STORYMIRROR

T. s.

Tragedy Fantasy Others

4  

T. s.

Tragedy Fantasy Others

నీకోసం..

నీకోసం..

1 min
344

నీకోసం విరిసిన నా మనసు ఝరి..

నీకోసం ఆగని నా కన్నీటి తడి..


నీ కోసం భావాల పూదోట పూయించాను

అక్షరాల రెక్కలు తొడిగి..


వనమాలిని నేనై కాపు కాసాను కనురెప్పలలో నిను దాచి..


అస్పష్టమైన భావాలలో కొట్టుకుపోయాను..


అందమైన ఊహలను అల్లడానికి అక్షరాలను పేర్చుతూ..


కెంపు మందారాలను కాంక్షలుగా..

నందివర్ధనాలను వరహలుగా..

రుధిరాశలను అశ్రువులుగా..


భావాలన్ని రాశులుగా పోసి పందిరి వేసాను..

 

నీకోసం విరిసిన నా మనసు ఝరి..

నీకోసం ఆగని నా కన్నీటి తడి..


Rate this content
Log in

Similar telugu poem from Tragedy