అంశం.... స్వాతంత్య్ర యోధులు శీర్షిక... స్మరణమే చిరకాలం
అంశం.... స్వాతంత్య్ర యోధులు శీర్షిక... స్మరణమే చిరకాలం
కవిత సౌరభం
అంశం.... స్వాతంత్య్ర యోధులు
శీర్షిక... స్మరణమే చిరకాలం
***
ఆంగ్లేయుల దాస్య శృంఖలాలను దేశ స్వరాజ్యం కు చేదింపజేసిన
సకల స్వాతంత్య్ర సమరయోధుల దేశభక్తి సర్వస్వం ధారపోసిన
సుభాష్ చంద్రబోస్ గారి అనుసరణీయ పథం గాంధీ గారి సత్య శోధన
తిలక్ గారి స్వాతంత్య్రం నా జన్మ హక్కు లాంటి నినాదాల హోరు న
నిరంతరం సమర వీరుల త్యాగాలను స్మరించి ,వారి ఖ్యాతినిపెంపొందించు
మువ్వన్నెల త్రివర్ణ పతాక ఎగురవేత మన భారతమాత కీర్తి ప్రఖ్యాత మందించు
జాతీయ కవితా దినోత్సవ సందర్భాన దేశభక్తుల కీర్తిని దేశ మాత కవితా గాన మంచు
దేశమంతటా,దిక్కులు పిక్కటిల్లేలా నినాదాల హోరుప్రభాత ఫేరీలు ఎల్లెడలాపొంచు ...
స్వాతంత్య్ర అమృత మహోత్సవ దినోత్సవ శుభాకాంక్షలతో ......
రచన : జయంత్ కుమార్ కవీశ్వర్.
హైదరాబాద్ . 14 . 08 . 2022
