Srinivasa Bharathi

Comedy

3.0  

Srinivasa Bharathi

Comedy

సెల్ భాగోతం...4....శ్రీనివాస భ

సెల్ భాగోతం...4....శ్రీనివాస భ

2 mins
331


"ఇప్పుడేది దారి? వాడిమీద కంప్లైట్ ఇవ్వడమా? వద్దా? ఇస్తే మాత్రం దొరుకుతుందా?. స్టేషన్ లో తెల్సిన పోలీస్ ఉంటే మంచిగా ఓసారి ప్రయత్నిస్తే ?నిజంగా వాడిదగ్గర లేదేమో? పల్లెటూళ్ళో చాలామంది అమాయకులు, మంచివాళ్ళు ఉంటారంటారు. నేను వాడిల్లు వాకబు చేస్తూ వెళ్లిన సంగతి ఊళ్ళో తెలియకుండా పోదు. నిజంగా వాడే దొంగ ఐతే ఇక వాడికి ఊళ్ళో విలువుండదు. కాకపోయే అవకాశాలే ఎక్కువ. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినా సెల్

దొరుకుతుందని నమ్మకం లేదు. తిలోదకాలు ఇచ్చేయాల్సిందే. ..వాళ్ళు మాత్రం ఎక్కడని, ఎంతని వెదుకుతారు... అనుమానితులు కొందరిని అడిగి చూస్తారు..రికవరీ అయ్యే అవకాశాలు ఇంచుమించు లేనట్టే." "అదేదో కధలో చెప్పినట్టు గొలుసు తీసిందని పసి పనిపిల్ల మీద పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి, ఆ పిల్ల చెప్పేది వినకుండా పోలీసులతో బెదిరించి చివరకు దాన్ని బాత్రూమ్ సబ్బుడొక్కులో చూసి, పిల్లను తీసుకు వెళ్ళడానికి వస్తే బాల హక్కుల చట్టం కేసు , పనిపిల్ల పని మానేయడం, మరెవరూ ఆ ఇంటికి పనికి కుదరక పోవడం...గుర్తొచ్చింది....సెల్ ఫోన్ తో అంత ప్రమాదం లేదు....ఇంకా నయం . చైన్ స్నాచింగ్ అయితే బంగారం మాట దేవుడెరుగు, ప్రాణాల మీదకి వచ్చేదేమో.".

ఆలొచన్లు కన్నా ఆటోవేగంగాపరిగెత్తినట్టుంది.దింపేసింది ఆనందరావుని ఉహాలనుంచి.

"సిమ్ బ్లాక్ చేయిస్తే సరి. బాంక్, lic, అప్పులోళ్లు, ఆఫీసరు, విసుక్కొనే భార్య, కోర్కెల చిట్టాతో కూతురు, కంప్లైంట్స్ తో కోడలు, అనునయంగా కొడుకు, దెప్పిపొడిచే అల్లుడూ, గారంగా ఏడిపించే మనవడూ, వీళ్ళందరూ ఆ ఫోన్ కి ఫోన్ చేసే ఉండొచ్చు. సెల్ పోతే కనుక్కొనే మార్గం మొదట ఆ సెల్ కి వీలైనంత ఎక్కువమంది ఫోన్ చెయ్యడమే. ఇంట్లో తానింకా చెప్పలేదు కాబట్టి వాళ్లు ప్రత్యేకించి ఫోన్ చేస్తారనుకోవడం లేదు. సుబ్బారావు వాళ్ళమ్మనుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా అసలే హాస్పిటల్లో ఉంది. వాడు మరీ మరీ చెప్పాడు. సోమవారం కాబట్టి వాడు డ్యూటీకి వెళ్లిపోయుంటాడు నా మీద నమ్మకం తో. ఆవిడ నెంబర్ ఎక్కడైనా వ్రాసుకొని ఉంటే బాగుణ్ణు.

ప్రభాకర్ గాడు పెళ్లిసంబంధం మాట్లాడాడు. ఏవిషయమూ ఫోన్ చేసి చెప్తానన్నాడు.. చేసాడేమో.

ఆ సంబంధం కుదిరితే బాగుణ్ణు..కట్నం ఎక్కువే అయినా డబ్బు మనుషులు కారంట. ప్రిస్టేజ్ ..అంతే. ఒకసారి నాది కాదనుకొని ఇచ్చేస్తే మరి అటువైపు తొంగి చూడక్కర్లేదు. బాగా స్థితిమంతులు. పిల్ల సుఖపడుతుంది. అన్నయ్య మరీ మరీ చెప్పాడు. ప్రభాకర్ మాటంటే వాళ్ళకి గురి. ప్రభాకర్ నీ ఫ్రెండ్.. కాస్త నచ్చజెప్పి చూడరా..అన్నాడు. మొత్తం 50 లక్షలు. 20 నగదు. మిగిలింది బంగారం. పిల్లాడి ఉద్యోగం బంగారం..నెలకు సంపాదన లకారం పైనే. ఆ పైన చిల్లర.. ఉద్యోగంలోకి వచ్చి నాలుగేళ్ళయింది. 2 అపార్ట్మెంట్ లు

కొన్నాడు. ఇంకా 25 ఏళ్ళ సర్వీసు..ఒక ఊరు కొనేస్తాడేమో చూడాలి. కుదిరితే చాలా మంచిది. కానీ 50 పోగేయడం ఎలా తంతే దమ్మిడీ లేదు ప్రస్తుతం అంత చేర్చాలంటే..".. విదిల్చాడు తలని ఆలొచన్లు తప్పించుకోవడానికి...

గేటు తీసి ఆఫిస్ లోకి అడుగు పెట్టాడు.. సెల్ కోసం సెలవు పెట్టాల్సి వస్తోందన్న ఆలోచనతో....

......................................................(ఇంకా ఉంది..


Rate this content
Log in

Similar telugu story from Comedy