జననీ
జననీ
నా బ్రతుకు కి
వెలుగునిచ్చింది తనే...
నా ప్రాణానికి
ఊపిరి పోసింది తనే...
నా చే ఓనమాలు దిద్దించిన
ఆదిగురువు తనే...
నా ఆశల పల్లకిని మోసింది తనే...
తను లేదంటే నేనుండలేను
నే లేదంటే తనుండలేదు...
నా జీవితం తనే ,నా ఊపిరి తనే !
నా వల్ల కావట్లేదు
అన్న ప్రతిసారి వెన్ను
తట్టి ప్రోత్సహించింది తనే
నా విజయానికి బాటలు
వేసింది తనే..
నా కై ఇంత చేసిన ఆ హృదయ
శ్రీమంత మహారాణీ కి
నేనేం ఇవ్వగలను
తనకి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను
తనని వర్ణించడానికి
మాటలు చాలవు ,
తన పై రాయడానికి పదాలు చాలవు
నా ఊపిరి ఉన్నంతవరకూ
తన జ్ఞాపకాలను స్మరిస్తూ బ్రతకడం తప్ప

