మెకానిక్ స్నేహితులు.
మెకానిక్ స్నేహితులు.
శివ అనే అబ్బాయిని వాళ్ళ తల్లి దండ్రులు చిన్నప్పుడే కుంటివాడని వదిలేసి వెళ్లిపోయారు. రోజూ గుడి మెట్ల పడుకునేవాడు. ఏది దొరికితే అది తినేవాడు. ఒకరోజు శివ"నేను కుంటివాడినైతే ఏముంది, కష్టపడి పైకోస్తాను" అని తనకు తానే నిర్ణయించుకున్నాడు. అప్పుడు శివ, శ్రీను అనే బైక్ మెకానిక్ షాప్ కి వెళ్లి పనడిగాడు. కానీ శివని పనిలేదు పో! నీకు ఎవరు పనియిస్తారు' అని బయటికి తోసేసాడు. శివకు చాలా బాధ కలిగింది. శ్రీను పెట్టిన మెకానిక్ షాప్ ముందే శివ కూర్చుని పని నేర్చుకున్నాడు. శివ కూడా షాపు పెట్టాడు. మొదట్లో ఎవరూ రాలేదు. కానీ మెల్లమెల్లగా ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు
. అది కూడా శ్రీను తీసుకున్న దాని కన్నా తక్కువ డబ్బులతోనే రిపేరు చేసిపెట్టే వాడు.అలా నెల రోజులు అయింది. ఇక అందరూ శివ షాప్ కే వస్తున్నారు. శీను షాప్ కి ఎవ్వరూ వెళ్లట్లేదు. అది చూసిన శ్రీను తలవంచుకుని శివ దగ్గరికి వెళ్లి 'నన్ను క్షమించు, ఆరోజు నిన్ను బయటకు తోసేశాను, నీ విలువ నాకు ఇప్పుడు అర్థమైంది అని మన ఇద్దరం కలిసిపోదాం .ఒక బైక్ సర్వీసు సెంటరు పెడదాం"అని అన్నాడు. దానికి శివ మరోమాట ఆలోచించకుండా ఒప్పుకున్నాడు. కలిసి బైక్ సర్వీసు సెంటరు పెట్టారు.
కొద్ది రోజుల్లోనే ఎంతో పేరు సంపాదించారు. దాంతో శివ,శ్రీను లు ఇద్దరూ మంచి జీవితం గడపసాగారు.