వింటారు అప్పుడు మీకే అర్థమవుతుంది ఈలోగా దయచేసి నాకు కొంచెం టీ పట్టుకు రాగలరా..." అదే ప్రశాంతతతో అడిగాడు మనోజ్.


" ఓకే ఓకే "అంటూ ఆలోచిస్తూనే ఇవ్వడానికి వెళ్ళాడు యాదయ్య

 5 నిమిషాల్లో ఒక కానిస్టేబుల్ వచ్చి యాదయ్య కి ఏదో చెప్పాడు. ఒక్కసారిగా స్తబ్దంగా నిలబడిపోయాడు యాదయ్య. గబగబా సెల్ దగ్గరకు వచ్చాడు .


"ఏం చేశావు నాయనా ..చంపేశావ్ ఇద్దరిని ..మీ ఇంట్లో బాంబు పేలి ఎస్సై నీ ఫ్రెండ్ ఇద్దరూ చచ్చిపోయారట.. ఏమనుకుంటున్నావు నువ్వు.. అయిపోయింది నీ పని ..."

రౌద్రం గా ఉంది యాదయ్య మొఖం. మళ్లీ అదే ప్రశాంతతతో ఉన్నాడు మనోజ్ .

"యాదయ్య గారు శాంతంగా ఉండండి నేను మీకు అంతా చెబుతాను వింటానంటే"

 అన్నాడు.

" సరే చెప్పు త్వరగా నేను వెళ్ళాలి" అన్నాడు కోపం గా యాదయ్య.

" సరే వినండి నా భార్య ఆత్మహత్యకు కారణం నా స్నేహితుడు . అతనికి సాయం చేసింది మీ ఎస్ఐ.

 నేను నా భార్య అరుణ 3 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.

 ఈ ఊరు వచ్చాక నా పాత స్నేహితుడు సిద్ధార్థ కలిసాడు.

 నాకు ఒక రోజు పని ఉండి బయటికి వెళ్లినప్పుడు తను వచ్చి నా భార్య కు తెలీకుండా అసభ్యకరంగా ఫోటోలు తీసాడు.

తర్వాత తనను బెదిరించడం మొదలుపెట్టాడు.

నాకు చెప్తే బయట పెట్టేస్తానన్నాడు.

 తనను లొంగ తీసుకోవడానికి ప్రయత్నించాడు. అది మరీ మితి మీరడం తో ఒకరోజు నా భార్య అతని గురించి ఎస్సైతో డైరెక్ట్ గా మాట్లాడింది. ఎస్సై సిద్ధార్థ కి స్నేహితుడిని అప్పుడే తెలిసింది. సిద్ధార్థ ను ఏమి అనకపోగా తిరిగి నా భార్యతో అసభ్యంగా మాట్లాడాడు. ఇద్దరూ కలిసి తనను చెరచాలని చూసారు.

 కానీ ఇదంతా చీకటి బాగోతం. అరుణ నాకేమీ చెప్పలేదు అని వాళ్ల ఉద్దేశం.

 తను కూడా అలాగే ఉండేది.

 సిద్ధార్థ మా ఇంటికి వస్తూ నాతో బాగానే మాట్లాడేవాడు కానీ అరుణ నా దగ్గర ఏదీ దాచలేదు.

చివరికి వాళ్ళిద్దరి బాధ పడలేక తను ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరినీ అందుకే శిక్షించాను. నేను చేసింది తప్పా స్వామి?"

 అడిగాడు మనోజ్.


" లేదయ్యా లేదు నువ్వు చేసింది కరెక్టే కానీ చట్టప్రకారం తప్పు నాకు చట్టం ముఖ్యం నేను నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతాను." అన్నాడు యాదయ్య.


" సరే మీ ఉద్యోగం పోవాలి అనుకుంటే చెప్పండి పెళ్లి కావలసిన మీ అమ్మాయి ఇంకా సెట్టిల్ అవ్వని మీ అబ్బాయి గురించి ఆలోచించుకోండి.


" నా ఉద్యోగం ఎందుకు పోతుంది మధ్యలో ?'

దాదాపుగా అరిచినట్టు అన్నాడు యాదయ్య..

" అయ్యా పోదామరి మీరే నాకు సహకరించారు నా స్నేహితుడిని తీసుకువచ్చారు .ఎస్ ఐ ని పంపించారు. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి కదా పార్క్ లో సీసీ కెమెరాల్లో మీరు నా స్నేహితుని తీసుకొచ్చినట్టు సాక్షం ఉంటుంది.

