దయలేని ఆకలి
దయలేని ఆకలి
ఆకలికి తెలియదులే అమ్మమనసు,
గుండెగొంతు మూగబోయినా కోరునంటా పిల్లశ్రేయస్సు,
కనుపాపల అనురాగాన్ని ఓడించే మృగత్వం,
బ్రతుకు ప్రశ్నకు సమాధానం చెప్పలేదు పసితనం.
ప్రాణాహరణ గుణానికి
కనపడునా దైవగుణం,
పెంచుకున్న మమకారం
వినలేకుంది ప్రేమస్వరం,
మనోవేదనకు మరోపేరేగా నరకం,
మృత్యు బాహువుల్లోనూ
ప్రాణమున్న దేహానికి తెలియునా వాస్తవ దృశ్యం,
హే భగవాన్ చూడలేకున్నావా
జీవనతత్వం.
కన్నీళ్ళ ఆవేదనకు లేదులే కొలమానం,
పసి హృదయానికి దొరుకునా
దేవుని కనికరం,
కర్కషపు కోరలకు
బలైన బంధాలు విధివ్రాతలోని
కర్మఫల సాక్ష్యాలు,
ముగిసిన ప్రస్థానం
ఉర్వితలం పై
మళ్ళీ జనియించడమే జన్మ చక్రం
