Dr.R.N.SHEELA KUMAR

Children

4  

Dr.R.N.SHEELA KUMAR

Children

నా బాల్యం

నా బాల్యం

1 min
331


ఆనాటి నా బాల్యం ఉమ్మడి కుటుంబం పెదనాన్న, పెద్దమ్మ, అమ్మ, నాన్న, ముగ్గురక్కలకు,ముగ్గురు అన్నయ్యలకు ముద్దుల చెల్లిని, అప్పట్లో నాన్న మా ఊరిలో ఎవరికి హాస్పిటల్ కీ తీసుకు వెళ్లాల్సి వచ్చిన తానే మద్రాస్ తీసుకు వెళ్లేవారు కనుక నేను నాన్న ఎప్పుడు మనలను ఎక్కడికి తీసుకొని వెళ్లట్లేదనే బాధ పడేదాన్ని, కానీ నాన్న ఊరు నుండి తిరిగి వచ్చేటప్పుడు రక రకాల గౌనులు తెచ్చే వారు నాకు అక్కలకు ఏమీ తేరు, అప్పుడు చాలా సంతోషం గా ఉండేది, ఓ సారి నేను రెండో తరగతి చదువుతున్నప్పుడు నన్ను, పెద్దక్కని నాన్న హైదరాబాద్ తీసుకొని వెళ్లారు. నేనక్కడ బిర్లామందిర్, కోటీ బజారు అప్సర హోటల్ లో ఊయల ఇప్పటికి మరచిపోని జ్ఞాపకాలు. అలానే నా చిన్నప్పుడు నాన్న దీపావళి టపాకాయలు గోనెల్లో కొని తెచ్చేవారు, మండుగుండు సామాన్లు తెస్తే పెదనాన్న వెన్నముద్దలు, పెనుసుళ్ళు, తిరుగుడు చక్రాలు సిసింద్రీలు ఇంట్లోనే తయారు చేసే వారు ఆనాటి దీపావళి మళ్ళీ నా జీవితంలో ఇకనా తిరిగి రాదు నాన్న నాన్నే ఆ స్థానం మరెవ్వరికీ రాదు లేదు. నా పెళ్లయ్యి ఓ 15ఏళ్ళ తరవాత నాన్న మా ఇంటికి వచ్చి 10రోజులు నాతో గడిపారు. అప్పుడు నాతో అన్న మాటలు ఇంకా నా చెవిన వినిపిస్తూనే వున్నాయి, ఈ అపోలో హాస్పిటల్ కీ ఎంత మందితో వచ్చే వాడినమ్మ, భగవంతుడిని నేను కోరేది ఒక్కటే నా కోసం ఎవ్వరు హాస్పిటల్ చుట్టూ తిరగకూడదమ్మా అదే నేను సాయిబాబా ని వేడుకుంటున్నాను అన్నారు అలానే నా దగ్గర నుండి వెళ్లిన నాలుగు నెలల్లో ఓ రోజు బ్రహ్మ ముహూర్తన్న బీష్మ ఏకాదశి రోజున వైకుంఠన్ని చేరుకున్నారు, నాన్న నీవు లేవన్న ఈ నిజాన్ని ఈ మనసు ఒప్పుకో లేకపోతోంది.



Rate this content
Log in

Similar telugu story from Children