Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ARJUNAIAH NARRA

Classics Crime Children

4.5  

ARJUNAIAH NARRA

Classics Crime Children

రాజ్యాంగ గీతోపదేశం

రాజ్యాంగ గీతోపదేశం

1 min
415


భారత రాజ్యాంగం


మనిషి సృష్టి కర్త బ్రహ్మమైతే

మనిషిని దానవుడిలా జీవించమని

ఈ జంబుద్వీపాన్ని స్వర్గ ప్రాప్తిరస్తు అని దీవిస్తూ

ప్రాధమిక నియామవళిని సృష్టించిన  

ప్రధాన రూపశిల్పి మన అంబెడ్కర్


దధీచి మహర్షి వెన్నెముక నుంచి 

తయారైన వజ్రాయుధంలాగా

అంబెడ్కర్ మేధస్సు నుండి

ఆవిష్కరించబడ్డ అద్భుత

ఆయుధమే మన రాజ్యాంగము


ముల్లోకాలను ఏలే 

విష్ణువు చేతిలోని, సుదర్శన చక్రమోలే

ఈ భారత్ రాష్ట్రలను మరియు కేంద్ర పాలిత  ప్రాంతాలను నియంత్రిస్తూ పాలిస్తున్న  

అంబెడ్కర్ రాతనే మన రాజ్యాంగం


ప్రజలపై అధికారం చేలాయించే వారు 

ఆ ప్రజలకు జావాబు దారిగా ఉండాలని 

మార్గాలను నిర్దేస్తు సహస్ర నామాల వలె

అధికరణలు, ఆర్టికల్స్, చట్టాలను 

దేవ భాషలో కాకుండా 

దేశ మరియు అంతర్జాతీయ భాషలో 

వ్రాసిన మనిషిస్మృతినే  మన రాజ్యాంగం


ప్రభుత్వం ఉల్లంఘించలేని 

ప్రజల ప్రాథమిక హక్కులను ఏర్పాటు చేస్తూ

చట్టం సమాజానికి సేవా చేస్తు 

నైతికతను రూపొందిస్తు 

సత్యమేవ జయతే అంటుంది

మన భారత రాజ్యాంగం


'అధర్ములకు' ధర్మం బోధిస్తూ

మళ్లీ ఈ భూమిపై ధర్మం పునఃస్థాపన 

జరగాలంటే చట్టాలు చుట్టాలుగా కాకుండా

పరశురాముడు గండ్రగొడ్డలిలా 

ఆచరించమని చెబుతుంది మన రాజ్యాంగం


డబ్బు ప్రీతితో, పదవి వ్యామోహాంతో

అధికార దాహంతో, లేదంటే స్త్రీ లౌల్యం వల్లనో

చట్టాన్నీ చేతిలోకి తీసుకొని చేసిన నేరాలకు 

దొరికిన నేతలను చూస్తుంటే భస్మాసుర కథను  

 గుర్తుకు తెస్తుంది మన రాజ్యాంగము


మా దేవుడంటే, మా దేవుడంటు 

మతం, మతం మధ్య చిచ్చులు వచ్చిన

దేవుడికి, దేవుడికి మధ్య యుద్ధం సంభవించిన

భక్తుల మధ్య వైరం పెరిగిన

గుడి, మసీదు, చర్చిలల్లో  

చర్చలు పెరిగి ఘోరం జరిగిన

భారతావనిలో మారణహోమం జరిగిన

శరణు శరణు రాజ్యాంగమా

స్వామియే శరణం అంబెడ్కరా


మాహా దేవుడికి గుడి కావాలన్న

దేవతకు కోవెల తలంపు కలిగిన

దేవిదేవ దేశమందు ఊరేగింపుగా తిరగాలన్న

దేవుడికైనా దేవతకైనా దేశాన్ని ఏలే 

నాయకులకైనా జెడ్ ప్లస్ రక్షణ ఇవ్వాలంటే

భారతావనిలో శరణు శరణు రాజ్యాంగమా

స్వామియే శరణం అంబెడ్కరా


చివరగా......రాజ్యాంగ  గీతోపదేశం

"పుట్టినవాడికి స్వార్థం ఉండక మానదు

స్వార్థం ఉన్నవాడు నేరం చేయక మానడు

నేరం చేసిన వాడు దొరక్క మానడు

దొరికిన నాడు శిక్షను తప్పించుకోలేడు 

ఇట్టి అనివార్యమగు శిక్షలను పొంది

చింతించడం, శోకించడం అవివేకము కదా!

అట్టి బతుకు బతుకుట కంటే......

రాజ్యాంగ గీతోపదేశం గావించి 

గాయత్రి మంత్రం జపించునట్లు 

చట్టాలను గౌరవిస్తు జీవించండి.."

ఎందుకంటే.....

"రాజ్యాంగం 

భారతీయల జీవన వేదం

భారతీయుల జీవన విధానం

ఇదే మన భారత దేశ ధర్మం

పాటించటం ప్రతి భారతీయుడి కర్తవ్యం

పాటించని  పౌరుడు ఒక దేశ ద్రోహి"

"జై జంబుద్వీప సర్వే జనా సుఖినో భవంతు"


Rate this content
Log in

Similar telugu poem from Classics