కవితా పూరణం : కవీశ్వర్ : 02 . 06 . 2021
కవితా పూరణం : కవీశ్వర్ : 02 . 06 . 2021
కవితా పూరణం : కవీశ్వర్ : 02 . 06 . 2021 (prompt : 08)
దత్త పాదం : " కాకి నీడ కోకిల గాన జ్ఞాపకం మధురమే " కవీశ్వర్
పూరణం : { దీనిని కవితలాగా పూరణం చేశాను . ఛందో బద్ధం గా ఉండకపోవచ్చు }
తాకి తనువుల కిరణముల చే ప్రకాశింప బడే
ప్రాకి నేలపై వ్యాప్తి చెందే పులుగుల నీడే
జోకి వాయస ప్రాభవం, కూజిత గానమీడే
కాకి నీడ , కోకిల గాన జ్ఞాపకం మధురమే ||
భావం : తనువు లను తాకి కిరణములచే ప్రకాశింపబడే
పక్షుల నీడేనేలపైప్రాకి వ్యాప్తిచెందే, జోకి(సంభాళించే )
వాయస ప్రాభవం (కాకి యొక్క గొప్పతనం )కూజిత (కోకిల )గాన (మీడే )
గానాన్ని గొంతులోనుండి పలికే ఇక్కడే ... కాకి నీడ , కోకిల గాన జ్ఞాపకం కూడా మధురమే
అని ఈ కవితా పూరణం యొక్క భావం : ఇది నా భావన కూడా ( వసంత ఋతు శోభ ).
కవీశ్వర్
