ప్రకృతి మహత్తు
ప్రకృతి మహత్తు


ఏమైనా డబ్బులు ఉన్న వాళ్ళు అన్నీ మంచి వస్తువులు కొనగలుగుతారు. మనం వాళ్ళలా అన్నీ తినలేం కదా అని మా ఆవిడ సూక్తి.
మా అమ్మాయి స్వప్న నేనూ మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకొచ్చాం. ఇదే ఛాన్సు దొరికింది నా శ్రీమతికి. నేను కొత్తగా పెట్టిన సూపర్ మార్కెట్ లో దొరికే ఆర్గానిక్ కూరగాయలు తీసుకురాలేదు అని తన కోపం.
నాకు ఆ సూపర్ మార్కెట్ గురించి మొత్తం తెలుసు. ఆర్గానిక్ అని చెప్పి అన్నీ కృత్రిమ రంగులు చల్లి ఎలా అందరికీ అంటగడుతున్నాడో మా ఆవిడకు అర్థం కావట్లేదు.
నేను మా అమ్మాయి స్వప్న ముందు
ఓడిపోలేను కదా.
అందుకే ఇలా అన్నాను. ఎంత డబ్బులు ఇచ్చి కొన్నా కూరగాయలు పండ్ల లోని క్వాలిటీ పెంచలేం కదా అని.
ఎలా నాన్నా అని అడిగింది మా అమ్మాయి.
స్వప్నా! ఇప్పుడు బాగా డబ్బులు ఖర్చు చేసి ఒక ఆపిల్ పండు కొన్నావ్ అనుకో. అది తిన్నప్పుడు నీ శరీరం గ్రహించే పోషకాలు మనకు ముఖ్యం. ప్రకృతి సిద్ధంగా పండించిన ఆపిల్ రుచి వేరు. దాని నుండి మన శరీరానికి లభించే పోషకాలు వేరు.
ఆర్గానిక్ అని చెప్పి మార్కెట్లో కనిపించే ప్రతి దాని మీదా డబ్బులు ఖర్చు చేయడం కంటే మన సొంత ఊరి నుండో లేక సిటీకి దగ్గరగా ఉన్న పల్లెల నుంచి వచ్చే రైతుల దగ్గర కూరగాయలు పండ్లు కొంటే వారికీ లాభం.
మనకూ మనం ఏం తింటున్నాం అనే విషయం తెలుస్తూ ఉంటుంది అన్నాను.
అలా అని చెప్పి ఆర్గానిక్ అనే దానికి నేను వ్యతిరేకం కాదు అని మా శ్రీమతి వైపు చూశాను.
స్వప్న కరెక్టే నాన్నా అని నన్ను సమర్థించింది.
మొత్తానికి నాన్నా కూతురు ఒక పార్టీ అంటూ శ్రీమతి నూనెలో తాలింపు గింజల్లా చిటపటలాడుతూ లోపలికి వెళ్ళింది