చివరి పదం
చివరి పదం
మనసును వేల భావాలతో
ఛిద్రం చేసే ఆలోచనలు..
ఊడల మ్రానుల్లో (గాయాల మ్రానుల్లో )
చిక్కుకున్న గుండెకు
ఊపిరి ఆడని భావన..
వేదనలు వేల మహా వృక్షాలుగా పెరిగి
చితిలోనే చల్లారుతానంటున్నాయి..
చివరికి ఏది అని చూస్తే
చివరి పదం ఇదేనేమో..
