ఇప్పటికి నా దేశ దైన్యమిది
ఇప్పటికి నా దేశ దైన్యమిది


నేటి భారతమిది.. నోటు మోహమైందది..
నా వీక్షణలివి.. నా పరీక్షణలివి..
అబ్బాయిలు పెరుగుతున్న తీరు..
ఎదుగుతున్న అమ్మాయిల జోరు..
కనిపించే కపటమైన కపాలాలు..
వినిపిస్తున్న విషవాంఛల విలాపాలు..
తగలబడుతున్న విథివంచిత వనితలు..
విహారాల్లో విషాద ఆర్తనాదాలు..
విలువ తగ్గుతున్న ఉపాధ్యాయ వృత్తి..
విషం చిమ్ముతున్న పాశ్చాత్య సంస్కృతి..
రక్షణ కరువైన రక్షక భటుల రీతి..
కళ తగ్గిన కర్షక జీవన శైలి..
ఎండిన చెరువులూ.. మండే సూర్యుడూ..
తీరని భూతాపం.. మూయని బోర్ల ప్రతాపం..
శ్రమ మరచిన శ్రామిక వర్గం..
విధి తోచని వీధి బాలల వైనం..