 పైగా మీ సెల్ నుంచి నా తమ్ముడికి ఫోన్ చేశాను కూడా ఆలోచించుకోండి."

 ఆపేసాడు మనోజ్ .

"ఏరా బాబు బాగా బుద్ధి చెప్పావ్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు ఒకవేళ నేను సాక్ష్యం చెప్పకపోయినా మీ ఇంట్లోకి బాంబు ఎలా వచ్చింది అనే ప్రశ్న వస్తుంది దానికైనా నువ్వు సమాధానం చెప్పుకోవాలి"

 అన్నాడు యాదయ్య .


"ఆ ప్రశ్నఏ రాదు సార్.

 నా ఇంట్లో అన్నిచోట్ల నేను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాను.

 2 రోజుల క్రితం ఎస్సై నా ఇంటికి వచ్చి నా భార్య ఆత్మహత్యకు నేనే కారణమని ఒప్పుకుంటే అసలు నిందితులు పారిపోవడానికి ప్రయత్నించకుండా దొరికే అవకాశం ఉంటుందని చెప్పి నన్ను ఒప్పించాడు అదంతా కూడా నేను రికార్డు చేసుకున్నాను. పాపం ఆ విషయం మీ గురువు గారికి తెలీదు."

' అది సరే మరి బాంబు సంగతి" అడిగాడు యాదయ్య.

" నిజానికి బాంబు ఆ బ్యాగ్ లోనే ఉంది సార్ ఆ బ్యాగ్ మ్యాగ్నెటిక్ బ్యాగ్ కాదు .

ఆ బ్యాగును సిద్ధార్థ కి ఇచ్చే ముందే నా స్నేహితుడు అందులో బాంబును పది నిమిషాలకి సెట్ చేసి ఉంచాడు. వాళ్లు తలుపు తీసుకుని లోపలికి వెళ్లారు అక్కడ ఆ సీసీ కెమెరాల్లో బాగ్ వాళ్లు తెచ్చుకున్నట్టె ఉంటుంది.

 వాళ్లు పెట్టె తలుపు తెరవగానే బ్యాగ్ లో ఉన్న బాంబు పేలింది. కాబట్టి సాక్ష్యం ఎవరు లేరు.

 నవ్వుతూ అన్నాడు మనోజ్.

 "బాగుందయ్యా చాలా తెలివైనవాడివి అవును మీకు ఎన్ని తెలివితేటలు ఉంటే నీ స్నేహితుడు డిటెక్టివ్ కదా వాడికి ఎందుకు లేవు.." ఆశ్చర్యంగా అన్నాడు యాదయ్య.


" మీకు తప్పు చెప్పాను సార్ డిటెక్టివ్ వాడు కాదు నేనే" అదే నవ్వు మనోజ్ ముఖంలో.

"ఓరి దేవుడా నువ్వు మామూలోడివి కాదు .

ఇంత ఈజీగా శత్రువుల్ని చంపొచ్చా.

 కానీ నాకు ఇంకో సందేహం ఉంది నీ భార్య చనిపోయినా నీకు ఎందుకు బాధ లేదు? అంతేకాదు ఇంత తెలివైన వాడిని భార్య చనిపోకుండా ఎందుకు కాపాడుకోలేక పోయావు? త్వరగా చెప్పు నేను వెళ్ళాలి" అన్నాడు యాదయ్య.


" తప్పకుండా సార్ నిజానికి నా భార్య నాకన్నా తెలివైనది ధైర్యవంతురాలు కూడా చనిపోయే అంత పిరికిది కాదు. తన జోళ్ళు హ్యాండ్ బ్యాగ్ వంతెన మీద ఉంచి,

కాలువలో దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. చూసినవాళ్లు మునిగిపోయింది అనుకున్నారు. పాపం తన కోసం వెతికి దొరక లేదన్నారు .

కానీ నా ప్రియమైన అరుణ బ్రతికే ఉంది ."

నెత్తి మీద పిడుగు పడింది యాదయ్య కి.

అంటే ఇద్దరూ నాటకం ఆడి వీళ్ళని చంపేశారు అన్నమాట."

 అన్నాడు .


'మరి ఏం చేయమంటారు సార్ 

ఒకటి చంపాలి లేదా ఏడుస్తూ చావాలి..

 నాకైతే మొదటిదే కరెక్ట్.

 మీరేమంటారు..?"

 మళ్ళీ మాట్లాడలేదు యాదయ్య..

      *******


Rate this content
Log in

Similar telugu story from Crime