చెత్త రహిత గ్రామం.
చెత్త రహిత గ్రామం.


బౌరంపేట అనే గ్రామంలో రాజేష్ మరియు రంజిత్ అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. ఇద్దరికీ
ఎప్పుడూ ఏవో చిన్న చిన్న గొడవలు అవుతుండేవి. అలానే వాళ్ళ ఇంటి పక్కనే ఒక పెద్ద డ్రైనేజీ ఉండేది. రాజేష్ ఎప్పుడూ చెత్తంతా పక్క డ్రైనేజీలో వేసేవాడు. రంజిత్ మాత్రం రోజు చెత్తను చెత్త బండి లో వేసేవాడు.ఒకరోజు రంజిత్ రాజేష్ దగ్గరికి వెళ్లి "చెత్తను డ్రైనేజీలో పడేయవద్దు అవి మళ్లీ దోమలుగా, ఈగలుగా, వ్యాధులుగా మారి మనకే హాని కలిగిస్తాయి అని చెప్పాడు. రాజేష్ "నా ఇష్టం నువ్వెవరు నాకు చెప్పటానికి" అని కసిరాడు. మరసటిరోజు రాజేష్ కు పొద్దున్నే లేవగానే ఒళ్ళంత
ా నీరసంగా, వేడిగా, అయిపోయింది. భయంతో డాక్టర్ దగ్గరికి వెళ్లి అడిగితే మలేరియా జ్వరం అని చెప్పారు. రాజేష్ కు అప్పుడు అర్థమైంది. "రంజిత్ నా మంచి కోసం చెప్పినా నేనేమో చెత్తను డ్రైనేజీలోనే వేసేవాడిని, బహుశా ఆ దోమలు నన్ను కుట్టి నాకు మలేరియా జ్వరం వచ్చింది. అలానే రంజిత్ పైన కూడా ఎప్పుడు కోప్పడేవాడిని నాకు ఇలానే జరగాలి" అని రాజేష్ బాధపడుతున్నాడు. తర్వాత రోజు నుంచి రాజేష్ కూడా తన చెత్తను చెత్త బండిలోనే వేయటం మొదలుపెట్టాడు. అలానే రాజేష్ రంజిత్ లు ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు,ఇంకా డ్రైనేజ్ సమస్యను కూడా తీర్చి వ్యాధుల బారినుంచి కాపాడుకున్నారు.