ఖైదు
ఖైదు
కల్లోలకాలంలో కరస్పర్శలా
ఉదయకిరణం ఊరడించటంలేదు
అసమానతల కిరీటాలతో
మనుషులంతా మనసులకు విడాకులిచ్చేశారు
ఉద్వేగాలన్నీ చలికి ముడుచుకుపోయాయి
లబ్ డబ్ గుండె వెబ్ ప్రపంచంలో నీడను వెతుక్కుంటోంది
డబ్బే జీవితమైన సమూహాలన్నీ పరుగుపందెంలో నే
పరువుందని మురిసిపోతున్నాయి
ఒకప్పుడు కలువపూలలా కలలపూలు
మెరిసిపోతుండేవి
నీరింకిన బావిలా జీవితమే పాడుబడినకోట ఇప్పుడు
మోయలేని ఆనందాలు లేవు..మోసపోయిన మనుషులు తప్ప..
చదును చేసిన నేలలా మానవసంబంధాలను
చదును చేశాం కదా
తాకట్టులో బాల్యమేం ఖర్మ
మొత్తం జీవితమే పైకప్పు లేని లాకప్ ఇప్పుడు