టెక్నాలజీ కన్నా కన్నవారే మిన్న
టెక్నాలజీ కన్నా కన్నవారే మిన్న


రాధమ్మ ,సీతయ్య, అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వాళ్లకి ఉదయ్ అనే కొడుకు కూడా ఉండేవాడు. ఆ ఇరువురు దంపతులు చాలా కష్టపడి ఉదయ్ ని పెద్దపెద్ద చదువులు చదివించారు. ఉదయ్ తల్లిదండ్రులు రెండు పూటలు మాత్రమే తినేవారు కానీ ఉదయ్ కి మాత్రం మూడు పూటలు అన్నం పెట్టేవారు.అంత ప్రేమగా చూసుకునేవారు. ఉదయ్ కి ఉద్యోగం వచ్చింది. ఒక విధంగా మంచిదైనా,కొడుకుని విడిచి ఉండలేము అని బాధపడుతున్నారు.
ఉదయ్ కి పెళ్లి కూడా చేసేశారు. ఉదయ్ అమెరికా వెళ్ళిపోయాడు. 10 నెలలు గడిచాయి. రాధమ్మ, సీతయ్యలకు,ఉదయ్ ని చూడాలనిపిస్తుంది.ఉదయ్ అమెరికాకు టికెట్లు కూడా బుక్ చేశాడు. తీరా వెళ్లాక ఉదయ్ నిరంతరం ఫోన్ తోనో , లేదా కంప్యూటర్ తోనో గడుపుతున్నాడు. అమ్మానాన్నలు వచ్చినా పట్టించుకోవడం లేదు. రాధమ్మ "ఏంటయ్యా ఇది! వీడితో సరదాగా, సంతోషంగా, పది రోజులు గడుపుదామని వస్తే వీడేమో మనల్న
ి వదిలేసి ఆ ఫోన్ పట్టుకొనే తిరుగుతున్నాడు!"అని చాలా బాధపడుతుంది. సీతయ్య" అక్కడే బావుండు మా స్నేహితులతో కలిసి ఒక చెట్టు దగ్గర కూర్చుని కష్టసుఖాలు మాట్లాడుకునేవాళ్ళం. ఎంతో గొప్పగా చెప్పుకున్న నా కొడుకు అమెరికా వెళ్ళాడని తీరా చూస్తే ఇదీ పరిస్థితి అని బాధ పడ్డాడు."ఉదయ్ డోర్ పక్కనే ఉన్నాడు. ఈ మాటలు విన్న ఉదయ్ ఏడుస్తూ "అమ్మా నన్ను క్షమించండి, ఈ ఫోన్ మాయలోపడి మిమ్మల్నే మరిచిపోయాను. నాకోసం మీ ప్రాణాలు పోయేటట్టు కష్టపడ్డారు నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చారు. అలాంటిది మిమ్మల్ని విడిచి ఆ ఫోన్ తోనే గడుపుతున్నాను" అని బాధపడ్డాడు. చివరికి సీతయ్య" అరే నాన్న!ఈ టెక్నాలజీ అనేది మనుషుల్ని దగ్గర చేయాలి కానీ దూరం చేయడానికి కాదురా "అని చెప్పాడు.
మనం ఎంత స్థాయిలో ఉన్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా ,ఏదైనా సరే మన తల్లిదండ్రుల తర్వాతే అని గ్రహించాలి.