"పుష్ప విలాసం - కవితా పూరణం" : కవీశ్వర్ - 16 .01. 2022
"పుష్ప విలాసం - కవితా పూరణం" : కవీశ్వర్ - 16 .01. 2022
"పుష్ప విలాసం - కవితా పూరణం"
: కవీశ్వర్ - 16 .01. 2022
దత్తపది : "మల్లె - జాజి - చేమంతి - గులాబి
పూరణం :
హిమతుషార బిందువై నిలిచె మల్లిపై
సమఘ్రాణాక్రమబంధువై పీల్చెజాజివై
కమనీయ నయన సోయగపూచేమంతినై
రమణీయ అలంకృత భావవర్ణిత గులాబికై
భావం : మల్లి పైన నిలిచినట్టి మంచు బిందువు వలే, పరిమళముచే
నాసికా పుటముల ఘ్రాణమునకు సమముగా వెదజల్లెడి జాజివై
కమనీయ,నయనానందకరంగా సుందర చేమంతికా పుష్పమునై
అలంకృత ,భావ వర్ణిత రమణీయ గులాబి చిర యశస్సు కై
పరంపరాగత సంస్కార ప్రక్రియలందు ఇమిడిపోగలవని భావం !
వ్యాఖ్య : "ఈ పుష్ప రాజములను పర్వదిన,పూజ విశేషదినములయందు
ఉపయోగించే అలంకృత పావన ప్రక్రియ." కవీశ్వర్.
