Srinivasa Bharathi

Comedy

3  

Srinivasa Bharathi

Comedy

సెల్ భాగోతం..7:::శ్రీనివాస భార

సెల్ భాగోతం..7:::శ్రీనివాస భార

3 mins
312


రఘురామ్ ఇంటి వైపు అడుగులు కదిలాయి. అరకిలో మీటర్ దూరంలో ఎడారిలో ఒయాసిస్సు కన్పించినట్టు కన్పించింది... ఎండలో రావడం వల్ల.

గొడుగుని గడపలో ఓ మూల దాచి "రఘురామ్" అంటూ కేకేసాడు. వాళ్ళ చిన్నమ్మాయి ప్రణవి తలుపు తీసింది.

" నాన్నగారు లేరంటూ" చెప్తునే

"కవి సాహిత్య సమ్మేళనానికి వెళ్లారు. "అంది.

"అదెక్కడా ?"అడిగాడు. "10 నిమిషాల దూరం ఇక్కడ్నుండి"

". మళ్ళీ మీ నాన్న ఎప్పుడు రావొచ్చు?"

" ఫోనొచ్చింది అంకుల్ అక్కడనుండి మా పెద్దక్క గీత వాళ్ళింటికి వెళ్లి రెండు రోజులు పోయాక వస్తారు.ఎందుకో నాన్న గారు మీ గురించి రెండుసార్లు అడిగారు కూడా." అంది..."చచ్చాం ఫో...ఐతే ఇప్పుడు అక్కడికి వెళ్ళాక తప్పదన్నమాట.." అనుకొంటూ

..కాళ్ళు కాళ్ళీడ్చుకొంటూ ముందుకు సాగాయి. మొత్తానికి చేరాడు ఎలాగైతేనేం.

గురజాడ వారి రచన కన్యాశుల్కం గురించి కొందరు ప్రసంగించారు. ఒక దురాచారం సమాజం నుండి తరిమెయ్యలంటే నేర్పుగా చెప్పగలిగే ఓర్పు ఉండాలి. సమాజం తాను చెప్పిన విషయాన్ని ఆరోగ్యం కోసం చేదు మాత్రయిన మింగక తప్పదన్నట్లు స్వీకరించగలగాలి. అప్పుడే రచయిత లేదా కవి విద్వత్తు అందరికీ తెలుస్తుంది. వరకట్నం దురాచారమే ఐనా ఇప్పటికీ కన్యాశుల్కం నాటకం చాలా చోట్ల ప్రదర్శించబడుతోంది. అదీ సజీవ సాహిత్యం గొప్పదనం...అలాంటివి చాలా మంది లబ్ధ ప్రతిష్టులు ఐన ప్రాచీనాంధ్ర కవులు. నవీనుల్లో కూడా ఆరుద్ర, ఆత్రేయ, శ్రీశ్రీ, దాశరధి వంటివారు....రాను రానూ సాహిత్యం కొత్త పుంతలు తొక్కింది..అయితే వాసి తగ్గి రాశి ప్రభావం పెరుగుతూ. ..ఆ ప్రసంగాలు క్లుప్తంగా చాలా బాగున్నాయి. అంత గొప్ప రచయితల్ని పది నిమిషాలు కు కుదించడం కష్టమే ఐనా...

పాత , కొత్త కవుల కలాలు గళాలు సవరించుకొంటున్నాయి. ఇద్దరు ముగ్గురు కవుల కవితలు చప్పట్ల జడివానలో తడిసి ముద్దయ్యాయి. ఆనందరావు కూడా చేతులు కలిపాడు.. చప్పట్ల సంబరంలో..

అప్పుడర్ధం అయిందాతడికి...గొడుగు వదిలేసిన విషయం.

"చచ్చాం. పో"

"ఇప్పుడేది దారి? గొడుగు రఘురామ్ గాడి ఇంటి దగ్గరే వదిలేసుంటా. అంటే ఇక్కడ్నుండి వాడు క్యాంపుకు డైరెక్ట్ గా వెళ్తే నేను మళ్ళీ వాడింటికి వెళ్లి గొడుగు తెచ్చుకోవాలేమో"

ఇంతకీ గొడుగు అక్కడే ఉంటుందా? వాళ్ల అమ్మాయి దాన్ని భద్రంగా దాచి ఉంటుందా ?లేదా దాన్ని అక్కడే ఉండనీ అని వదిలేస్తుందా? లేదా ఈలోపు ఎవడైనా పుణ్యాత్ముడు వచ్చి దాంతో అలా అలా..?.వెధవది ఫోన్ ఉంటేనా? ఒక్క క్షణంలో చేసి కాస్త జాగ్రత్తగా ఉంచమ్మా అనక పోదునా...అసలు ఫోన్ పోబట్టేగా ఈ సమస్యలన్నీ.? అనుకున్నాడు.

