నీ జ్ఞాపకాలు నాలో పదిలం
నీ జ్ఞాపకాలు నాలో పదిలం


కొన్ని కథలు కథలు గానే ఉండి పోవాలి అనుకున్నా
అవి జ్ఞాపకాల రూపంలో మనలోనే ఇమిడిపోతాయి
పోనీ ఆ జ్ఞాపకాలను తలచుకుందాం అనుకున్నా
అవి మనసుకు చేసిన గాయం గుర్తొస్తూ ఉంటుంది
అన్నీ మర్చిపోయి జీవితంలో ముందుకు సాగిపో అని బుద్ధి చెబుతుంది
కానీ నీ నుండి నీ జ్ఞాపకాలను వేరు చేయలేనని మనసు చెబుతుంది
అవి మంచైనా చెడైనా
ప్రతి జ్ఞాపకం నా గుండె లోతుల్లో పదిలం
ఎందుకంటే
గుండెకు తగిలిన గాయానికి మందు లేదు
నా జ్ఞాపకాలకి మరణం లేదు
కలకాలం నీవు నాలో పదిలం......