మధ్యతరగతి జీవితాలు
మధ్యతరగతి జీవితాలు
ఆశలేమో ఆకాశ వినువీధుల్లో..!
బాధలెన్నెన్నో బ్రతుకు సందుల్లో..!
నీడకేమో బరువైన బాడుగంట..!
నిండు నిదురకై నానావిధాల తంటా..!
ఆకలి తీర్చే అత్తెసరు అర్భక జీతం..!
దాహం మాన్పే వీధి కుళాయిల వీరంగం..!
ir="ltr">పండగొస్తే అప్పులూ.. ఆపసోపాలు..!
కాసుల్లేకున్నా.. కళ తప్పని జీవితాలు..!
నిత్య జగడమైననేమి నీతి పదిలం..!
స్థాయి కాదు.. సొంత పరువు ముఖ్యం..!
బ్రతుకుదెరువు కోసం బండెడు చాకిరీ..!
చావు వెక్కిరిస్తే, దహనంలోనూ సుఖమేదీ..?