డాలర్ డ్రీమ్స్
డాలర్ డ్రీమ్స్
బావ నేనంటే నీకు ఇష్టం లేదా బాధగా అడిగింది సుమ రాజీవ్ ని.
అదేంటి అలా అడిగావు నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా అంటున్న రాజీవ్ ని చూసి మరి మా నాన్న మనకి పెళ్లి చేస్తా అంటే ఎందుకు వద్దన్నావ్.
నీకు తెలుసుగా నా కల. స్టేట్స్ వెళ్ళాలని, వెళ్ళి డాలర్లు సంపాదించాలని.
బావ మనకి ఇన్ని ఆస్తులు ఉన్నాయి, మా నాన్న దగ్గర, మీ నాన్న దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి మళ్ళీ నువ్వు స్టేట్స్ వెళ్లి సంపాదించాల ఏంటి.
మనం పెళ్లి చేసుకుందాం బావ.
అది కాదు సుమ నా డ్రీమ్ నా చేతినిండా డాలర్లు చూడాలని నా కోరిక.
కొన్ని రోజుల తర్వాత...
బావ బావ దోసిలి పట్టు అంటూ హడావిడిగా వచ్చింది సుమ రెండు చేతులు వెనక్కి పెట్టుకుని.
ఎందుకు ఏమైనా తినడానికి తెచ్చావ అంటుంటే ముందు పట్టు బావ అని గట్టిగా చెప్పడంతో దోసిలి పట్టాడు రాజీవ్.
అంతే తన చేతుల్లో ఉన్న డాలర్లని రాజీవ్ దోసిలి నిండా వేసింది.
ఆశ్చర్యంగా చూస్తున్న రాజీవ్ తో బావ నీ కల నెరవేరింది కదా.
నా కల నెరవేరడం ఏంటి అయినా ఇన్ని డాలర్లు నీకు ఎక్కడివి అడిగాడు రాజీవ్.
అది బావ నువ్వు నీ చేతినిండా డాలర్లు చూడాలనుకున్నావ్ గా వాటి కోసం వేరే దేశం దాక ఎందుకు వెళ్ళడం, అని మా నాన్నకి తెలిసిన వాళ్ళు స్టేట్స్ లో ఉంటే ఈ డాలర్లు తెప్పించా.
ఇంకే నీ కల తీరిందిగా మనం పెళ్లి చేసుకుందాం బావ అని అమాయకంగా అడుగుతున్న సుమని చూసి వెర్రి మొహం వేసుకుని చూసాడు రాజీవ్.
తాను కష్టపడి సంపాదించాలనుకున్నాడు డాలర్లు.
ఇలా కాదు.
కానీ ఒకటి బాగా అర్థం అయింది సుమకి తానంటే అమితమైన ప్రేమని, అందుకే ఇంకేం మాట్లాడలేక అవును నా డాలర్ల డ్రీమ్ నెరవేరింది.
మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు.
