ఆడజన్మకు రక్షణ లేదు
ఆడజన్మకు రక్షణ లేదు


అమ్మ కడుపులో వెచ్చగా ఊపిరిపోసుకునే బిడ్డను ఆడపిల్ల అని తీయించేస్తున్నారు.... అమ్మ కడుపులో రక్షణ లేదు.
పూర్తిగా కళ్ళు కూడా తెరవక ముందే కన్నతండ్రే
ఆడపిల్ల అని అమ్మేస్తున్నాడు..... నాన్న దగ్గర రక్షణ లేదు.
ఇంట్లో ఎవరు ఎందుకు తన మీద చేయి వేస్తున్నారో
అర్థం కాని పసిపిల్లలు.... ఇంట్లో రక్షణ లేదు.
బయటకు వెళితే తండ్రి స్థానంలో ఉండాల్సిన పెద్దల చేతిలో రాలిపోతున్న పసి మొగ్గలు ఎన్నో.... సమాజంలో రక్షణ లేదు.
చదువు చెప్పాల్సిన గురువులే
కర్కశంగా మీద పడి పోతుంటే....
చదువుల తల్లి నిలయంలో రక్షణ లేదు.
అన్నింటినీ ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని ఉద్యోగానికి వెళితే అక్కడ వెంటాడే మానవ మృగాలెన్నో....
ఉద్యోగంలో రక్షణ లేదు.
వీటన్నింటి నుండి బయటపడడానికి ఇష్టం లేకున్నా పెళ్లికి ఒప్పేసుకుంటే
మంగళ సూత్రంతో యమపాశం విధించిన వరకట్నచావులెన్నో.... అత్తవారింట్లో రక్షణ లేదు.
ఈ బాధలు వద్దు అనుకుని ఆత్మహత్య చేసుకుంటే
చచ్చినా, బ్రతికినా, జీవచ్ఛవంలా ఉన్నా అది ఆడదైతే చాలు అని.... ఆస్పత్రిలో రక్షణ లేదు.
చివరకు ఆడ జన్మకు చితిలోనే సంతోషం, రక్షణ అయితే అలాంటి సమాజంలో మనం బతుకుతున్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను.