STORYMIRROR

ARJUNAIAH NARRA

Tragedy Crime Children

4  

ARJUNAIAH NARRA

Tragedy Crime Children

అనాథఅంతరిక్షపరిశోధకుడేమో!

అనాథఅంతరిక్షపరిశోధకుడేమో!

1 min
395

వీధి బాలుడు అనాథ

అంతరిక్ష పరిశోధకుడేమో!


ఉదయించిన సూర్యుడు మసకబారిండు

వెన్నెల కాసే జాబిలమ్మకు అమావాస్య నిండుకుంది

ముద్దులొలికే ముఖానికి మసి పూసింది ఎవరు?

నవ్వులు రువ్వాల్సిన పెదవులను కాల్చినది ఎవరు?

ఆ వదనాలలో దైన్యానికి కారణం ఎవరు?


చింపిరి జుట్టు.. చిరిగిన బట్టలు

పెరిగిన గోళ్లు, పాలిపోయిన ముఖం ...

అశుభ్రమైన ఆహార్యం.... 

మన దేశ బాలల గాంభీర్యం

బడి ఈడు పిల్లల చేతిలో స్కూల్ 

బ్యాగుకు బదులు చిరిగిన గోనెసంచితో

మురికి కాల్వలో, పెంట కుప్పలలో

భవిష్యత్తును వెతుకుతున్న

రేపటి భారతీయ పౌరుడు


విధి వక్రీకరణ, కుటుంబాల విచ్ఛిన్నం, 

లైంగిక, భావోద్వేగ రుగ్మతలు

పేదరికం, సాంస్కృతిక కారణాల వల్ల

మానసిక ఆరోగ్య సమస్యల వల్ల

ట్రాఫికింగ్, గ్యాంగుల వేధింపులకి

భిక్షాటన సిండికేట్‌ల ద్వారా

మాఫియా ముఠాల దౌర్జనానికి

డ్రగ్ అండ్ క్రైం గ్యాంగుల దాష్టికానికి

బాల్యానికి పెనుచీకట్లు అలుముకున్నాయి


భావి భారత బాలల బతుకులు 

చెత్తకుప్పల్లో విసిరిన విస్తరిలోని 

ఎంగిలి మెతుకుల కోసం కుక్కలవలె

లేదంటే వీధులల్లో,ఫుట్‌పాత్‌ల దగ్గర

రహదారులపై సిగ్నల్స్‌ వద్ద

పేవ్ మెంట్స్ మీదనో, ముష్టివాళ్లుగానో 

వికలాంగులుగానో అడుక్కునే దృశ్యం 

అడుగడునా సాధారణం


పిడికెడు మెతుకుల కోసం 

కడుపులో రగిలే ఆకలి 

వారి బతుకులతో ఆడుకొని

శతకోటి వ్యసన విద్యలకు వారసున్ని చేసి 

సిగరెట్‌ కి, బీడీకి, గంజాయికి, పొగాకుకి

జర్దాకి,గుట్కాకి, తంబాకుకి, వైట్‌నర్‌కి,

మద్యనికి, మోసనికి, దొంగతనం, దోపిడీ,

దాడి, జూదం, వ్యభిచారనికి బానిసగా మార్చేసి

హెచ్‌.ఐ.వి, ఎయిడ్స్‌,సుఖవ్యాధులతో, 

దీర్ఘకాలిక రోగాలతో, కాకవికాలం చేసి

ఆ చీకటి బతుకులను కాటికి సాగనంపుతుంది


జనాబా లెక్కల్లో గారడి చేసిన

జైల్ గోడలలో మాయం చేసిన

నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లో 

లెక్కకు అందని పేర్లు, లేదంటే

క్రైమ్ స్టోరీల కథలు, ఏ క్రైమ్ పేజ్ చదివినా 

ఈ అనాథ బాలల బతుకులు

నేరగాథలుగా ముద్రితమవుతాయి


ఎవరికి తెలుసు!

చెత్తకుప్పలోని పసిమనుసును

పట్టించుకోకపోతే ఏహాభావం పెంచుకొని

ఏ ఉన్మాదిగానో, తీవ్రవాదిగానో మారుతాడేమో!


ఎవరికి తెలుసు!

మురికి కూపంలో సంచరించే 

అభాగ్యులకు ప్రేమను పంచితే 

రేపటి భావి భారత అంతరిక్ష పరిశోధకులుగా మారుతారేమో!


మేధావులరా! రాజకీయా నేతలారా!

పరిపాలకులారా, మానవత్వ వాదులారా! 

ఇది మన అందరి సామాజిక బాధ్యత 

ఈ చైతన్యానికి చేయి చేయి కలుపుదాం

చిత్త శుద్దితో బాలల హక్కులను కాపాడుకుందాం

చైల్డ్ లేబర్ యాక్ట్ ను కఠినంగా అమలుచేసి

నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రోత్సహించి

మన దేశ భవిష్యత్తును రూపుదిద్దుకుందాం



Rate this content
Log in

Similar telugu poem from Tragedy