STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Crime

4  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Crime

కుల రక్కసి శీర్షిక: వీడు మావోడే : vachana kavithaa sourabham

కుల రక్కసి శీర్షిక: వీడు మావోడే : vachana kavithaa sourabham

1 min
656

అంశం:- కుల రక్కసి

శీర్షిక: వీడు మావోడే 

తేదీ : 10 .10. 2021 

వచన కవితా సౌరభం 

÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

ప్రతిభకు పట్టం కట్టే రోజులు రాలేవా ?

కులాస్వామ్యం విచ్చలవిడిగా తిరుగుటలేదా ?

చోటామోటా నాయకుడు నావోడే అనడం లేదా ? 

ఉద్యోగం ఇప్పించే అధికారి తన కులం వాడికే అనలేదా ?


లంచానికి పీటవేసినా చెల్లించుకొనే వాడికేది ప్రతిభ ? 

చేసిన కొన్నేళ్ళకు గుణాత్మకం కనుమరుగు అవలేదా?

కాంట్రాక్టులలో లాభాలతో తనవారికి బినామీలుగా పంచలేదా?

నీతిగా పరీక్షలు రాసి ప్రథమ స్థానంలో వచ్చినవారికి తర్వాత చెబుతామనలేదా ?


ప్రతిభావంతుల ప్రకటనల్లో లొసుగులతో ఇతరులకు ఇచ్చి

మీ వయసు దాటిపోయిందనలేదా ?

మతప్రసక్తి లేని లౌకిక రాజ్యం అని అందులో కులాలు ఎందుకంటున్నారని ?

వీడు మావోడే, మనోడే , అని వారికి ఉద్యోగమిప్పించే ముందు వారి ప్రతిభ ఎంత? 


అందరు మనవాళ్లే అని , వసుధైక కుటుంబకం అనుకుని

దేశ అభివృద్ధికి పాటుపడాలంటే కులం , మతం , వర్గం

మొదలైనవాటిని మొత్తం నిర్ములిస్తే అందరికి( ప్రతిభ కు )

తగిన ప్రాధాన్యత ఉందికదా ! అందరూ సమానమే దరఖాస్తుల్లో

ఆ అంశాన్ని అడుగకుంటే బాగుంటుంది కదా! 



Rate this content
Log in

Similar telugu poem from Abstract