యువత మేలుకో!.
యువత మేలుకో!.


శివ అనే అబ్బాయి తొమ్మిదోతరగతి చదువుతున్నాడు.
ఒకరోజు శివ పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఒక బైకు,ఒక కారు ఢీకొన్నాయి.బైకు
నడిపే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు.కారు నడిపే వ్యక్తి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ అక్కడ ఉన్న ఎవ్వరూ అతన్ని పట్టించుకోవట్లేదు. అందరూ ఫోన్లు తీసి ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు, తీసి ఫేస్బుక్లో, వాట్సాప్ లో, అప్లోడ్ చేస్తున్నారు తప్ప సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు. అది చూసిన శివ వెంటనే అక్కడ ఉన్న వారి దగ్గర ఫోన్ తీసుకుని 108 కి కాల్ చేసి అతని ప్రాణాలను కాపాడాడు. ఇంత చిన్న పిల్ల వాడికి ఉన్న ఇంగిత జ్ఞానం కూ
డా జనాలకు లేదంటూ అక్కడ ఉన్న అందరూ సిగ్గుతో తల దించుకున్నారు. శివ "మీరు మీ లైకులు , ఫాలోయింగ్ కోసం, ఒక మనిషి ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. అసలు మీరు మనుషులేనా! అదే పరిస్థితుల్లో మీ కుటుంబమే ఉంటే ఇలానే సెల్ఫీలు, వీడియోలు, తీస్తారా. ఒక్కసారి ఆలోచించండి ఆ మనిషి కోసం వాళ్ళ కుటుంబం, పిల్లలు, నాన్న ఎప్పుడొస్తాడో అంటూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మనిషే లేకపోతే ఆ కుటుంబం ఏమైపోతుందో ఎవరైనా ఆలోచించారా? ఇప్పటికైనా మారండి, ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయండి కానీ స్వార్థంగా ఆలోచించకండి" అంటూ అందరినీ నిలదీశాడు. చివరికి"దేశ పౌరులుగా మనమున్నంత కాలం మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి "అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.