Narra Pandu

Comedy Romance

4.2  

Narra Pandu

Comedy Romance

సినిమా ప్రేమలేఖ

సినిమా ప్రేమలేఖ

1 min
353




"అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి"ని చూశాను.

మా కాలేజీలో ఆమెకు నేనే మొదటిసారిగా "సుస్వాగతం" చెప్పాను.

ఆమె నవ్వు "స్వాతిముత్యం"లా ఉంటుంది.

ఆమె నుదుటిపై "కుంకుమ" "చందమామ"లా ఉంటుంది.

ఆమెను చూసిన మరుక్షణమే ప్రేమలో పడ్డాను. "నువ్వంటే నాకిష్టం" "నిన్నే ప్రేమిస్తా" అంటూ ఎన్నో సార్లు "నిజం" చెప్పాలనుకున్నాను.

మా ఫ్రెండ్స్ వద్దన్నా వినకుండా "నా ఇష్టం" అంటూ "ప్రేమ సందేశం" పంపాను.

"ప్రియతమా" "నిన్ను చూడాలని" "నా ప్రాణం" "క్షణక్షణం" "ఆకాశమంతా" "ప్రేమతో" ఎదురు చూస్తోందని ప్రతిరోజు చెప్పేవాడిని.

ఎవరు "ఔనన్నా కాదన్నా" ఆమె "నా సొంతం అనుకున్నాను.

ఫీల్ మై లవ్ అంటూ "ఆర్యా"లా ఆమె ఉంటే తిరిగాను.

ఎవరు అడ్డొచ్చిన "సైనికుడు"లా ఎదిరిస్తాను అన్నాను. 

"హ్యాపీ డేస్"లో టైసన్ లా బ్రతిమాలాడి "ఆది"వారం నాడు మన ఇంటికి "అతిధి"గా రమ్మన్నాను.

"నువ్వు నేను" "బృందావనం"లో "కలిసుందాం రా" అన్నాను.

కాలేజీ లో అందరు నన్ను "ఇడియట్" "అన్న" పట్టించుకోలేదు.

"ప్రేమికుల రోజు" "ఐ లవ్ యు" చెప్పాను. ఆమె "అరుంధతి"లా రెచ్చిపోతాదేమో అనుకున్నాను. కానీ, "చిరునవ్వుతో" వెళ్ళిపోయింది.

ఇక "జయం" నాదే అనుకున్నాను.

నా "మనసంతా నువ్వే" అంటూ "క్రిష్"లా వాళ్ళింట్లో దూరాను.

ఆరోజు తెలిసింది ఆమె మా సంస్కృతం "మాస్టారు" గారి అమ్మాయి అని తెలుగు అసలే రాదని,

అయిన "నువ్వే కావాలి" అంటూ పది రోజుల సమయం ఇచ్చాను.

ఆమె కోసం "స్టూడెంట్ నెం.1"లా ఉండే నేను "పోకిరి"లా తయారయ్యాను.

కలం పట్టుకునే చేతితో "కత్తి" పట్టుకున్నాను.

నా "ఖలేజా" చూపిద్దామని.

ఆమె అవునంటే "మరో చరిత్ర". కాదంటే "రక్త చరిత్ర".

                                       ఇట్లు

శ్రావణి సుబ్రహ్మణ్యం


Rate this content
Log in

Similar telugu story from Comedy