.

"ఫోన్ కు తోడు గొడుగు కూడా పోయిందంటే ఇంకా చెప్పేదేమైన ఉందా..అసలే వాళ్ళ నాన్న ఈమధ్యనే కొనిచ్చినది.అది.

..మళ్ళీ ఓ అరగంట అర్ధం కాని భాషలో శాస్త్రీయ సంగీతం...దాన్ని కేవలం కొందరు ఇల్లాళ్ళు మాత్రమే కొందరు భర్తల కోసం కనిపెట్టినట్టున్నారు..కొందరు దీన్ని కొళాయి భాష అంటారు కూడా.

"ఇంతకీ ఈ గుంపులో వీడెక్కడున్నాడో..?ఎలా వెదికేది?

స్టేజెక్కి మైక్ లో అనౌన్స్ చేస్తే?...చుక్కల్లో అరుంధతిలా ఠక్కున ప్రత్యక్షం ఔతాడు...అది సాధ్యం అయ్యే పనేనా? మరేది దారి?

.. చుట్టూ చూసాడు సభా ప్రాంగణం అంతా ఇసక వేస్తే రాలనట్టుంది...

అంతా కవి సమ్మేళనం మహిమా? భానుడి ప్రతాపమా? లేదా నాలా ఒకర్ని వెదకడానికి మరొకరు రావడం వల్లా?

అతడికి కాస్సేపు అర్ధం కాలేదు..కళ్ళు గుండ్రంగా తిరిగాయి..సెర్చ్ లైట్లు లా. సగం మంది బట్టతల వాళ్ళే తనలా..ఆ ఆడిటోరియం పైకి వెళ్లే కొద్ది ఎత్తు పెరిగింది.తాను చివర్లో ఎలాగో చేరాడు..తనకన్నీ వీపులు...బట్టతలలే..మధ్యలో మాత్రం ప్రత్యేకంగా యూనిఫామ్ లు. బహుశా సభ నిండడానికి తెచ్చారేమో మరి. లేదా వాళ్లే స్పాన్సర్ చేస్తున్నారా ?

ఒకరెవరో ఛందో బద్దంగా వర్తమాన చదువులు గురించి మాత్రా చందస్సులో చెప్తున్నారు..తప్పట్లు మారుమోగుతున్నాయి.

అసలీవేళ సెలవుకదా?..మరి యూనిఫామ్ ల హాజరేంటి?.. అంటే బానిస బోధన ...వక్తల కోసం శ్రోతలను ఈడ్చుకొచ్చి నట్టుంది...అదీ సంగతి..వీళ్ళు రాకుంటేనా?..వాడ్ని క్షణాల్లో పట్టేసేవాడ్ని..

యూనిఫామ్ వదిలేసి వెదుక్కొని చూడు..మెదడు సందేశం..స్లిప్లు లు తెచ్చిన విద్యార్థి ఏది సరైందో వెదుక్కుంటున్నట్టుంది ఆనందరావు పరిస్థితి..

దరిద్రం కాకపోతే తన పెళ్ళాం అలాంటి పనికి మాలిన ఆలోచన్లు చెయ్యడం ఏమిటి ?ఊళ్ళో మిగిలిన వాళ్ళు కాపురాలు చెయ్యడం లేదా? దేవుడా దీనికి కనీసం ఒక సంవత్సరం సైగలతో బ్రదికేలా చూడు...నన్ను పాతికేళ్ళ నుండి కాల్చుకు తింటున్న పాపం కొంతైనా తీర్చిన వాడవౌతావు. ఊళ్ళో అందరితో మంచి.మొగుడ్ని చూస్తే మాత్రం..పిల్లి..ఎలకా జీవితం.

తలవిదిలించాడు ఆలోచనల నుండి బైటపడాలని.

"ఈ రఘురామ్ ఒకడు..చదువుతున్న రోజులనుంచి కవిత్వం పిచ్చి. అప్పుడే ఓ అమ్మాయి మీద కవిత్వం ఆశువుగా చెప్పాడు. మాకు అర్ధం కాకపోయినా టీచర్ కు బాగా అర్థం అయినట్టుంది. బహుమతి వీపుపై బాగా ఇచ్చారు..వారం రోజులు వాడు చుక్కయి పోయాడు...

