STORYMIRROR

Dinakar Reddy

Abstract Action Fantasy

4  

Dinakar Reddy

Abstract Action Fantasy

సత్యదూరం

సత్యదూరం

1 min
291

ఆ పానీపూరీ తిన్నాక

మళ్లీ అడిగి వేయించుకున్న పానీ

కూరగాయలు అమ్మే వాళ్ళతో బేరమాడి

విసిగించి మరీ తీసుకున్న కొత్తిమీర


దాచుకున్న చాక్లెట్ రేపరు

రేపటి రోజున వచ్చే పేపరు

పని కోసం పట్టుకున్న సాసరు

ప్రతి లాభంలో అడగాలి అనిపించే కొసరు


ఖాళీ బస్సులో మిగిలించిన సీటు

పర్సులోంచి బయటకు రాని నోటు

ఎవరి డబ్బుతోనో మెక్కిన స్వీటు


ఏంటో

ఏం చేసినా తృప్తి లేదు

నువ్వు నాతో లేకుంటే 

అన్నీ సత్యదూరం

చెరిపెయ్యవా మన మధ్య ఈ దూరం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract