NEW YEAR..
NEW YEAR..
కడుపున పడ్డానేమో..
కాని సమయాన
గాలి పీల్చానేమో..
గడ్డు కాలానా
కూడు తిన్నానేమో..
కృంగు సమయాన
పలక పట్టానేమో..
పాడు కాలాన
కాలమనే..
తీరిక లేని కడలి తీరంలో
అలుపెరుగని అలల ప్రయాణమే..
క్రొత్త వత్సరము.
ఎగిసిపడే అలల తీరున..
మానవ జీవిత అధమోన్నతులు..
అంతులేని....సాగర లోతులు.
రాలు కాలమ్మంటు ఉండే..
రేకు (ఆకు)లకి
జారు కాలమ్మంటు ఉండే..
జల్లులకి
కరిగే కాలమ్మంటు ఉండే..
హిమములకి
మరిగె కాలమ్మంటు ఉండే..
జలములకి
గానీ..
కాలమ్ము కన్న వేగమ్ముగా పరుగెత్తు
తలంపున్న మనుజునికేల తెలియరాదే
ఆగేదెప్పుడో..ఈ గుండె చప్పుడు?
పేరుకి మానవ జన్మ
ఎంతో ఉత్కృష్టం
బతుకేమో... నికృష్ఠం
ఇదే కాబోలు..
దేవునికత్యంత ...ఇష్టం!
.......రాజ్.....