STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Crime

4  

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Crime

అక్రమ రవాణా..

అక్రమ రవాణా..

1 min
175

రవాణా..రవాణా..

అక్రమ రవాణా


గంధపు చెక్కల నుండి గంజాయి వరకు

బంగారం నుండి బియ్యపుగింజల వరకు

శరీర అవయవాల నుండి శవాల వరకు

కాదేదీ రవాణాకనర్హం అన్నట్టు


అభంశుభం తెలియని పసి పిల్లల్ని

ఆర్థిక సామాజిక పరిస్తుతుల్లో

అధమంగా ఉన్న అమాయుకుల్ని

ఆశ పెట్టి ఆదుకున్నట్టు మభ్య పెట్టి

జరుగుతున్నది రవాణా..

వెట్టి చాకిరికి అక్రమ రవాణా


స్వర్గాన ఉన్న సొగసుల సిరోమణులను

తపోభంగానికై రవాణా చేసెడివరాప్పుడు

ఈ లోకాన ఇంకాస్త మితిమీరిన మాయగాల్లు

ఆకలి చేతుల్లో ఓడిపోయి..

అండలేని..ఒంటరి అమ్మాయిలకు

ఆడంబరాలను ఎర వేసి..

కొత్త కొత్త అనుభూతుల్ని రుచి చూపి

పైసలకు...పైశాచికంగా 

పడతుల పరువాన్ని  

పైకమున్న భోగులకు బోనస్ గా ఇచ్చేదే

రవాణా... వ్యభిచారమనే అక్రమ రవాణా


నేడు కరోనా కాలు పెట్టి

కూడు కోసం కళ్ళు కాయలు కాసేలా చేసి

కాళ్ళు అరిగేలా చేసి 

కడుపు కోసం కాని పనులుకైనా

కాలు కదిపేలా చేసింది


ఏ అక్రమమైనా

అత్యాశ పెరిగినపుడు

అదును దొరికినపుడు

ఆకలి రాజ్యమేలినపుడు

అంగలు వేసుకుంటూ 

ఆధిపత్యం చెలాయిస్తుంది


వాటిని 

అదుపులో పెట్టాల్సింది

అరికట్టాల్సింది 

అధికారంలోనున్న ప్రభుత్వాలు

ప్రభుత్వ సేవకులు


       ......రాజ్.....



Rate this content
Log in

Similar telugu poem from Tragedy