STORYMIRROR

Midhun babu

Crime Inspirational Children

4  

Midhun babu

Crime Inspirational Children

అమ్మ తోడు

అమ్మ తోడు

1 min
3


ఒట్టేస్తూ అలవోకగ..పెట్టేవా అమ్మతోడు..!

చిన్ని దెబ్బ తగిలితేనె..తలచేవా అమ్మతోడు..!


పెదవివిప్పకుండ తాను..ప్రేమగగన మయ్యిందే..

పెరిగిపెద్ద కాగానే..మరచేవా అమ్మతోడు..! 


నీవెన్నో విజయాలను..పొందాలని దీవించెనె..

నేను-నాది ధ్యాసలోన..వదిలేవా అమ్మతోడు..! 


కన్నీరో మున్నేరో..కొంగుచాటు దాచిందే..

ఎన్నిపొరల చిక్కె మనసు..వీడేవా అమ్మతోడు..! 


మాయచేయ వేళలోన..తేనెలొలుకు నవ్వులెన్నొ .. 

మాటకు ముందే చక్కగ..పలికేవా అమ్మతోడు..!


గోర్వెచ్చని తన ఒడిలో..మురిసిన ఆ ఎఱుకేదీ.. 

ఇంత జ్వరం వస్తేమరి..కోరేవా అమ్మతోడు..!


అమ్మచేతి గోరుముద్ద..అమృతనిధే మాధవుడా..

"అమ్మా..అమ్మా..!"అంటే..అందేవా అమ్మతోడు..!


Rate this content
Log in

Similar telugu poem from Crime