STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Inspirational Children

4  

Jayanth Kumar Kaweeshwar

Action Inspirational Children

బాలల గేయం - వచన కవితా సౌరభం

బాలల గేయం - వచన కవితా సౌరభం

1 min
213

బాలల గేయం - వచన కవిత : కవీశ్వర్

జీవిత ఉద్యాన వనం లో విరబూసిన వసివాడని పూలు 

ఆరోగ్యానికి, ఆనందానికి ,విజ్ఞానానికి అవసరం ఈ పాలు 

పచ్చని పైరు పంటలలో గడిచే కలిమిగలిగిన సిరి ఈ చేలు 

ఒకరికొకరు సహకారములతో మెలగడమే ఎల్లప్పుడూ మేలు


పౌరాణిక , చారిత్రిక జ్ఞాపకాలతో విహరించు మనో తేరు 

సకలకళా -కౌశలాలతో కీర్తి ప్రఖ్యాతుల చెందు తమపేరు 

మంచి-చెడుల నిర్ణయాత్మక విశ్లేషణ జనులకు వేరు-వేరు 

క్షీర-నీరన్యాయముచే జీవన కాసార సమాన సంపదఈ నీరు 


మనోకలేశాలను ప్రయత్న పూర్వకంగా అవశ్యము గా బాపు 

మనందరికీ పరమాత్ముడే జీవన గమ్యమార్గ దర్శన కు కాపు 

భక్తులందరికీ అగుపించు ను బహు సుందర ఆకృతి రూపు 

ఆరూపములవైపు భక్తి తో చూసిన ఆతని కరుణాత్మక చూపు 


అనుదినము మన సఫల కార్యములను నిరంతరమూ చేసిన నాడు 

మంచి ఫలితములనందించుఅనుభవపూర్వకముగామనకు నేడు 

సంతృప్తితో సంపాదించే ధాన్య సంపద మనకు సరిపడు కూడు 

భగవంతునికి సర్వస్య శరణాగతిి సమర్పణతో దైవం వినును గోడు 



Rate this content
Log in

Similar telugu poem from Action