ఉద్యోగం వచ్చాక ఆ అమ్మాయినే వెదుక్కోని మరీ పెళ్లాడాడు... అదీ వాడి కవిత్వం దెబ్బ...

ఇప్పుడీ గుంపులో వాడెక్కడున్నాడో.?.ఎలా పోల్చడం.? వెళ్లేందుకు త్రోవలేదు. డోర్ దగ్గరా జనం..ఎండాకాలం ఏసీ లో పంక్షన్ జరిగితే...ఇదుగో ఇలానే...వెదుక్కోవాలి..రమ్మని బ్రతిమాలాలి.

రెండేసి సమోసాలు చేతులు మారుతున్నాయి వాటర్ పేకెట్లతో..

బహుశా ఎవరు ఏకారణం చేత కూడా బైటకి వెళ్ల కూడదని కాబోలు.అందరూ తింటున్న మధ్యలో పుస్తకావిష్కరణ కొద్దిసేపట్లో ఉంటుందని... ఆ పుస్తకాలు బైట వరండాలో సరసమైన ధరకు లభిస్తాయని..ఆ మైక్ మార్మోగింది...

ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం లా లేదని భావించిన ఆనందరావు అందరూ నోటికి పనిచెప్పినప్పుడే..

"నీ అందం నన్ను పిచ్చెక్కించేస్తోంది... జోడు తియ్యొద్దు

: నీ నవ్వు వెర్రెక్కిస్తోంది...కర్ర పట్టొద్దు "అన్నాడు గట్టిగా...

అందర్లోంచి ఒక్కతల పైకి లేచింది.

"ఒరేయ్ రఘురాం..నేను ఆనందం "అన్నాడు గట్టిగా...ఆనందరావు...కవిత్వం తనకిలా ఉపయోగ పడినందుకు ఆనందిస్తూ..

కవులు మంచివారే... కవిత్వం మంచిదే..ఆదరించే వారు ఉంటే అది మరింత శోభిస్తుంది. కానీ ఈనాడు మాత్రం చాలావరకు బిరుదులు, రచనలు అన్నీ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సాగేవే.

రఘురామ్ కు అర్ధం అయింది. "వస్తున్నా నుండరా.."అంటూ తర్వాత లైన్లు చెప్పకుండానే అక్కడ్నుంచి అరుస్తూ నోరు నొక్కేసాడు...

వాడు గాని మొత్తం చదివితే ఆ వెండికప్పు బహుమానం తనకే ఇచ్చేయాలి...అదీ రఘురాం భయం.

పెళ్ళైనప్పట్నుండి కవిత్వం సవతి పెళ్ళాం అయింది భార్య దృష్టిలో...

ఇద్దరూ ఎలాగో బయట పడ్డారు...బయట రెండు రకాల పుస్తకాలు సర్దుతున్నారు. కుతూహలంగా చూసాడు ఆనందరావు అటువైపు.. ఒకదానిపేరు...నేనెందుకు రాస్తున్నాను .రెండో పుస్తకం నే రాయడం మానేస్తే....ఒక్కోటి వంద రూపాయల ఖరీదు..20 పేజీలు...అన్నీ కలిపి...టైటిల్స్ చూసి నవ్వొచ్చింది ఆనందరావుకు...

"ఎందుకొచ్చావ్ రా ఆనందం?" అన్నాడు రఘురామ్. "ఒరేయ్ ..నిన్న మీ ఇంటికొచ్చినప్పుడు సెల్ గాని..".అంటూ ఆగాడు.

"లేదురా..అలాంటిదేం కన్పించలేదు". అన్నాడు రఘురామ్..

" అదిసరే..మీ అమ్మాయి ఎందుకో నాగురించి రెండు సార్లు ఆడిగావట" ...

"అదా.. మీ వాళ్ళ మేరేజ్ విషయం మాట్లాడదామని...అంతే.."

హతాశుడయ్యాడు ఆనందరావు...కధ మళ్ళీ మొదటికొచ్చిందని. ..తర్వాతెక్కడి

వెళ్ళాడో... గుర్తు చేసుకోసాగాడు.

    ----------*******************---------------

                తరువాయి 8 వ భాగం లో...


Rate this content
Log in

Similar telugu story from Comedy